Rpbs Zphs Srikalahasthi

Rpbs Zphs Srikalahasthi RPBS ZPHS SRIKALAHASTHI 2006-2007 10TH BATCH

28/04/2022

🤔 ఎక్కడుందో రహస్యం..🙄

*చిన్నప్పుడు*
ఏ పండక్కో..పబ్బానికో
Dress కుట్టిస్తే..
ఎంత ఆనందమో...👗👕

ఎప్పుడు పండగ
వస్తుందా, ఎప్పుడు
వేసేసుకుందామా
అన్న ఆతృతే...🥳

ఇంటికి చుట్టాలొచ్చి
వెళ్తో వెళ్తూ..
చేతిలో రూపాయో...
అర్ధరూపాయో పెడితే
ఎంత వెర్రి ఆనందమో...😊

చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే
దుఃఖం తన్నుకు వచ్చేది...
ఇంకా ఉంటే బాగుండు
అన్న ఆశ...
ఎంత ఆప్యాయతలో...💞

సినిమా వచ్చిన ఏ
పదిహేను రోజులకో
ఎంతో ప్లాన్ చేసి
ఇంట్లో ఒప్పించి
అందరం కలిసి
నడిచి వెళ్లి..
బెంచీ టికెట్
కొనుక్కుని సినిమా
చూస్తే ఎంత ఆనందమో...🥰

ఇంటికొచ్చాకా
ఒక గంటవరకూ
ఆ సినిమా కబుర్లే...
మర్నాడు స్కూల్ లో
కూడా...
ఆ ఆనందం ఇంకో పది
రోజులుండేది...💖

అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం...అమాయకత్వం..🙄

పక్కింట్లో వాళ్లకి రేడియో
ఉంటే..ఆదివారం
మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం
ముందు కూర్చుని
రేడియో లో సంక్షిప్త
శబ్ద చిత్రం (ఒక గంట కి
కుదించిన) సినిమాని
వింటే ఎంత ఆనందం...
మనింట్లో కూడా రేడియో
ఉంటే...అన్న ఆశ...😇

కాలక్షేపానికి లోటే లేదు...
స్నేహితులు
కబుర్లు, కధలు
చందమామలు
బాలమిత్రలు...🥰

సెలవుల్లో మైలు దూరం
నడిచి లైబ్రరీ కి వెళ్లి
గంటలు గంటలు
కథల పుస్తకాలు
చదివి ఎగురుకుంటూ
ఇంటికి రావడం....🏃🏻‍♂️

సర్కస్ లు,
తోలు బొమ్మలాటలు
లక్కపిడతలాటలు...
దాగుడు మూతలు...
చింత పిక్కలు
వైకుంఠ పాళీ
పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు..
ఎన్ని ఆటలో...☺️

మూడు గదుల రైలుపెట్టి
లాంటి ఇంట్లో అంతమంది
ఎంత సంతోషంగా ఉన్నాం...
వరుసగా కింద చాపేసుకుని
పడుకున్నా ఎంత హాయిగా
సర్వం మరిచి నిద్రపోయాం...😴

అన్నంలో కందిపొడి..
ఉల్లిపాయ పులుసు
వేసుకుని తింటే
ఏమి రుచి...
కూర అవసరమే లేదు..🤷‍♂️

20/-రూపాయలు తీసుకెళ్లి
నాలుగు కిలోల
బియ్యం తెచ్చేది...
ఇంట్లో, చిన్నా చితకా
షాపింగ్ అంతా నేనే...
అన్నీ కొన్నాకా షాప్
అతను చేతిలో గుప్పెడు
పుట్నాల పప్పో, పటికబెల్లం
ముక్కో పెడితే ఎంత
సంతోషం...
ఎంత బరువైనా
మోసేసేవాని..💓

ఎగురుతున్న విమానం
కింద నుండి
కళ్ళకు చెయ్యి అడ్డం
పెట్టి చూస్తే ఆనందం...🥰

తీర్థం లో ముప్పావలా
పెట్టి కొన్న ముత్యాల దండ
చూసుకుని మురిసి
ముక్కలైన రోజులు...

