Mulukalapally Govt High School

Mulukalapally Govt High School

Share

This school was located at out side of the village. So many students settled in govt and private sec

26/02/2019

ఇద్దరు మిత్రులు ఒక రోజు ఉదయం ఒక నిర్జనారణ్యం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. అకస్మాత్తుగా వారి సమీపంలోని ఒక పొద వైపు నుంచి ఓ సన్యాసి ఆదుర్దాగా, ఆయాసంతో రొప్పుతూ వస్తూ కనిపించాడు. వాళ్ళిద్దరూ ఆయన్ను ఆపి "ఏం జరిగింది? ఎందుకలా భయపడుతున్నారు?" అని అడిగారు. అందుకాయన... "అదిగో అక్కడ కనిపిస్తున్న పొదలో మనుషుల్ని చంపేది ఉంది." వాళ్ళిద్దరూ భయంతో… "అంటే అక్కడ పులి ఉందా?" అని అడిగారు.

"కాదు. కానీ దానికన్నా ప్రమాదకరమైనది. నేను కొన్ని మూలికల కోసం తవ్వుతుండగా అది బయటపడింది." అన్నాడాయన. "ఇంతకీ ఏమిటది?" అని అడిగారు వాళ్ళిద్దరూ కంగారుగా. "బంగారు నాణేల గుట్ట" అన్నాడు సన్యాసి. వాళ్ళిద్దరూ సంతోషంగా "ఎక్కడ?" అని అడిగారు.

"అదిగో ఆ పొదల్లోనే" అని వేలు చూపించి తన దారిన పోయాడా సన్యాసి. వాళ్ళిద్దరూ ఆ పొదవైపు పరుగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ బంగారు నాణేలు కనిపించాయి. "ఈ సన్యాసి ఎంత మూర్ఖుడు? బంగారు నిక్షేపాన్ని పట్టుకుని మనుషుల్ని చంపేది అంటాడేమిటి?" అన్నాడొక మిత్రుడు.

"అతడి సంగతి వదిలేయ్. ముందుగా ఇప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. పట్టపగలే బహిరంగంగా దీన్ని మోసుకుపోతే ఊర్లో జనాలు అనుమానపడే అవకాశం ఉంది. మనలో ఒకరం దీనికి కాపలాగా ఉందాం. మరొకరు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకు వద్దాం." అన్నాడు మరో మిత్రుడు.

అనుకున్నట్టే ఒక మిత్రుడు బంగారానికి కాపలాగా ఉన్నాడు. రెండోవాడు ఊర్లోకి వెళ్లాడు. ఈలోగా మొదటి వాడు ఇలా అనుకున్నాడు. "ఛ… ఈ రోజు నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చుంటే ఎంత బాగుండేది? ఇప్పుడు అనవసరంగా నేను అతనికి సగం బంగారం ఇవ్వాల్సి వస్తుంది. బంగారం కూడా మరీ ఎక్కువగా లేదు. నా కుటుంబం చాలా పెద్దది. దాన్ని పోషించడానికి ఈ బంగారం అంతా నాకే దక్కితే బాగుంటుంది కదా! వాడు వచ్చీ రాగానే కత్తితో పొడిచి చంపేస్తాను. ఎవరికీ అనుమానం రాదు. బంగారం అంతా నేనే తీసుకోవచ్చు." అలా అనుకుని కత్తిని నూరి సిద్ధంగా ఉంచుకున్నాడు.

ఇదిలా ఉండగా ఊర్లోకి వెళ్ళిన రెండో వాడి ఆలోచన ఇలాఉంది… "వాడికి సగం భాగం ఎందుకివ్వాలి? మొత్తం బంగారం నేనే తీసుకుంటే పోలా! అసలే నాకు చాలా అప్పులున్నాయి. నా జీవితంలో నేను ఏదీ వెనుకేసుకోలేదు. వాడికేమో అప్పులు లేవు. ఉన్నవాళ్ళు స్నేహితులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బంగారమంతా నాకే దక్కాలి. కాబట్టి నేను తీసుకెళ్ళే భోజనంలో విషం కలుపుతాను. అది తిని వాడు చనిపోతాడు. ఎవరికీ తెలియకుండా బంగారమంతా నేనే తీసుకోవచ్చు" అనుకున్నాడు. అలా అతడు భోజనంలో విషం కలిపి మిత్రుడి కోసం నిధి దగ్గరకు తీసుకెళ్ళాడు.

అతను దగ్గరికి వెళ్ళగానే అక్కడే కత్తితో పొంచి ఉన్న రెండోవాడు ఒక్క ఉదుటున మీదకు దూకి కత్తితో పొడిచి చంపేశాడు.

"పిచ్చివాడు. సగం బంగారం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇంక నేను భోంచేస్తాను." అనుకుని

ఏ మాత్రం అనుమానం లేకుండా తెచ్చిన అన్నాన్ని తిన్నాడు. అరగంట తర్వాత అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. "సన్యాసి మాటలు ఎంత నిజమో కదా" అనుకున్నాడు చివరి క్షణాల్లో.

రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… తోబుట్టువుల మధ్యం వైరం పెంచుతాను. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెడతాను, ఇవరికి స్నేహితులను కూడా దూరం చేస్తాను అంటుంది ఆ రూపాయి…. అని పెద్దల నానుడి. కాబట్టి ఆ రూపాయి విషయంలో జాగ్రత…

17/01/2019

1.నాకు ఉచిత విద్య లభించడం లేదండీ —
*..... హెన్రీ ఫోర్డ్ కి కూడా లభించ లేదు*

2. జీవితం లో చాలా సార్లు ఓడిపోయానండి
*........................ అబ్రహం లింకన్ చాలా అపజయాలను చూశాడు*

3. నేను చాలా పేద కుటుంబానికి చెందిన వాడిని —
*.......................- అబ్దుల్ కలాం కూడా బీద కుటుంబం నుండే వచ్చాడు*

4. నేను చిన్నప్పటినుండి అనారోగ్య వంతుడిని
*.......................... నటి మర్లీ మాట్లిన్ చిన్నప్పటి నుండి అవకరం తోనే ఉంది*

5. జీవితం అంతా సైకిల్ మీదే గడిచిపోతోంది —
*........................ నిర్మా సబ్బు కర్సన్ భాయి పటేల్ సైకిల్ మీద తిరిగి అమ్మాడు*

6. ఒక ప్రమాదం జరిగి నాధైర్యాన్ని కోల్పోయాను —
*........................ నాట్య మయూరి సుధా చంద్రన్ కృత్రిమ కాలు తో డాన్సు చేస్తుంది*

7. చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు . నన్ను చూసే వారే లేరు .
*....................... ఎ ఆర్ రెహమాన్ తండ్రి కూడా చిన్నప్పుడే పోయారు*

8. కుటుంబ భారం అంతా నా మీదే ఉంది . అందుకే ఎదగ లేక పోయాను
*............ లతా మంగేష్కర్ కూడా చిన్నప్పుడే కుటుంబ భారం మోసింది*

