Divine Talent School,Visakhapatnam.

Divine Talent School,Visakhapatnam. The Voice of Education

Divine Talent School @100% Digital School Learning by doing,
,.concept and project based education.
# Incorporate ethics , values & personality development.Communication skills.
# The Voice Of Education
# Destiny for Parents aspirations.

09/01/2026
*ఉపాధ్యాయుడి అధికారం కూలిన రోజే సమాజం తన భవిష్యత్తును చంపుకుంది**ఒకప్పుడు ఉపాధ్యాయుడు దండిస్తే తల్లిదండ్రులు తలవంచేవారు....
28/12/2025

*ఉపాధ్యాయుడి అధికారం కూలిన రోజే సమాజం తన భవిష్యత్తును చంపుకుంది**

ఒకప్పుడు ఉపాధ్యాయుడు దండిస్తే తల్లిదండ్రులు తలవంచేవారు.
ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు (అందరూ కాదండీ)
పిల్లల ముందే ఉపాధ్యాయుడిని అవమానించే స్థాయికి దిగజారుతున్నారు.
ఇక్కడే అసలు పతనం మొదలైంది.

తప్పు చేసిన పిల్లాడిని కాదు,
తప్పు చూపించిన ఉపాధ్యాయుడినే నిందించడం మొదలైన రోజే
విద్యార్థి లోకపు నాశనం ప్రారంభమైంది.

“నీకు అధికారం ఎవరిచ్చారు?”
అని ఉపాధ్యాయుడిని ప్రశ్నిస్తే
ఆ పిల్లాడు నేర్చుకునేది చదువు కాదు—
👉 తప్పు చేసినా కాపాడేవాళ్లు ఉంటారు
👉 నియమాలు తనకు వర్తించవు
👉 పెద్దలను ఎదిరించొచ్చు

ఇవే ఈ తరపు విద్యార్థి నేర్చుకుంటున్న అసలు పాఠాలు.

క్రమశిక్షణ లేని పెంపకం
స్వేచ్ఛ కాదు… **విషం**.
శిక్షించే అధికారం లేని ఉపాధ్యాయుడు
విద్య ఇవ్వలేడు—మహా అయితే పాఠాలు చదివిస్తాడు.
మార్కులు రావొచ్చు కానీ మార్గం దొరకదు.

దాంతో
🔹 10 ఏళ్లకే అహంకారం
🔹 15 ఏళ్లకే నియంత్రణలేని ప్రవర్తన
🔹 20 ఏళ్లకే జీవితాన్ని తట్టుకోలేని అసహనం

ఇది విధి కాదు.
ఇది ప్రమాదం కాదు.
ఇది పెంపకంలో జరిగిన ఘోరమైన తప్పు.

ఉపాధ్యాయుడు భయపడితే
విద్యార్థి భయపడడు.
ఉపాధ్యాయుడి మాటకు విలువ లేకపోతే
నియమాలకు విలువ ఉండదు.
నియమాలు లేని సమాజంలో
స్వేచ్ఛ కాదు—**అరాచకమే రాజ్యమేలుతుంది**.

దీనికి బాధ్యత ఎవరిది?
పిల్లలది కాదు.
ఉపాధ్యాయులది కాదు.
👉 **పూర్తిగా తల్లిదండ్రులదే.**

పిల్లల్ని ప్రేమించడం అంటే
ప్రతి తప్పునీ సమర్థించడం కాదు.
తప్పు చేసినప్పుడు
తప్పు అని చెప్పడమే నిజమైన ప్రేమ.

ఉపాధ్యాయుడిని అవమానిస్తే
మీ పిల్లల భవిష్యత్తును
మీ చేత్తో మీరే నాశనం చేసుకున్నట్టే.

చివరగా ఒకటే మాట—
ఉపాధ్యాయుడు శత్రువు కాదు.
వారు శిక్షిస్తే అది ద్వేషం కాదు,
స్వార్థం లేని బాధ్యత.

ఈ రోజు మీరు పిల్లల తప్పుని సమర్థిస్తే
రేపు అదే తప్పు
సమాజం శిక్షగా తిరిగి ఇస్తుంది.

ఉపాధ్యాయుడికి అధికారం ఇవ్వండి—
అదే సమాజానికి **శ్రీరామరక్ష**,
పిల్లల పాలిట **జగద్రక్ష**.

ఉపాధ్యాయుడిని దేవుడిలా పూజించాల్సిన అవసరం లేదు…
కానీ **సాటి మనిషిగా అయినా గౌరవించండి**.

చివరగా

ఉపాధ్యాయుడి అధికారం కూలిన రోజే
సమాజం తన భవిష్యత్తును తానే చంపుకుంది.
గౌరవం పోయిన చోట
విలువలు నిలవవు.
విలువలు లేని విద్య
సమాజాన్ని నిలబెట్టలేదు.





Celebrating my 10th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉
15/05/2025

Celebrating my 10th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

The film theme near our divine talent school idealism @ 15 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రి  తప్పక చూడాలి ...
15/05/2025

The film theme near our divine talent school idealism @ 15 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రి తప్పక చూడాలి .

నేడు ఎక్కువ మంది పిల్లలు నడుస్తున్న దారి - ఇన్ఫోబేసిటీ/ డిజిటల్ డిస్టోపియా. ఇది వినాశానికి దారి తీస్తుంది. పిల్లలు నడవాల...
05/01/2025

నేడు ఎక్కువ మంది పిల్లలు నడుస్తున్న దారి - ఇన్ఫోబేసిటీ/ డిజిటల్ డిస్టోపియా.
ఇది వినాశానికి దారి తీస్తుంది.

పిల్లలు నడవాల్సిన దారి — సంపూర్ణత !

ప్రతి తల్లితండ్రి గురువు ప్రతి బిడ్డను సంపూర్ణత దారిలో నడపాలి.

కింద ఉన్న పోస్టర్ ను సేవ్ చేసుకొని జూమ్ చేసి చదవండి. ప్రింట్ తీసి భద్రపరుచుకోండి.
మీ కుటుంబ సభ్యులతో చర్చించండి.

ప్రతి బడిలో టీచర్స్ దీన్ని అమలు చేయండి.

ఇంగ్లీష్ , తెలుగు - రెండు పోస్టర్స్ వున్నాయి. ఒకటికి ఇంకోటి తర్జుమా కాదు. రెండూ చదివితే మీకు మరింత లోతయిన అవగాహన ఏర్పడుతుంది.

07/12/2024

పిల్లల పై అతి ప్రేమతో, వారు చేసే తప్పులను సమర్థిస్తూ ... తప్పని చెప్పిన టీచర్స్ పై నిందలు మోపుతూ .... ఎదురు దాడి చేస్తే నష్ట పోయేది ఎవరు ?

తొమ్మిదేళ్ల ఒక పిల్లాడు "ప" అనే అక్షరానికి పదాలు రాయమంటే పిర్ర , పిత్తు అని రాస్తే అది అమాయకత్వం అవుతుంది .
తెలుగు టీచర్ ... నోట్స్ తో సహా ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకొని వెళితే " నాన్నా! మన శరీరంలో ఎన్నో భాగాలుంటాయి . మనం దుస్తులు వేసుకొంటాము . అన్నింటినీ కనబడనీయం . ఎందుకు ? దాన్నే సభ్యత .. నాగరికత అంటారు . అలాగే కొన్ని పదాలు.. మాటలు... బూతులు . వాటిని పలకకూడదు . రాయకూడదు " అంటే... పిల్లాడు అర్థం చేసుకొన్నాడు .

"అవి తెలుగు పదాలు కాదా? రాస్తే తప్పేంటి ? మీరు కౌన్సిలింగ్ పేరుతొ మా అబ్బాయిని హింసిస్తున్నారు " అని తల్లి అభాండాలు వేస్తె టీచర్ మానసిక స్థితి ఏంటి ?


అదే తొమ్మిదేళ్ల పిల్లాడు క్లాసులో ఒక అమ్మాయి అంటే తనకు ఇష్టం అని , గూగుల్ లో ఫలానా వర్డ్ టైపు చేస్తే బొమ్మలు కనబడుతాయని , గూగుల్ లో హోమ్ వర్క్ పోస్ట్ చేస్తే సమాధానాలు వస్తాయని అప్పుడు కాపీ కొట్టుకోవచ్చని అందరికీ చెబితే ?
"మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు . మేము చెబుతాము . మీరు చెప్పండి" అని తల్లికి చెబితే " లేదు క్లాసులో మా అబ్బాయి పై పిల్లలు అభాంఢాలు వేస్తున్నారు .. అంతా డ్రామా" అని తల్లి చెప్పడం .. సరే నిజం తెలుసుకొందామని క్లాసు లోకి వెళ్లిన సంస్థ హెడ్ మొత్తం వీడియో రికార్డు చేయిస్తూ .. "ఏమి జరుగుతోంది మీ క్లాసు లో? అని ఎవరి పేరు పెట్టి అడగకపోయినా పోయినా ... పిల్లందరూ... ఒకరు ... ఒకరు లేచి... ఇలా చేస్తున్నాడు .. ఆలా చేస్తున్నాడు అని చెప్పడం .. కనీసం ఆ అబ్బాయి పైన కోపం చూపకుండా ... చూడండి .. నోట్స్ కాపీ కొడితే నష్టపొయ్యేది మీరే .. తెలిసి తెలియని వయసులో ప్రేమ లాంటి ఆలోచనలు చేయకూడదు .. అని అందరికీ చెప్పి బయటకు వస్తే .. .అహం దెబ్బ తిన్న తల్లి .." మీరు అందరికి ఎదురుగా మా అబ్బాయి ని తప్పు పట్టారు .. దానితో మా అబ్బాయి చిన్న పుచ్చుకొన్నాడు .. అన్నం తినడం లేదు .. మీ పై కేసు పెడుతా .. మీడియా ను తెస్తా " అని డైరెక్ట్ గా బెదిరిస్తోంది .

తల్లి... " లేదు .. నా కొడుకు అమాయకుడు .. మీకు నిజాలు తెలియదు "అని చెప్పినప్పుడు .. ఏమి జరిగిందో తెలుసుకోవడానికి క్లాస్ లోకి వెళ్లి పిల్లల్ని అడగడం తప్పా?
కనీసం కోప పడకుండా నెమ్మదిగా అందరికీ మంచి మాటలు చెబితే అబ్బాయి ఎందుకు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు ? ఇగో హర్ట్ అయ్యిపోయి పాగా సాదించుదామని .. ఇలా నటించు అని అబ్బాయి కి తల్లే చెబితే... రేపు ఆ అబ్బాయి ఆలోచనలు ఎలా ఉంటాయి ? మనస్తత్వం ఎలా తయారవుతుంది ?

తొమ్మిదేళ్ల వయసులో క్లాస్ రూమ్ లో నాకు ఫలానా అమ్మాయి అంటే లవ్ అని చెబితే .. సర్ నేను చూసాను .. విన్నాను అని ఆ అమ్మాయి స్వయంగా చెబితే ... టీచర్ గా మేము పట్టించుకోకపోతే పర్యవసానాలు ఎలా ఉంటాయి ? రేపు వాడు రెచ్చి పోయే ఆ అమ్మాయి పైన ఏదైనా చేస్త్తే ? ఇలాంటి పిల్లాడికి ఇది తప్పు అని నెమ్మదిగా చెప్పడమే క్రైమ్ అయితే .. ఆ తప్పుకు ఉరి కంభం ఎక్కడానికి ఆ విద్యా వేత్త రెడీ .మీ పిల్లాడు చెప్పేది మాత్రమే నిజాలు .. మిగతా పిల్లలవి డ్రామాలు .. ఇదేనా ?

ఇక తేలుచుకోవాల్సింది సమాజమే !

టీచర్ ని నిందిస్తే... బ్లాక్ మెయిల్ చేస్తే .. గెలిచామన్న తాత్కాలిక ఆనందం కలగొచ్చు . కానీ మన పిల్లాడి మనసులో విష బీజాలు నాటితే నష్టపొయ్యేది తల్లి .. ఆ పిల్లాడు . అవునా? కాదా ?

తల్లి ఎంత ద్వేష మనస్తత్వం కలిగివున్నా.." అయ్యో పాపం .. పసి పిల్లాడు" .. అని పేర్లు బయట పెట్టడం లేదు . తల్లి అహం చల్లబరచడానికి క్షమాపణ కూడా చెప్పడం అయ్యింది ." లేదు నువ్వు చేసింది తప్పు . పిలల్లకు మంచి బుద్ధులు చెప్పకూడదు .. నా కొడుకు ఏమి చేసినా అది కరెక్ట్ అని అనుకొంటే . నష్టం ఎవరిది? "

గురువుగా పాఠాలు చెప్పడం ధర్మం .. వృత్తి ..
తల్లి అహం ? పిల్లాడి భవిత ఏది ముఖ్యం ?

19/11/2024
14/11/2024

Children’s Day Special: Parents and financial experts emphasise the importance of imparting money management skills to children early on. Interactive tools, workshops, and open conversations help kids develop financial literacy and responsible habits.

 All My   and
05/09/2024

All My and

మిత్రులందరికీ  స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు...!!
04/08/2024

మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు...!!

03/08/2024

*_🚩మెరుగైన జీవితానికి పంచసూత్రాలు🌴_*

మెదడు నిరంతరం చురుగ్గా ఉంటేనే
మీ మేధస్సు, నైపుణ్యాలు పెరుగుతాయి.
అందుకోసం ఇవి ప్రయత్నించండి:

1.కొత్త విషయాలను నేర్చుకోవడం ఆపొద్దు. అప్పుడే మీ మెదడు ఉత్తేజితమవుతుంది.

2.సౌకర్యవంతమైన పరిస్థితులను వదిలి ముందడుగు వేస్తేనే మీలో సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది.

సమస్యల పరిష్కారానికి అవసరమైన నైపుణ్యాలు అలవడుతాయి.

3.ఏ విషయాన్నైనా కొత్త కోణంలో చూడండి. ఇతరుల దృక్పథం నుంచి సమస్యలను పరిశీలిస్తేనే పరిష్కారానికి కొత్త ఆలోచనలు మొగ్గ తొడుగుతాయి.

4. లక్ష్యానికి దగ్గరి దారి ఎంచుకోవద్దు. అప్పుడే మీ సామర్థ్యాలు బలోపేతం అవుతాయి.

5.విభిన్న నేపథ్యం ఉన్న వ్యక్తులతో సంబంధాలు మెరుగుపర్చుకోండి. తద్వారా మీ జ్ఞానం విస్తృతం కావడంతో పాటు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయి.

Like me
02/08/2024

Like me

Address

Madhavadara
Visakhapatnam
530041

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+917287004379

Alerts

Be the first to know and let us send you an email when Divine Talent School,Visakhapatnam. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Divine Talent School,Visakhapatnam.:

Shortcuts

Share

Category