Sri Telaprolu Raja High School

Sri Telaprolu Raja High School One and only Best Government (Aided) School in One Town.

31/07/2024

వీళ్ళలో పెద్దపెద్ద ఇంజనీర్లు ....డాక్టర్లు.... లాయర్లు... ఐఏఎస్లు.... ఐపీఎస్లు.... కూడా ఉన్నారు. వాళ్ళ చిరు కోరిక మాత్రం మళ్లీ స్కూల్ రోజులకు వెళ్లి వారి మాస్టారు తో ఒక బెత్తం దెబ్బ తినాలి అని. అది ఇలా రి యూనియన్ ద్వారానే సాధ్యపడింది.

మీ మీ బ్యాచ్ తో అందరూ ఒక సారి యూనియన్ ప్లాన్ చేయండి మంచిగా ఎంజాయ్ చేస్తారు.

27/04/2024
27/09/2023

Just for fun. No Politics

Happy Teachers Day 💐ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 💐🙏
05/09/2023

Happy Teachers Day 💐
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 💐🙏

12/11/2022

తెలుగు సాహిత్యంలో చెప్పుకోదగిన మరపురాని హాస్య నవల ''బారిస్టర్‌ పార్వతీశం''. మొక్కపాటి నరసింహాశాస్త్రి గారు రాసిన ఈ నవల 90లో పదవతరగతి చదువుకున్న వారందరికీ గొప్ప అనుభూతితో కూడిన జ్ఞాపకం..

వారానికోసారి సారి మా రూపావతి(తెలుగు టీచర్) గారు ఈ పాఠం చెప్పేవారు. మిగతా రోజులు తెలుగు పాఠాలంటే పెద్దగా ఆసక్తి చూపించని మేము బారిస్టర్ పార్వతీశం పాఠం చెప్పే రోజు కోసం వారమంతా ఎదురుచూసేవాళ్ళం.

హాస్యపు నవలను అంతే హాస్యంగా చెప్తూ భలే నవ్వించేవారు మా రూపావతి టీచర్.

ఎప్పటికైనా ఈ పాఠం సినిమాగా తెరకెక్కాలని ఎదురుచూస్తున్న కొందరిలో నేను ఒకడిని.

గురుదేవో భవః
01/02/2022

గురుదేవో భవః

24/11/2021

ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు.

అది ప్రపంచంలోనే అతి పె ద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు.
"ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ?" అడిగాడు బాస్.

"చెయ్యలేదు"

"సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా! ".

తర్వాతి రోజు చాలా భారంగా నడిచింది తనకి. చివరకి సాయంత్రం ఆరు గంటలకి బాస్ వచ్చాడు.

"ఈ రోజు ఎంత మంది custermurs కి సేల్స్ చేశావు?".

"సర్ ! కేవలం ఒకరు" అని బదులిచ్చాడు తను.

"ఒకటేనా ! నువ్వు ఇక్కడ గమనించావా, అందరూ 40 నుండి 50 సేల్స్ చేస్తారు. సరే, ఎంత ఖరీదైన సేల్ నువ్వు చేశావో చెప్పు?"

"8,009,770 పౌండ్స్" చెప్పాడు మన సేల్స్ మాన్.

"వాట్ !!" అదిరిపడ్డాడు బాస్.

"అంత పెద్ద సేల్ ఏమి చేశావు?" అడిగాడు.

"వినండి. ఒక పెద్దాయనకి ఒక చేపలు పట్టే పెద్ద గేలం అమ్మాను."

"గాలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ ఖరీదు కాదే? " అన్నాడు బాస్.

"పూర్తిగా వినండి, తర్వాత ఆ గాలానికి సరిపడే రాడ్, ఒక గేర్ అమ్మాను. ఎక్కడ చేపలు పట్టాలనుకుంటున్నారో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పారు. దాని కన్నా ఒక బోట్ లో వెళుతూ నది మధ్య చేపలు పడితే బాగుంటుందని ఒప్పించి బోట్ స్టోర్లో ఒక షూనర్ బోట్ డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్దమనిషి తన జీప్ కెపాసిటీ తక్కువ ఈ బోట్ ని తీసుకు పోలేదు అన్నారు. అప్పుడు ఆటొమోబైల్ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త 4 * 4 డీలెక్స్ బ్లాజర్ కొనిపించాను.తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి కాంపింగ్ డిపార్ట్మెంట్ లో కొత్తగా ఒచ్చిన ఆరు స్లీపర్ల ఇగ్లూ కాంప్ టెంట్ దానిలో ఉండటానికి కావల్సిన భోజన సామగ్రి పాక్ చేయించాను.”

బాస్ ఆశ్చర్యంతో రెండు అడుగులు వెనక్కి వేశాడు. "ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా !!!"

"లేదు సార్ !" బదులు ఇచ్చాడు సేల్స్ మాన్.

"మరి ? " అన్నాడు బాస్.

" ఆయన నిజానికి ఒక తల నొప్పి టాబ్లెట్ కోసం వచ్చారు. తలనొప్పికి టాబ్లెట్ కన్నా చేపలు పట్టే హాబీ ద్వారా తగ్గించుకోవచ్చు అని ఒప్పించాను."

బాస్: " అరే యార్ …!! ఇంతకీ నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి?"

అప్పుడు ఆ సేల్స్ మాన్ చెప్పాడు "
చైతన్య -నారాయణ, కార్పొరేట్ స్కూల్ లో టీచర్ ఉద్యోగం చేసేవాణ్ణి సార్."టీచర్ కి, సేల్స్ కు,ఏంటి రిలేషన్?? అడిగాడు బాస్
ఏబిసిడి లు నేర్పమని వస్తే ,పదేళ్ల తర్వాత వచ్చే ఐఐటి -నీట్-సివిల్స్ ,రాంక్ పేరు మీద ఫీజులు వసూలు చేసేవాళ్ళం... అని ఆన్సర్ ఇచ్చాడు😃😃😃

Forward post...😊😊

Address

Vijayawada
520001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

8688598655

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Telaprolu Raja High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category