Srimahi E Services

Srimahi E Services RUBBER STAMPS MAKING
INTERNET ONLINE SERVICES
STUDENT IDENTITY CARDS MAKING
writing chalk making

20/10/2016
సీఐఎస్‌ఎఫ్‌లో 441 కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులుకేంద్ర పారిశ్రామిక భదత్రా దళం (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్- స...
14/10/2016

సీఐఎస్‌ఎఫ్‌లో 441 కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు
కేంద్ర పారిశ్రామిక భదత్రా దళం (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్- సీఐఎస్‌ఎఫ్) ప్రత్యేక నియామక ప్రక్రియకు ప్రకటన విడుదల చేసింది.
Jobsఇందులో భాగంగా గతంలో భర్తీ కాకుండా మిగిలిపోయిన (బ్యాక్‌లాగ్) కానిస్టేబుల్/డ్రైవర్ ఉద్యోగాల నియామకానికి ఎస్సీ, ఎస్టీ పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ కొలువులను తొలుత తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నప్పటికీ భవిష్యత్‌లో క్రమబద్ధీకరించే (పర్మినెంట్ చేసే) అవకాశం ఉంది.
మొత్తం పోస్టులు: 441 (ఎస్సీ-364, ఎస్టీ-77).
విద్యార్హత: పదో తరగతి/తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయసు: 2016, నవంబర్ 19 నాటికి కనీసం 21 ఏళ్లు, గరిష్టం 27 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ తదితరులకు గరిష్ట వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
డ్రైవింగ్ లెసైన్స్-అనుభవం: హెవీ/లైట్ వెహికల్, మోటార్ సైకిల్ డ్రైవింగ్ లెసైన్స్, ఆయా వాహనాలను నడపడంలో (2016, నవంబర్ 19 నాటికి) మూడేళ్ల అనుభవం.
శారీరక ప్రమాణాలు:
1. ఎస్సీ: 167 సెం.మీ. ఎత్తు; 80 సెం.మీ. ఛాతీ (గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. విస్తరించాలి)
2. ఎస్టీ: 160 సెం.మీ. ఎత్తు; 76 సెం.మీ. ఛాతీ (గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. విస్తరించాలి)
వైద్య ప్రమాణాలు: ఎత్తుకు తగ్గ బరువు, స్పష్టమైన కంటి చూపు కలిగి ఉండాలి. శారీరకంగా, మానసికంగా ఆర్యోగవంతులై ఉండాలి. శరీరంలో ఎక్కడా పచ్చబొట్టు ఉండకూడదు.
ఎంపిక విధానం: అర్హత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష (పీఈటీ), ట్రేడ్ టెస్ట్ అండ్ రిటెన్ టెస్ట్, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
1. అర్హత పరీక్ష: అభ్యర్థుల దరఖాస్తుల్లోని వివరాలు, వాటిని ధ్రువీకరించే ఒరిజినల్ సర్టిఫికెట్లు సీఐఎస్‌ఎఫ్ ప్రకటనలోని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవో తనిఖీ చేసి, ఉత్తీర్ణులను రెండో దశ (పీఈటీ)కి ఎంపిక చేస్తారు.
2. పీఈటీ: ఇందులో మూడు ఈవెంట్లు ఉంటాయి. వీటిలో అర్హత సాధించినవారికి శారీరక కొలతల ప్రక్రియ నిర్వహిస్తారు.
ఎ. రన్నింగ్: 195 సెకన్ల (3 నిమిషాల 15 సెకన్ల) వ్యవధిలో 800 మీటర్లు పరుగెత్తాలి.
బి. లాంగ్‌జంప్: 11 అడుగులు (ప్రతి అభ్యర్థికి మూడు అవకాశాలు ఇస్తారు).
సి. హై జంప్: 3 అడుగుల 6 అంగుళాలు (మూడు అవకాశాలు ఇస్తారు).
3. ట్రేడ్ టెస్ట్ అండ్ రిటెన్ టెస్ట్
పరీక్ష
మొత్తం మార్కులు
అర్హత మార్కులు
రాత పరీక్ష
20
10
లైట్ వెహికల్ డైవింగ్ టెస్ట్
50
25
హెవీ వెహికల్ డైవింగ్ టెస్ట్
50
25
మోటార్ మెకానిజం, రిపేర్ నాలెడ్జ్
30
15

4. వైద్య పరీక్ష: కేటగిరీల వారీగా మెరిట్‌లిస్ట్‌ను రూపొందించిన అనంతరం జాబితాలోని అభ్యర్థుల శారీరక దృఢత్వాన్ని నిర్ధారించేందుకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
తుది ఎంపిక: వైద్య పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులకు అర్హతల ధ్రువీకరణ పత్రాల నకళ్లను జతచేసి, సంబంధిత జోన్‌లోని సీఐఎస్‌ఎఫ్ డీఐజీ కార్యాలయానికి పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 19, 2016.

ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ 2016 నోటిఫికేషన్ విడుదలవివిధ ఉద్యోగాల నియామకానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికే...
10/10/2016

ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్ 2016 నోటిఫికేషన్ విడుదల
వివిధ ఉద్యోగాల నియామకానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ), లోయర్ డివిజనల్ క్లర్‌‌క(ఎల్‌డీసీ), కోర్టు క్లర్‌‌క పోస్టులను భర్తీ చేసేందుకు ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2016’ను నిర్వహించనుంది. కేవలం ఇంటర్మీడియెట్ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ కొలువును సొంతం చేసే ఈ పరీక్ష వివరాలు..
Education Newsపోస్టుల వారీ ఖాళీలు ...
1. పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్లు : 3281
2. ఎల్‌డీసీ : 1321
3. డీఈఓ : 506
4. కోర్టు క్లర్క్‌ : 2

వేతనం: అన్ని పోస్టులకూ వేతన శ్రేణి సమానంగా రూ.5,200-రూ. 20,200 ఉంటుంది. గ్రేడ్ పే మాత్రం రెండు రకాలుగా చెల్లిస్తారు. పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్లు, డీఈఓలకు గ్రేడ్ పే రూ.2,400; మిగిలిన పోస్టులకు రూ.1900.

విద్యార్హత: 2017, జనవరి 1 నాటికి ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత లేదా తత్సమానం.

వయసు: కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 27 ఏళ్లలోపు ఉండాలి. వివిధ కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్షలు, టైపింగ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టైపింగ్/స్కిల్ టెస్ట్ అర్హత పరీక్ష మాత్రమే. రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక నిర్వహిస్తారు.

రాత పరీక్ష విధానం: ఈ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. టైర్‌-1(ఆన్‌లైన్) ఎగ్జామ్‌లో ఆబ్జెక్టివ్ టైప్ (బహుళైచ్ఛిక సమాధాన) ప్రశ్నలు, టైర్‌-2 (ఆఫ్‌లైన్) ఎగ్జామ్‌లో డిస్క్రిప్టివ్ టైప్ (విశ్లేషణాత్మక సమాధాన) ప్రశ్నలు ఇస్తారు.

పార్ట్ సబ్జెక్టు ప్రశ్నలు గరిష్ట మార్కులు
1. జనరల్ ఇంటెలిజెన్స్ 25 50
2. ఇంగ్లిష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) 25 50
3. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (బేసిక్ అర్థమెటిక్ స్కిల్) 25 50
4. జనరల్ అవేర్‌నెస్ 25 50

టైర్-1: 75 నిమిషాల వ్యవధి ఉండే ఈ పరీక్షను రోజుకు రెండు, మూడు బ్యాచ్‌ల చొప్పున రెండు రోజులు నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు కోత విధిస్తారు. పార్ట్-1, 3, 4 ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీలో ఉంటాయి.

టైర్-2: గంట వ్యవధి గల ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 200-250 పదాల్లో ఎస్సే, 150-200 పదాల్లో లెటర్/అప్లికేషన్ రాయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణతకు కనీసం 33 శాతం మార్కులు సాధించాలి. సమాధానాలను ఇంగ్లిష్/ హిందీలో మాత్రమే రాయాలి. టైర్‌-2 మార్కులను కూడా మెరిట్ లిస్ట్ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటారు.

టైర్-3: ఇది అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చిన మార్కులను మెరిట్ లిస్ట్ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోరు. డీఈవో పోస్టులకు అభ్యర్థుల డేటా ఎంట్రీ స్పీడ్‌ను పరీక్షిస్తారు. ఇందులో ప్రతి అభ్యర్థి 2000-2200 స్ట్రోక్స్/కీ-డిప్రెషన్స్ గల ఇంగ్లిష్ కంటెంట్‌ను 15 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్‌లో ఎంటర్ చేయాలి. పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్, ఎల్‌డీసీ, కోర్టు క్లర్క్ పోస్టులకు అభ్యర్థి టైపింగ్ స్పీడ్‌ను పరీక్షిస్తారు. స్కిల్ టెస్ట్ మీడియం ‘ఇంగ్లిష్’ అని పేర్కొన్న అభ్యర్థుల టైపింగ్ స్పీడ్ ‘నిమిషానికి 35 పదాలు’; హిందీ అభ్యర్థుల టైపింగ్ స్పీడ్ ‘నిమిషానికి 30 పదాలు’ ఉండాలి. ఇచ్చిన అంశాన్ని 10 నిమిషాల వ్యవధిలో కంప్యూటర్‌పై ఎంత కచ్చితంగా టైపింగ్ చేశారనే దాన్ని బట్టి టైపింగ్ స్పీడ్‌ను పరీక్షిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు రుసుం: రూ.100 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, ఎక్స్‌సర్వీస్‌మెన్లు, పీడబ్ల్యూడీలకు మినహాయింపు ఇచ్చారు.

ముఖ్య తేదీలు :
1. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: నవంబర్ 7, 2016
2. టైర్‌-1 పరీక్ష తేది: 2017 జనవరి 7, ఫిబ్రవరి 5
3. టైర్‌-2 పరీక్ష తేది: 2017 ఏప్రిల్ 9

India Post Payments Bank Limited: AGM, Chief Manager, DGMApplications are invited for filling up the following posts:Job...
05/10/2016

India Post Payments Bank Limited: AGM, Chief Manager, DGM
Applications are invited for filling up the following posts:
Jobs Images

AGM (Fraud Control Operations) SMGS – V: 01 Post
AGM (Customer Service) SMGS – V: 01 Post
DGM (Information Security)/ Chief Information Security Officer TEGS – VI: 01 Post
Chief Manager (Treasury Settlements and Reconciliation) SMGS – IV: 01 Post
Chief Manager (Market Risk) SMGS – IV: 01 Post
Chief Manager (Dealer) SMGS – IV: 01 Post
AGM (Chief Dealer) SMGS – V: 01 Post
AGM (Human Resource Management) SMGS – V: 01 Post
AGM (Program Management Office) SMGS – V: 01 Post
DGM (Product and Strategic Partnerships) TEGS – VI: 01 Post
AGM (Marketing) SMGS – V: 01 Post
AGM (IT Operations) SMGS – V: 01 Post

Application Fee/ Intimation Charges: Rs.150/- for SC/ ST/ PWD category (Only Intimation charges) and Rs.700/- for All other category.

How to Apply: Candidates can apply online only.

Important Dates:

Opening date of online registration October 04, 2016
Closing date of online registration: October 25, 2016

నెల్లూరు జిల్లా వ్యవసాయశాఖలో 32 ఎంపీఈఓ పోస్టులుశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేయడానికి కా...
05/10/2016

నెల్లూరు జిల్లా వ్యవసాయశాఖలో 32 ఎంపీఈఓ పోస్టులు
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్హత గల అభ్యర్థుల నుంచి జిల్లా వ్యవసాయ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobsపోస్టు: బహుళ ప్రయోజక విస్తరణాధికారి (ఎంపీఈఓ).
ఖాళీలు: 32 (ఎస్సీ- 6, ఎస్టీ- 2, బీసీ-7, ఓసీ- 17)
వయోపరిమితి: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 2016, జూన్ 31 నాటికి 18 నుంచి 40 ఏళ్లకు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
అర్హత: సంబంధిత రంగంలో బీఎస్సీ/ పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్/ డిప్లొమా ఇన్ ( సీడ్ టెక్నాలజీ/ హార్టికల్చర్)/ తత్సమాన విద్యార్హత ఉండాలి. బీఎస్సీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్/ డ్రైల్యాండ్ అగ్రికల్చర్) చేసిన వారికి మొదటి ప్రాధాన్యతనిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 15, 2016

నాల్కోలో స్పెషల్ రిక్రూట్‌మెంట్నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దివ్యాంగుల (...
05/10/2016

నాల్కోలో స్పెషల్ రిక్రూట్‌మెంట్
నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో) వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దివ్యాంగుల (పీడబ్ల్యూడీ) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobsపోస్టులు:ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సు.
ఖాళీలు: 8
అర్హత: సంబంధిత విభాగంలో తత్సమాన విద్యార్హతతోపాటు అనుభవం ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 29, 2016

టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియాలో స్పెషల్ రిక్రూట్‌మెంట్న్యూఢిల్లీలోని టెలీకమ్యూనికేషన్‌‌స కన్సల్టెంట్స్ ఇండియా ...
05/10/2016

టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియాలో స్పెషల్ రిక్రూట్‌మెంట్
న్యూఢిల్లీలోని టెలీకమ్యూనికేషన్‌‌స కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Jobsపోస్టులు:ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (హెచ్‌ఆర్), ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్.
ఖాళీలు: 4
వయోపరిమితి: సెప్టెంబర్ 1, 2016 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ఇతర కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 18

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2017ఇండియన్ రైల్వే సర్వీసెస్, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్...
05/10/2016

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2017
ఇండియన్ రైల్వే సర్వీసెస్, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీసెస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఐఈఎస్) నిర్వహిస్తోంది. తాజాగా ఐఈఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈసారి పరీక్షా విధానం, సిలబస్‌లో మార్పులు జరిగాయి. కొత్త నోటిఫికేషన్ ద్వారా దాదాపు 440 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Education Newsవిభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
ఖాళీల సంఖ్య: 440
అర్హత: ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. వయసు 2017, జనవరి 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి (1987 జనవరి 2 - 1996 జనవరి 1 మధ్యలో జన్మించి ఉండాలి). గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులకు వారి సర్వీసులకు అనుగుణంగా నిబంధనల మేరకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.
ఎంపిక విధానం: స్టేజ్-1 (ప్రిలిమినరీ పరీక్ష), స్టేజ్-2 (మెయిన్స్), పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. స్టేజ్ -1 పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో; స్టేజ్ -2 పరీక్ష కన్వెన్షనల్ విధానంలో ఉంటుంది.
పరీక్షా విధానం :

స్టేజ్-1 (ఆబ్జెక్టివ్ విధానం):

పేపర్


సబ్జెక్ట్


మార్కులు


సమయం

పేపర్-1


జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్


200


2 గంటలు

పేపర్-2


ఇంజనీరింగ్ సబ్జెక్ట్


300


3 గంటలు

స్టేజ్-2 (కన్వెన్షల్ విధానం) :

పేపర్-1


ఇంజనీరింగ్ సబ్జెక్ట్


300


3 గంటలు

పేపర్-2


ఇంజనీరింగ్ సబ్జెక్ట్


300


3 గంటలు

స్టేజ్-3 :
పర్సనాలిటీ టెస్ట్:200 మార్కులు
మొత్తం మార్కులు (స్టేజ్ 1 + స్టేజ్ 2 +స్టేజ్ 3)= 1300.
గమనిక: ఆబ్జెక్టివ్ విధానంలోని ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు ఉంటాయి. ఒక్కో తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోత విధిస్తారు.

తుది జాబితా రూపకల్పన: స్టేజ్-1లో కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థులనే స్టేజ్-2లో ఉండే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్లకు అనుమతిస్తారు. మొత్తం ఖాళీల సంఖ్యకు ఆరు నుంచి ఏడు రెట్ల మంది అభ్యర్థులను స్టేజ్ -2కు పిలుస్తారు. ఆ తర్వాత ఎంపిక ప్రక్రియలో చివరిదైన పర్సనాలిటీ టెస్ట్‌కు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసేందుకు స్టేజ్-1, స్టేజ్-2లో పొందిన మార్కులను పరిగణనలోకి తీసు కుంటారు. పర్సనాలిటీ టెస్ట్ కూడా ముగిశాక అర్హత పరీక్షగా పేర్కొన్న స్టేజ్-1, స్టేజ్-2, ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా తుది జాబితా ప్రకటిస్తారు. దీని ప్రకారం మొత్తం 1300 మార్కులకుగాను అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

సిలబస్...
స్టేజ్-1 :
జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్: ఈ పేపర్ అన్ని బ్రాంచ్‌ల అభ్యర్థులకు కామన్‌గా ఉంటుంది. ఇందులో జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక డెవలప్‌మెంట్ అంశాలకు సంబంధించిన వర్తమాన అంశాలు, ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, న్యూమరికల్ అనాలసిస్; డిజైన్, డ్రాయింగ్‌కు సంబంధించిన జనరల్ ప్రిన్సిపల్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ సేఫ్టీ తదితర అంశాలు ఉన్నాయి.

ఇంజనీరింగ్ సబ్జెక్ట్: ఇంజనీరింగ్ సబ్జెక్ట్‌లోని ప్రశ్నలు.. ఆయా బ్రాంచ్‌ల వారీగా బీఈ/బీటెక్ స్థాయిలో ఉంటాయి. ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సిలబస్ స్టేజ్-1, స్టేజ్-2లో కామన్‌గా ఉంటుంది. స్టేజ్-2 (మెయిన్స్)లో ఉన్న రెండు పేపర్ల సిలబస్ స్టేజ్ -1 (ప్రిలిమినరీ)లోనే ఉంటుంది కానీ, మెయిన్స్‌లో మాత్రం సిలబస్‌ను రెండు పేపర్లుగా విభజించారు.

సివిల్ ఇంజనీరింగ్ సిలబస్:
పేపర్ 1: బిల్డింగ్ మెటీరియల్స్, సాలిడ్ మెకానిక్స్, స్ట్రక్చరల్ అనాలసిస్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్, డిజైన్ ఆఫ్ కాంక్రీట్ అండ్ మేసోన్రీ స్ట్రక్చర్స్, కన్‌స్ట్రక్షన్ ప్రాక్టీస్ ప్లానింగ్ మేనేజ్‌మెంట్ సబ్జెక్టులపై ప్రశ్నలు అడుగుతారు.
పేపర్ 2: ఫ్లూయిడ్ మెకానిక్స్, ఓపెన్ చానల్ ఫ్లో, పైప్ ఫ్లో, హైడ్రాలిక్ మెకానిక్స్ అండ్ హైడ్రోపవర్, హైడ్రాలజీ, వాటర్ రీసోర్స్ ఇంజనీరింగ్; ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ (వాటర్ సప్లై ఇంజనీరింగ్, వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్), ఎయిర్, నాయిస్ పొల్యూషన్ అండ్ ఎకాలజీ తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.

మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్:
పేపర్ 1: ఫ్లూయిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్‌ఫర్, ఐసీ ఇంజన్స్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, టర్బో మెషినరీ, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ సబ్జెక్టులు ఉన్నాయి.
పేపర్ 2: ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, మెకానిజమ్స్ అండ్ మెషీన్స్, డిజైన్ ఆఫ్ మెషీన్ ఎలిమెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్ అండ్ రోబోటిక్స్ సబ్జెక్టులను అభ్యర్థులు చదవాల్సి ఉంటుంది.

ముఖ్య సమాచారం :
దరఖాస్తు రుసుం: రూ. 200 (మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది)
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 2016 అక్టోబర్ 26
ప్రిలిమినరీ పరీక్ష తేది: 2017, జనవరి 8
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

Address

CULB COMPLEX, SULTHANABAD
Sultanabad
505185

Alerts

Be the first to know and let us send you an email when Srimahi E Services posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share