AP Model School. Venkatagiri

AP Model School. Venkatagiri AP MODEL SCHOOL - VENKATAGIRI
TIRUPATI DISTRICT, ANDHRAPRADESH

ఒక్క క్లిక్ తో..వెంకటగిరి మోడల్ స్కూల్ గురించి...వీక్షించండి!!
09/03/2026

ఒక్క క్లిక్ తో..
వెంకటగిరి
మోడల్ స్కూల్ గురించి...
వీక్షించండి!!

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

ఎపి మోడల్ స్కూల్  & జూనియర్ కాలేజ్ - వెంకటగిరి.“నాణ్యమైన విద్య…ఉన్నత లక్ష్యాలు…నైతిక  విలువలు…మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు...
09/03/2026

ఎపి మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ - వెంకటగిరి.
“నాణ్యమైన విద్య…
ఉన్నత లక్ష్యాలు…
నైతిక విలువలు…
మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సరైన దిశ - దశ చూపే
ఆదర్శవంతమైన విద్యాసంస్థ…
వెంకటగిరిలో
అదే AP Model School & Junior College.”

“ఇక్కడ ప్రతి విద్యార్థిలో నైపుణ్యత.. ఒక ప్రత్యేకత...

ఆదర్శ పాఠశాల ఈ ప్రతిభకు ప్రతి రూపం, ప్రగతికి నిదర్శనం .

ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు
క్రమ శిక్షణ.. నాణ్యత.. నైపుణ్యం నైతిక విలువలతో విద్యనందించడమే లక్ష్యం..

విశాల భవనం.. ఆధునిక విద్యకై సకల సౌకర్యాలు, డిజిటల్ క్లాస్ రూములు, IFP పానల్స్ ద్వారా అనుభవజనులైన పీజీటీ, టీజీటీ ఆధ్యాపకులతో..
ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన.

ఆధునిక డిజిటల్ క్లాస్‌రూమ్‌ల ద్వారా
పాఠ్యాంశాలు సులభంగా, స్పష్టంగా ప్రతి విద్యార్థికి అర్ధం అయ్యేలా విద్య అందించబడుతుంది.

ప్రతి విద్యార్థికి ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్ దుస్తులు.. షూస్ స్కూల్ బ్యాగులు ప్రతి ఏడాది పంపిణీ.
“సృజనాత్మకమైన సైన్స్ ల్యాబ్‌లు… ఆధునిక కంప్యూటర్ ల్యాబ్… పాల్ ల్యాబ్ మొదలగు ఆధునిక వనరులతో పిల్లల్లో పరిశోధన, పరిశీలనా శక్తిని పెంపొందించి నేటి పోటీ ప్రపంచానికి ధీటుగా తయారుచేసే విద్యా విధానం…”

ప్రత్యేకంగా స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని నింపి సునాయాసంగా.. సరళంగా ఇంగ్లీషులో మాట్లాడే నైపుణ్యం పెంపొందించడమే ఈ పాఠశాల ప్రధాన లక్ష్యం.

చదవడంపై ఆసక్తిని పెంపొందిస్తూ జ్ఞానాన్ని విస్తరింపు చేయుటకు..
పిల్లలకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలతో గ్రంధాలయం కలదు. . మెడికల్, ఇంజనీరింగ్ అర్హత పరీక్షలకు, నీట్, జె ఇ ఇ, ఐ ఐ టి, ఎంసెట్ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలుకూడా ఉంటాయి.

NMMS, IIT, NEET, EAMCET వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణతో మీ పిల్లల కలలను సాకారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.”
పిల్లల మానసిక ఒత్తిడిని అధికమించేందుకు యోగా, మెడిటేషన్ తరగతులు నిర్వహించబడును.

మానసిక ఆరోగ్యానికి
శారీరిక దృఢత్వానికి పునాది క్రీడలు.
ఇందుకోసం సువిశాల క్రీడా ప్రాంగణం.
విద్యార్థులకు అవసరమైన ఆట వస్తువులు... క్రీడా పోటీలకు తగిన పరికరాలు కలిగి వున్నాయి.

“విద్య మాత్రమే కాదు…వ్యక్తిత్వ వికాసం కూడా మా లక్ష్యం.
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, నాయకత్వ లక్షణాలు పెంపుందించుటకు
స్కౌట్స్ &, గైడ్స్ మరియు NCC శిక్షణ ఇవ్వబడును.

9వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలను పెంపొందించడానికి అనువుగా వృత్తి విద్యా కోర్సులైన ఐటీ మరియు అప్పారెల్ లో శిక్షణ ఇవ్వబడును.
అన్నింటిని మించి శుభ్రమైన త్రాగు నీరు.. RO ప్లాంట్ సౌకర్యం మరియు
ఇంటర్ వరకు సుచికరమైన ఉచిత మధ్యాహ్న భోజన వసతి కలదు .

సుదూర ప్రాంతాల వారికి 9వతరగతి నిండి ఇంటర్ దాకా లేడీస్ హాస్టల్ సదుపాయం కలదు.

పాఠశాలను గుణాత్మకంగా బలోపేతం చేయటం, జాతీయ విద్యా విధానాలతో ఆధునిక, మౌలిక సదుపాయాలతో ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చిదిద్దటం, నాణ్యమైన విద్యను అందిచడం పి ఎం శ్రీ మోడల్ స్కూల్ ప్రధాన లక్ష్యం.

వెంకటగిరి పట్టణ ప్రజలకు, పరిసర మండల ప్రజలకు ఇదొక
సదవకాశం. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఆదర్శ పాఠశాల మార్గదర్శకంగా నిలుస్తుంది.

వెంకటగిరి పరిసరవాసులకు శుభవార్త
“ఇప్పుడు ఎపి మోడల్ స్కూలులో 6వ తరగతి ప్రవేశాలకు ప్రక్రియ ఆరంభమైంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక.
100 పరిమిత సీట్లు – ఈ అవకాశాన్ని వదులుకోకండి.”
గుర్తింపు పొందిన ప్రాధమిక పాఠశాలలో తెలుగు లేదా ఇంగ్లిష్ మీడియంలో 5వతరగతి చదువుతున్న విద్యార్థులకు సువర్ణావకాశం.
ఎలా దరకాస్తు చేసుకోవాలని ఆలోచిస్తున్నారా?
అతి సులభం. మీ పరిసర ప్రాంతాల్లోని నెట్ సెంటర్స్ కు లేదా మీ సేవకు వెళ్ళండి.
WWW. apms.apcfss.in/ అనే వెబ్ సైటు ద్వారా మార్చి 31వ తేది లోగా ఆన్ లైన్లో ప్రవేశ రుసుము చెల్లించి ఆన్ లైన్ లో దరకాస్తు చేసుకోండి.
ప్రవేశ పరీక్ష వెంకటగిరి మోడల్ స్కూల్లో ఏప్రిల్ 12వ తేది ఆదివారం ఉదయం జరుగును .
ఫలితాలను, తుది ఎంపిక జాబితాను
ఏప్రిల్ 27వతేది పాఠశాలలో ప్రకటించబడును.

ఇంకా సందేహాలున్నాయా?..
అయితే.. ఏపి మోడల్ స్కూలు పనివేళల్లో సంప్రదించండి.
అత్యవసరమైతే 8333066000 నంబరును సంప్రదించండి.

ఇంకెందుకు ఆలస్యం!
వెంటనే దరకాస్తు చేసుకోండి.

ఆగండి .. మరో మాట..
మీ పిల్లలు పదో తరగతి చదివారా?
అయితే మోడల్ స్కూల్ నందు ఇంటర్మీడియట్ లో చేర్పించండి.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి దరకాస్తులు కోరబడుతున్నాయి.
MPC, Bi.P.C, MEC, CEC కోర్సులు కలిగి వున్నాయి. ప్రతి గ్రూపులో 40 సీట్లు మాత్రమే పరిమితం.
సౌకర్యాలు మాత్రం అపరిమితం
మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు
మొదటి అడుగు వేయండి.
ఎపి మోడల్ స్కూలులో ప్రవేశం పొందండి.
అదే పిల్లల విద్యా జీవితానికి మలుపు.
ఆ మలుపుకు ఇదే మా పిలుపు.

26/01/2026

ఏపీ మోడల్ స్కూల్ వెంకటగిరి
ప్రిన్సిపల్ తులసి జ్యోతి గణతంత్ర దినోత్సవ ప్రసంగం

🇮🇳

గౌరవనీయులైన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు
ప్రియమైన నా విద్యార్థినీ విద్యార్థులకు
ఎస్ ఎం సి సభ్యులకు
తల్లిదండ్రులకు

మీ అందరికీ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
🇮🇳

ఈ రోజు...
ఈ గణతంత్ర దినోత్సవం... మనందరికీ అత్యంత గౌరవప్రదమైన, పవిత్రమైన క్షణం.
77 సంవత్సరాల క్రితం 1950 జనవరి 26వ తేదీన మన భారత దేశం తన రాజ్యాంగాన్ని అంగీకరించి, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా అవతరించింది.

ఈ పవిత్ర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ,
మన హృదయాల్లో దేశభక్తి జ్వాలను రగిలిస్తూ,
ఈ మహోన్నత దినోత్సవాన్ని జరుపుకోవడం మన అందరి అదృష్టం!

ఈ త్రివర్ణ పతాకం కేవలం ఒక వస్త్రపు ముక్క కాదు, ప్రియమైన విద్యార్థులారా! ఇది లక్షలాది మంది అమర బలిదానాల సాక్ష్యం! భగత్ సింగ్ వంటి యువ విప్లవకారుల త్యాగం, సుభాష్ చంద్రబోస్ వంటి నాయకుల సాహసం, మహాత్మా గాంధీ వంటి మహనీయుల అహింస మార్గం - ఇవన్నీ కలిసి నేటి స్వతంత్ర భారతాన్ని మనకు అందించాయి.

కానీ నా ప్రియమైన పిల్లలారా, ఒక ప్రశ్న!
స్వాతంత్య్రం వచ్చింది... రాజ్యాంగం వచ్చింది... హక్కులు వచ్చాయి...
కానీ మన బాధ్యతలు ఏమిటి? మీరు,
ఈ వెంకటగిరి AP మోడల్ స్కూల్‌లో చదువుకుంటున్న రేపటి భారత పౌరులు...
మీ బాధ్యత ఏమిటి?
విద్యార్థులారా, మీరే మన దేశ భవిష్యత్తు!
మీలో కొందరు భారత రక్షణ మంత్రులు కావచ్చు,
కొందరు అంతరిక్ష శాస్త్రవేత్తలు కావచ్చు,
కొందరు వైద్యులుగా ప్రాణాలు కాపాడవచ్చు,
కొందరు ఉపాధ్యాయులుగా జ్ఞాన జ్యోతి వెలిగించవచ్చు, కొందరు వ్యవసాయవేత్తలుగా ఆహార భద్రత కల్పించవచ్చు,

కొందరు సాంకేతిక నిపుణులుగా భారతాన్ని ప్రపంచ శిఖరాగ్రానికి చేర్చవచ్చు!

కానీ మీరు ఏ రంగంలో ఉన్నా, మీ హృదయంలో ఒక్క విషయం తప్పనిసరిగా ఉండాలి - భారత మాతకు, మన రాజ్యాంగ విలువలకు నిబద్ధత!

మన రాజ్యాంగం మనకు ఏమి చెప్తుంది?
న్యాయం - సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం!
స్వేచ్ఛ - ఆలోచన, భావ ప్రకటన, నమ్మకం, ఆరాధన, వృత్తి స్వేచ్ఛ!
సమానత్వం - స్థితి మరియు అవకాశాల సమానత్వం!
బంధుత్వం - వ్యక్తి గౌరవం మరియు జాతీయ ఐక్యత కల్పించే బంధుత్వం!

ఈ నాలుగు స్తంభాల మీద నిలబడి ఉంది మన గణతంత్రం!
ఈ నాలుగు విలువలను హృదయంలో నాటుకొని జీవించాలి మీరు!

ప్రియమైన విద్యార్థులారా,
మీరు ఇప్పుడు 6వ నుండి ఇంటర్ 2వ సంవత్సరం వరకు చదువుకుంటున్నారు.
ఈ వయస్సు అత్యంత కీలకమైన దశ!
ఈ దశలో మీరు ఏ విలువలను నేర్చుకుంటారో, ఏ అలవాట్లను పెంచుకుంటారో - అవే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి!

