Sri Vyshnavi Medical Academy

Sri Vyshnavi Medical Academy One Year Long Term Eamcet (MEDICAL) Coaching.....
To Make Students STRONGER From Root Level In MEDICAL STREAM

24/05/2025
22/05/2025
31/12/2021

ఇది వరకే ఓమిక్రాన్ విస్తరించింది అనిపించినా , గణాంకాల ప్రకారం చూస్తే ...

1 . ముంబై , ఢిల్లీ నగరాల్లో ఓమిక్రాన్ వేవ్ మొదలయ్యింది .

2 . తెలంగాణ లో కూడా కేసులు పెరగడం ప్రారంభం అయ్యింది .

ఎన్ని టెస్ట్ లు చేస్తారు అనే దాన్ని బట్టి కేసులు రోజుకు రెట్టింపు అవుతూ , జనవరి చివరి కల్లా లక్షల్లోకి చేరవచ్చు . ఓమిక్రాన్ ఎవరినీ వదలదు . అందరికీ సోకుతుంది .

ప్రపంచ వ్యాప్తంగా డేటా చూస్తే ..

1 . ఓమిక్రాన్ సోకిన వారిలో నూటికి తొంబై మందికి ఎలాంటి లక్షణాలు వుండవు . మిగతా పదిమందికి అతి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటాయి . ఇది సూపర్ మైల్డ్

2 . ఓమిక్రాన్ చంపదు. ఎలాంటి మందులు వాడకుండానే లక్షలాది మంది ఓమిక్రాన్ సోకిన వారు కోలుకున్నారని దక్షిణాఫ్రికా డాక్టర్ లు తెలియచేసారు . తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ లు ఓమిక్రాన్ రోగులకు కేవలం విటమిన్ మాత్రలు అంటే బి , సి , డి విటమిన్ మాత్రలు మాత్రమే ఇచ్చినట్టు చెప్పారు .

౩. జలుబు , గొంతులో గరగర , కొద్ది పాటి ఒంటి నలత దీని లక్షణాలు . కొంత మందికి ఒకటి రెండు రోజులు జ్వరం ఉండవచ్చు . రెండు మూడు రోజుల పాటు వేడి నీళ్లు తాగడం , గొంతు లో గరగర ఆంటే సోర్ త్రోట్ తగ్గించడం కోసం వేడి నీళ్లలో ఉప్పు వేసి నోట్లో పోసుకొని తల పైకెత్తి గార్గిల్ చేయడం , వేడి పాలల్లో పసుపు వేసుకొని తాగడం , లేదా అల్లం పసుపు కొద్ది పాటి సుగంధ ద్రవ్యాల తో చేసిన కషాయాన్ని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు టీ లాగా తాగడం చెయ్యాలి . సాధారణంగా లక్షణాలు రెండు రోజుల్లో తగ్గిపోతాయి . జ్వరం ఉంటే డోలో 650 ఒకటి రెండు రోజులు వాడొచ్చు . తగ్గని పక్షం లో డాక్టర్ ను సంప్రదించవచ్చు . ఆసుపత్రి లో చేరాల్సిన అవసరం ఉండదు . ఆక్సిజన్ అవసరం ఏర్పడదు . రుచి వాసన పోదు .

ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది జలుబు లాంటిది . ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోండి . ఒకటి రెండు రోజులు విశ్రాంతి చాలు . దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం ఓమిక్రాన్ సోకినవారు ఇంట్లోనే ఉండాలి అనే రూల్ తీసేసింది . సోకినా బయటకు వెళ్లొచ్చు . అందరికీ టెస్ట్ లు చేయడం, ఒక వ్యక్తికి పాజిటివ్ వస్తే అతని కుటుంబ సబ్యులకు కూడా టెస్ట్ లు చేయడం లాంటివి అవసరం లేదని ఆ ప్రభుత్వం నిర్ణయించింది . ఇక్కడ మన ప్రభుత్వాలు ఎలాంటి నియమాలను తెస్తాయో చూడాలి . భాద్యత కలిగిన పౌరులుగా ప్రభుత్వ నియమాలను పాటిద్దాము . ఇలాంటివి మార్చ్ తరువాత ఇక ఉండవు.

వేవ్ అనొచ్చా ?

కేసులు పెరగడాన్నే వేవ్ అని చెప్పాలి అంటే వేవ్ అనుకోవచ్చు . కేసులైతే రోజుకు లక్షల్లో ఉంటాయి . కానీ ఆసుపత్రి కి వెళ్ళడాలు, అంబులెన్సు లు ఇలాంటి వి కనబడవు . టెస్ట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు . చేసుకోకపోయినా నష్టం లేదు . రెండు మూడు రోజుల్లో లక్షణాలు తగ్గిపోతాయి .

ఓమిక్రాన్ వేవ్ చాలా ఉదృతంగా ఉంటుంది . అంటే కేసుల సంఖ్య బట్టి ఉదృతం . అంతే కానీ డేంజర్ కాదు . ఓమిక్రాన్ వల్ల ప్రాణ నష్టం ఉండదు . కేసులు పెరుగుతున్నప్పుడు భయపెట్టే ప్రచారానికి దూరంగా ఉండాలి . భయం పెరిగితే స్ట్రెస్ వస్తుంది . అది గుండెపోటుకు దారి తీయొచ్చు .

ఓమిక్రాన్ కరోనా యొక్క శాంత స్వరూపం . ఓమిక్రాన్ దేవుడు లేదా ప్రకృతి ఇచ్చిన అద్భుత వాక్సిన్ . ప్రాణాలు తీయదు. పైగా ఆంటీ బాడీ లు, టి సెల్స్ రక్షణ నిస్తుంది . ఆంటే కరోనా వేవ్ కు ఇది చివరి దశ . ఫిబ్రవరి కల్లా ఓమిక్రాన్ వేవ్ ముగుస్తుంది . మార్చ్ నుండి ఇక మన జీవితం లో లాక్ డౌన్ లు, కట్టడి లాంటివి ఏమీ వుండవు . 2020 లో ప్రారంభం అయిన { చైనా లో 2019 లోనే } కోవిద్ 19 ముగింపు దశ లో మనం ఉన్నాము. ఆంటే ఇది కరోనా పాండెమిక్ నుంచి ఎండెమిక్ దశకు మారే సందర్భం . పండెమిక్ ఆంటే వ్యాధి వేగంగావిస్తరిస్తూ ప్రాణహాని కలిగించే దశ . ఎండెమిక్ ఆంటే ప్రాణాలు హరించదు. మన చుట్టూరా ఎప్పటికీ ఉంటుంది .

మొదటి ప్రపంచ యుద్ధ ముగింపు కాలం లో, ఆంటే 1918 లో స్పానిష్ ఫ్లూ మొదలయ్యింది . ఆ పాండెమిక్ లో అనేక మంది చనిపోయారు . కానీ రెండేళ్లకు అది ఎండెమిక్ గా మారిపోయింది . ఆ వైరస్ పోలేదు . H1N1 ఇన్ఫ్లుఎంజా- A వైరస్ ఇంకా మన చుట్టూరా వుంది . అది జలుబు కలుగ చేస్తుంది . మనం ఇన్నాళ్లు, ఆంటే కరోనా రాక ముందు జలుబుకు భయపడ్డామా ? లేదు కదా . ఇప్పుడు కరోనా కూడా అలాగే అయిపొయింది . ఓమిక్రాన్ ఇక ఎప్పటికీ పోదు . మనకు సోకుతూనే ఉంటుంది . సోకినా భయపడాల్సింది ఏమీ లేదు .

జనవరి ఫిబ్రవరి నెలల్లో లక్షలాది కేసులు రావొచ్చు . ఆ నంబర్స్ చూసి భయపడొద్దు .

లక్షలాది ఓమిక్రాన్ కేసులు ఉన్నా అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో పాఠశాలలు కళాశాలలు నడుస్తూనే వున్నాయి . కానీ మన దేశం లో పరిస్థితి వేరు . ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలు మూసెయ్యాలని ఆదేశం జారీ చేసింది . దీని దారిలో ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం నడవొచ్చు . ఏదైనా ప్రభుత్వం ధైర్యంగా విద్య సంస్థలను నడపాలి అని భావిస్తే వాటి పై ఒత్తిడి పెరుగుతుంది . పాఠశాలలు , కళాశాలలు క్లోజ్ చేసే దాక ఊరుకోరు . ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయో చూడాలి .

సంక్రాంతి సెలవుల తరువాత కొన్ని రోజులు కేవలం ఆన్లైన్ తరగతులు మాత్రమే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం . తెలంగాణ లో సంక్రాంతి తరువాత కొద్ది రోజులు పాటు విద్యాసంస్థలు మూసేస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై కూడా ఒత్తిడి పెరుగుతుంది . ఆ ప్రభుత్వం విద్య సంస్థలను నడపాలి అని పట్టుదల తో వ్యవహరించడం వల్ల మొదటి రెండు వేవ్ ల మధ్య సుమారుగా నాలుగు నెలలు ఆంధ్ర ప్రదేశ్ లో విద్య సంస్థలు నడిచాయి . మన దేశం లో ఇలా బోల్డ్ గా వ్యవహరించిన ఏకైక రాష్ట్రం ఏపీ. దాని వల్లే ఆంధ్ర ప్రదేశ్ పిల్లల పై కోవిద్ ప్రభావం తక్కువ . ఢిల్లీ లాంటి రాష్ట్రాలు సుమారుగా రెండుళ్లుగా బడులని మూసేసాయి . దీని వల్ల పిల్లలకు అపార నష్టం జరిగింది .

ఏది ఏమైనా మార్చ్ కి తిరిగి బడులు తెరుచుకొంటాయి . పరీక్షలు రద్దు అయిపోతాయి అనే మూడ్ లో పిలల్లు వున్నారు . ఈ సారి పదవ తరగతి , ఇంటర్ లాంటి పరీక్షలు తప్పక జరుగుతాయి . పిలల్లకు చెప్పండి . చదువు గాడి తప్పితే తీవ్ర నష్టం .
మిగతా క్లాసుల కు కూడా పరీక్షలు జరుగుతాయి . ఓమిక్రాన్ వేవ్ ఎంత వేగంగా వస్తుందో ఆంటే వేగం గా పోతుంది . మార్చ్ తరువాత ఇక పిల్లలాల్ చదువుకు ఎలాంటి ఆటంకాలు ఉండవు



2022 అందరి జీవితాల్లో వెలుగులు నింపబోతోంది . కేసులు , కట్టడి లాంటి మాటలు మార్చ్ తరువాత మనకు వినబడవు . అందరికీ నూతన సంవత్సర శుభాకంక్షాలు . ఈ కొత్త సంవత్సరం లో మీకు అన్నీ శుభాలే జరగాలి . జరుగుతాయి .

రెండేళ్లుగా నేను కోవిద్ పై చేస్తున్న పోరాటానికి వేలాది మంది అండగ నిలిచారు . నా మెసేజ్ ని వాట్సాప్ గ్రూప్ ల లో సోషల్ మీడియా లో షేర్ చెయ్యడం ద్వారా లక్షలాది మందికి వాస్తవాలు తెలియచేందుకు సహకరించారు . అందరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు . వందనాలు . అమృతం కోసం పాల సముద్రం చిలికితే ముందుగా విషమే వచ్చింది . మంచి తో పాటు చెడు ఎప్పుడూ ఉంటుంది . ఈ రెండేళ్లలో నా పోరాటాన్ని కించపరిచిన వారు, హేళన చేసిన వారు వున్నారు . వారి సంఖ్య చాలా తక్కువ . వారి పై నాకు కోపం లేదు . సత్యం గెలుస్తుంది . అదే నా బలం .

ఈ మెసేజ్ ని కూడా మీ వాట్సాప్ గ్రూప్ ల లో షేర్ చేసుకోండి . మొదటి రెండు వేవ్ ల లో వేలాది మందికి సూచనలు సలహాలు ఇచ్చాను . ఇప్పుడు ఓమిక్రాన్ వేవ్ సందర్భంగా కూడా నేను ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మీకు సేవలు అందించడానికి సిద్ధంగా వున్నాను .

మంచి చేశాను .. నా వల్ల సమాజానికి ఎంతో కొంత లబ్ది కలిగింది అనే తృప్తి నాకు చాలు .

సర్వే జన సుఖినోభవంతు .

మీ
వాసిరెడ్డి అమర్నాథ్ .

విద్యావేత్త . మెడికల్ ఆంత్రోపాలజీ నిపుణుడు { ప్రపంచ వ్యాప్తంగా ఆదిమ సమాజాలు మొదలుకొని ఆధునిక సమాజాల దాక వ్యాధి , జబ్బు భావన ల ను సంపూర్ణంగా అధ్యనం చేసేదే వైద్య మానవ శాస్త్రం . }

Address

Kanuru
Vijayavada
521002

Telephone

+919154518555

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Vyshnavi Medical Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sri Vyshnavi Medical Academy:

Shortcuts

Share