9. నేను చాలా పోట్టివాడిని
*....................... సచిన్ టెండూల్కర్ కూడా పోట్టివాడే*

10. నేను మంద బుద్ది వాడిని
*................ థామస్ ఆల్వా ఎడిసన్ కూడా చిన్నప్పుడు మంద బుద్దివాడే*

11. నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను . దానితో ఏమి చెయ్యగలను ?
*.................. ధీరూ భాయి అంబానీ కూడా చిన్న ఉద్యోగం తోనే మొదలు పెట్టాడు*

12. నా కంపెనీ దివాలా తీసింది . నన్నెవరు నమ్ముతారు ?
*................... పెప్సీ కోలా కూడా రెండు సార్లు దివాలా తీసింది*

13. నేను ఒకసారి నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురి అయ్యాను .ఇప్పుదు ఏమి చెయ్యగలను ?
*.............. వాల్ట్ డిస్నీ మూడు సార్లు నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురి అయ్యారు*

14. నా వయసు ఐపోయింది . ఇప్పుడు ఏమి చెయ్యగలను
*.............. కెంటకీ ఫ్రైడ్ చికెన్ హర్లాండ్ శాండ ర్స్ 60 వ ఏట కె ఎఫ్ సి మొదలు పెట్టాడు*

మనం ఉన్న చోటునుండి ఉన్నతి కి వెళ్ళాలి అనే *కోరిక* ప్రబలంగా ఉంటె మనం వెళ్ళగలం

పూర్తిగా చదివిన వారికి ధన్యవాదాలు

ఈలాంటి మాటలకూ గతి తప్పుతున్న మన బ్రతుకులను మళ్ళి గాడి లొ పెట్టె శక్తి ఉంది.

కనుక అందరికి పంచండి .....

*ఒక్కరు స్పూర్తి ని పొందిన ఈ రోజు కు మనం ఒక మంచి పని చేసినట్లే !*

05/01/2019

రాష్ట్రంలో భూములకు సంబంధించి తాజా సమాచారం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (ccla.telangana.gov.in) వెబ్‌సైట్లో సిటిజన్‌ స్టేటస్‌ కింద పేర్కొన్న ‘నో యువర్‌ ల్యాండ్‌ సర్వీస్‌’ను నొక్కగానే http://ccla.telangana.gov.in/landStatus.do అనే ప్రత్యేక లింకు తెరుచుకుంటుంది. ఇందులో భూముల వివరాల్ని రెవెన్యూశాఖ పొందుపరిచింది. దీనిద్వారా రైతులు, కొనుగోలుదారులకు కనీస సమాచారం లభ్యం కానుంది. సర్వేనంబర్ల వారీగా భూములు, ఖాతా నంబర్ల వారీగా ఆర్‌వోఆర్‌ (1బీ) వివరాలు పొందుపరిచింది. 31 జిల్లాలవారీగా డివిజన్‌, మండలం, గ్రామాల వివరాలు నమోదు చేసి సమాచారం తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రాథమిక సమాచారం కోసం అప్పటివరకు అందుబాటులో ఉన్న ‘మాభూమి’ సేవలు భూరికార్డుల ప్రక్షాళన మొదలైన తరువాత నిలిచిపోయాయి. దీని స్థానంలో సమీకృత ‘ధరణి’ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రెవెన్యూ విభాగానికి మాత్రమే ఈ సాఫ్ట్‌వేర్‌ అందుబాటులో ఉంది. దానిని ప్రజలకు చేరువ చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో తొలివిడత ప్రక్షాళన పూర్తయ్యాక సేవా రుసుము చెల్లించి మీసేవ ద్వారా భూముల పహాణీ, 1బీ కాపీలు పొందవచ్చని రెవెన్యూ శాఖ తెలిపింది. దీంతో రైతులు, ప్రజలకు కొంత ఇబ్బంది కలిగింది. తాజాగా సీసీఎల్‌ఏ వెబ్‌సైట్లో వివరాలు లభ్యమవుతుండటంతో ఉచితంగా భూములకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం వచ్చింది.
* సీసీఎల్‌ఏ వెబ్‌సైట్లో సమాచారం కేవలం ప్రాథమిక అవగాహనకే పెట్టామని.. మీసేవ ద్వారా అధీకృత పత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని రెవెన్యూశాఖ స్పష్టం చేసింది.
* గతంలోని మాభూమి వెబ్‌సైట్లో హైదరాబాద్‌ పరిసర జిల్లాలకు సంబంధించిన సేత్వార్‌, నక్షా (మ్యాప్‌) వివరాలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం కేవలం భూముల ప్రాథమిక సమాచారం మాత్రమే ఉంది.
* అభ్యంతరాలతో నిలిచిపోయిన భూముల ప్రక్షాళన జరిగిందా? లేదా? వివరాలు తెలుస్తాయి. సంబంధిత సర్వే నంబరు, ఖాతానంబరు లేకుంటే దరఖాస్తు ఇంకా పరిష్కారం కాలేదని సమాచారం.
* భూరికార్డుల ప్రక్షాళన జరిగినందున కొత్తగా భూములు కొనేవారికి సీసీఎల్‌ఏ సమాచారంతో నిజమైన పట్టాదారులు ఎవరు? హక్కుల విషయంలో న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయో తెలుసుకునే వీలుంది. వివాదాలుంటే ఆ భూముల వివరాలు అందుబాటులో ఉండవు.
* ప్రస్తుత సమాచారం చూసుకుని అందులో ఏమైనా తప్పులుంటే రైతులు, యజమానులు సరిచేసుకునేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా భూముల రికార్డులను ఎప్పటికప్పుడు వివాదరహితంగా, తప్పులు లేకుండా చూసుకునేందుకు వీలు కలుగుతుంది.

25/09/2018

ప్రజాస్వామ్యానికి ‘ఓటు’ ఆయువుపట్టు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో అవకాశమున్న ప్రతి ఒక్కరూ ఓటు ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి. అందుకు అర్హులైన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఇప్పటికీ ఓటు పొందనివారు, జనవరి 1, 2018కి 18 ఏళ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజు. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకూ అవకాశం ఉంది. దరఖాస్తులు స్వీకరించేందుకు జిల్లాల ఎన్నికల యంత్రాంగాలు పోలింగ్‌ బూత్‌లలో సేవా కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఫొటో, వయసు ధ్రువీకరణ, చిరునామా తెలిపే గుర్తింపు కార్డులతో పౌరులు ఆయా కేంద్రాలను సంప్రదించి దరఖాస్తులు సమర్పిస్తే సరిపోతుంది. వాటిని సంబంధిత జిల్లా అధికారులు పరిశీలించి అక్టోబరు 8 నాటికి ఓటరు కార్డులను మంజూరు చేస్తారు.

ఏ దరఖాస్తు.. ఎందుకు?
* ఫారం-6.. నూతన ఓటరు నమోదు
* ఫారం-7.. ఓటరు కార్డు తొలగింపు(శాసనసభ నియోజకవర్గం దాటి బదిలీ కావడం, చనిపోవడం, తదితర కారణాలతో)
* ఫారం-8.. పేరు, చిరునామాల్లో దోషాలు ఉంటే సరిదిద్దుకునేందుకు.
* ఫారం-8ఏ.. చిరునామా మార్పు(అదే శాసనసభ నియోజకవర్గం పరిధిలో)

11/06/2018

🐜 *ఒక చీమ రోజు ఆఫీసు కి వెళ్తుండేది..*
*ఆడుతూ పాడుతూ పని చేసిది..*
*అది పని చేసే చోట మంచి ఉత్పత్తి (result)వచ్చేది.*

*సీఈఓ సింహం🦁 రోజూ చీమని🐜 చూసి సంతోసించేవాడు.*

*ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు..*🤔

*చీమ🐜 దానంతటది పని చేస్తేనే ఇంత బాగా చేస్తోంది, దీని పైన ఒక సూపర్ వైజర్ ని పెడితే ఇంకా ఎంత బాగా చేస్తుందో అని.*

*ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్ వైజర్ గా నియమించాడు.*

*బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు, అటెండెన్స్ లు ప్రవేశ పెట్టింది..*

*వీటన్నిటిని చూసుకోవడానికి ఒక సాలీడు🕷 ని సెక్రటరీ గా నియమించుకుంది.*

*సింహం🦁 గారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వాళ్ళ ఎంత ఉత్పత్తి పెరిగింది, పని విధానానికి సంబందించిన రిపోర్ట్ లు వగైరా అడిగారు..*

*ఇవన్ని చేయడానికి బొద్దింక ఒక కంప్యూటర్ ని ఒక ప్రింటర్ ని తెప్పించుకొని వాటిని ఆపరేట్ చేయడానికి ఒక ఈగని 🐝నియమించింది.*

*మరో వైపు ఆడుతూ పాడుతూ పని చేసే చీమ🐜 నీరసించడం మొదలు పెట్టింది..*

✅ *అది చేసే పని కి తోడూ పై అదికారులతో మీటింగ్ లు, ఎప్పటికప్పుడు అందచేయాలసిన రిపోర్ట్ లు దాని నెత్తి మీదకొచ్చి పడ్డాయి.*.

🤦🏻‍♂ *ఈ లోగ బొద్దింక అధికారికి తోడూ మరో మేనేజర్, వీళ్ళ హోదా కి తగినట్లు ఆఫీసు కు కొత్త హంగులు, ఆర్భాటాలు మొదలైనాయి..*

*క్రమంగా చీమ కే కాదు ఆఫీసు లో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండా పోయింది..*

*ఉత్పత్తి(result)పడిపోయింది*

*సిఈఓ సింహం🦁 గారు ఈ సమస్యని పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్ల గూబ🦉 కి అప్పగించారు..*

*ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం లో ప్రపంచ ప్రసిద్ది గాంచిన గుడ్లగూబ🦉 గారు ఆఫీసు స్థితిగతులని అద్యయనం చేసి, అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పారు..*

*వెంటనే సింహం🦁 ,బొద్దింక మీటింగ్ పెట్టుకొని చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న చీమని🐜 పనిలో నుండి తొలగించాలని తీర్మానించాయి..*

*This is the style of present administration every where*

👌👌👌👌👌👌👌👌

*నీతి: పెత్తనం చేస్తూ పనిచెయ్యని వారిదే రాజ్యం*
*కష్టపడి పని చేసేవాడు ఎప్పుడూ బాధితుడే.*. ✍✍✍✍

31/05/2018

👏👏ఇద్దరు అన్నదమ్ములు...

ఒకడు తాగుబోతు🍺...

ఒకడు ప్రయోజకుడు👨‍🎓...

తాగుబోతును నువ్వెందుకిలా అయ్యావు అని అడిగితే💁‍♂️...

"అంతా మా నాన్న వల్లే...
ఆయన తాగుబోతు. మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ కొట్టేవాడు. ఏదో నేరం చేసి జైలుకి వెళ్లేవాడు....
అందుకే నేనిలా తయారయ్యాను." అన్నాడు🙆‍♂️...

ప్రయోజకుడిని నువ్వెందుకిలా అయ్యావు అని అడిగితే...
"అంతా మా నాన్న వల్లే.🤴..
ఆయన తాగుబోతు. మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడూ కొట్టేవాడు. ఏదో నేరం చేసి జైలుకి వెళ్లేవాడు.... అమ్మని కొట్టేవాడు... ఆయన్ని చూసి నేనేం చేయకూడదో నేర్చుకున్నాను🙋‍♂️.
అందుకే నేనిలా తయారయ్యాను." అన్నాడు...

ఒకే పరిస్థితి...
"ఇద్దరికీ వేర్వేరు పాఠాలను నేర్పించింది"👐
తేడా పాఠంలో లేదు...
నేర్చుకునేవాడిలో ఉంది...

---

మంచి చెడుల విచక్షణ చేసి మంచి వైపు తీసుకెళ్ళే హేతుబద్ధ యోచన సహజంగానే మనుషుల్లో ఉంటుంది.🤛🤜

దానిని ఉపయోగించుకున్నవారు పాఠాలు నేర్చుకుని ,చెడును వదలి మంచివైపు పయనిస్తారు.🤘

దానిని ఉపయోగించకొనని వారు అనుసరించి ఆ చెడువైపే పయనిస్తారు.👎

ఆ హేతుబద్ధ యోచనను తట్టి లేపవలసిన పని జ్ఞానం ఉన్న ప్రతి వారూ చేయాలి.🤝🙌🏃‍♂️👨‍🚀

15/05/2018

ఇంజినీరింగ్‌
బ్రాంచా.. కళాశాలా.. ఎంపికలో ఏదిముఖ్యం?

పిల్లలకు ఫలానా ర్యాంకు వచ్చింది. అదుగో ఆ కాలేజీలో సీటు వస్తుందని అంచనా. కానీ కావాల్సిన బ్రాంచి రాదు. అవకాశాలు తక్కువగా ఉండే మరో బ్రాంచిలో చేరదామంటే మనసు ఒప్పుకోవడం లేదు. పోనీ కోరుకున్న బ్రాంచిలో చేరదాం అంటే కాలేజీ అంతగా బాగోలేదు. మేనేజ్‌మెంట్‌ సీటు అనుకుంటే ఆర్థిక భారం మోయడం కష్టం. ఇవే ఈ దశలో ఎదురవుతున్న సందేహాలు, సందిగ్ధతలు.
ఏ బ్రాంచి మంచిది? ప్రస్తుతం దేనికి అవకాశాలు బాగున్నాయి? అన్నింటిలోకీ సులువైన ఇంజినీరింగ్‌ బ్రాంచి ఏది? ఏ కాలేజీలో ఏ బ్రాంచి బాగుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలను సాధారణంగా అందరూ వెతుక్కుంటుంటారు. అయితే మంచి నిర్ణయం తీసుకోడానికి కేవలం ఆ ప్రశ్నలకు జవాబులు రాబట్టుకుంటే చాలదు. వాటికి నిర్దిష్టమైన సమాధానాలు రావాలంటే మరికొన్ని అనుబంధ, అదనపు ప్రశ్నలకు సంతృప్తికరమైన వివరాలు తెలుసుకోవాలి.

మీ ప్రాధాన్యం కాలేజీ అయితే!
కాలేజీ ముఖ్యమని విద్యార్థి, తల్లిదండ్రులు భావిస్తే ఈ కింది అంశాలను పరిశీలించాలి.

సిలబస్‌, కరిక్యులమ్‌: దాదాపు అన్ని కళాశాలలకు కరిక్యులమ్‌ (బోధనా ప్రణాళిక)ను విశ్వవిద్యాలయం నిర్ణయిస్తుంది. అయితే స్వయం ప్రతిపత్తి ఉన్న కళాశాలలకు కొంత వెసులుబాటు ఉంటుంది. కరిక్యులమ్‌ దీర్ఘకాలంలో మంచి కెరియర్‌కు ఎంతమేరకు ఉపయోగపడుతుందో పరిశీలించుకోవాలి. దానికి నిపుణుల సాయం తీసుకోవచ్చు.

అధ్యాపక బృందం: కాలేజీలోని బోధనా సిబ్బంది పని అనుభవం వివరాలు తెలుసుకోవాలి. వారికి పరిశ్రమల్లో పూర్వ అనుభవం లేదా ప్రస్తుతం అనుబంధం ఉందా అని కనుక్కోవాలి. వివిధ రీతుల్లో బోధన చేసిన అనుభవం, పోటీపరీక్షలకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులు కళాశాలలో ఉంటే మరీ మంచిది. రిసెర్చ్‌ ప్రచురణలు చేసే సిబ్బంది అయితే విద్యార్థుల ఆశయాల సాధనకు సాయపడతారు.

కొత్త ఆవిష్కరణలు-ప్రోత్సాహకాలు: కాలేజీలో ప్రయోగశాలలు సరిగా ఉన్నాయా, ఆవిష్కరణలకు తగిన ప్రోత్సాహం అందుతుందా, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణల పూర్వాపరాలు తెలుసుకోవాలి.

కాలేజీలో విద్యార్థి జీవనం: విద్యార్థి రోజులో ఎక్కువభాగం కళాశాలలో గడపాల్సి ఉంటుంది. అందుకు తగిన వాతావరణం ఉందా అని సీనియర్లను అడగాలి. క్రమశిక్షణతోపాటు పరిమితులతో కూడిన స్వేచ్ఛ కూడా విద్యార్థులకు అవసరమే. ఇంజినీరింగ్‌ అంటే కేవలం పాఠ్యపుస్తకాల పఠనం కాదు. ప్రయోగాలు, సహవిద్యార్థులతో సమాలోచనలు, సంప్రదింపులు, గ్రంథాలయంలో వివిధ వనరుల అన్వేషణ వంటి పలు అంశాలు ఉంటాయి. ఇవన్నీ సరిగా నిర్వర్తించాలంటే కొంతమేరకు స్వేచ్ఛ కావాలి. అది కాలేజీలో ఉండాలి. క్రీడలకు ప్రోత్సాహం, మైదానాల ఏర్పాటును పరిశీలించాలి.

విద్యార్థి సముదాయం: సాధారణంగా ఇంజినీరింగ్‌ స్థాయిలో అధ్యాపకుల ద్వారా పాఠ్యాంశాల పరిచయం జరిగితే స్నేహితుల సాయంతో పూర్తిస్థాయిలో నేర్చుకుంటారు. అలా విద్యార్థుÄలను చిన్న బృందాలుగా ఏర్పరచడంలో కళాశాల ఎలాంటి చొరవ చూపిస్తోందో కనుక్కోవాలి.

దూరం: కాలేజీ ఎంత దూరంలో ఉందనే అంశాన్ని ఒక ప్రతిబంధకంగా మార్చుకోవద్దు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, బిట్స్‌ వంటి ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలన్నీ నిర్జన ప్రదేశాల్లోనే ప్రకృతి ఒడిలో ఉంటాయి. ఇతర విషయాలన్నీ సంతృప్తికరంగా ఉంటే దూరాన్ని పరిగణనలోకి తీసుకోవద్దు.

కాలేజీ వారసత్వం: ఫలానా కాలేజీ నుంచి వచ్చిన విద్యార్థిగా కొన్ని ఉపయోగాలు ఉంటాయి. స్థాపితమైన నాటి నుంచి ఆ కాలేజీ పాటించిన నియమావళి, విలువలు, అభివృద్ధి చెందిన తీరు వంటివి ఆ కాలేజీకి ఒక పేరును తెచ్చిపెడతాయి. ఇది కూడా కళాశాల ఎంపికలో విద్యార్థి గుర్తించాల్సిన విషయం. అదే సమయంలో పిల్లల్లో నాయకత్వ లక్షణాలను కాలేజీ పెంపొందిస్తోందో లేదో కూడా తెలుసుకోవాలి.

ప్రకటనల ఆకర్షణ: కాలేజీ విశేషాలను కరపత్రాల రూపంలో యాజమాన్యాలు పంచుతాయి. కొందరు వాటిని అసలు పట్టించుకోరు. మరికొందరు దాని ఆధారంగానే కళాశాలలో పిల్లలను చేర్పించేస్తారు. ఈ రెండూ అంత మంచి పద్ధతులు కాదు. కాలేజీ ప్రాంగణాలను స్వయంగా సందర్శించి అన్ని వసతుల వివరాలు కనుక్కోవాలి. యంత్రాంగ సామర్థ్యాన్ని ఆరాతీయాలి. అలాగే కాలేజీ సామాజిక బాధ్యతగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందో కూడా అడగాలి. మంచి నిర్ణయం తీసుకోవడంలో ఈ అంశాలు సాయపడతాయి. ప్రయోగశాలలు, ప్రయోగాలు, ప్రాజెక్టులు చేయిస్తున్న తీరు తదితరాలను గ్రహించాలి.

విద్యార్థి-అధ్యాపక నిష్పత్తి: విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అధ్యాపకుల తోడ్పాటు తప్పనిసరి. ఏఐసీటీఈ నిబంధనల మేరకు ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలి. ఇందులో మళ్లీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తగిన నిష్పత్తిలో ఉండాలి. ఈ సంవత్సరం నుంచే 1 : 20 నిబంధనలు అమలులోకి వచ్చాయి. కొన్ని సంస్థలు 1 : 15 నిష్పత్తిలోనే అధ్యాపకులను నియమించుకున్నాయి. ఇలాంటి కాలేజీల్లో అడ్మిషన్‌ తీసుకుంటే విద్యార్థి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతాయి.

ఎన్‌బీఏ, న్యాక్‌ ప్రమాణాలు: కళాశాలల్లో ఇంజినీరింగ్‌ బ్రాంచీల నిర్వహణ ప్రమాణాల నాణ్యతకు గుర్తుగా ప్రభుత్వం ఏఐసీటీఈ ద్వారా ఎన్‌బీఏ అక్రెడిటేషన్‌ పత్రం ఇస్తుంది. ఈ గుర్తింపును కాలేజీలోని ప్రతి బ్రాంచికి తీసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో విద్యాబోధన ఉంటేనే ఎన్‌బీఏ అర్హత లభిస్తుంది. అలాగే విద్యాసంస్థ నిర్వహణలో ప్రమాణాలు పాటిస్తే న్యాక్‌ గుర్తింపు వస్తుంది. ఒక కళాశాలకు ఈ రెండు గుర్తింపులు చాలా ముఖ్యం. అందులోనూ ఎన్‌బీఏ పత్రం అత్యవసరం. ఈ గుర్తింపులు ఉన్న కళాశాలలో కోర్సు చేస్తే దేశవిదేశాల్లో ఉద్యోగం, ఉన్నత విద్యకు మార్గాలు సులభమవుతాయి.

ఇతర అంశాలు
కాలేజీ, బ్రాంచీల గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు మరికొన్ని ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.

ప్రాంగణ నియామకాలు: కాలేజీల్లో ప్రాంగణ నియామకాలు జరుగుతున్న తీరు గమనించాలి. సాధారణంగా సేవల రంగంలో ఉన్న కంపెనీలకు ఎక్కువమంది ఇంజినీర్ల అవసరం ఉంటుంది. అందుకే అక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలే కాకుండా మౌలిక బ్రాంచీలైన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ రంగాలకు చెందిన కంపెనీలు ప్రాంగణ నియామకాలు జరిపే కాలేజీలను ఎంచుకోవడం మంచిది. ఫలానా బ్రాంచికి ఫలానా కాలేజీలో అధిక నియామకాలు జరుగుతుంటే అది కూడా పరిగణనీయ అంశమే.

ఉద్యోగావకాశాలు: ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోనూ అవకాశాలు చాలా ఉన్నాయి. ఏ రంగంలో పని చేయాలనుకుంటున్నారనేది కూడా నిర్ణయాలను ప్రభావితం చేసే అంశమే. ఉదాహరణకు ప్రభుత్వ, ప్రైవేటుల్లో రెండింటిలోనూ సమాన అవకాశాలు ఉన్న బ్రాంచి కావాలనుకుంటే ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌ లేదా ఆటోమొబైల్‌ బ్రాంచీలు ఎంచుకోవాలి. విదేశాలు, ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటే సీఎస్‌ఈ, ఐటీ, బయోటెక్‌ లాంటివి తీసుకోవచ్చు. ఇతర బ్రాంచీలకు కూడా విదేశీ అవకాశాలు ఉన్నాయి.

కన్సల్టెంట్‌ల సహాయం: కాలేజీలు ఎక్కువై, సీట్లు పెరిగే కొద్దీ కొన్ని కాలేజీలు కన్సెల్టెంట్ల సహాయం తీసుకుంటాయి. కమీషన్‌కు ఆశపడేవారిని పూర్తిగా నమ్మకూడదు. కొందరు కన్సల్టెంట్లు తమకు వచ్చిన కమీషన్‌లో కొంత సొమ్ము ఇస్తామని ప్రలోభ పెట్టవచ్చు. అలాంటి ప్రలోభాలకు అసలు లొంగవద్దు. కన్సెల్టెంట్లు చూపిన కాలేజీ అయినా, స్వయంగా అన్ని విషయాలనూ బేరీజు వేసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి.

కోరుకున్న బ్రాంచిలో చేరాలంటే!
ఇది మరో చిక్కు ప్రశ్న. కొంత విషయసేకరణతో దీని పట్ల కూడా స్పష్టత ఏర్పరచుకోవచ్చు. తగిన నిర్ణయం తీసుకోడానికి అది సాయపడుతుంది. దేశంలో దాదాపు రెండువందలకు పైగా స్పెషలైజేషన్లు బీటెక్‌ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలావరకు కొత్త కోర్సులన్నీ ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోనూ, అనుబంధ కాలేజీల్లోనూ దాదాపు మౌలిక బ్రాంచీలే ఉన్నాయి. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఆటోమొబైల్‌, మెటీరియల్‌ సైన్స్‌ వంటి కోర్‌ బ్రాంచీల్లో బీటెక్‌ చేయడం మంచిదే. అలా అని ఇతర బ్రాంచీలు పనికిరావని కాదు. దేని ప్రత్యేకత దానిదే. ఆసక్తి, అభిరుచి, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నామనే అంశాలే బ్రాంచిని నిర్ణయిస్తాయి.
ఒకప్పుడు ఇంజినీరింగ్‌ పూర్తయిన వెంటనే ఉద్యోగాలు సిద్ధంగా ఉండేవి. కాలేజీలో బి.టెక్‌ ముగించిన విద్యార్థులకు అప్పట్లో సంస్థలు శిక్షణ ఇచ్చేవి. తమ అవసరాలకు అనుగుణంగా మలచుకునేవి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విపరీతంగా పెరుగుతున్న పోటీ, వేగంగా మారుతున్న టెక్నాలజీలు, ప్రైవేటైజేషన్‌, ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు, ప్రాపంచిక జ్ఞానం, భావప్రకటనా సామర్థ్యం, బహుభాషా పాటవం కూడా చాలా అవసరమైన ఆయుధాలుగా పరిణమించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక బ్రాంచి ఉద్యోగం తెప్పిస్తుందని అనుకోవడం పొరపాటు. ఫలానా బ్రాంచికి ఉద్యోగం వస్తుందని భావించడం అపోహే. లేదా ఒక బ్రాంచి మిగిలినవాటికన్నా సులభం అనుకోవడం కూడా మభ్యపెట్టుకోవడమే.

ఒకరు ఒక బ్రాంచిలో బీటెక్‌ చేసి ఎక్కువ జీతం తెచ్చుకున్నారనే విషయంలో బ్రాంచి గొప్పదనం కంటే విద్యార్థి శ్రమే అధికంగా ఉంటుంది. కాబట్టి ఒక బ్రాంచి అందరికీ గొప్ప జీవితాన్ని ఇచ్చేస్తుందనుకోకూడదు. సహజమైన అభిరుచితో ఏ బ్రాంచిలో బీటెక్‌ చేసినా, పొందిన నైపుణ్యాల ఆధారంగా మాత్రమే కెరియర్‌ ఉంటుందనేది అక్షర సత్యం. అందుకే అభిరుచి ప్రధానంగా బ్రాంచి ఎంచుకోవాలి. అందుకు నిపుణుల సాయం తీసుకోవచ్చు.

ఇప్పుడు ఏ బ్రాంచికి గిరాకీ ఉంటుందనే విచారణలు కొందరు చేస్తుంటారు. ఇది మరీ అసంబద్ధం. కోర్సులో చేరడానికి ముందు ఫలానా బ్రాంచికి డిమాండ్‌ ఉందనిపిస్తే నాలుగేళ్ల తర్వాత అదే పరిస్థితి ఉంటుందన్న గ్యారంటీ ఉంటుందా? కష్టం. నిజానికి ప్రతి బ్రాంచికి తనదైన డిమాండ్‌ ఉంటుంది. విద్యార్థి పడే శ్రమ మాత్రమే ఉద్యోగ భద్రతను ఇస్తుంది.

అన్నింటికీ అవకాశాలు
అభిరుచికి తగినట్లు బ్రాంచిని ఎంచుకుంటే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. అంతేకానీ విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలానా బ్రాంచే కావాలని పట్టుపట్టడం సరికాదు. అభిరుచి, సామర్థ్యం, భవిష్యత్తులో కెరియర్‌ ఎలా ఉండాలనుకుంటున్నామనే అంశాలే కీలకం. విద్యార్థి సామర్థ్యాలపై కూడా సరైన స్పష్టత ఉండాలి.

కాలేజీ, బ్రాంచీల్లో ఏది ముఖ్యం అనే ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలంటే రెండూ అనాల్సిందే. అయితే ఆ పరిస్థితుల్లో ఎదురయ్యే సందిగ్ధతను తొలగించాలంటే విద్యార్థి తనకున్న అవకాశాలను బేరీజు వేసుకోవాలి. ఇప్పటివరకు చర్చించిన అంశాల ప్రాతిపదికన కాలేజీని అంచనా వేయాలి. బ్రాంచి ముఖ్యమనుకున్నప్పుడు అంచనాలో తేలిన కాలేజీల్లో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఒకవేళ స్పష్టమైన సమాధానం దొరక్కపోతే మంచి కాలేజీ వైపే మొగ్గు చూపడం అభిలషణీయం.

తల్లిదండ్రుల ఒత్తిడి, స్నేహితులు, బంధువుల ప్రభావం కన్నా విద్యార్థి అభిరుచికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ అందుకు తగిన శ్రమ కూడా విద్యార్థి పడాలి. కేవలం నాలుగేళ్ల చదువుకే పరిమితం కాకుండా జీవితానికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. అందులో స్వీయ ఆసక్తులదే ప్రధానపాత్ర.

ఎప్పుడూ ఒకేలా ఉండదు
ఒక బ్రాంచిలో ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయని దానిలోనే అడ్మిషన్‌ తీసుకుంటే బాగుంటుందనే ధోరణి చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది సరైంది కాదు. ఒక బ్రాంచిలో దొరికే అవకాశాలు కాలక్రమేణా మారుతుంటాయి. కొత్త ఆవిష్కరణలు, మార్పులు ప్రతి బ్రాంచిలోనూ సహజమే. అందువల్ల డిమాండ్‌ ఉందని ఇష్టం లేని బ్రాంచిలో చేరితే తరువాత బాధపడాల్సి ఉంటుంది.

అన్ని కాలేజీలు తమ వెబ్‌సైట్‌ల్లో తమ కాలేజీల్లో జరిగే విద్యా బోధనాపద్ధతులు, విద్యార్థి అభివృద్ధి కేంద్రిత కార్యక్రమాల వివరాలు పొందుపరుస్తుంటాయి. వీటి ద్వారా ఒక కాలేజీలో ఆయా బ్రాంచీలు తమ విద్యార్థుల అవసరాలను ఎలా గుర్తించి, వివిధ కార్యక్రమాల ప్రణాళిక అమలు చేస్తున్నాయో తెలుస్తుంది. వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులను కలిసి అదనపు సమాచారం సేకరించాలి. ఒక కాలేజీలో అన్ని బ్రాంచీలు సమానంగా ఉండకపోవచ్చు. ఆ విషయంలో ఐఐటీలకు కూడా మినహాయింపు లేదు. ఫలానా ఐఐటీలో ఫలానా బ్రాంచి బాగుందనే మాటలు వినిపించడానికి కారణం అదే. కాలేజీ, బ్రాంచీల చర్చ వస్తే ఐఐటీలను కూడా ఈ కోణంలోనే ఆలోచించాలి.

All the best....

09/05/2018

పెంపకం.. ఓ జీవన కళ!

తల్లిదండ్రుల తీరుతోనే బుజ్జాయిలకు సంస్కారం

ఇవీ కిటుకులు
* ఐదేళ్ల వరకు లాలనగా చూడాలి. ఏమీ తెలియని పసివయసు కాబట్టి చిన్నారుల కదలికలు, సైగలను, కదలికలను గమనించి లాలనతో సపర్యలు చేయాలి.

* పదేళ్ల వరకు ఆలనగా ఉండాలి. మాటలు బాగా వస్తాయి కాబట్టి ఏవేవో కోరికలు కోరుతుంటారు. ఆటబొమ్మలు, తినుబండారాలు లాంటివి అడుగుతుంటారు. అవసరమైన మేరకే వాటిని తీర్చాలి.

* పదహారేళ్ల వరకు పాలనగా చూడాలి. చాలా కీలకమైన వయస్సు అది. చదువు, సంస్కారం, దేశభక్తి, సేవానిరతి, సానుకూల ఆలోచనా ధోరణిని అలవరచాలి. ఇంటి పని బయటి పనులకు పురమాయించాలి. లోకం తీరు, సమాజాన్ని తెలుసుకుని మంచిని ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది.

* పిల్లలతో కోపంగా మాట్లాడొద్దు. మంచి పని చేసినప్పుడు అభినందించాలి. చెరుపు పని చేసినపుడు ఆలోచన కలిగించేలా వివరించాలి.
* పిల్లలు ఏ పని చేసినా కొందరు పెద్దలు కోపంగా మాట్లాడతారు. ఆ అలవాటును మానుకోవాలి.

* చిన్నారులను ఇంటి నుంచి కదలనివ్వకుండా కట్టడి చేయడం సరికాదు. చిన్నప్పుడు కట్టడి చేస్తే యవ్వనంలో విచ్చలవిడిగా మారే ప్రమాదం ఉంటుంది.

* చిన్నారులను ఎంతసేపు ఆడించినా మనస్ఫూర్తిగా సంతృప్తి చెందరు. సమ వయసు పిల్లలకు ఆకర్షితులు కావడం సహజ లక్షణం. మంచి వారితో ఆడుకుని పాడుకుని ఆనందించేలా చూడాలి.

* చెప్పిందే వినాలని పిల్లలను అజమాయిషీˆ చేయరాదు. వారిలోని సృజనను గమనించాలి. ఇష్టాయిష్టాలను తెలుసుకోవాలి. చెడును సవరించాలి, మంచిని ప్రోత్సహించాలి.

* కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పు చేసినా వెనకేసుకొస్తుంటారు అది సరికాదు. మంచి చెడులు వివరించాలి.

* కొందరు తండ్రులు ఇంటి పనిని పట్టించుకోరు. మంచివారు అనిపించుకునేందుకు బయటి వారు కోరే సాయం చేసేందుకు మాత్రం పరుగెడతారు. ముందు ఇంటిని చూడాలి. ఆ తర్వాతే బయట అనే విషయం గుర్తుంచుకోవాలి.

* పిల్లల ముందు భార్యాభర్తలు ఎట్టి పరిస్థితిల్లోనూ గొడవ పడవద్దు. పిల్లలపైన ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

* మీ అమ్మకు ఏమీ తెలియదని, మీ నాన్నకు ఏమీ తెలియదని పిల్లలతో అనరాదు. ఇద్దరికీ ఏమీ తెలియని అమాయకులని ముద్రపడుతుంది.

* వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ చాటింగ్‌లను అవసరార్థం వాడటంలో తప్పులేదు. దుర్వినియోగం అవుతున్నప్పుడు తప్పనిసరిగా కట్టడి చేయాలి.

* మా బాబు అచ్చం తాతయ్యలా మొండిగా ఉంటాడు, మా పాప అమ్మమ్మలా గయ్యాళిగా ఉంటుందని పదేపదే పిల్లల ముందు అనరాదు. మనసులో నాటుకుని పోయి అలాగే వ్యవహరించే ప్రమాదం ఉంటుంది.

11/04/2018

పదోతరగతి తర్వాత?
ఈ ఉద్యోగాలకు టెన్త్‌ చాలు!

ప్రతి విద్యార్థి చదువు పరమార్థం దాదాపుగా ఉద్యోగమే. ఎంత పెద్ద పట్టా పుచ్చుకుంటే అంత గొప్ప ఉద్యోగం రావచ్చేమో కానీ పది పాసైతే మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కొలువులు ఎన్నో ఉన్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, రైల్వే, పారామిలటరీ, పోస్టల్‌, రెవెన్యూలో వీఆర్‌ఏ.. ఇలా వివిధ విభాగాలు, శాఖల్లో కేవలం టెన్త్‌తో ఉపాధి పొందవచ్చు. చిన్న వయసులోనే ఈ ఉద్యోగాలు సాధించడం ద్వారా జీవితంలో స్థిరత్వంతోపాటు, తరువాత తగిన అర్హతలు సంపాదిస్తే ఉన్నత స్థానాలకూ చేరుకోవచ్చు.

పదో తరగతి ఉత్తీర్ణత పొందడం విద్యార్థి జీవితంలో మొదటి మైలురాయిగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఉన్నత విద్యతోపాటు కొన్ని రకాల ఉద్యోగాలకూ అర్హత లభిస్తుంది. ఆర్థిక అవసరాలు, ఆసక్తుల మేరకు అభ్యర్థులు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టెన్త్‌ తర్వాత ఉన్న ఉద్యోగాల గురించి తెలుసుకుందాం. ఆయా నోటిఫికేషన్లు వెలువడినప్పుడు వాటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌
మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలనూ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ భర్తీ చేస్తుంది. ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 18-25 ఏళ్లవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ 25, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌ 25, జనరల్‌ ఇంగ్లిష్‌ 50, జనరల్‌ అవేర్‌నెస్‌ 50 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పేపర్‌-2 డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో భాగంగా ఏదైనా అంశంపై పొట్టి వ్యాసం, ఉత్తరం రాయాల్సి ఉంటుంది. నచ్చిన భాషలో రాసుకునే వెసులుబాటు ఉంది.
వెబ్‌సైట్‌: http://www.ssc.nic.in

ఎయిర్‌ ఫోర్స్‌
భారత వాయుసేన (ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌) పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ఎయిర్‌ మెన్‌ (మ్యుజీషియన్‌ ట్రేడ్‌) ఉద్యోగాలను కల్పిస్తోంది. ఇది గ్రూప్‌ వై ట్రేడ్‌ కిందికి వస్తుంది. ఈ విధానంలో ఎంపికైనవారు ఎయిర్‌ ఫోర్స్‌ బ్యాండ్‌లో పనిచేస్తారు. ఏదో ఒక మ్యూజిక్‌ పరికరంపై ప్రావీణ్యం ఉండాలి.
అర్హతలు: కనీసం 45 శాతం మార్కులతో పదో తరగతి పాసై ఉండాలి. వయసు 17 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎత్తు 157 సెం.మీ., ఛాతీ సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: మొదట రాతపరీక్ష ఉంటుంది. తర్వాత శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో అర్హత సాధించిన వారికి వైద్య పరంగా ఫిట్‌నెట్‌ పరిశీలించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్‌:www.indianairforce.nic.in

ఇండియన్‌ నేవీ
చెఫ్‌, స్టివార్డ్‌, శానిటరీ హైజీనిస్ట్‌ ఉద్యోగాలను మెట్రిక్‌ రిక్రూట్‌మెంట్‌ (ఎంఆర్‌) ద్వారా నేవీలో భర్తీ చేస్తున్నారు. పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హతతో 17 -21 ఏళ్లలోపు వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. రాత, దేహదార్ఢ్య పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌ సైట్‌: www.joinindiannavy.gov.in

రైల్వేలో...
రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) పోస్టులకు రాతపరీక్ష, దేహదార్ఢ్య పరీక్షల ద్వారా భర్తీ చేస్తారు.
రైల్వేలో వివిధ విభాగాలు, సెక్షన్లలో హెల్పర్‌, హాస్పిటల్‌ అటెండెంట్‌, అసిస్టెంట్‌ పాయింట్స్‌ మెన్‌, గేట్‌మన్‌, పోర్టర్‌, హమాల్‌, స్వీపర్‌ కమ్‌ ఆపరేటర్‌ తదితర ఉద్యోగాలు పది అర్హతతో ఉన్నాయి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు (సీబీటీ), ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్టు (పీఈటీ)ల్లో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. టికెట్‌ ఎగ్జామినర్‌, జూనియర్‌ క్లర్క్‌ కం టైపిస్టు ఉద్యోగాలను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా భర్తీ చేస్తారు. రైల్వే పరీక్షలు తెలుగులోనూ రాసుకోవచ్చు.
వెబ్‌ సైట్లు: ‌www.indianrailways.gov.in & www.scr.indianrailways.gov.in

ఆర్‌బీఐలో ఆఫీస్‌ అటెండెంట్లు
ఆర్‌బీఐ ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టులను పదో తరగతి విద్యార్హతతో భర్తీ చేస్తుంది. ఇందులో ప్యూన్‌, దర్వాజ్‌, మజ్దూర్‌ అనే మూడు రకాల ఉద్యోగాలు ఉంటాయి. 18-25 ఏళ్లలోపు వారు అర్హులు. ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ఎంపిక చేస్తారు. రీజనింగ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఉద్యోగంలో చేరినవారు సీనియర్‌ ఆఫీస్‌ అటెండెంట్‌గా పదోన్నతి పొందవచ్చు. డిగ్రీ పూర్తయితే శాఖాపరమైన పరీక్షల ద్వారా ఉన్నత ఉద్యోగాలు లభిస్తాయి.