నేను మీతో కొన్ని ముఖ్యమైన విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను:
1. విద్యే సర్వ సంపద - విద్యే మీ అసలైన శక్తి!
మీరు ఇక్కడ పొందుతున్న విద్య కేవలం పరీక్షల్లో మార్కులు తెచ్చుకోవడానికి మాత్రమే కాదు!
అది మిమ్మల్ని సంపూర్ణ మానవులుగా తీర్చిదిద్దడానికి!
మీ మెదడును పదును పెట్టడానికి!
మీ హృదయాన్ని విశాలం చేయడానికి!
మీ ఆలోచనా శక్తిని బలోపేతం చేయడానికి!

గణితం, సైన్స్, సామాజిక శాస్త్రాలు, భాషలు - ఇవన్నీ కలిసి మిమ్మల్ని రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం చేస్తాయి.
కాబట్టి ప్రతి సబ్జెక్టును, ప్రతి పాఠాన్ని గౌరవంగా నేర్చుకోండి!

2. సత్యమే జయతే - నిజాయితీ మీ మార్గదర్శి కావాలి!
3. మన జాతీయ నినాదం "సత్యమేవ జయతే" -

సత్యమే విజయం సాధిస్తుంది!
జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రలోభాలు ఎదురైనా, సత్య మార్గం నుండి తప్పుకోకండి!

పరీక్షల్లో నకలు చేయడం, తప్పు చేసి అబద్ధం చెప్పడం, మోసం చేయడం -
ఇవన్నీ చిన్న చిన్న నేరాలుగా అనిపించవచ్చు.
కానీ గుర్తుంచుకోండి - చిన్న చిన్న అబద్ధాలే పెద్ద పెద్ద అవినీతికి దారితీస్తాయి!

3. ఐక్యతే బలం - ఐక్యతలోనే శక్తి!
4. మన దేశం వివిధత్వంలో ఐక్యత యొక్క అద్భుత ఉదాహరణ! 28 రాష్ట్రాలు, 22 అధికారిక భాషలు,
వివిధ మతాలు,
వివిధ సంప్రదాయాలు -
అన్నీ కలిసి ఒకే భారతం!
మీ తరగతిలో,
మన స్కూల్లో వివిధ నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థులు ఉన్నారు. కొందరు పట్టణాల నుండి, కొందరు గ్రామాల నుండి,

కొందరు వివిధ కులాల నుండి,
కొందరు వివిధ మతాల నుండి

- కానీ అందరూ ఒకే విద్యార్థులు!
ఒకే భారతీయులు!

ఈ వైవిధ్యాన్ని గౌరవించండి! ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉండండి!
కులం, మతం, ప్రాంతం చూడకుండా అందరినీ సమానంగా చూడండి!
ఇదే నిజమైన దేశభక్తి!

4. కర్మణ్యేవాధికారస్తే - శ్రమే మీ హక్కు!

భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ మాటలు ఎంత అర్థవంతమైనవి!
మీకు కర్మ మీద, శ్రమ మీద మాత్రమే హక్కు!
ఫలితం మీద కాదు!
కష్టపడండి, శ్రమించండి, నిజాయితీగా ప్రయత్నించండి.

- ఫలితం తప్పకుండా వస్తుంది! షార్ట్‌కట్లు వెతకకండి!
సులువైన మార్గాలు వెతకకండి! కష్టపడి సాధించిన విజయమే నిజమైన విజయం!.

5. వసుధైవ కుటుంబకం - ప్రపంచమే మన కుటుంబం!

మన పూర్వీకులు చెప్పిన ఈ మహోక్తి నేటి ప్రపంచానికి ఎంత అవసరమో! ప్రపంచమంతా మన కుటుంబమే!
కాబట్టి మీరు చదువుకుంటూ, ముందుకు సాగుతూ, కేవలం మీ కోసం మాత్రమే కాకుండా, సమాజం కోసం, దేశం కోసం, మానవత్వం కోసం ఆలోచించండి!

ఇప్పుడు నేను మీతో కొన్ని ప్రాథమిక బాధ్యతల గురించి మాట్లాడాలనుకుంటున్నాను:

పర్యావరణ పరిరక్షణ:
ప్రియమైన పిల్లలారా, మీరు ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు వాతావరణ మార్పు! భూగోళ వేడెక్కడం!
కాలుష్యం!
కాబట్టి ప్రతి చెట్టును ఒక జీవంగా చూడండి! ప్లాస్టిక్ వాడకం తగ్గించండి!
నీటిని వృథా చేయకండి!

విద్యుత్తును బుద్ధిగా వాడండి!

డిజిటల్ బాధ్యత:
మీరు డిజిటల్ యుగంలో పెరుగుతున్న తరం!
సోషల్ మీడియా, ఇంటర్నెట్ మీ జీవితంలో భాగం!
కానీ దీనిని బుద్ధిగా వాడండి! ఆన్‌లైన్‌లో మంచి ప్రవర్తన చూపించండి!
దుర్వినియోగం చేయొద్దు.
అవసరం ఎంత వుందో అంతవరకే పరిమితం చేయండి.

ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయకండి! సైబర్ బెదిరింపులకు పాల్పడకండి!

స్వచ్ఛత మిషన్:
మహాత్మా గాంధీ చెప్పారు - "స్వచ్ఛత భక్తికి సమానం" అని!
మీ తరగతి గదిని, స్కూల్ ప్రాంగణాన్ని, ఊరిని శుభ్రంగా ఉంచడం మీ బాధ్యత!

మహిళల గౌరవం:
"యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః" -

స్త్రీలను గౌరవించే చోట దైవం నివసిస్తుంది!
మీ అమ్మ, అక్క, ఉపాధ్యాయిని, సహపాఠిని - ప్రతి స్త్రీని గౌరవించండి!

మహిళలపై హింస, అవమానం - ఇవి నాగరిక సమాజానికి పొసగవు!

ప్రియమైన విద్యార్థులారా!
మీరు ఒక ప్రత్యేకమైన పాఠశాలలో చదువుకుంటున్నారు!

మోడల్ స్కూల్ అంటే ఆదర్శ పాఠశాల!
అంటే మీరు ఆదర్శ విద్యార్థులు కావాలి!
మీరు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలి!

ఈ స్కూల్ మీకు కేవలం క్లాస్‌రూములు మాత్రమే ఇవ్వడం లేదు -
ఇది మీకు కలల వేదికను అందిస్తోంది!

ఈ స్కూల్ నుండి... ఈ వెంకటగిరి నేల నుండి...
మీరు ఉన్నత స్థితికి చేరుకోవాలి!

మీలో ఎవరైనా డాక్టర్ అబ్దుల్ కలాం వంటి శాస్త్రవేత్త కావచ్చు!
ఎవరైనా సచిన్ టెండూల్కర్ వంటి క్రీడాకారుడు కావచ్చు!
ఎవరైనా సీవీ రామన్ వంటి నోబెల్ బహుమతి గ్రహీత కావచ్చు!

ఎవరైనా సుందర్ పిచాయ్ వంటి టెక్ నాయకుడు కావచ్చు!

ఎవరైనా కల్పనా చావ్లా వంటి అంతరిక్ష యాత్రికురాలు కావచ్చు!

కానీ దాని కోసం మీరు కృషి చేయాలి!
ప్రతిరోజు క్రమశిక్షణతో చదువుకోవాలి!
ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవాలి!
ప్రతిరోజు మీ లక్ష్యం వైపు ఒక అడుగు వేయాలి!
మీరు విజయం సాధించినప్పుడు...
ఉన్నత స్థితిని చేరుకున్నప్పుడు...
అది కేవలం మీ విజయం మాత్రమే కాదు!
అది మీ ఊరి విజయం!
అది వెంకటగిరి గౌరవం!
అది ఈ జిల్లా అభిమానం!
అది తెలుగునాట ఆంధ్రప్రదేశ్ కీర్తి!
అది భారత మాత పేరు ప్రతిష్ట!

మీరు అన్ని రంగాలలోనూ రాణించాలి! విద్యలో, క్రీడలో, కళలలో, సైన్స్‌లో, టెక్నాలజీలో, వ్యవసాయంలో, వాణిజ్యంలో - అన్ని రంగాలలోనూ భారతాన్ని ప్రపంచ పటంలో ప్రధమ స్థానానికి చేర్చాలి!

మీ ఉపాధ్యాయులు మీకోసం రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారు!

మీ తల్లిదండ్రులు మీ కోసం త్యాగాలు చేస్తున్నారు!

ఈ స్కూల్ మీకు అవకాశాలు కల్పిస్తోంది!

ఈ అందరి కష్టాన్ని, త్యాగాన్ని, నమ్మకాన్ని నిరాశ పరచకండి!
వారికి గర్వకారణంగా నిలవండి!
వారికి పేరు తెచ్చిపెట్టండి!

