Divine Talent School_Skill Development Curriculum

Divine Talent School_Skill Development Curriculum

Share

*Skill development Curriculum.
*Learning by doing
*100%Digital Class room with home free "smart cla

15/05/2025

The film theme near our divine talent school idealism @ 15 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రి తప్పక చూడాలి .

Photos from Divine Talent School_Skill Development Curriculum's post 05/01/2025

నేడు ఎక్కువ మంది పిల్లలు నడుస్తున్న దారి - ఇన్ఫోబేసిటీ/ డిజిటల్ డిస్టోపియా.
ఇది వినాశానికి దారి తీస్తుంది.

పిల్లలు నడవాల్సిన దారి — సంపూర్ణత !

ప్రతి తల్లితండ్రి గురువు ప్రతి బిడ్డను సంపూర్ణత దారిలో నడపాలి.

కింద ఉన్న పోస్టర్ ను సేవ్ చేసుకొని జూమ్ చేసి చదవండి. ప్రింట్ తీసి భద్రపరుచుకోండి.
మీ కుటుంబ సభ్యులతో చర్చించండి.

ప్రతి బడిలో టీచర్స్ దీన్ని అమలు చేయండి.

ఇంగ్లీష్ , తెలుగు - రెండు పోస్టర్స్ వున్నాయి. ఒకటికి ఇంకోటి తర్జుమా కాదు. రెండూ చదివితే మీకు మరింత లోతయిన అవగాహన ఏర్పడుతుంది.

27/07/2024

⚡ *మరుగున పడుతున్న కొన్ని 209 తెలుగు సామెతలు..మీకోసం!*

1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు
2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా
3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ
4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు
5. అనువు గాని చోట అధికులమనరాదు
6. అభ్యాసం కూసు విద్య
7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి
8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం
9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం
10. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత
11. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు
12. ఇంట గెలిచి రచ్చ గెలువు
13. ఇల్లు పీకి పందిరేసినట్టు
14. ఎనుబోతు మీద వాన కురిసినట్టు
15. చెవిటి వాని ముందు శంఖమూదినట్టు
16. కందకు లేని దురద కత్తిపీటకెందుకు
17. కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు
18. కుక్క కాటుకు చెప్పుదెబ్బ
19. కోటి విద్యలూ కూటి కొరకే
20. నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు
21. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం
22. పిట్ట కొంచెం కూత ఘనం
23. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
24. వాన రాకడ ప్రాణపోకడ ఎవరి కెరుక
25. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు
26. మింగమెతుకులేదు మీసాలకు సంపంగి నూనె
27. ఆడబోయిన తీర్థము యెదురైనట్లు
28. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
29. ఆది లొనే హంస పాదు
30. ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము
31. ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు
32. ఆకాశానికి హద్దే లేదు
33. ఆలస్యం అమృతం విషం
34. ఆరే దీపానికి వెలుగు యెక్కువ
35. ఆరోగ్యమే మహాభాగ్యము
36. ఆవులింతకు అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముడు లేడంట
37. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
38. అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి
39. అడగందే అమ్మైనా అన్నము పెట్టదు
40. అడ్డాల నాడు బిడ్డలు కాని గడ్డాల నాడు కాదు
41. ఏ ఎండకు ఆ గొడుగు
42. అగ్నికి వాయువు తోడైనట్లు
43. ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు
44. అందని మామిడిపండ్లకు అర్రులు చాచుట
45. అందితే జుట్టు అందక పోతే కాళ్ళు
46. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు
47. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు
48. అప్పు చేసి పప్పు కూడు
49. అయ్య వారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా
50. అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు
51. బతికుంటే బలుసాకు తినవచ్చు
52. భక్తి లేని పూజ పత్రి చేటు
53. బూడిదలో పోసిన పన్నీరు
54. చాదస్తపు మొగుడు చెబితే వినడు,
గిల్లితే యేడుస్తాడు
55. చాప కింద నీరులా
56. చచ్చినవాని కండ్లు చారెడు
57. చదివేస్తే ఉన్నమతి పోయినట్లు
58. విద్య లేని వాడు వింత పశువు
59. చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ
60. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు
61. చక్కనమ్మ చిక్కినా అందమే
62. చెడపకురా చెడేవు
63. చీకటి కొన్నాళ్ళువెలుగు కొన్నాళ్ళు
64. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
65. చింత చచ్చినా పులుపు చావ లేదు
66. చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే,
ఆ వంకర టింకరవి యేమి కాయలని అడిగిందట
67. చిలికి చిలికి గాలివాన అయినట్లు
68. డబ్బుకు లోకం దాసోహం
69. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు
70. దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన
71. దాసుని తప్పు దండంతో సరి
72. దెయ్యాలు వేదాలు పలికినట్లు
73. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు
74. దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి
75. దొంగకు తేలు కుట్టినట్లు
76. దూరపు కొండలు నునుపు
77. దున్నపోతు మీద వర్షం కురిసినట్లు
78. దురాశ దుఃఖమునకు చెటు
79. ఈతకు మించిన లోతే లేదు
80. ఎవరికి వారే యమునా తీరే
81. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు
82. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందంట
83. గాజుల బేరం భోజనానికి సరి
84. గంతకు తగ్గ బొంత
85. గతి లేనమ్మకు గంజే పానకం
86 గోరు చుట్టు మీద రోకలి పోటు
87. గొంతెమ్మ కోరికలు
88. గుడ్డి కన్నా మెల్ల మేలు
89. గుడ్డి యెద్దు చేలో పడినట్లు
90. గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు
91. గుడినే మింగే వాడికి లింగమొక లెఖ్ఖా
92. గుడిని గుడిలో లింగాన్నీ మింగినట్లు
93. గుడ్ల మీద కోడిపెట్ట వలే
94. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నాడట
95. గుర్రము గుడ్డిదైనా దానాలో తక్కువ లేదు
96. గురువుకు పంగనామాలు పెట్టినట్లు
97. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు
98. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
99. ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిలాల కంపు
100. ఇంటికన్న గుడి పదిలం
101. ఇసుక తక్కెడ పేడ తక్కెడ
102. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట
103. కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు
104. కాగల కార్యము గంధర్వులే తీర్చినట్లు
105. కాకి ముక్కుకు దొండ పండు
106. కాకి పిల్ల కాకికి ముద్దు
107. కాలం కలిసి రాక పోతే కర్రే పామై కాటు వేస్తుంది
108. కాలు జారితే తీసుకోగలము కాని నోరు జారితే తీసుకోగలమా
109. కాసుంటే మార్గముంటుంది
110. కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్లు
111. కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును
112. కలి మి లేములు కావడి కుండలు
113. కలిసి వచ్చే కాలం వస్తే, నడిచి వచ్చే కొడుకు పుడతాడు
114. కంచే చేను మేసినట్లు
115. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
116. కందకు కత్తి పీట లోకువ
117. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం
118. కీడెంచి మేలెంచమన్నారు
119. కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు
120. కొండల్లే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు
121. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు
122. కొన్న దగ్గిర కొసరే గాని కోరిన దగ్గర కొసరా
123. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందిట
124. కూటికి పేదైతే కులానికి పేదా
125. కొరివితో తల గోక్కున్నట్లే
126. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్లు
127. కొత్తొక వింత పాతొక రోత
128. కోటిి విద్యలు కూటి కొరకే
129. కొత్త అప్పుకు పొతే పాత అప్పు బయటపడ్డదట
130. కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు
131. కృషితో నాస్తి దుర్భిక్షం
132. క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెరిగి దానము
133. కుడుము చేతికిస్తే పండగ అనేవాడు
134. కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు
135. ఉన్న లోభి కంటే లేని దాత నయం
136. లోగుట్టు పెరుమాళ్ళకెరుక
137. మెరిసేదంతా బంగారం కాదు
138. మంచమున్నంత వరకు కాళ్ళు చాచుకో
139. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది
140. మంది యెక్కువయితే మజ్జిగ పలచన అయినట్లు
141. మనిషి మర్మము.. మాను చేవ...
బయటకు తెలియవు
142. మనిషి పేద అయితే మాటకు పేదా
143. మనిషికి మాటే అలంకారం
144. మనిషికొక మాట పశువుకొక దెబ్బ
145. మనిషికొక తెగులు మహిలో వేమా అన్నారు
146. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా
147. మీ బోడి సంపాదనకుఇద్దరు పెళ్ళాలా
148. మెత్తగా ఉంటే మొత్త బుద్ధి అయ్యిందట
149. మొక్కై వంగనిది మానై వంగునా
150. మొరిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు
151. మొసేవానికి తెలుసు కావడి బరువు
152. ముల్లును ముల్లుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతొనే కొయ్యాలి
153. ముందర కాళ్ళకి బంధాలు వేసినట్లు
154. ముందుకు పోతే గొయ్యి వెనుకకు పోతే నుయ్యి
155. ముంజేతి కంకణముకు అద్దము యెందుకు
156. నడమంత్రపు సిరి నరాల మీద పుండు
157. నేతి బీరకాయలో నెయ్యి యెంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది
158. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా
159. నవ్వు నాలుగు విధాలా చేటు
160. నీ చెవులకు రాగి పొగులే అంటే అవీ నీకు లేవే అన్నట్లు
161. నిదానమే ప్రధానము
162. నిజం నిప్పు లాంటిది
163. నిమ్మకు నీరెత్తినట్లు
164. నిండు కుండ తొణకదు
165. నిప్పు ముట్టనిదే చేయి కాలదు
166. నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు
166. నూరు గుర్రాలకు అధికారయినా, భార్యకు యెండు పూరి
167. ఆరు నెళ్ళు సావాసం చేస్తే వారు వీరు అవుతారు
168. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు
169. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బ్రతకవచ్చు
170. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు
171. ఊరంతా చుట్టాలు ఉత్తికట్ట తావు లేదు
172. ఊరు మొహం గోడలు చెపుతాయి
173. పనమ్మాయితొ సరసమ్ కంటే అత్తరు సాయిబు తో కలహం మేలు
174. పాము కాళ్ళు పామునకెరుక
175. పానకంలో పుడక
176. పాపమని పాత చీర ఇస్తే గోడ చాటుకు వెళ్ళి మూర వేసిందట
177. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు
178. పండిత పుత్రః పరమశుంఠః
179. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు
180. పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మేలు
181. పట్టి పట్టి పంగనామం పెడితే, గోడ చాటుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట
182. పెదవి దాటితే పృథ్వి దాటుతుంది
183. పెళ్ళంటే నూరేళ్ళ పంట
184. పెళ్ళికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్ళినట్టు
185. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరికిందట
186. పెరుగు తోట కూరలో, పెరుగు యెంత ఉందో, నీ మాటలో అంతే నిజం ఉంది
187. పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు
188. పిచ్చోడి చేతిలో రాయిలా
189. పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా
190. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం
191. పిండి కొద్దీ రొట్టె
192. పిట్ట కొంచెము కూత ఘనము
193. పోరు నష్టము పొందు లాభము
194. పోరాని చోట్లకు పోతే , రారాని మాటలు రాకపోవు
195. పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నదడట
196. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు
197. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు
198. రాజు గారి దివాణంలో చాకలోడి పెత్తనము
199. రామాయణంలో పిడకల వేట
200. రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుంది అని అడిగినట్టు
201. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదలనట్లు
202. రెడ్డి వచ్చే మొదలెట్టు అన్నట్టు
203. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లు
204. రౌతు కొద్దీ గుర్రము
205. ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు
206. చంకలో పిల్లవాడిని ఉంచుకుని ఊరంతా వెతికినట్టు
207. సంతొషమే సగం బలం
208. సిగ్గు విడిస్తే శ్రీరంగమే
209. శివుని ఆజ్ఞ లేక చీమైనా కుట్టదు….

Source..........ors

09/03/2024

చుట్టాలొస్తున్నారు జాగ్రత్త !

ఆదివారం .
సాహితి వాళ్ళింట్లో సందడిగా ఉంది.
సాహితి కజిన్ { పిన్ని కూతురు } స్వప్న తన కుటుంబంతో ఆ రోజు సాహితి వాళ్ళింటికి వచ్చింది .

ఎప్పుడో కానీ రాని అక్క స్వప్న ఇంటికి రావడంతో సాహితి ఆనందానికి అవధులు లేవు . లంచ్ కోసం మూడు నాలుగు డిషెస్ చేసింది . ఇంకొన్నిటిని జొమాటో పై ఆర్డర్ ఇచ్చి తెప్పించింది .

భోజనాల సమయం లోస్వప్న భర్త అంటే తన బావ గారు " పిల్లల చదువెలా సాగుతోంది స్వప్న ? " అని అడిగారు .

"బాగుంది బావగారు . మేము చాలా హ్యాపీ . పిల్లలు ఇద్దరు ఇష్టపడి స్కూల్ కు వెళుతారు . స్కూల్ లో టీచర్ లు పిల్లలకు అర్థమయ్యేలా పాఠాన్ని చెబుతారు . కష్టపడి కాకుండా.. మా ఇద్దరు పిల్లలు.. ఇష్టపడి చదువుతారు . జంక్ ఫుడ్ కు.. సెల్ ఫోన్ దూరంగా వుంటారు . ఆటల్లో పాటల్లో చురుకుగా పాల్గొంటారు " చెప్పింది సాహితి .

" ఇంత అమాయకంగా ఉంటే ఎలా సాహితి ? ట్రెండ్ బట్టి పోవాలి కానీ ?... ఇంకా నువ్వు సంపూరణాత్మక విద్య .. క్రీడలు... అని కూర్చుంటే పిల్లలు వెనుకబడి పోరా ? పోనీ ఏదో ఐదో క్లాస్ వరకు అయితే ఫరవా లేదు . పిల్లలిద్దరూ ఇప్పుడు హై స్కూల్ కొచ్చారు . ఆరో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ చదివించకపోతే వెనుకబడిపోతారు . మా ఇద్దరు పిల్లల్ని చూడు . చిన్నది ఆరో తరగతి . ఇప్పుడు దానికి ఎనిమిదో క్లాస్ గణితం, ఫిజిక్స్ పాఠాలు నడుస్తున్నాయి . పెద్దాడు ఎనిమిదో తరగతి . ఇప్పుడు వాడికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లెసన్స్ నడుస్తున్నాయి . ఖో ఖో.... కబడ్డీ అంటూ మీ పిల్లలు పదో తరగతి దాకా కాలక్షేపం చేసి ఇంటర్ కొస్తే అప్పడు ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ చేసిన మా పిల్లలు లాంటివారితో పోలిస్తే బాగా వెనుకబడి పోరా ? ఐఐటీ లో సీట్ వస్తే లైఫ్ సెటిల్ అయిన్నట్టే . లైఫ్ స్కిల్స్ లాంటివి నేర్చుకోవడానికి అటుపై బోలెడంత లైఫ్ ఉంటుంది... " స్వప్న చెబుతుంటే సాహితి ఆమె భర్త శ్రీనివాస్ ఆలోచనలో బడ్డారు .

" ఈ రోజు మీరు ఇంటికి రాకుంటే మేము లైఫ్ లో ఎంత మిస్ అయ్యే వాళ్ళమో స్వప్న" .. చెప్పింది సాహితి .

మరుసటి రోజే శ్రీనివాస్ , సాహితి ఇద్దరూ తమ పిల్లలని తీసుకొని స్వప్న తో కలిసి ఆమె పిల్లలు చదువుతున్న కార్పొరేట్ స్కూల్ కు కు వెళ్లారు . ఏవో టెస్ట్ లు పెట్టి .. "మీ పిల్లలు అకాడెమిక్స్ లో బాగా వీక్ గా వున్నారు . కనీసం ఇప్పటికైనా మేలుకున్నారు . ఏదో మా స్కూల్ పేరెంట్ అయిన స్వప్న గారు రికమెండ్ చేసారు కాబట్టి సీట్ ఇస్తున్నాము " అన్నారు .

సాహితి శ్రీనివాస్ ల ఆనందానికి అవధులు లేవు . తమ పిల్లలు ఖరగ్పూర్ ముంబై ఐఐటీ ల చదువుతున్న దృశ్యం వారి కళ్ళముందు కదలాడింది .


వారం రోజులు గడిచాయో లేదో ... సాహితి పిల్లలిద్దరూ "కొత్త స్కూల్ కు వెళ్లము" అని మొండికేశారు .

" మా ఇంగ్లీష్ టీచర్ కే ఇంగ్లీష్ సరిగ్గా రాదు . "మ్యాడం" .. "కమ్ము" .. "వ్వాట్ దీసు" అని బట్లర్ ఇంగ్లీష్ లో మాట్లాడుంటే నాకొచ్చిన ఇంగ్లీష్ పోతుందేమో అని భయం వేస్తోంది " చెప్పింది చిన్నది .

" ఇంగ్లీష్ దేముందమ్మా ? మాథ్స్ , ఫీజికల్ సైన్స్ ముఖ్యం . అదే మిమ్మల్ని రేపు ఐఐటీ క్యాంపస్ లోకి తీసుకొని వెళ్ళేది " చెప్పింది సాహితి .

" లేదు మమ్మీ .. మా టీచర్స్ కు సబ్జక్ట్స్ సరిగ్గా రాదు అనిపిస్తుంది . పుస్తకం లో ఉన్నది ఉన్నట్టుగా చెబుతారు . ఎనాలిసిస్ ఉండదు , వివరణ అసలు ఉండదు . ఏదైనా డౌట్ అడిగితే " అతి తెలివి చూపించకు . నోరు మూసుకొని కూర్చో . ఒకటికి నాలుగు సార్లు చదువు .. సబ్జెక్టు అదే వస్తుంది " అని తిడుతారు . మా క్లాస్ అంతా బట్టి చదువులే . పుస్తకంలో ఉన్నదాన్ని ఉన్నట్టు చదివి పరీక్ష లో రాయడమే . పరీక్షలకు ముందే మాకు ప్రశ్నలు స్లో గా లీక్ చేస్తారు . వాటినే వల్లే వేయించి పదేపదే రాయిస్తారు . దానితో పాఠం ఒక ముక్క అర్థం కాకపోయినా చాలా మందికి నూటికి నూరు మార్కులు వచ్చేస్తాయి .. ఈ వారం రోజుల్లో నాకు అర్థం అయ్యింది మా సీనియర్స్ తో మాట్లాడితే వారు చెప్పింది ఇదే " ఎనిమిదో తరగతి లోని పెద్దాడు చెబుతూ పోతుంటే సాహితి అంతర్మధనం లో పడిపోయింది .

మరుసటి రోజు భర్త తో కలిసి స్కూల్ ప్రిన్సిపాల్ ను కలిసింది . అయన ఛాంబర్ లో అదే సమయానికి ఆ ఏరియా డీన్ కూడా వున్నారు .

" మీరు ఐఐటీ బ్యాచ్ లో చేర్పించారు . ఇంకా మంచి స్టేట్ లెవెల్ ఫాకల్టీ కావాలంటే ఫీజు రెండు లక్షలు . సీఓ బ్యాచ్ లో అయితే బెస్ట్ ఫాకల్టీ ఉంటుంది . స్టడీ హవర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి " ప్రిన్సిపాల్ చెప్పారు .

" ఆంత ఫీజు కట్టుకోలేము సార్!" చెప్పింది సాహితి .

" అయితే మీకు సాయం చేస్తాము . మీరు గనుక ఒక కొత్త అడ్మిషన్ తెస్తే మీ పిల్లల ఫీజు లో కొంత రాయితీ ఉంటుంది . ఎన్ని అడ్మషన్స్ తెస్తే ఆంత కన్సెషన్ . పది అడ్మషన్స్ తెస్తే ఫ్రీ కోచింగ్ . ఈ స్కీం అందరికీ కాదు . మీకు ఒక్కరికి మాత్రమే " చెప్పారు డీన్ .

" మేము అడ్మషన్స్ ఎలా తేవాలి సార్?" అడిగారు సాహితి దంపతులు.

" ఏముందండి ? చాలా సింపుల్ .. మీ బంధువుల స్నేహితుల ఇళ్లకు చుట్టపు చూపుగా వెళ్ళండి . వారికి మన ఐఐటీ కోర్స్ గురించి చెప్పండి . కన్విన్స్ చెయ్యండి . మీ రెఫరెన్సు తో వారు అడ్మిషన్ తీసుకొంటే మీ పిల్లకు ఫీజు లో రాయితీ " చెప్పాడు ప్రిన్సిపాల్ .

స్కూల్ బయటకు వచ్చాక ..

" ఏమండి ..నేనంత పిచ్చిదాన్నో ! మనింటికి ఆ రోజు స్వప్న వచ్చిందంటే తెగ సంతోషపడిపోయాను .తెల్లవారు జామున లేచి వంటలు చేశాను . ప్లాన్డ్ గా స్కూల్ మార్కెటింగ్ కోసం .. అదీ తన పిల్లల ఫీజు కన్సెషన్ కోసం మనకు బ్రెయిన్ వాష్ చేస్తుందని అనుకోలేదు . ఇంత మోసమా ? " భర్త తో అంది సాహితి .

" ఈ రోజుల్లో అందరూ ఇంతే సాహితి .. . మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా కార్పొరేట్ స్కూల్ మార్కెటింగ్ మాయాజాలం" చెప్పాడు శ్రీనివాస్ .

" లేదండీ అందరూ ఇలా కాదు . మా కిట్టి పార్టీ లో చాలా మంది మార్వాడి ఫ్రెండ్స్ వున్నారు . వాళ్ళ వ్యాపారం లో వారు ఏమి చేస్తారో నాకు తెలియదు కానీ .. బంధువుల మిత్రుల విషయం లో వారు ఇలా తప్పుడు సలహాలివ్వరు . బంధుత్వం విలువ వారికి తెలిసినంతగా బహుశా మరెవరికీ తెలియదేమో " చెప్పింది సాహితి .

" అవును సాహితి . ఒక కాకి ఛస్తే కాకులన్నీ ఒక్క చోట చేరి గోల చేస్తాయి . చంపిన వాడిని వెంటాడి వేధిస్తాయి . అదే జంతు ప్రపంచం లో నత్తలు కూడా ఉన్నాయి. ఒకటి పైకి పోతుంటే మిగతావి దాన్ని కిందకు లాగేస్తాయి . మనుషులంతా ఒకే రకంగా ఉండరు. స్వలాభం కోసం బంధుత్వాలను అమ్ముకొనే వారు ఎందరో ? మన జాగ్రత లో మనం ఉండాలి . రకరకాల మోసాలు .. రకరకాల మార్కెటింగ్ టెక్నీక్కులు .. వినదగు నెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపఁతగున్ .. కని కల్లా నిజమే తెలిసినవాడే మనుజుడు మహిలో సుమతి " అపార్ట్మెంట్ లో కార్ పార్క్ చేసూ శ్రీనివాస్ చెప్పిన మాటలు .

.
అందరికీ అవగాహన కల్పించండి .

27/02/2024

హై టెక్ మోసాలు !

కోడింగ్ పని అయిపోయిందా ?

కరోనా కాలం లో ఎక్కువగా వినిపించిన మాట .. కోడింగ్ .

మీ పిల్లలు కోడింగ్ నేర్చుకొంటే లక్షలు సంపాదించవచ్చు అని ఊదర గొట్టి కొన్ని కంపెనీ లు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించాయి . ఆలా కోడింగ్ నేర్చుకొన్న పిల్లలు ఎవరూ ఉద్యోగాలు సాధించలేదు . సరే కోడింగ్ నేర్చుకొంటే పిల్లల్లో లాజికల్ థింకింగ్ పెరుగుతుంది . భవిష్యత్తు అంతా అంత కోడింగ్ దే అని తల్లితండ్రులు సరిపెట్టుకున్నారు .

న్విడియా కంపెనీ సీఈఓ జెన్సెన్ హుయాంగ్ ఇప్పుడొక బాంబు పేల్చారు . ఆయన ఏమన్నారంటే ..

"కృత్రిమ మేధతో ఇప్పుడు ఎవరైనా కోడింగ్ చెయ్యొచ్చు .. అంటే కోడింగ్ ను కృత్రిమ మేధ చూసుకొంటుంది . పిల్లలు కోడింగ్ నేర్చుకోనక్కర లేదు ."

కోడింగ్ సంగతి ఎలా ఉన్నా నూతన టెక్నాలజీ పేరుతొ గత కొంత కాలంగా జరుగుతున్న నాటకాలు అన్నీ ఇన్నీ కాదు .

మన పిలల్లు టెక్నాలజీ పరంగా అప్డేట్ కాకపోతే ఎక్కడ వెనుకబడి పోతారో అన్న ఆదుర్దా తల్లితండ్రుల్లో ఉంటుంది . దీన్ని కాష్ చేసుకోవడానికి కొన్ని కంపెనీ లు పుట్టుకొచ్చాయి . మీ పిలల్లకు రోబో సైన్స్ నేర్పుతాము అని ఇలాంటి కంపెనీ లు కొన్ని పాఠశాలలతో కలిసి తల్లితండ్రుల్ని బురిడీ కొట్టిస్తున్నాయి .

అక్కడ నేర్పేది ఏమీ ఉండదు . గడ్డీగాదంతో రోబో లాంటిది తయారు చెయ్యడం దానితో కాసేపు పిల్లలు ఏదో నేర్చుకొన్నట్టు కలరింగ్ ఇవ్వడం .

టెక్నాలజీ ఎలా వాడుకోవాలో తెలియకపోవడం డిజిటల్ ఏజ్ నిరక్షరాస్యత అవుతుంది . సుమారుగా పదేళ్ల క్రితం కొన్ని కంపెనీ లు .. "మీ స్కూల్ లో ట్యాబు లు తప్పని సరి చెయ్యండి . నోట్స్ ... హోమ్ వర్క్ వీటి ద్వారానే ఇవ్వండి ఇదిగో మీకు నెలకు ఇంత ఆదాయం" అని వచ్చాయి .
" అసలు స్కూల్ లో మొబైల్స్ టాబ్స్ వాడం. ఇంట్లో కూడా వీటి వాడకం అవసరం లేదు. తమరిక దయచేయండి "అని చెప్పాను.
అప్పట్లో అదొక సంచలనం .

బ్రెయిన్ ఫెడ్ అనే మ్యాగజైన్ నన్ను ఇంటర్వ్యూ చేసింది ." అన్ని స్కూల్స్.. మొబైల్స్ ను టాబ్స్ ను ప్రోత్సహిస్తుంటే మీరేంటి? అని
.. టెక్నాలజీ ఎలా వాడుకోవాలో వివరంగా చెప్పాను . ముందుగా ఫ్రాన్స్ .. ఇప్పుడు అనేక ఐరోపా దేశాలు స్కూల్స్ లో మొబైల్స్ ను టాబ్స్ ను నిషేధించాయి . దుబాయ్ లాంటి గల్ఫ్ దేశాల్లో ఇది ఇంకా కొనసాగుతోంది . చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం గ్యారెంటీ .

మరి టెక్నాలజీ ఎలా వాడుకోవాలి ?

అవసరం అనుకొంటే ఇంట్లో డెస్క్ టాప్ ఏర్పాటు చెయ్యాలి . అడల్ట్ సైట్స్ ఓపెన్ కాకుండా దానికి సాఫ్ట్ వెర్ లాక్ వుండాలి . డెస్క్ టాప్ ను ఇంట్లో అందరూ తిరిగే చోట అంటే డ్రాయింగ్ రూమ్ లో ఉండేలా చేసుకోవాలి . పిలల్లు ఏమి బ్రౌజ్ చేస్తుంన్నారో నిరంతరం కనిపెట్టి ఉండాలి .

స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్ లో ప్రతి కంప్యూటర్ కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి . పిలల్లు అవసరం అయిన సమాచారాన్ని దీని ద్వారా బ్రౌజ్ చేస్తారు .. డౌన్ లోడ్ చేసుకొంటారు . మా పాఠశాలలో అయితే ఐదో తరగతి నుంచి ప్రతి లెస్సన్ అయిపోయాక కంప్యూటర్ ల్యాబ్ లో పిల్లలు చాట్ జిపిటి వుపయోగించి ఆ చాప్టర్ కు సంబంధించి హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ప్రశ్నలు చాట్ జిపిటి ని అడిగి విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడం గత సంవత్సరం గా జరుగుతోంది .

ఎడ్యుకేషన్ సెగ్మెంట్ ఒక పెద్ద లాభాల గని.. అని.. అనేక టెక్ కంపెనీ లు భావిస్తున్నాయి . ఎలాగైనా వీటిలోకి చొరబడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి .

ఆన్లైన్ లెర్నింగ్ ... డిస్టెన్స్ లెర్నింగ్ .. హోమ్ స్కూలింగ్ .. స్కూల్స్ తో కాలాబోరేట్ అయ్యి పిల్లలకు కోడింగ్.. రోబోటిక్స్ నేర్పిస్తాము... అని ముందుకు వస్తున్నాయి .

ఐఐటీ స్థాయి మేధావులు గత పదేళ్లుగా స్కూల్ సెగ్మెంట్ లోకి చొచ్చుకొని పోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు .

తమ తమ ప్రపోజల్స్ తో ఎంతో మంది నన్ను కలిసారు .

ఇలా చెబుతున్నందుకు సారీ .. మరో సారి.. నాది అహంకారం .. అతిశయోక్తి అనిపించవచ్చు . వీరిలో నూటికి తొంబై తొమ్మిది మందికి స్కూలింగ్ బేసిక్స్ తెలియదు . వీరు తయారు చేసి తీసుకొని వచ్చే ప్రపోజల్స్ క్రేజీ గా ఉంటాయి .

వీళ్ళెవరూ ఒక్క రోజు కూడా పిల్లలకు పాఠాలు చెప్పివుండరు . టెక్నాలజీ వుపయోగించి మొత్తం విద్య వ్వవస్థ తమ గుప్పిట పట్టేసి లాభాలు పిండుకోవాలనే ఆత్రుత తప్పించి పిల్లల మనస్తత్వం .. సామజిక తెలివి తేటలు .. భావోద్వేగ తెలివితేటలు..లాంటి అంశాల గురించి ఒక ముక్క అవగాహన ఉండదు . వీరి ఆలోచన చూస్తే జాలి పడి నవ్వుకోవడం తప్పించి చేసేది ఏమీ ఉండదు .

ఒకటి చెప్పనా ?

ఎల్ కేజీ.. మొదలు పదో తరగతి వరకు .. ఆ మాటకొస్తే డిగ్రీ.. పీజీ .. అటుపైన సివిల్స్ ప్రిపరేషన్ దాకా అన్ని అంశాలు నెట్ పై ఫ్రీ గా దొరుకుతాయి . వికీ పీడియా .. యూట్యూబ్ .. ఇప్పుడు చాట్ జిపిటి ..

ఇక ఏడూ టెక్ కంపెనీ ల అవసరం ఏముంది ? పిల్లల్ని స్కూల్స్ మానిపించి ఒక లాప్టాప్ ఇచ్చి ఇంట్లో ఫ్రీగా చదివించుకోవచ్చుగా ?
ఆ కేరళ బైజూస్ రవీంద్రన్ .. ఏదో క్యాట్ కోచింగ్ తో ప్రారంభించాడు . అటుపై సివిల్స్ సెగ్మెంట్ లోకి దూరాడు . పదేళ్ల క్రితమే బ్రెయిన్ ట్రీ డైరెక్టర్ మిత్రుడు గోపాల కృష్ణ " వీరిది అత్యాశ . ఏదో అనుకొని సివిల్స్ ఫీల్డ్ లోకి వచ్చాడు . ఇక్కడ నడవదు " అన్నాడు .

లాక్ డౌన్ వచ్చేటప్పటికి ఇతని అత్యాశ.. అంతకు మించి ఇంగిత జ్ఞాన లేమి ఆకాశాన్ని దాటేసి బ్లాక్ హోల్ దాక వెళ్ళిపోయింది . "ఇంకేముంది స్కూల్స్ పని అయిపొయింది . హ్యాపీగా ఇంట్లో కూర్చొని పిల్లలు చదివేసుకొంటారు అని అనుకొన్నాడు .

తానొక్కడు అనుకోవడం కాదు .
నేటి ప్రపంచం చదువుకొన్న మూర్ఖుల నిలయం .
పెద్ద ఎత్తున ఫండింగ్ కంపెనీ లు ఇన్వెస్టర్స్ నమ్మించాడు .

గాలిబుడల వ్యాపారం పై లక్షల కోట్లు ప్రవహించాయి . ఎన్నో ఎడ్ టెక్ కంపెనీ లను కొనేశారు . ఇక తాను విశ్వ గురు అనుకొన్నాడు .

కరోనా కాలం లో నైతే క్రేజ్ వాలా లను మేనేజ్ చేసి స్కూల్స్ రెండుళ్లు లాక్ డౌన్ ఉండేలా చూసి ఏదో వ్యాపారం సాగించాడు . కోట్లాది తల్లితండ్రులు నమ్మారు .

కరోనా కష్ట కాలం లో " పిల్లలు ఇంట్లో లాప్ టాప్ తో కూర్చుంటే ఏమి జరుగుతోందో నేను చెబితే మండిపడి... నాది అజ్ఞానం అని తేల్చేసిన మేధావుల సాక్షిగా ఇప్పుడు అందరు తల్లితండ్రులకు విషయం అవగతం అయ్యింది .

తాను పెట్టిన బైజూస్ నుంచి ఇప్పుడు మెడ పట్టుకొని గెంటి వేయబడిన రవీంద్రన్ .. టెక్నాలజీ పేరుతొ నేడు జరుగుతున్న మోసానికి సజీవ సాక్షం . చెరకురా చెడేవు అని నీతి కథ మరో సారి ఆవిష్కృతం . రవీంద్రన్ బాధలు... బైజూస్ బాధలు.. అయిపోయాయి అని అందరూ ఇప్పడు అనుకొంటునాన్రు . లేదు ... ఇది జస్ట్ బెగిన్నింగ్ .

మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసగించేవారు పుట్టుకొస్తూనే వుంటారు . కృషి బ్యాంకు వెంకటేశ్వర రావు లు .. బైజూస్ రవీంద్రన్ లు .. కేవలం పాత్ర దారులు .
మన అవగాహాన లేమి అసలు సూత్ర దారి.

డిజిటల్ యుగం లో బతికి బట్టకట్టాలంటే క్రిటికల్ థింకింగ్ అవసరం .. లేక పొతే కరోనా వాక్ సీన్ లు .. బైజూస్ రవీంద్రన్ లు .. కట్టలుగా వస్తాయి . ముందుముందు ఇంకా మోసాలు .. హై టెక్ నేరాలు ఘోరాలు జరుగుతాయి .

ఒకటి గుర్తు పెట్టుకోండి .. కృత్రిమ మేధ యుగం లో మిమ్మల్ని కాపాడేది మా సహజ మేధ మాత్రమే . దాని పదును పెట్టండి .

శుభోదయం . గుడ్ మార్నింగ్.

05/02/2024

In his insightful book "Leaders Don't Command: Inspire Growth, Ingenuity, and Collaboration," Jorge Cuervo challenges traditional notions of leadership and offers a refreshing perspective on how to foster a culture of engagement, innovation, and collaboration.

Here are 10 key lessons from the book:

1. Leadership is not about control, but about enabling others. True leaders empower their team members to take ownership, make decisions, and contribute their unique talents. They create an environment where people feel valued, respected, and encouraged to reach their full potential.

2. Leadership is a shared responsibility, not a one-person show. Effective leadership is not about a single individual at the top, but rather about a collective effort to achieve shared goals. Leaders facilitate collaboration, break down silos, and foster a sense of shared purpose among team members.

3. Leadership is not about titles or positions, but about behavior. Leadership is not defined by a hierarchical position or a fancy title. It's about the actions and behaviors that inspire and motivate others. True leaders embody the qualities they want to see in their team members, such as integrity, empathy, and a willingness to learn.

4. Leadership is not about commanding, but about inspiring. Leaders don't rely on authority or intimidation to get things done. Instead, they inspire their team members to reach for excellence by creating a vision that resonates, providing meaningful feedback, and celebrating achievements.

5. Leadership is not about being perfect, but about being authentic. Leaders don't pretend to have all the answers or to be infallible. They are open to feedback, admit their mistakes, and demonstrate vulnerability. This authenticity builds trust and strengthens relationships.

6. Leadership is not about micromanaging, but about empowering others. Effective leaders trust their team members to do their jobs and make decisions. They provide guidance and support, but avoid micromanaging or stifling creativity.

7. Leadership is not about taking credit, but about giving it away. True leaders recognize the contributions of their team members and celebrate their successes. They focus on building up others and creating a culture of appreciation.

8. Leadership is not about seeking power, but about using it responsibly. Leaders understand that power is not about personal gain or control, but about serving others and making a positive impact. They wield power responsibly and ethically.

9. Leadership is not about winning at all costs, but about winning together. Leaders strive for success, but they recognize that true victory comes from working together towards a common goal. They foster a spirit of camaraderie, collaboration, and mutual support.

10. Leadership is not a destination, but a journey of continuous learning and growth. Effective leaders are always seeking to learn, improve, and adapt. They embrace change, challenge their assumptions, and seek feedback from others.

In essence, "Leaders Don't Command" challenges us to reframe our understanding of leadership and embrace a more collaborative, empowering, and inspiring approach to leading others. By cultivating these qualities, we can create workplaces where people feel engaged, valued, and motivated to reach their full potential.

Book: https://prf.hn/l/Vx8Y4Xk

27/01/2024
27/11/2023

హితులు, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు, అందరకు @ యశస్సు , ఆయుష్షు, అభివృద్ధి , ఆరోగ్యం నిండుగ కలగాలని కోరుకుంటూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సర్వేజనా సుఖినోభవంతు!

24/10/2023

To All my well wishers & Friends

Want your school to be the top-listed School/college in Visakhapatnam?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Visakhapatnam
530018

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm