05/05/2025
*శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వేములవాడలో అంగరంగ వైభవంగా జరిగిన వార్షికోత్సవ వార్షికోత్సవ వేడుకలు*
శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ వేములవాడలో 45వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వార్షికోత్సవ వేడుకలని బీసీ వెల్ఫేర్ బోయినపల్లి గురుకుల ప్రిన్సిపాల్ శ్రీ జిన్నా సత్యనారాయణ రెడ్డి గారు దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు .
ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన శిశు మందిర్ ప్రత్యేకతలు అయిన యోగ చాప్, యోగ, కోలాటం, చెక్కభజన ,పిరమిడ్స్, ఘోష్ డంబుల్స్ మొదలైన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.
ఈ సందర్భంగా ఈ
విద్యా సంవత్సరం జరిగిన FA1నుండి మొదలు SA 2
వరకు జరిగిన అన్ని పరీక్షల్లో కలిపి ప్రథమ,ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులకు అతిథులచే మెడల్స్ బహూకరించబడ్డాయి.
ఈ సంవత్సరం అటెండెన్స్ లో హైస్కూల్లో చిరంజీవి చిలుక మనస్విని 100% అటెండెన్స్ తో ,ప్రైమరీలో చిలుక అభిరామ్ 99% అటెండెన్స్ తో ప్రథమ స్థానంలో నిలిచారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ లో హైస్కూల్ ఛాంపియన్ గా చిరంజీవి నక్క అశ్వన్ తేజ్ ఎనిమిదవ తరగతి విద్యార్థి, ప్రైమరీ స్కూల్ ఛాంపియన్ గా చిరంజీవి లాల దీక్షిత
మూడవ తరగతి
విద్యార్థిని స్కూల్ ఛాంపియన్స్ గా నిలిచారు.
ఈ సందర్భంగా ప్రధాన వక్త
శ్రీ జిన్నా సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ చదువు అన్ని విద్యాసంస్థల్లో
లభిస్తుందని చదువుతోపాటు సంస్కారం క్రమశిక్షణ దేశభక్తి కేవలం సరస్వతి విద్యాపీఠం ద్వారా నిర్వహిస్తున్న సరస్వతీ శిశుమందిరాల్లో మాత్రమే లభిస్తాయని ,
ఇలాంటి పాఠశాలలో చదివిస్తున్న తల్లిదండ్రులకు అభినందనలు అని , శిశు మందిర్ లో చదివిన విద్యార్థులు ఎక్కడ ఏ రంగంలో ఉన్న అత్యున్నత స్థాయికి వెళ్తారని బండి సంజయ్ గారిని ఉదాహరిస్తూ చెప్పారు.
అలాగే పిల్లల తల్లిదండ్రులను మరియు వేడుకలను తిలకించడానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ శిశుమందిర్ లో చదివిన అమ్మాయి పెళ్లి కూతురుగా ఏ ఇంట్లో అడుగుపెట్టిన ఆ ఇల్లు నూతన కళ ని సంతరించుకుంటుందని,
ఆ ఇంటి వాతావరణమే ఆహ్లాదకరంగా మారిపోతుందని, వినయం విధేయతలు ,పెద్దల పట్ల గౌరవం, ప్రేమ, మంచి నడవడకతో ఉన్న మాట శిశు మందిర్ విద్యార్థుల సొంతమని, అలాంటి విద్యార్థులు చదువు పూర్తయి వ్యాపారంగమైన ,
ఉద్యోగ రంగమైన రాజకీయరంగమైన
ఏ రంగంలో ఉన్న మంచి విలువలతో కూడిన నడవడికను కొనసాగిస్తూ మంచి పేరును తెచ్చుకుంటారని ,ఇలాంటి శిశు మందిరాలని ప్రోత్సహిస్తూ సమాజానికి అత్యుత్తమ పౌరులను అందించే కార్యంలో తమ వంతు పాత్ర పోషించాలని తెలిపారు.
కాగా ఈ వేడుకల్లో శ్రీ జిన్నా సత్యనారాయణ రెడ్డి గారితో పాటు పాఠశాల అధ్యక్షులు శ్రీ యాచమనేని శ్రీనివాసరావు గారు ,ఉపాధ్యక్షులు శ్రీ డాక్టర్ కోయినేని రాజేందర్ గారు,కార్యదర్శి శ్రీ మోటూరి మధు గారు, సమితి కోశాధికారి శ్రీ నమిలికొండ నరహరి గారు, సభ్యులు కొమరవెల్లి శ్రీనివాస్ గారు, మంచాల కైలాసం గారు
బూరుగుపల్లి పరమేష్ గారు, కొక్కు గోపాల్ గారు ,
పూర్వ ప్రధానాచార్యులు చిలుక గట్టు గారు మరియు
విశ్వహిందూ పరిషత్ నాయకులు నాగుల రాములు గౌడ్ గారు, సంఘ వివిధ క్షేత్రాల కార్యకర్తలు పాఠశాల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ మ్యాన రాంప్రసాద్ గారు తెలిపారు