మీరు సాధించే ప్రతి విజయం... సాధించే ప్రతి మెడల్...
సాధించే ప్రతి పురస్కారం - అవన్నీ ఈ స్కూల్ గౌరవాన్ని, మీ ఉపాధ్యాయుల శ్రమను, మీ తల్లిదండ్రుల త్యాగాన్ని ప్రతిబింబిస్తాయి!

ప్రియమైన విద్యార్థులారా,
నేను మీకు ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను.

1963లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అన్నారు -
"I have a dream" - నాకు ఒక కల ఉంది అని!
నాకు కూడా ఒక కల ఉంది!
నాకు కల ఉంది -
ఈ వెంకటగిరి AP మోడల్ స్కూల్ నుండి భారత రత్న గ్రహీతలు వెలువడాలని!

నాకు కల ఉంది - ఈ స్కూల్ విద్యార్థులు ఒలింపిక్స్‌లో పతకాలు గెలవాలని!

నాకు కల ఉంది - మీలో ఎవరైనా నోబెల్ బహుమతి పొందాలని!

నాకు కల ఉంది - ఈ పాఠశాల దేశానికి, ప్రపంచానికి గొప్ప నాయకులను అందించాలని!

కానీ కలలు కేవలం కనడం చాలదు - వాటిని నిజం చేయాలి!

మీరు మీ కలలను నిజం చేసుకోండి! మీ లక్ష్యాలను సాధించుకోండి!
మీ అభిలాషలను నెరవేర్చుకోండి!
గుర్తుంచుకోండి:
"కష్టం లేని సాధన లేదు!
శ్రమ లేని సఫలత లేదు!
త్యాగం లేని విజయం లేదు!"

చివరిగా..
ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన అందరం కొన్ని ప్రతిజ్ఞలు చేసుకుందాం:

నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను:
నా దేశాన్ని, నా రాజ్యాంగాన్ని గౌరవిస్తానని!
నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవిస్తానని!

క్రమశిక్షణతో, నిజాయితీతో చదువుకుంటానని!

సమాజానికి, దేశానికి మంచి పౌరుడిగా ఎదుగుతానని!
కులం, మతం, ప్రాంతం చూడకుండా అందరితో సమానంగా ప్రవర్తిస్తానని!

పర్యావరణాన్ని పరిరక్షిస్తానని!
మహిళలను గౌరవిస్తానని!
అవినీతికి, అక్రమానికి వ్యతిరేకంగా నిలబడతానని!

సత్యం, అహింస మార్గంలో సాగుతానని!
భారత మాత కీర్తిని ప్రపంచమంతా వ్యాపింపజేస్తానని!

ప్రియమైన విద్యార్థులారా,!

ఈ త్రివర్ణ పతాకం
మీ చేతుల్లో ఉంది!
భారత భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది!
మీరు ఎలా నడుచుకుంటారో దానిపై భారతదేశం భవిష్యత్తు ఆధారపడి ఉంది!
కాబట్టి లేచి నిలబడండి!
మీ కలలను వెంబడించండి! మీ లక్ష్యాలను సాధించండి! ఈ వెంకటగిరి నేల నుండి... ఈ AP మోడల్ స్కూల్ నుండి...
ఆకాశాన్ని అంటండి! శిఖరాలను చేరండి!
మీ విజయం ఖాయం! ఎందుకంటే మీలో శక్తి ఉంది! మీలో సామర్థ్యం ఉంది!
మీలో దేశభక్తి ఉంది!
జై హింద్! వందే మాతరం!
భారత మాతా కీ జై!
జై జవాన్! జై కిసాన్! జై విజ్ఞాన్!
📖
మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
🇭🇺
మన త్రివర్ణ పతాకం ఎప్పటికీ ఎగురుతూ ఉండాలి!

మన భారత దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉండాలి!

మీరంతా ఎప్పటికీ విజయవంతులై ఉండాలి!
జై హింద్!
🇮🇳

AP Model School, Venkatagiri -  BAL SANSAD ELECTIONS 2025-2026
02/01/2026

AP Model School, Venkatagiri - BAL SANSAD ELECTIONS 2025-2026

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Address

Periyavaram
Venkatagiri
524132

Alerts

Be the first to know and let us send you an email when AP Model School. Venkatagiri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share