02/09/2022
అపూర్వం--- అద్భుతం
మన వాళ్లకు ఆత్మీయ ఆహ్వానం.,
వేటపాలెం బండ్ల బాపయ్య విద్యాసంస్థలలో చదివిన మధుర ఘడియలు గుర్తున్నాయా...!!!
చిలిపి చేష్టలు,- అమాయక చూపులు, బెత్తం దెబ్బలు, తొడపాసాలు, చూసి కాపీలు ఓయ్..... ఒక్కటేమిటి ఏది తలుచుకున్నా మధురమే....
నిక్కర్లతో కబడ్డీ, ఫుట్బాల్ , బాస్కెట్బాల్ , క్రికెట్ ఆడిన రోజులు......
హాఫ్ స్కర్ట్లతో వాలీబాల్ తో గోల్ కొట్టిన రోజులు గుర్తున్నాయా......
ఆ రోజులు వేరు..... కాలచక్రం గిర్రున తిరిగిన మన మధుర స్మృతులు పదిలం.....
మన జ్ఞాపకాలు బంగారు గనులు.... మన ఆటలు , పాటలు, స్మృతులు ఇంకా ఒక వేటపాలెం బండ్ల బాపయ్య విద్యాసంస్థల బడి మైదానంలోనే సుస్థిరం.,
1921 లో స్థపించబడిన ఈ మన బండ్ల బాపయ్య విద్యాసంస్థలు కేవలం వేటపాలెం ప్రజలనే కాక మన చుట్టుపక్కల ప్రాంతాల యెుక్క ఎంతో మంది ప్రజలను విద్యావంతులని చేసింది
ఈ బంధం భావితరాలకు ఇక దివిటీ కావాలి., చెరిగి పోతున్న మానవ సంబంధాలకు మన కలయిక ఒక గుణపాఠం కావాలి.,
మనం చదివిన పాఠశాలకు మాత్రమే మనం పూర్వ విద్యార్థులం కావచ్చు కానీ అలనాటి విద్యార్థులుగా ఇప్పుడు జీవిత పాఠాలు చదువుతూ ముందుకు సాగే నిత్య విద్యార్థులం మనం.,
నో ఫియర్ మనం ఇప్పటికీ ఎప్పటికీ విద్యార్థులమే అందుకే 2022 నవంబర్ 5 మరియు 6 తేదీ శుభ ఘడియలులో వేటపాలెంలోని మనo చదువుకున్న బండ్ల బాపయ్య విద్యాసంస్థల యెుక్క జూనియర్ కలశాలలో కలుసుకుందాం రండి!
ఆనాటి స్మృతులు తలచు కుందాం రండి! మనసు విప్పి హాయిగా చిన్న పిల్లలా కేరింతలు కొడదాం రండి! అక్షరాలను దిద్దించిన గురువుల రుణం తీర్చుకునేలా వారికి పువ్వులు చల్లి ప్రణామాలు చేల్లిద్దాం రండి..!
మనం కలిసే రోజు, ఈ జగతికే ఒక గొప్ప వెలుగు.....
మీ రాక కోసం ...వేయి కళ్లతో.... కొత్త పుంతలు..... తొక్కేలా.... ఎదురుచూస్తూ.….
బండ్ల బాపయ్య విద్యాసంస్థల మిత్ర మండలి.,