కొత్త పుస్తకం కొంటే
ఆనందం...వాసన
చూసి మురిపెం..
కొత్త పెన్సిల్ కొంటే
ఆనందం...
రిక్షా ఎక్కితే...
రెండు పైసల
ఇసుఫ్రూట్ తింటే
ఎంత ఆనందం..?🤩

రిక్షా ఎక్కినంత తేలికగా...
ఇప్పుడు విమానాల్లో
తిరుగుతున్నాం...✈️
మల్టీప్లెక్స్ లో ఐమాక్స్
లో సినిమా చూస్తున్నాం.
ఇంటర్వెల్ లో
ఐస్ క్రీం తింటున్నాం..🍧

బీరువా తెరిస్తే మీద పడి
పోయేటన్ని బట్టలు...
చేతినిండా డబ్బు...
మెడలో ఆరు తులాలనగ....
పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...
ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...
హోమ్ థియేటర్లు...
సౌండ్ సిస్టమ్స్,
చేతిలో ఫోన్లు...
అరచేతిలో స్వర్గాలు...
అనుకోవాలే గానీ క్షణంలో
మన ముందు ఉండే
తిను బండారాలు..
సౌకర్యాలు...😍

అయినా చిన్నప్పుడు
పొందిన ఆ ఆనందం
పొందలేకపోతున్నాం
ఎందుకు ...?
ఎందుకు...? ఎందుకు...?🤔

చిన్నప్పుడు కోరుకున్నవి
అన్నీ ఇప్పుడు
పొందాము కదా...
మరి ఆనందం లేదేం...
ఎందుకంత మృగ్యం
అయిపోయింది...
ఎండమావి
అయిపోయింది..

మార్పు ఎందులో...?🤔
మనలోనా...?
మనసుల్లోనా...?
కాలంలోనా...?
పరిసరాల్లోనా...?
ఎందులో... ఎందులో...?
ఎందులో ...?
చెప్పరా తెలిస్తే....!!

ప్లీజ్. తెలిస్తే గట్టిగా అరవాలనిపిస్తుంది
(

Source: whatsapp
Credit: Respective owner

ఆకులు కొమ్మలు రాలినంత మాత్రాన  చెట్టు ఎదుగుదల  ఆగిపోదు కదా, అలాగే జీవితం కూడా....శుభోదయం🙏https://www.instagram.com/p/CTW...
03/09/2021

ఆకులు కొమ్మలు రాలినంత మాత్రాన చెట్టు ఎదుగుదల ఆగిపోదు కదా, అలాగే జీవితం కూడా....

శుభోదయం🙏

https://www.instagram.com/p/CTWDGdoiNne/?utm_medium=copy_link

                Rpbs Zphs Srikalahasthi
30/06/2021



Rpbs Zphs Srikalahasthi

శుభోదయం 💐
23/04/2021

శుభోదయం 💐

01/04/2021

ఏదుటి వారిని విమర్శించడం చాలా తేలిక. అవకాశం ఉంటే ప్రోత్సహించండి అంతే కాని విమర్శించకండి.... మార్పు కోసం ప్రయత్నించడం లో ...
19/01/2021

ఏదుటి వారిని విమర్శించడం చాలా తేలిక. అవకాశం ఉంటే ప్రోత్సహించండి అంతే కాని విమర్శించకండి.... మార్పు కోసం ప్రయత్నించడం లో తప్పు లేదు. నాకు తెలిసి ఏ ప్రయత్నం చేయకుండా ఏ మార్పు రాదు. చేసే వారిని వెనక్కి లాగకండి......

Rpbs Zphs Srikalahasthi

మధురమైన ప్రతి క్షణం..నిలుస్తుంది జీవితం..ఈ కొత్త సంవత్సరం..అలాంటి క్షణాలెన్నో..అందించాలని ఆశిస్తు..మీకు, మీ కుటుంబ సభ్యు...
31/12/2020

మధురమైన ప్రతి క్షణం..
నిలుస్తుంది జీవితం..
ఈ కొత్త సంవత్సరం..

అలాంటి క్షణాలెన్నో..
అందించాలని ఆశిస్తు..
మీకు, మీ కుటుంబ సభ్యులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు 😍💐



Good Morning 🙂HAPPY DUSSEHRA 💐
25/10/2020

Good Morning 🙂

HAPPY DUSSEHRA 💐

" ఓటమిని గురించి ఆలొచించే వాడు ఎప్పుడూ గెలవలేడు.."మనం ఏ పనయిన మొదలు పెట్టి రెండు,మూడు సార్లు విఫలం అయితే ఆటోమాటిక్ గా.. ...
27/09/2020

" ఓటమిని గురించి ఆలొచించే వాడు ఎప్పుడూ గెలవలేడు.."

మనం ఏ పనయిన మొదలు పెట్టి రెండు,మూడు సార్లు విఫలం అయితే ఆటోమాటిక్ గా.. నిరుత్సాహం వస్తుంది.. ఆ పని మీద నమ్మకం పోతుంది.. ఏ పనిలోనయినా విజయం సాధించాలి అంటే కావలసింది...?? మన మీద మనకి నమ్మకం..

గజనీ మహమదు గురించి వినే ఉంటారు.. తాను కోల్పోయిన తన రాజ్యాన్ని గెలుచుకోవడానికి 17 సార్లు దండయాత్ర చేసి ఓడిపోతాడు.. తన రాజ్యాంతో పాటు సైనికులు కూడా చాల మందిని కోల్పోతాడు.. మిగిలిన సైనికులను కాపాడుకుంటూ.. ఒక గృహలో దాక్కుంటాడు..
రాజ్యాన్ని కోల్పోయాననే అసహనం.. సైనికులు దూరం అవుతున్నారనే బాధ.. ఇంక గెలవలేనేమో అనే నిరుత్సాహంతో.. కూర్చుని అక్కడే నిద్రలోకి జారుకున్నాడట..
నిద్ర లేచి చూస్తే ఒక చీమ తనకన్నా ఎక్కువ బరువున్న ఆహారాన్ని నోటితో తీసుకుని.. గోడపైకి పాకుతూ తన ఇంటికి చేరుకునే ప్రయత్నం చేస్తుంది...
ఆహారం నోటిలోంచి జారి కిందకి పడిపోతుంది... మళ్ళీ ఆ చీమ కిందకు దిగి ఆహారాన్ని నోటితో పట్టుకుని తిరిగి తన ఇంటికి వెళ్ళడం గమనించాడు మన గజనీ మహమదు..
అలా ఆ చీమ చాలా సార్లు ఆహారాన్ని జాడవిరచడం.. తిరిగి పైకి తీసుకెళ్ళడం చేస్తుంది.. చివరకు తన గమ్యస్థానికి చేరుకుంది..

గజనీ మహమదు ఒక్క సారి ఆలోచనలో పడ్డాడు.. అరే ఇంత చిన్న జీవి తనకన్న ఎక్కువ బరువున్న ఆహారాన్ని కింద పడుతున్నా సహనంతో తన ఇంటికి తీసుకు వెళ్ళింది..
మరి చీమకన్న లక్షల రెట్ళు పెద్దవాడిని అయిన నాకు ఆ నమ్మకం ఎందుకు లేదు...?? :)
శత్రువు పెద్దవాడే అయి ఉండొచ్చు.. కాని నా ఆశయం అంతకన్నా గొప్పది..?? నేను గెలవగలను అని గట్టిగా సంకల్పించుకుని... పోరాడదాం అని తన సైనికులను మానసికంగా సిద్దం చేసి... యుద్దానికి బయలుదేరుతాడు..

18వ సారి తన రాజ్యాన్ని గెలుచుకుంటాడు... ఆ చిన్న చీమ గజనీ మహమద్ నమ్మకాన్ని తిరిగి సంపాదించుకునేలా చేసింది... ఆ నమ్మకమే గజనీ మహమద్ బలాన్ని గుర్తు చేసింది.. :)

" ఓటమిని గురించి ఆలొచించే వాడు ఎప్పుడూ గెలవలేడు.." మన పనిని మొదలుపెట్టే ముందు.. నమ్మకమనే బలంతో మొదలు పెడితే విజయం మనది అవుతుంది..." పెద్దలు చెప్పినట్లు.. పోరాడి ఓడిపో కానీ... పోరాడటంలో మాత్రం ఓడిపోవద్దు...

నేను పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఎంతో మంది గురువులు  నా ఎదుగుదల కి కారణం అయ్యారు... అందులో కొందరు పుస్తకాలలో పాఠాలు...
05/09/2020

నేను పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఎంతో మంది గురువులు నా ఎదుగుదల కి కారణం అయ్యారు... అందులో కొందరు పుస్తకాలలో పాఠాలు నేర్పించారు.... మరికొందరు జీవిత పాఠాలు నేర్పించారు... కొంత మంది ఎలా బ్రతకాలో నేర్పించారు ఇంకొంత మంది ఎలా బ్రతకకూడదో నేర్పించారు...కొంతమంది ఎలా మాట్లాడాలో నేర్పించారు.. ఇంకొంత మంది ఎలా మాట్లాడకూడదో నేర్పించారు... ఇలా నా జీవితం లో ప్రతీ క్షణం ఎదో ఒకటి ఎవరో ఒకరి దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉన్నాను... ఇలా ప్రతిది నాకు నేర్పిన, నేర్పిస్తున్న నా గురువులందరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు..

ప్రతి విద్యార్థి వాళ్ళ గురువు కి ఇచ్చే గురు దక్షణ ఎలా ఉండాలి అంటే వీడు నా స్టూడెంట్ అని అందరిలో గర్వంగా చెప్పుకునే విధంగా బతకాలని నేను కోరుకుంటున్నాను....

Address

Srikalahasti

Website

Alerts

Be the first to know and let us send you an email when Rpbs Zphs Srikalahasthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category