Sri Sivananda High School

Sri Sivananda High School Dyvam Society ��

08/03/2021

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
శ్రీ శివానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ - సిరిపురం
మహిళలు పూజింపబడే దేశమే దేశం !

భారతదేశంలో వివిధ రంగాల్లో పేరు గాంచిన తొలి మహిళలు వీరే....!

➡️ తొలి మహిళా ప్రధానమంత్రి - శ్రీమతి ఇందిరాగాంధీ
➡️ తొలి మహిళా రాష్ట్రపతి - శ్రీమతి ప్రతిభాపాటిల్
➡️ తొలి మహిళా గవర్నర్ - సరోజని నాయుడు
➡️ తొలి మహిళా ముఖ్యమంత్రి - సుచితాకృపలాని
➡️ తొలి మహిళా ఐపీఎస్ అధికారి - కిరణ్ బేడీ
➡️ జాతీయ కాంగ్రెస్ తొలి మహిళా ప్రెసిడెంట్ - అనిబిసెంట్
➡️ సుప్రీం కోర్టు తొలి మహిళా జడ్జి - మీరా సాహెబ్ ఫాతిమా బేబి
➡️ ఐక్యరాజ్యసమితి లో తొలి మహిళా రాయబారి - విజయలక్ష్మి పండిట్
➡️ నోబెల్ బహమతి గెలుచుకున్న తొలి మహిళ - మదర్ థెరిస్సా
➡️ భారతరత్న గెలుచుకున్న తొలి భారతీయ మహిళ - శ్రీమతి ఇందిరాగాంధీ
➡️ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ - బచెంద్రిపాల్
➡️ భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్ట మొదటి సంగీత కళాకారిణి - ఎమ్మెస్ సుబ్బలక్ష్మి
➡️ అంతరిక్షం లోనికి వెళ్ళిన తొలి భారతీయ మహిళ - కల్పనా చావ్లా
➡️ జ్ఞానపీఠ అవార్డు స్వీకరించిన మొట్టమొదటి మహిళ - ఆశాపూర్ణ దేవి
➡️ రాజవీగాంధి ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి క్రీడాకారిణి - కరణం మల్లీశ్వరి (వెయిట్ లిఫ్టింగ్)

ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది స్త్రీలను గౌరవించడం, ప్రోత్సహించడం మనందరి బాధ్యత. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నది అక్షర సత్యం.
" మాదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్ "

విజయ్ కుమార్ బెహరా
శ్రీ శివానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్
సిరిపురం

26/01/2021

Happy Republic Day 🇮🇳😍🥳

అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం" మహాత్ములు కోవొత్తి వలె దహించుకుపోతూ ఇతరులకు వెలుగునిస్తారు "పొట్టి శ్రీరాములు ...
15/12/2020

అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం

" మహాత్ములు కోవొత్తి వలె దహించుకుపోతూ ఇతరులకు వెలుగునిస్తారు "

పొట్టి శ్రీరాములు గారు తన ప్రాణాలు అర్పించి అయిన ఆంధ్ర రాష్ట్రం సాధించడానికి పూనుకున్నారు. 58 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేశారు. ప్రపంచంలోనే ఇది ఒక అపూర్వ సంఘటన.

సాగిలి మ్రొక్కరా ! తెలుగుజాతికి భాగ్యవిదాతయా
త్యాగికి, అర్థనూట పదారులు జీవిత సుప్రభాతముల్
యాగ హావిస్సుగా సలిపె ! ఆయన సత్ తపస్సులోన శ్రీ
బాగు ఫలించెరా ! తెలుగుబాగుకు మూలము పొట్టిబాబురా !

⭐HAPPY CHILDREN'S DAY⭐         JAWAHARLAL NEHRU (The first Prime Minister of India 🇮🇳)             Often referred to by ...
14/11/2020

⭐HAPPY CHILDREN'S DAY⭐

JAWAHARLAL NEHRU (The first Prime Minister of India 🇮🇳)

Often referred to by his initials Pandit , he was an Indian statesman who was the first and longest-serving Prime Minister of India (1947-1964). One of the leading figures in the Indian Independence movement, Nehru was elected by the Indian National congress to assume office as Independent India's first Prime Minister, and reelected when the Congress Party won India's first general election in 1952. As one of the founders of the Non-Aligned Movement, he was also one of the Principal leaders of India's Independence Movement in the 1930s and '40s. Nehru established parliamentary government and became noted for his "neutralist" policies in foreign affairs.

