03/01/2026
విద్యార్థుల్లో విద్యతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు తగరపువలస సాయి రవీంద్ర స్కూల్ మరియు శ్రీ రామకృష్ణ విద్యాలయంలో, వెంపాడ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ అవార్డు గ్రహీత మేజీషియన్ శ్రీనివాస్ పండిట్ గారిచే మేజిక్ షో నిర్వహించారు.
ఈ మేజిక్ షో ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని తాళ్లవలసలోని భరోసా లిటిల్ హగ్స్ బాలల సంరక్షణ కేంద్రం పిల్లల ఖర్చుల కోసం వినియోగిస్తామని శ్రీనివాస్ గారు తెలిపారు.
వెంపాడ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు డా. వెంపాడ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పిల్లల సంక్షేమానికి ఈ ఆదాయాన్ని ఉపయోగిస్తామని, సహకరించిన స్కూల్ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు.