26/09/2026
గుంటూరులో జేకేసీ కాలేజ్ పూర్వ విద్యార్థులు, స్నేహితులు, యువత ఆధ్వర్యంలో 21వ సంవత్సరం గణపతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో శ్రీ భాష్యం రామకృష్ణ గారు పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన, సంపన్నమైన, సంతోషకరమైన రాష్ట్రంగా అభివృద్ధి చెందాలని గణనాథుడిని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో కొనసాగాలని, భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు.