Sri sidhhartha public school vissannapeta

Sri sidhhartha public school vissannapeta na

29/04/2018

10th results

P - Pass, *P - Supp. Pass, F - Fail, *F - Supp. Fail A - Absent, W - Withheld, M - Malpractice, N - Not Registered Grade A: Above 75% Grade B: 60% to 75% Grade C: 50% to 60% Grade D: 35% to 50%

27/04/2018

ఇంటికి దీపం ఇల్లాలు...
ఆ దీపం వెలిగించే ఇల్లాలు విద్యావంతురాలైనప్పుడే ఆ కుటుంబానికి నిజమైన వెలుగులు సాధ్యం...
ఆడపిల్లను చదివించండి..ఆర్ధికంగా తనకాళ్ళమీద తాను నిలిచేవారకు ప్రోత్సహించండి...
దేశానికి నిజమైన సౌభాగ్యం మహిళలకు ఆర్ధిక స్వాతంత్రం తోనే సాధ్యం.

24/01/2018

ఈ రోజు జాతీయ బాలికల దినోత్సవం

ఈ సందర్భం గా ప్రభుత్వాలు పాలకులు ఎందుకు ఈ బాలిక దినోత్సవం నిర్వహిస్తున్నారు అనే విషయం చూద్దాం

ఆంధ్ర ప్రదేశ్ లో 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి 1000 : 997
కానీ బాలలు లో లింగ నిష్పత్తి 1000 : 939

ఇదే రాబోయే రోజులలో జనాభా యొక్క అసమౌల్యత కి దారి తియ్యచ్చు ..
భారత దేశా జాతీయ బాల బాలికల సగటు 919 .
దేశం యొక్క సగటు కన్నా ఆంధ్ర ప్రదేశ్ సగటు బాగున్నప్పటికీ ఇది పడిపోతున్న బాలికలు యొక్క నిష్పత్తిని చుసిస్తోంది .
అదే విధం గా సమాజం లో బాలికలు ఎదుర్కొంటున్న వివక్ష లు కొంత వరకు అన్న రూపుమాపడానికి భారత ప్రభుత్వం మహిళా శిశు మంత్రిత్వ శాఖ అద్వర్యం లో 2008 సంవత్సరం నుంచి జనవరి 24 తేదీ ని జాతీయ బాలికల దినోత్సవం గా జరుపుతోంది ..

ఈ జాతీయ బాలికల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు

1 సమాజం లో బాలికలు ఎదుర్కుంటున్న అన్ని రకాల వివక్షలు ( విద్య , పౌష్ఠిక ఆహారం లోపం , బాలికలు హక్కులు , గౌరవం , బాల్య వివాహాలు , ) మొదలైన వివక్షలు రూపుమాపాలి

2 బాలికలు సమాజంలో ఎదుర్కొనే అన్ని అసమానతలు రూపుమాపాలి

3 ప్రతి బాలిక కి సమాజం లో తగిన గౌరవం తో చూడాలి

4 సమాజం లో పడిపోతున్న చైల్డ్ సెక్స్ రేషియో( బాలికల లింగ నిష్పత్తి ) ని పెంచాలి

5 నూతన దంపతులకు బాలిక అయినా బాలురు అయినా ఒకటే అని కౌన్సిలింగ్ ఇచ్చి బాలికల జనాభా నిష్పత్తి పెరిగేలాగా చూడాలి

6 బాలికలకు తగిన పౌషకాహారం అందలించాలి

బాలికలు పట్ల వివక్ష రూపుమాపుదాం
లింగ వివక్ష ని రూపుమాపుదాం
బాలికల లింగ నిష్పత్తి పెరిగే విధంగా కృషి చేద్దాం ..
బాలికలు ని గౌరవిద్దాం ..
బాలికలు చదువు ని ప్రోత్సహాహిద్దాం ..
వీటి అన్నిటిలో మన ప్రయత్నం మనం చేద్దాం ..

జై ఆంధ్ర ప్రదేశ్
జై అమరావతి ..

.

19/08/2017
31/03/2017

*APRIL FOOL..*
అసలీ పదం ఎలా వచ్చిందో తెలుసా?

యావత్ భారతజాతిని *వెర్రోళ్ళనీ చిత్రించేందుకు జరిగిన పన్నాగంతో పుట్టుకొచ్చింది ఏప్రిల్ ఫూల్* పదం. 1564లో అప్పటి పోప్ తీర్మానంతో జనవరి 1 నూతన సంవత్సరంగా పరిగణించబడింది. అప్పటికీ యుగాలుగా మనజాతి యుగాదిని కొత్త ఏడాదిగా ఆచరించుకుంటూ వచ్చింది. సమస్త భారతీయులు వెర్రిబాగులోళ్ళు కావాలని ఈ పరిణామం జరిగింది. దీన్ని ప్రశ్నించేవాళ్లని ఫూల్స్ గా పిలవాలని సదరు పొప్ సలహా ఇవ్వడంతో ప్రతి ఆంగ్లేయుడూ ఎదురైన ప్రతి భారతీయుడ్ని ఫూల్ గా వ్యవహరించడం మొదలుపెట్టాడు.

