05/11/2025
మధురవాడ, జన విజ్ఞాన వేదిక కమిటీ ఆధ్వర్యంలో
మహా విశాఖ 6 వార్డు పరిధి పీఎం పాలెం లో గల సృజన స్కూల్లో మంగళవారం చెకుముఖి సైన్స్ సంబరాలు లో భాగంగా జోనల్ స్థాయిలో పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20 పాఠశాలలు నుండి 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. . ఈ పరీక్షల్లో 8, 9,10 తరగతిల విద్యార్థులు పాల్గొన్నారని దీనిలో మొదటి మరియు రెండవ బహుమతులను మాలతంభ విద్యానికేతన్ పీఎం పాలెం వారు కైవసం చేసుకున్నారుతదుపరి ఈనెల 23వ తేదీన జరిగేటటువంటి జిల్లా స్థాయి చెకుముకి పోటీలకు అర్హత సాధించారు