15/05/2024
*ఏపి గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలలో మెరిసిన శ్రీ సాయిరాం విద్యార్థులు*
పెద్దపప్పూరు న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 5వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో శ్రీ సాయిరాం ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 9మంది ప్రతిభ కనబరిచి,గురుకుల పాఠశాలలకు ఎంపిక అయ్యారని కరస్పాండెంట్ బి.చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.గత నెల 25న అనంతపురం కేంద్రంగా జరిగిన ఈ పరీక్షలో 100 మార్కులకు 95 మార్కులతో కె.అదితి(స్టేట్ ర్యాంక్ 21)తో పాటుగా,5మంది విద్యార్థులు 100లోపు ర్యాంకును సాధించారన్నారు.ప్రవేశాలు పొందిన విద్యార్థులలో కె.అదితి,జి.గాయత్రి,హెచ్.డి.మమత,కె.దీక్షచరితశ్రీ లు APRS గుత్తి గురుకుల పాఠశాల;ఎం.హిమజ - APRS బనవాసి(కర్నూలు);కె.కేదార్నాథ్,సి.చైతన్య,కె.సిద్దార్థ,వై.హర్షవర్ధన్ లు APRS నూతిమడుగు పాఠశాలలకు ఎంపిక అయ్యారన్నారు.ఎంపిక అయిన విద్యార్థులను కన్వీనర్ మదన్ మోహన్ రెడ్డి,హెచ్.ఎం.మల్లేశ్వరి అభినందనలు తెలియజేశారు.కార్యక్రమంలో పాఠశాల ఇంఛార్జి ఉపాధ్యాయులు రామాంజినేయులు,గిరి,గురుకుల విభాగ ఉపాధ్యాయులు మహమ్మద్ భాష,ఉపాధ్యాయులు అనంతయ్య,పీరా,భాస్కర్,బాలాజీ,నూర్బి,కౌసల్య,ప్రియాంక,నీలవతి,శాబిరా,కల్పన తదితరులు పాల్గొన్నారు.