శుద్ధపాడ్యమిని ఎందుకు మార్చారని అడిగేలోపే.. నాటి పండుగరోజైన ఏప్రిల్ 1ని ఫూల్స్ డే అని అధికారిక ప్రకటన చేసేశాడు. అప్పట్నుంచి ఎన్నో తరాలు మారాయి. నిజాన్ని కాలరాసి ఫూల్స్ డే ఆచరణని మనుగణనలో ఉంచనే ఉంచేశారు. *మనల్ని వెధవలను చేసిన ఆ ప్రక్రియను మనకు తెలీకుండా మనమే కొనసాగిస్తున్నాం*.
ఏప్రిల్ ఫూల్ అనిపించుకునే వాడే కాదు ఆ.. ఆరోజు ఆ పదాన్ని అనే ప్రతి భారతీయుడు *ఫూలే*

ముందే...... మాకు ఎందుకు చెప్పలేదు అంటారేమోనని ముందే మీకు చెపుతున్నా.
*దయచేసి ఆ దరిద్రపు ఆచారాన్ని మానేయండి...*

16/03/2017
08/08/2016
మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
01/01/2016

మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

12/09/2015

ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇంటలో ఒక శిష్యుడిని పిలిచి, "నాయనా, దాహంగా ఉంది, ఆ కనబడే చెరువునుంచి కొన్ని నీళ్ళు తీసుకురా" అని చెప్పాడు.
అప్పుడే ఒక ఎద్దులబండి ఆ చెరువులోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారయింది. శిష్యుడు ఆ నీరు తేరుకొనేంతవరకు అలాగే కూర్చున్నాడు. అరగంట సమయం గడిచింది. చూస్తే నీరు ఇంకా మురికిగానే ఉంది. మరో అరగంట సమయం వేచి చూసాడు. నీరు తేరుకున్నాయి. ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్ళి బుధ్ధుడికి ఇచ్చాడు శిష్యుడు.

అప్పుడు శిష్యుని అనుమానం

" ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుండి? నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అది నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్చమైన నీరు పైకి తేరుకుంది.

మన మనసు కూడా అంతే. ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి. కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళీపోయి, మనసు స్వచ్చంగా మారుతుంది. నీ మనసు తేలిక అవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నమూ చేయవలసిన పనిలేదు. కొంతసేపు అలా వదిలేస్తే, దానంతట అదే సద్దుమణుగుతుంది. చక్కబడుతుంది. మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. మన ప్రయత్నం లేకుందానే జరిగిపోతుంది."

మీకు ఇష్టమైన వాళ్లను ఎప్పుడూ వదులుకోకండి. వారు తప్పులు చేసారు అనుకుంటే, ఒక్క క్షణం వారితో మీరు గడిపిన అద్భుతమైన, ఆనందకరమైన క్షాణాల గురించి ఒక్కసారి తలుచుకోండి. ఎందుకంటే, పరిపక్వత కన్నా, అభిమానం ముఖ్యం. మిమ్మల్ని మీరు కౌగలించుకోలేరు. మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు. అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి.

జీవితం అంటే ఒకరి కొసమ ఒకరు బ్రతకటమే.

మీకు ఇష్టమైన వారి కోసం, మిమ్మల్ని ప్రేమించేవారికోసం బ్రతకండి.స్నేహం,ప్రేమ ,

బంధుత్వాలు అనేవి డబ్బు భాష మాట్లాడే వారికి అర్ధం కావు. ఎందుకంటే కొన్ని పెట్టుబడులు మనకు కనిపించే లాభాలను ఇవ్వలేకపోవచ్చు, కాని మనలను సంపన్నుల్ని చేస్తాయి.

కుటుంబం, స్నేహితులు అలాంటి గొప్ప పెట్టుబడులు.....