Vijay Kumar
Sri Sivananda English Medium School
Siripuram

గాంధీ జయంతి       1869 వ సంవత్సరం 2వ తేదీన కరంచంద్ పుత్తలీబాయిలుకు జన్మించిన మొహందాస్ కరంచంద్ గాంధీ బాల్యమున సత్యహరిశ్చం...
02/10/2020

గాంధీ జయంతి

1869 వ సంవత్సరం 2వ తేదీన కరంచంద్ పుత్తలీబాయిలుకు జన్మించిన మొహందాస్ కరంచంద్ గాంధీ బాల్యమున సత్యహరిశ్చంద్ర , శ్రవణ కుమార నాటకము చూచెను. అవి అతని జీవితమును మార్చివేసినవి. కస్తూరిబా అతని భార్య. ఆమె అతనికి సత్యాగ్రహమును నేర్పేను. ఇంగ్లాండ్ వెళ్లి బారిష్టరు చదివి న్యాయవాదిగా పని చేయుటకు దక్షిణాఫ్రికా వెళ్లెను. అచట ఆంగ్లేయులు భారతీయుయులను బానిసల వాలే చూచుచుండిరి. నేటాల్ కాంగ్రెసును ఏర్పరిచి దక్షిణాఫ్రికా భారతీయులకు కొన్ని హక్కులు కల్గించెను. "ఫోనిక్స్" ఆశ్రమమును ఏర్పాటు చేసికొని "ఇండియన్ ఒపీనియన్" పత్రికలద్వారా దక్షిణాఫ్రికాలో అతడు జయము పొందెను.

భారత దేశమునకు తిరిగివచ్జి స్వతంత్ర పోరాటమును చేపట్టెను. "సబర్మతి" ఆశ్రమమును స్థాపించెను. సత్యము, శాంతి, సత్యాగ్రహముల ద్వారా భారతదేశమునకు స్వతంత్రము తెచ్చేను. అందువలన అతడు "జాతిపిత" అనియు "మహాత్ముడు" అనియు పిలువబడెను. దళితుల కొరకు, మతసహణము కొరకు అతడు తన జీవితమును త్యాగము చేసెను. ఆయన నిరాడంబరుడు. ఎవరిపని వారు చేసికోవలెనను శ్రమవిలువను బోధించెను.

"అంటరానితనం -- అమానుషం"

లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి

లాల్ బహుదూర్ శాస్త్రి గాంధీజీ అంతటి నిరాడంబరుడు. పొట్టివాడైనను గట్టివాడని పేరు తెచ్చికొనిన ప్రధానమంత్రి. పాకిస్తాన్ లో యుద్ధము చేసి జయించి భారత ఆత్మ గౌరవమును కాపాడిన దొడ్డవ్యక్తి . అతడు నిజాయితీ పరుడు. నిస్వార్థ పరుడు చిత్తశుద్ధి, సేవాభావాలు కల గాంధీ శిష్యుుడు నెహ్రు అనుచరుడు. పేద కుటుంబము నుండి వచ్చి పెద్ద పదవిని అధిష్టించ గలిగిన వినయ శీలుడు. భార్యను కూడ స్వతంత్ర పోరాటమున దుముకుమని ప్రోత్సహించిన నాయకుడు. కేంద్ర మంత్రిగా నిజాయితితో పనిచేసి రైలు ప్రమాదమునకు బాధ్యత వహించి రాజీనామా చేసిన నిష్కల్మషుడు.

ఈ దేశము వ్యవసాయ దేశమని, రైతు దేశమునకు వెన్నెముక , అన్నదాత అని గౌరవపాత్రుడని; దేశమును రక్షించువాడు సైనికుడని అతనికి కృతజ్ఞులుగా ఉండవలెనన్న భావంతో "జైజవాన్ ! జైకిసాన్" అన్న నినడాన్నిచ్చిన మహోన్నత వ్యక్తి లాల్ బహుదూర్ శాస్త్రి.

"జై జవాన్ - జై కిసాన్"

విజయ్ కుమార్
శ్రీ శివనంద హైస్కూల్
సిరిపురం

ఉపాధ్యాయ దినోత్సవం డా" సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం - సెప్టెంబర్ -05"గురుర్ బ్రహ్మ - గురుర్ విష్ణుః  గురుర్ దేవో...
05/09/2020

ఉపాధ్యాయ దినోత్సవం
డా" సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం - సెప్టెంబర్ -05

"గురుర్ బ్రహ్మ - గురుర్ విష్ణుః
గురుర్ దేవో - మహేశ్వరః
గురుర్ సాక్షాత్ - పరబ్రహ్మా
తస్మైశ్రీ గురవేనమః

డా"సర్వేపల్లి రాధా కృష్ణన్ బాల్యం నుండే మేధావి . విద్యాబోధనా కళాశాలలో ప్రొఫెసర్ల కంటే ఈయనే విద్యార్థిగా ఉండి కూడ చక్కగా బోధించేవాడు. భారతీయ తత్త్వ శాస్త్రాన్ని గురించి ఎన్నో గ్రంధాలు వ్రాశాడు. దేశ విదేశాలు పర్యటించి, మహోపన్యాసలిచ్చి భారత సంస్కృతిని చాటాడు.
రష్యన్ రాయబారిగా స్టాలిన్ వంటి ఉక్కు మనిషి హృదయాన్ని కరిగించి ఇనుపగోడలు గల రష్యా తలుపులు తెరిచి భారత్ తో స్నేహం కూర్చాడు.
దేశానికి ఉపాధ్యక్షుడు అయ్యాడు. అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాడు. తన జన్మదినాన్ని "ఉపాధ్యాయ దినోత్సవంగా" జరుపుకోమని ఉపాధ్యాయుల పట్ల తనకున్న గౌరవాన్ని ప్రకటించాడు.

మెదడు తీర్చిదిద్దు మేధావి ఎవరయ్యా?
చదువు చెప్పునట్టి సద్గురుడు"
"గురువనగా వెలిగేటి మణిదీపమురా
గురిగల్గిన అతడిచ్చును జ్ఞానకాంతిరా
అజ్ఞానమనే చీకటిని తొలగించునురా
సుజ్ఞానమిచ్చి అతడు నిన్ను ఉద్ధరించురా
తల్లిదండ్రులిత్తూరు భౌతిక రూపం
గురువేమో మన ప్రగతికి చూపును దీపం"

విజయ్ కుమార్
శ్రీ శివానంద హైస్కూల్
సిరిపురం

ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు - 29)             మన జిల్లా వాసి అయిన గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతిని తెలుగు బ...
29/08/2020

ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు - 29)

మన జిల్లా వాసి అయిన గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతిని తెలుగు బాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోధ్యామానికి మూల పురుషుడు , బహుభాషా , శాస్త్రవేత్త , చరిత్రకారుడు , సంఘ సంస్కర్త , హేతువాది. వ్యవహారిక భాషను గ్రంధ రచనకు స్వీకరింప చేయడానికి కృషిచేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు.

గిరిజనులలో అజ్ఞానాన్ని తొలగించడానికి వారిలో విద్యా వ్యాప్తి అధికం చేయడానికి సవరల విద్యాభివృద్ధికై ఆచరణాత్మకమైన సూచనతో A MEMORANDUM ON THE STATUS OF EDUCATION AMONG THE SAVARAS పేరిట ప్రభుత్వానికి తన మెమోరాండం సమర్పించారు. వీరు గిడుగువారు వ్యవహారిక భాషోద్యమం కోసం , సవర గిరిజనుల సముద్దరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసారు.

సవరల భాష నేర్చుకొని వాళ్లకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు సవర భాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవర భాషలో పుస్తకాలు వ్రాసి సొంత డబ్బుతో స్కూళ్లు పెట్టి అధ్యాపకులు జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు. ఈ కృషికి మెచ్చి 1913 లో "రావు బహుదూర్" బిరుదు ఇచ్చారు.

