ZPHS Kodakandla

ZPHS Kodakandla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ZPHS Kodakandla, High School, Kodakandla, Warangal.

14/07/2023
22/01/2023

#నాన్న 💞💓💞
నాన్న ఏడ్వడం_
_ఎప్పుడైనా చూశారా.?_
_జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ,_
_వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి._
_అలాంటి నాన్న గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేశారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌._
_పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ‘డాడీ’ గురించి మాట్లాడారు._
_తండ్రి తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో కోల్పోతాడని పేర్కొన్నారు._
_”నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.__ఎందుకంటే.._
_నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్యకి అసలు చెప్పడు. అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు._
_నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు._
_’ఎప్పుడూ పనేనా? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’_
_అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం._
_పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు._
_నిజానికి *నాన్నను, నాన్నే..* మిస్‌ అవుతుంటాడు._
_పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు._
_మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు”_
_”ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. వృద్ధాప్యం ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు._
_నాన్న డాక్టర్‌ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు. తన పిల్లలు గొప్ప వాళ్లు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం._
_అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు._
దీపావళి నరకచతుర్దశి మరునాటి పండుగ విశిష్టత
_మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ._
_ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు”_
_”కొన్ని వందలసార్లు అమ్మ ఏడ్వడం చూశాం._
_కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా?.._
_నాన్న కూడా ఏడుస్తాడు._
_కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు._
_పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. నాన్న అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు._
_అప్పుడే పిల్లలు నాన్నకు.. చెప్పడం మొదలుపెడతారు._
_’ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, నేను ఎవరి కోసం బతికాను?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి._
_’నా కోసం నేను ఏదీ దాచుకోలేదే..’ అనుకుంటాడు._
_నిజానికి ‘నేను’ అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు”_
_’ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి._
_ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్నను ఏడిపిస్తాడు._
_నాన్న గుండెలపై తంతాడు._
_అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు._
_అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి._
_కొడుకు ఎంత మంచివాడు, ప్రయోజకుడైతే తండ్రిని అంత బాధ పెడతాడు._
_వాడికి ఎంత సక్సెస్‌ వస్తే.._
_అంత ఎక్కువగా తండ్రిని ఏడిపిస్తాడు._
_ఇది నిజం._
_మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి._
_బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం._
_కానీ,_
మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు._
_అసలు మీ నాన్న పుట్టినరోజు కూడా మీకు గుర్తుండదు._
_ఎందుకంటే_
_మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు._
_నాన్న మీ భవిష్యత్తు కాదు._
_కానీ.._
_నాన్నకు మీరే భవిష్యత్తు._
_మీ కోసం రిస్క్‌ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు._
_మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది. ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది నాన్నలు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీగా మిగిలిపోయారు..’_
*అని పూరీ చెప్పిన మాటలు భావోద్వేగానికి గురి చేసేలా ఉన్నాయి.

🙏🙏🙏

Ranapuram Village - Kodakandla - Jangaon - Telangana
22/01/2023

Ranapuram Village - Kodakandla - Jangaon - Telangana

Police Station Kodakandla
22/01/2023

Police Station Kodakandla

Address

Kodakandla
Warangal
506222

Telephone

+919000666136

Website

Alerts

Be the first to know and let us send you an email when ZPHS Kodakandla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category