Z.p.boys HIGH School-Tanuku

Z.p.boys HIGH School-Tanuku A place to know the Insights of our school

*ఉపాధ్యాయ ఉద్యమాల సారధి*..... "రాజగోపాల్ గారు ఇకలేరు" అనే చేదు నిజం ఆయనతో సాన్నిహిత్యం ఉన్న మిత్రులందరికీ విషాద ఘటన........
13/12/2024

*ఉపాధ్యాయ ఉద్యమాల సారధి*..... "రాజగోపాల్ గారు ఇకలేరు" అనే చేదు నిజం ఆయనతో సాన్నిహిత్యం ఉన్న మిత్రులందరికీ విషాద ఘటన....... జీవితాంతం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అలుపెరుగని సేవలందిoచి .. అందరిని చిరునవ్వుతో పలకరించే రాజగోపాల్ గారు ఆకస్మికంగా స్వర్గస్తులు కావడం ఉపాధ్యాయ లోకానికి తీరనిలోటు..., SGT గా, స్కూల్ అసిస్టెంట్ (బయాలజీ )గా , హెడ్ మాస్టర్ గా,ఏ పదవిలో ఉన్నా తనదైన విలక్షణ శైలి తో..... ,పనిచేసిన ప్రతీ పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి సేవలందించి గ్రామస్తులలోనూ, సహోపాధ్యాయులలోనూ చెరగని ముద్ర వేసి పదవీ విరమణ చేసిన,సహృదయశీలి, అసమాన ప్రజ్ఞాశీలి.. అయినపర్తి రాజగోపాల్ గారు...బాలుర ఉన్నత పాఠశాలలో 2004--2014 మధ్య కాలంలో బయాలాజీ ఉపాధ్యాయుని అందించిన సేవలు చిరస్మరనీయం .......... ఆ యనకు సద్గతిని, ఆయన ఆత్మకు శాంతిని, ఆ సర్వేశ్వరుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ..... వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియ జేస్తున్నాము 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻*............ ...... ఓం శాంతి.. ఓం శాంతి

పాఠశాల లో చిత్రలేఖనోపాధ్యాయునిగా సుదీర్ఘ కాలం నుండి పనిచేస్తున్న శ్రీ dr వేంపటాపు వెంకట సత్యనారాయణ గారు గత నెల 31తేదీన ప...
09/08/2024

పాఠశాల లో చిత్రలేఖనోపాధ్యాయునిగా సుదీర్ఘ కాలం నుండి పనిచేస్తున్న శ్రీ dr వేంపటాపు వెంకట సత్యనారాయణ గారు గత నెల 31తేదీన పదవీ విరమణ సందర్భంగా (31-7-2024)బుధవారం పాఠశాల ప్రాంగణంలో అభినందన సత్కార సభ ఘనంగా జరిగింది.. ఈసందర్బంగా పలువురు వక్తలు మాట్లాతూ 35సంవత్సరాల సేవాకాలంలో 25సంవత్సరాలు బాలుర ఉన్నత పాఠశాలకు ఆదర్శ వంతమైన సేవలు అందించి, విద్యార్థులను జాతీయ అంతర్జాతీయ చిత్రలేఖనం పోటీలలోవిజేతలు గా నిలపడంతోబాటు, చిత్రకారునిగాఅనేక అంతర్జాతీయ, జాతీయ వేదికలపై అనేక అవార్డులు రివార్డులుఅందుకున్నారని,, రచయితగా, నటునిగా, కళారంగానికి ఎనలేని సేవలందించి అందరి మన్ననలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశీలిగా సహృదయశీలిగా వేంపటాపు గారిని అభివర్ణించారు.. అనంతరం పాఠశాల సిబ్బందితో బాటు బంధు మిత్రులు, సన్నిహిత ఉపాధ్యాయ మిత్రులు,జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన డ్రాయింగ్ టీచర్స్,, రంగస్థల కళాకారులు,వేంపటాపు బాల్య మిత్రులు, విద్యార్థులు, పూర్వవిద్యార్థులు, వేంపటాపు దంపతులను ఘనంగా సత్కరించారు......

బాలుర ఉన్నత పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు శ్రీ వట్టికూటి పురుషోత్తం గారు 23.2.24తేదీన స్వర్గస్తులయ్యారు..... 30సంవత్సరా...
26/02/2024

బాలుర ఉన్నత పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు శ్రీ వట్టికూటి పురుషోత్తం గారు 23.2.24తేదీన స్వర్గస్తులయ్యారు..... 30సంవత్సరాల పైగా ఉపాధ్యాయ జీవితంలో గణిత ఉపాధ్యాయునిగా వేలాదిమంది విద్యార్థులను సత్ పౌరులుని గా తీర్చి దిద్దిన ఘనత పురుషోత్తం గారిది, భేషజాలు లేని సత్ ప్రవర్తన, నమ్రత,వినయం, సహనం, మృదుభాషణ,అయన సహజ సిద్ద లక్షణాలు... ప్రధానోపాధ్యాయులు గా బాయ్స్ హై స్కూల్ పునర్మాణంకోసం పట్టణ పెద్దలు మరియు పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన పునర్నిమాన కమిటీకి(వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ )అనుసంధాన కర్తగా వ్యవహరించి, పాఠశాలను సర్వాంగసుందరంగా నిర్మించడంలో పురుషోత్తంగారు నిర్వహించిన భూమిక
చాలా గొప్పది ......పదవీ విరమణ చేసి రెండు దశాబ్దాలు ఐన ఇప్పటికి ఆనాటి సహోపాధ్యాయులు అందరి హృదయాలలో నిలిచి వున్నారంటే అదే ఆయన సామర్థ్యనికి సహృదయానికి నిదర్శనం.......వారికీ .. ఆ భగవానుడు సద్గని ప్రసాదించి,.ఆయన ఆత్మకు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ..... పురుషోత్తం మాస్టారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము... ఓం శాంతి.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

ఒక అరుదయిన ఫోటో... దొరికింది....1935 కీ ముందు ఓల్డ్ బిల్డింగ్ పై ఫ్లోర్ లేదు...
05/07/2022

ఒక అరుదయిన ఫోటో... దొరికింది....1935 కీ ముందు ఓల్డ్ బిల్డింగ్ పై ఫ్లోర్ లేదు...

*పాఠశాల కంప్యూటర్ విద్యా భివృద్ధి కి వెంకట్రావుఅందించిన సేవలు చిర స్మరణీయం* గత 3సంవత్సరాలనుండి నుండి బాలుర ఉన్నత పాఠశాలక...
17/11/2021

*పాఠశాల కంప్యూటర్ విద్యా భివృద్ధి కి వెంకట్రావుఅందించిన సేవలు చిర స్మరణీయం*
గత 3సంవత్సరాలనుండి నుండి బాలుర ఉన్నత పాఠశాలకుకంప్యూటర్ విద్యాభోదనలో సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న విద్యా వేత్త వాసిరెడ్డి వెంకట్రావు మరణం పాఠశాల విద్యా రంగానికి తీవ్ర లోటని బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట విశ్వేశ్వర వర ప్రసాద్ తెలిపారు.ఖమ్మం జిల్లాకు చెందినరిటైర్డ్ చరిత్ర అధ్యాపకులు శ్రీ వాసిరెడ్డి వెంకటరావుగారు
"చైతన్య సారథి ట్రస్ట్",ద్వారా విదేశాలో స్థిరపడి NRI ప్రముఖులను ప్రోత్సహించి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ లను నె కోల్పి అందిస్తున్నసేవలు చిరస్మరనీయమని తెలిపారు.
ది. 14- 11- 2021 ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందిన సందర్భంగా పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన సంతాపసభలో పలువురు ఉపాధ్యాయులు మాట్లాడు చూ..నిగర్వి, నిరాడంబరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ వెంకటరావు సేవలను కొనియాడారు.....చైతన్య సారధి ట్రస్టు ద్వారా అనేక ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ప్రోత్సహించుట కంప్యూటర్ బోధకులను ట్రస్టు ద్వారా నియమించి ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారని . నిరంతరాయంగా పాఠశాలల్లో కంప్యూటర్ విద్య ప్రగతిని పర్యవేక్షిస్తూ విద్యార్థులకు ఉపయోగపడే అనేక అంశాలలో వారికి శిక్షణ ఇస్తూ ఉండేవారు.
వృత్తిరీత్యా వీరు ఉపాధ్యాయులు గాను ప్రధాన ఉపాధ్యాయులుగా పని చేసి పదవీ విరమణ అనంతరం లైన్స్ క్లబ్ అధ్యక్షుడిగా వ్యవహరించారని .రక్తదాన- ఉచిత వైద్య శిబిరాలు చేపట్టారు, అంధత్వ నివారణ సంస్థ జిల్లా మేనేజరుగా పని చేశారని ప్రశంసించారు .
తన జీవిత పర్యంతము విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఎంతగానో పాటుపడ్డారు,చివరకు వెంకట్రావు గారు మృతదేహాన్ని ప్రభుత్వ వైద్య కళాశాలకు దానం చేయాలనే ఆకాంక్ష స్ఫూర్తిదాయకంగా నిలిచింది. వెంకటరావు గారి కోరిక మేరకు అతని చిన్న కొడుకు వాసిరెడ్డి శ్రీనివాసరావుతో కుటుంబ సభ్యులు మరియు బంధువులు సోమవారం ఆయన పార్థివ దేహాన్ని విద్యార్థుల బోధన కొరకు సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల అనాటమీ అధ్యాపకులకు, కళాశాల యాజమాన్యంకు అప్పగించడం ఎందరికో స్ఫూర్థి దయకమని తెలిపారు.
వెంకట్రావు గారు చనిపోయిన తర్వాత కూడా నాలుగు తరాలకు ఉపయోగపడేలా నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమపలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు.ఈసందర్బంగా పాఠశాల కంప్యూటర్ ఫాకల్టీ, వర్మ, రాజేష్ మరియు
ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థులు వాసిరెడ్డి వెంకట్రావు గారి కి ఘన నివాళి అర్పించారు...

14/10/2021

గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న పాఠశాల చిత్రాలేఖనోపాధ్యాయులు వేంపటాపు వెంకట సత్యనారాయణ.....

సరికొత్త రూపు రేఖలతో 2021 -22 విద్యా సంవత్సరానికి స్వాగతం        పలుకుతున్న బాలుర ఉన్నత పాఠశాల
26/07/2021

సరికొత్త రూపు రేఖలతో 2021 -22 విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న బాలుర ఉన్నత పాఠశాల

పాఠశాల చిత్రలేఖనోపాధ్యాయులు బి. శ్రీనివాసరావు గారు బదిలీపై ఉండ్రాజవరం హై స్కూల్ కి వెళ్ళిన సందర్భంగా వారిని పాఠశాల ప్రధా...
17/07/2021

పాఠశాల చిత్రలేఖనోపాధ్యాయులు బి. శ్రీనివాసరావు గారు బదిలీపై ఉండ్రాజవరం హై స్కూల్ కి వెళ్ళిన సందర్భంగా వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కోట svv ప్రసాద్ గారి అధ్యక్షతన ఈ నెల 12తేదీన ఘనంగా సత్కరించారు , ఆయన రెండు పర్యాయములలో 18సంవత్సరాలకు పైగా పాఠశాలకు అందించిన సేవలను.. అయనతోవున్న అనుబంధాన్ని.. ప్రశంసలతో కొనియాడారు ....ఈ కార్యక్రమానికి స్టాఫ్ సెక్రటరీ ప్రభువరం సారథ్యం వహించారు. ఇంకా ఉపాధ్యాయులు, వేంపటాపు, smt T. ఉమా, వీరభద్రరావు, smt వరలక్ష్మి, సంజయ్ గాంధి, షరీఫ్ sr Asst smt రాధ తదితరులు మాట్లాడారు.

జ్ఞాపకాలు
10/02/2021

జ్ఞాపకాలు

Address

RP Road
Tanuku
534211

Website

Alerts

Be the first to know and let us send you an email when Z.p.boys HIGH School-Tanuku posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category