పోస్టల్‌
పోస్టల్‌ శాఖలో పోస్టుమ్యాన్‌, మెయిల్‌ గార్డు ఉద్యోగాలను పదో తరగతి అర్హతతో భర్తీ చేస్తున్నారు. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. వంద మార్కులకు నిర్వహించే ఆప్టిట్యూడ్‌ పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌, మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, తెలుగు అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
* గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌ (జీడీఎస్‌) - బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), మెయిల్‌ డెలివరర్‌ (ఎండీ), ప్యాకర్‌ పోస్టులను పదోతరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తున్నారు. శాఖాపరమైన పరీక్షల ద్వారా వీరు పోస్టుమేన్‌, మెయిల్‌ గార్డు మొదలైన పదోన్నతులు పొందవచ్చు.
వెబ్‌సైట్‌: ‌www.indiapost.gov.in

చాలా ఉద్యోగాలకు కనీస వయసు పద్దెనిమిదేళ్లు నిండాలి. పదో తరగతి పూర్తయినవారికి ఆ వయసు ఉండదు కాబట్టి చదువు ఆపేయకుండా ఏదో ఒక కోర్సులో చేరడం మంచిది. అలా చేరడం వీలుకానివాళ్లు ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్‌ లేదా ఒకేషనల్‌ కోర్సులు పూర్తిచేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఉద్యోగంలో చేరిన తర్వాత పద్దెనిమిదేళ్లు నిండినవారు ఇంటర్‌ లేకుండానే నేరుగా డిగ్రీలోకి దూరవిద్య ద్వారా ప్రవేశం పొందవచ్చు. అన్ని యూనివర్సిటీలూ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

ఎస్‌ఎస్‌సీ-కానిస్టేబుల్స్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టులకు ప్రకటన విడుదల చేస్తుంది. పదో తరగతి అర్హతతో ఎక్కువ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్‌ ద్వారానే భర్తీ అవుతున్నాయి. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ), స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ ( ఎస్‌ఎఫ్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌ వంటి విభాగాల్లో ఖాళీలను ఎస్‌ఎస్‌సీ ఉమ్మడి రాతపరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత. వయసు 18 నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుష అభ్యర్థుల ఛాతీ చుట్టుకొలత సాధారణ స్థితిలో 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: మూడు దశల్లో ఎంపిక చేపడతారు. మొదటి దశలో ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అయిదు కిలోమీటర్లు పరుగెత్తాలి. రెండో దశలో రాతపరీక్ష ఉంటుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌, ఇంగ్లిష్‌/ హిందీ సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తారు. మూడో దశలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగానికి ఎంపికచేస్తారు.

వీఆర్‌ఏ

రాష్ట్రంలో రెవెన్యూ విభాగానికి సంబంధించి గ్రామస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించే విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ (వీఆర్‌ఏ) ఉద్యోగాలను పొందాలంటే టెన్త్‌ అర్హత సరిపోతుంది. ఇటీవల రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు రాతపరీక్షల ద్వారా ఈ భర్తీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
వెబ్‌సైట్‌: ‌www.psc.ap.gov.in. www. tspsc.gov.in

అటవీ శాఖ

రాష్ట్ర అటవీ శాఖల్లో బంగ్లా వాచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎత్తు: పురుషులకు 163 సెం.మీ., స్త్రీలకు 150 సెం.మీ.
ఎంపిక: తగిన శారీరక ప్రమాణాలను కలిగి ఉన్నవారికి రాతపరీక్ష ఉంటుంది. అందులో అర్హులైన వారికి నడక పరీక్ష నిర్వహిస్తారు. దీన్లో నాలుగు గంటల లోపు పురుషులు 25 కిలోమీటర్ల దూరాన్ని, మహిళలు 16 కిలోమీటర్ల దూరాన్ని నడవాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్‌:www.forests.ap.gov.in, www.forests.telangana.gov.in

ఇండియన్‌ ఆర్మీ

ఇండియన్‌ ఆర్మీ పదో తరగతి అర్హతతో వివిధ రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలవారీగా రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలను చేపట్టి అర్హులను ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు. పదో తరగతితో ఆర్మీలో సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ, సోల్జర్‌ ట్రేడ్స్‌మెన్‌ ఉద్యోగాలు లభిస్తున్నాయి. సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ ఉద్యోగానికి 17 1/2 -21 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. సోల్జర్‌ ట్రేడ్స్‌మెన్‌ ఉద్యోగానికి 17 1/2 - 23 ఏళ్లలోపువారు అర్హులు. ఈ ఉద్యోగంలోకి చేరినవారు తరువాత సిపాయి, నాయిక్‌, హవల్దార్‌ వంటి ప్రమోషన్లు పొందవచ్చు. రాత, దేహదార్ఢ్య పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు ఉంటాయి. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా వైద్య ఆరోగ్య పరీక్షలు కూడా ఉంటాయి. ఏటా భర్తీ కార్యక్రమాలు (రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలు) జరుగుతాయి.
వెబ్‌సైట్‌:www.indianarmy.nic.in

మరికొన్ని విభాగాలు

ఐటీబీపీఎఫ్‌: ఇండో - టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీఎఫ్‌)లో కానిస్టేబుల్‌ హోదాలోనే కుక్‌, వాషర్‌మన్‌, బార్బర్‌, వాటర్‌ క్యారియర్‌, సఫాయి కర్మచారి తదితర ఉద్యోగాలు లభిస్తాయి. పురుషులు మాత్రమే అర్హులు. వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. శారీరక సామర్థ్య, రాత, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
వెబ్‌సైట్‌: https://.itbpolice.nic.in
* ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల్లో లేబర్‌ పోస్టులు పదో తరగతి విద్యార్హతతోనే భర్తీ చేస్తారు. అలాగే బ్యాంకులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్యూన్‌ పోస్టులకు ఈ విద్యార్హతతోనే పోటీ పడవచ్చు.
* సీఐఎస్‌ఎఫ్‌లో కుక్‌, వాటర్‌ క్యారియర్‌, వాషర్‌, సఫాయీ కర్మచారి, బార్బర్‌ తదితర పోస్టులకు పదో తరగతే అర్హత. 18-23 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్‌: http://www.cisf.gov.in/
* ఏపీఎస్‌/టీఎస్‌ ఆర్‌టీసీల్లో కండక్టర్‌ పోస్టులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా పదో తరగతి మార్కుల మెరిట్‌ ఆధారంగా భర్తీ చేస్తున్నారు.
* పదో తరగతి విద్యార్హతతోపాటు హెవీ వెహికిల్‌ మోటార్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ మొదలైనవాటిలో డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆర్టీసీ బస్‌ డ్రైవర్‌ ఉద్యోగానికి ఈ లైసెన్స్‌ ఉన్నవారు అర్హులే.

Want your school to be the top-listed School/college in Warangal?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


Mulukalapally
Warangal
506366