12/09/2015

ఫిలాసఫీ
ఓ ఫిలాసఫీ ప్రొఫెసర్ తరగతి బల్ల మీద కొన్ని వస్తువులతో నిలుచుని ఉన్నాడు. విద్యార్థులు మౌనంగా, ఆయన చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నారు.
కొన్ని క్షణాల తర్వాత, ప్రొఫెసర్ తను తెచ్చిన వస్తువుల్లోంచి ఓ పెద్ద ఖాళీ గాజు జాడీని, కొన్ని గోల్ఫ్ బంతులని బయటకి తీసారు. గోల్ఫ్ బంతులని ఒక్కొక్కటిగా జాడీలోకి జారవిడిచారు. క్లాసంతా నిశ్శబ్దం.
జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.
పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.
అప్పుడు ప్రొఫెసర్ తను తెచ్చిన గులకరాళ్ళ కవరు విప్పి, వాటిని కూడా జాడీలో జారవిడిచారు. జాడీని కొద్దిగా కదిలించారు. గులక రాళ్ళన్ని గోల్ఫ్ బంతుల మధ్యకి, అట్టడుగుకి చొచ్చుకుపోయాయి.
క్లాసంతా నిశ్శబ్దం.
జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.
పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.
తర్వాత ప్రొఫెసర్ ఓ పొట్లంలోంచి ఇసుకని తీసి జాడీలో ఒంపారు.అది జాడీలోకి నిరాటంకంగా జారిపోయింది.
క్లాసంతా నిశ్శబ్దం.
జాడీ నిండిందా అని విద్యార్థులని అడిగారు.
"నిండింది" అంటూ విద్యార్థులు ఒకే గొంతుతో అరిచారు.
అప్పుడు ప్రొఫెసర్ అప్పటి దాక మూత పెట్టి ఉన్న రెండు కాఫీ కప్పులని దగ్గరికి తీసుకున్నారు. వాటి మీది మూతలను తీసి, కాఫీని జాడీలోకి వొంపారు. ఇసుక రేణువుల మధ్య ఉందే ఖాళీ స్థలంలోకి కాఫీ సులువుగా జారుకుంది.
ఈ చర్యకి విద్యార్థులు విరగబడి నవ్వారు.
నవ్వులు సర్దుమణిగాకా, ప్రొఫెసర్ ఇలా అన్నారు -
"ఈ జాడీ మీ జీవితాన్ని ప్రతిబింబిస్తోందని గ్రహించండి.
గోల్ఫ్ బంతులు ముఖ్యమైనవి - దేవుడు, కుటుంబం, మీ పిల్లలు, మీ అరోగ్యం, స్నేహితులు, ఇంకా మీకు అత్యంత ప్రీతిపత్రమైన అంశాలు! మీ సిరిసంపదలన్నీ పోయినా, ఇవి మీతో ఉంటే మీ జీవితం పరిపూర్ణంగానే ఉన్నట్లే.
గులక రాళ్ళు - మీ ఉద్యోగం, సొంతిల్లు, కారు వంటివి.
ఇసుక - అన్ని చోట్ల ఉండే చిన్న, చితక విషయాలు.
మీరు జాడీని ముందుగా ఇసుకతో నింపేస్తే, గోల్ఫ్ బంతులకి, గులక రాళ్ళకి అందులో చోటుండదు.
జీవితంలో కూడ ఇంతే -
ప్రాధాన్యత లేని చిన్న చిన్న విషయాలకి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ, అసలైన, ముఖ్యమైనవాటిని విస్మరిస్తూంటాం.
సంతోషం కలిగించే వాటిపై దృష్టి నిలపండి.
మీ పిల్లలతో ఆడుకోండి.
మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
అప్పుడప్పుడు మీ జీవిత భాగస్వామిని బయట డిన్నర్‌కి తీసుకెళ్ళండి.
మీ 18 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నారో, అంతే ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపండి.
ఇంటిని శుభ్రం చేసుకోడానికి, నిరుపయోగమైన వాటిని వదుల్చుకోడానికి ఎప్పుడూ సమయం ఉంటుంది.
గోల్ఫ్ బంతుల వంటి ముఖ్యమైన అంశాలపై ముందు దృష్టి పెట్టండి. ప్రాధాన్యతలు నిర్ణయించుకోండి. మిగిలేదంతా ఇసుకే" –
క్లాసంతా నిశ్శబ్దం.
ఇంతలో ఒక కుర్రాడు తనకో సందేహమన్నట్లు చెయ్యెత్తి, "మరి కాఫీ దేనికి ప్రతిరూపం?" అని అడిగాడు.
"శభాష్, ఈ ప్రశ్న అడింగందుకు నాకు సంతోషంగా ఉంది.
"మీ జీవితం దేనితో నిండిపోయినా, మిత్రుడితో ఓ కప్పు కాఫీకి ఎప్పుడు అవకాశం ఉంటుంది" అంటూ ప్రొఫెసర్ క్లాస్ ముగించి వెళ్ళిపోయారు.

Address

SH-46
Vissannapet
521215

Opening Hours

Monday 9am - 4:30pm
Tuesday 9am - 4:30pm
Wednesday 9am - 4:30pm
Thursday 9am - 4:30pm
Friday 9am - 4:30pm
Saturday 9am - 4:30pm

Alerts

Be the first to know and let us send you an email when Sri sidhhartha public school vissannapeta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category