08/01/2018
ప్రియమైన పిల్లలు మరియు పెద్దలకి నా విన్నపం. దయచేసి మన కుటుంబం కోసం ఇది చదవండి ఆచరించండి మరియు షేర్ చేయండి.
ఈకాలంలో పెద్ద వయసు వారికే కాదు చిన్న వయసు వారికి కూడా రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఒకప్పుడు అన్ని వ్యాధులకి ఒకరే డాక్టర్ ఉండేవారు. కానీ ఇప్పుడు రకానికి ఒక డాక్టర్ ఉంటున్నారు ఎందుకు?? ఎందుకు అంటే అనేక రకాల జబ్బులు తాయారు అయ్యాయి కాబట్టి దానికి కారణం మానసిక ఒత్తిడి మరియు శరీరానికి శ్రమ లేకపోవటం. ఈ కాలంలో అందరు కాలీ దొరికితే టీవీలో లీనం అవుతున్నారు లేదా cellphone లో లీనం అయిపోతున్నారు. అందువలన శరీరానికి శ్రమ లేక ఆరోగ్యం పాడు అవుతుంది.
కానీ పూర్వంలో గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా సాయంత్రం అవ్వగానే అందరు పెద్దలు ఒకచోట చేరి ముచ్చట్లు చేస్కునే వారు.
పిల్లలు సరదాగా దాగుడుమూతలు, బొమ్మ ప్రాణం, ఏడుపెంకులాట, కర్ర బిల్లా, చైన్ కట్, అంటుకునే ఆట, మా తాత ఉత్తరం ఢిల్లీ కి పోయింది ఆట, ఒంగు దూకుళ్ళు, కబడ్డీ, కోకో, క్రికెట్, షటిల్, ఫుట్ బాల్ లాంటి శరీరానికి శ్రమ కలిగే ఆటలు ఎన్నో ఆడేవారు అందువలన శారీరకంగా మరియు మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండేవారు. పెద్దలు శరీరానికి శ్రమ కలిగే పనులు ఎక్కువగా చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడ కనపడట్లేదు.
పెద్దలు మీరు పొందిన అనుభూతులని ఒక్కసారి గుర్తుకు తేచ్చుకోండి.
మీరు పొందిన ఆనందాన్ని మరియు ఆరోగ్యాన్ని మీ పిల్లలకి పంచటం ఇష్టం లేదా??
పల్లెలో వారు అయిన పట్టణాల్లో అపార్ట్మెంట్స్ లో ఉండేవారు అయిన సాయంత్రం అవ్వగానే మీరు ఆడుకున్న పూర్వపు ఆటలు మీరు మీ వయసు వారితో లేదా మీ పిల్లలతో ఆడండి. మీ పిల్లలని కూడా ఆడించండి. అప్పుడే మీరు మరియు మీ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు.
అపార్ట్మెంట్స్ లో ఉండే వారు లేదా పల్లెల్లో ఉండేవారు జనాలు అందరు మనల్ని వింతగా చూస్తారు అని సిగ్గు పడకండి ఎందుకంటే మనం చేసేది తప్పు పని కాదు. చాల ఉత్తమమైన పని. మన ఆరోగ్యాన్ని, ఉల్లాసాన్ని మన చేతులతో మనం బాగు చేసుకుంటున్నాం అంతే. వీలు అయితే అలా చేస్తున్నందుకు గర్వంగా తల ఎత్తుకు తిరగండి.
దయచేసి షేర్ చేసి కొందరిలో అయిన మేలుకొలుపు తీస్కురండి.
ధన్యవాదాలు - మదిలో భావాలు పేజి.