06/06/2025
ప్రతిభ అవార్డుకు ఉషాకిరణ్ విద్యార్థుల ఎంపిక
రాష్ట్ర ప్రభుత్వము పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వనున్నది. ఈ ప్రతిభ అవార్డుకు ఉషాకిరణ్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పూనేటి తేజేష్ , పడమటింటి కేశవానందు ఎంపికైనట్లు కరస్పాండెంట్ బిఎస్ రమణారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో కరస్పాండెంట్ విద్యార్థులను అభినందించారు.
9వ తేదీ కడప జిల్లా కేంద్రంలో జరగనున్న అవార్డుల ప్రధానోత్సవం లో విద్యార్థులకు ప్రముఖులు అవార్డును ప్రధానం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. తమ పాఠశాల విద్యార్థులు సాధించిన విజయం పట్ల కరస్పాండెంట్ బిఎస్ రమణారెడ్డి, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ చిన్నారులు మరింత ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు.