16/11/2025
My Redeemer English medium school Kodakandla
is a nice school
16/11/2025
04/06/2024
గౌరవనీయులైన గ్రామ పెద్దలకు, మై రెడీమర్ స్కూల్ తల్లిదండ్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు
మై రెడీమర్ స్కూల్ - కొడకండ్ల మండల యాజమాన్యం తరుపున ప్రతీ ఒక్కరికి నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు.
కొడకండ్ల మండల కేంద్రం లో మై రెడీమర్ స్కూల్ 2012 లో ప్రారభించబడి నేటికీ 12 సంవత్సరాలు పూర్తి కావస్తుంది..ఇన్ని సంవత్సరాల నుండి ఈ స్కూల్ ని ఆధరిస్తున్న, ప్రేమిస్తున్నా, ప్రతీ ఒక్క తల్లీ దండ్రులకు, గ్రామ పెద్దలకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, ఉపాధ్యాయ బృందానికి, నాగాలాండ్ నుండి గత పది సంవత్సరాల నుండి నమ్మకంగా పనిచేస్తున్న ఇంచార్జి హెడమాస్టర్ సార్ సునేప్ జమీర్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు.. తెలియజేస్తున్నాము.
ఈ 12 సంవత్సరాల కాలం లో దాదాపుగా 300 వందల మందికి పైగా మై రెడీమర్ స్కూల్ విద్యార్థులు గురుకులం లో, ఇద్దరు విద్యార్థులు నవోదయ లో సీట్లు సాధించి ఉచితంగా విద్యనభ్యసిస్తున్నారు. అలాగే నర్సరీ నుండి 5 వ తరగతి వరకు మై రెడీమర్ స్కూల్లో బేసిక్స్ చదివిన విద్యార్థిని, విద్యార్థులు పదవ తరగతిలో 9.0 నుండి 10/10 లు సాధించడం అలాగే ఇంటర్మీడియట్ లో కూడా టాప్ ర్యాంక్ లు సాధించడం, ఇంగ్లీష్ లో మాట్లాడటం చాలా గర్వకారణం, మా దగ్గర ప్రీ ప్రైమరి చదివి ఆర్ధిక పరిస్థితులు బాగాలేక వేరే స్కూళ్లకు వెళ్ళిన విద్యార్థులు కూడా గురుకులం లో సీట్స్ సాధిస్తూ స్కూల్ ఫస్ట్, సెకండ్ ర్యాంక్ లో నిలుస్తున్న విషయం హర్షించదగినది.
ఆర్ధికంగా వెనుక బడి ఉన్న తల్లిదండ్రుల విషయమై ఆలోచించి నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థులను గురుకుల మరియు నవోదయ పరీక్షలకు కోచింగ్ ఇస్తూ పరీక్షలు వ్రాయించగా ఉచితంగా సీట్లు సాధించి ఖర్చు లేకుండా హాస్టల్స్ లో చదువుకుంటున్నారు.
పదవ తరగతి వరకు ఉన్న పెద్ద పెద్ద స్కూల్స్ లో పిల్లల్ని జాయిన్ చేయడం వల్ల వారు 10/10 సాధించుట కొరకు ఒక్క పదవ తరగతి చదువుతున్న పిల్లలపై మాత్రమే శ్రద్ధ తీసుకుంటూ ప్రైమరీ పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల వారి బేసిక్ పూర్తిగా పాడవుతుంది ఆ కారణం చేత మై రెడీమర్ స్కూల్ ప్రైమరీ క్లాస్సేస్ మాత్రమే నడిపిస్తు చిన్న వయసు నుండే బలంగా పునాదులు వేసి పై తరగతులకు పంపించేలా ప్రయత్నిస్తున్నారు.
గమనిక : ఫౌండేషన్ లేదా పునాది బాగుంటేనే పిల్లలు ఎక్కడికి వెళ్లిన బాగా చదువుతారు, ర్యాంక్ లు సాధిస్తారు. మా స్కూల్ యొక్క ప్రత్యేకత కూడా పునాది బలంగా వేసి అన్ని రంగాల్లో పిల్లల్ని రాణించేలా చిన్నతనం నుండే అనేక కాంపిటిషన్లు నిర్వహించి స్టేజ్ ఫియర్ లేకుండా చేసి, పిల్లలని ఉన్నత విద్యకు పంపించడమే మా యొక్క అంతిమ లక్ష్యం. ఈ రోజు మై రెడీమర్ స్కూల్ లో చదివిన విద్యార్థిని, విద్యార్థులు పదవ తరగతి లో 10/10 లు , ఇంటర్ మీడియట్ లో ర్యాంక్స్ సాధిస్తున్నారు అంటే మేము చిన్నప్పటి నుండే వారికీ బలంగా వేసిన పునాది.... ఈ సంవత్సరం కూడా గురుకులం లో 18 మంది సీట్స్ సాధించారు... అంటే కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా మా విద్యార్థులదే హావ.
మీ పిల్లల ఉజ్వల బంగారు భవిష్యత్ కై చిన్న తనం నుండి బలమైన పునాది వేసి ఉన్నత చదువులు చదువుటకు మీ పిల్లల్ని మై రెడీమర్ స్కూల్ లో చేర్పించి సహకరించగలరని మనవి.
ఈ సమాచారాన్ని వాట్స్ ఆప్ లో, పేస్ బుక్ లో చదివిన నా మిత్రులు, శ్రేయోభిలాషులు ఇట్టి సమాచారాన్ని కొడకండ్ల మండల పరిసర ప్రాంతాల్లో మీకు తెలిసిన వారికీ తెలియజేసి సహకరించగలరని విన్నపం.
మీ పిల్లలకి మీరు ఆస్థి, పాస్తులు కూడేసి ఇస్తే వాటిని కొన్ని రోజుల్లోనే ఖర్చు చేసి చెడు వ్యాసనాలకు బానిసలై, బికారులు, దేశ దిమ్మరులవ్వుతారు.
అదే చదువునే ఆస్తిగా ఇస్తే జీవితాంతం సుఖంగా, ఆనందంగా ఉంటారు.
ఇట్లు
సదా మీ విద్యాసేవలో
పెద్దపూడి.ప్రసన్న కుమార్
ప్రిన్సిపాల్ - కొడకండ్ల.
9533211544
08/06/2023
26/04/2023
శ్రీ. గంటా. రవీందర్ సార్ ( మహాత్మా హెల్పింగ్ హాండ్స్) వార్షికోత్సవ వేడుకలో అధ్బుతమైన సందేశం. తప్పక ప్రతీ ఒక్కరూ వినాల్సిన మాటలు...
అంగరంగ వైభోగంగా జరిగిన మై రెడీమర్ స్కూల్ 12 వ. వార్షికోత్సవ వేడుకలు.
జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రం లోని మై రెడీమర్ స్కూల్ 12 వ. వార్షిోత్సవ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి,ముందుగా జాతీయ గీతాలాపన చేసి సభను ప్రారంభించారు.
ముఖ్యాతిదులుగా విచ్చేసిన గౌరవనీయులు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ మరియు మహాత్మా హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు శ్రీ గంటా రవీందర్ ఇచ్చిన సందేశం చాలా మందిని ఆకట్టుకుంది, ప్రతీ ఒక్కరూ సమాజ సేవలో భాగం కావాలి అంటూ , మానవత్వం అనేది అందరి లో వుంది, దానిని వెలికి తీయాలి అంటూ, ప్రతీ ఒక్కరూ దాన గుణాన్ని అలవర్చుకోవాలి అంటూ అధ్బుతమైన సందేశాన్ని ఇచ్చారు, అలాగే కొడకండ్ల మండల గ్రామ సర్పంచ్ శ్రీ పసునూరి. మధు సుధన్, వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ శ్రీ పేరం రాము, అందే యాకన్న, కొడకండ్ల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తమ్మి దిలీప్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు మసురం వెంకన్న , ఎండీ ఆసీఫ్ తమ అమూల్యమైన సందేశాలను ఇచ్చారు అనంతరం పిల్లలు అందరూ ఆకర్షణీయమైన వస్త్రాలంకారణలు ధరించి , అధ్బుతమైన, అబ్బురపరిచే డాన్స్ లు, డ్రామాలు వేసి కళా ప్రాంగణాన్ని సందడి చేశారు, వచ్చిన అదితులను శాల్వా మరియు మెమెంటో తో స్కూల్ యాజమాన్యం సన్మానించారు, గంటా. రవీందర్ ప్రోత్సాహం తో ముందుగా తనని సన్మానించడం కాదు ప్రిన్సిపాల్ ప్రసన్న కుమార్ దంపతులను వారి తల్లిదండ్రులని సన్మనించాలని కోరగా వచ్చిన అదితులందరు కలిసి స్కూల్ యాజమాన్య బృందాన్ని సత్కరించారు, అనంతరం స్కూల్ లో జరిగిన ఆటల పోటీలు, ఎక్కాల పోటీలు, స్వయం పరిపాలన దినోత్సవం , ఫ్యాషన్ షో, డ్రాయింగ్ కాంపిషన్ లో అలాగే క్లాస్ మొదటి, రెండవ, మూడవ ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు వచ్చిన అదితులు మరియు ఉపాధ్యాయుల చేతుల మీదుగా దాదాపుగా 260 షీల్డ్స్ నీ అందజేయడం జరిగింది, విద్యార్థులు స్కూల్ తల్లి దండ్రులు మరియు పూర్వ విద్యార్థులు, స్నేహితులతో శ్రేయోభిలాషులతో ప్రాంగణం అంత నిండి పోయింది, అనంతరం స్కూల్ ప్రిన్సిపల్ ప్రసన్న కుమార్ ఇంత అద్భుతంగా పిల్లలకి కొరియోగ్రఫీ అందించి, అద్భుతంగా పిల్లలకు మేకప్ చేసి, నమ్మకంగా, బాధ్యతతో స్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న వారిని సన్మానించారు వారితో పాటు స్కూల్లో పని చేసే ఆయమ్మ నీ కూడా సన్మానించారు అనంతరం అందరూ కలిసి తృప్తిగా బోజనాలు చేసి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాఠశాల చైర్మెన్ జాషువా నవామని, విశిష్ట అదితి గంటా. రవీందర్, గ్రామ సర్పంచ్ పసునూరి. మధు సూధన్, వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ పేరం. రాము, ఎంపిటిసి. అందే. యాకన్న , గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తమ్మీ. దిలీప్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు మసురం.వెంకట్ నారాయణ, ఎండీ ఆసీఫ్, వార్డ్ మెంబర్ శన్నా, దిన పత్రిక ల పాత్రికేయులు కృష్ణ కోట. కొమురయ్య , పెద్ధవంగర నమస్తే తెలంగాణ పాత్రికేయులు కొండా. సతీష్ స్కూల్ యాజమాన్యం తల్లి దండ్రులు తది తరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం విజవంతంగా జరగడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు.
05/02/2023
పిల్లల ఆటల పోటీల వీడియోస్.....చూసి మరిన్ని అప్డేట్ కోసం ఈ ఛానెల్ నీ సబ్స్క్రయిబ్ చేయండి.
https://youtu.be/7YAesz9_4AQ
https://youtu.be/Ex2vzWfzCjg
https://youtu.be/9kD4Q9h4rGU
https://youtu.be/bwGoz0ngU5g
https://youtu.be/W8aUmeHfuxg
https://youtu.be/IUdgFZuPdzc
https://youtu.be/5KYAEsJR23Q
https://youtu.be/xVFtsxey2HA
https://youtu.be/Txh57mMnsME
https://youtu.be/AtnSEUQfkys
https://youtu.be/6-dVt_GEnsU
Kabaddi tournament Finals||Junior & Senior Boys & Girls.(2) ఫైనల్స్ లో గెలిచి 1&2 విజేతలుగా నిలిచిన టీమ్స్...
04/02/2023
Kabaddi pics of boys and girls...
03/02/2023
Games time....
వివిధ రకాల డ్రెస్సుల్లో మై రెడీ మర్ స్కూల్ కిడ్స్
27/01/2023
74వ. గణతంత్ర దినోత్సవ ఫొటోస్...
My Redeemer English Medium School 🏫 Kodakandla on Republic Day Celebrations -2023.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Telephone
Address
Kodakandla
Warangal
506007