విజయ్ కుమార్
శ్రీ శివానంద హైస్కూల్
సిరిపురం

విశ్వమాత మదర్ థెరీసా(ఆగ్నస్ గొన్షా బొజాక్షువూ)" ప్రార్ధించే పెదవులు కన్నా సేవించే చేతులు మిన్న "           దీనుల పాలిట ద...
26/08/2020

విశ్వమాత మదర్ థెరీసా
(ఆగ్నస్ గొన్షా బొజాక్షువూ)

" ప్రార్ధించే పెదవులు కన్నా సేవించే చేతులు మిన్న "

దీనుల పాలిట దేవత , ఆర్తులు అన్నార్తులు అనాధలు పాలిట కన్న తల్లిగా పేరొందిన మదర్ థెరీసా బాల్యం నుంచే సేవాభావం కలిగి ఉండేది. కుటుంబాన్ని వదిలి వివాహం మాని మత కన్యగా మారి దీనుల సేవ చేయాలని తలచింది. అందుకు అవసరమైన శిక్షణ పొందింది. తొలుత కలకత్తాలో ఉపాధ్యాయునిగా చేరింది. తర్వాత అనాధ బాలలకు, ముసలి వారికి, దిక్కులేని రోగులకు సేవ చేయటం కోసం ఉద్యోగాన్ని వదిలి పెట్టింది. కలకత్తాలో పేద బడి పిల్లలకు పాలు , మందులు ఇవ్వడం తో ప్రారంభమైన ఆమె సేవ అనేక దేశాలలో సేవ సదనాలు , బాల గృహాలు , అనాధ శరణాలయాలు , కుష్టు వ్యాధి చికిత్స కేంద్రాలు ప్రారంభించడంతో విశ్వమంతా వ్యాపించింది. ఆమెను మన ప్రభుత్వం 'భారతరత్న' బిరుదునిచ్చి సత్కరించింది. ఎక్కడ విపత్తులు వచ్చినా , కరువు వచ్చిన అక్కడ ఆమె ప్రత్యక్షమయ్యేది. ఎంతోమంది సేవికులకు శిక్షణ ఇచ్చింది. ఆమె చల్లని తల్లి ప్రేమను అందుకున్న దేశాల వారు ఆమెను 'విశ్వమాత' అని పిలిచారు.

విజయ్ కుమార్
శ్రీ శివానంద హైస్కూల్
సిరిపురం

★వినాయకచవితి శుభాకాంక్షలు★"బంక మట్టితో తయారు చేసిన మట్టి వినాయకులే ముద్దు!""ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన రంగుల ప్...
22/08/2020

★వినాయకచవితి శుభాకాంక్షలు★

"బంక మట్టితో తయారు చేసిన మట్టి వినాయకులే ముద్దు!"

"ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన రంగుల ప్రతిమలు వద్దు!"

చిన్నా , పెద్దా అంతా కలిసి ఆనందంగా చేసుకొనే పండగ వినాయక చవితి. భక్తితో నిర్వహించే పండగ స్థానంలో అడంబరం ప్రవేశించింది . మట్టి వినాయకులకు బదులు ఆకర్షణీయంగా కనబడే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక ప్రతిమలను పూజిస్తున్నారు. అందంగా ఉన్నాయన్న కారణంగా వాటిని పూజించి , పర్యావరణానికి చేటు తెచ్చిన వారమవుతున్నము. రకరకాల ఏనామిల్స్ రంగులు, తయారీలో వాడడంతో నిమజ్జనం తరువాత ఈ రంగులు నెమ్మదిగా కరుగు తుంటాయి. తద్వారా నీరు కాలుష్యం అవుతోంది . ఆకర్షణీయంగా ఉట్టి పడేందుకు వినియోగించే 'సిలికాన్' మెర్క్యూరీ, సీసం గాజుపూత పదార్థాలు కారణంగా జల జీవులకు, శ్వాస , జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. నీటిలో నివసించే తాబేలు, చేపలు, అంతరించే ప్రమాదముంది. ఈ చేపలు భుజించిన వారికి రోగాలు వ్యాప్తి చెందుతాయి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమలు నిమజ్జనం చేసే చెరువుల నీటిని, ఉపయోగిస్తే చర్మ, జీర్ణకోశ, కంటి రోగాలు ప్రబలుతాయి అని నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.

★పర్యావరణానికే ముప్పు★ :-
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలతో పర్యావరణానికే ముప్పు! సృష్టిలో జీవుల మధ్య ఒక తుల స్థితి ఉంటుంది. ఇటువంటి చర్యలు కారణంగా , జలావరణ తులా స్థితి దెబ్బతినే ప్రమాదం ఉంది. భక్తి ముఖ్యం కావున ఆర్భాటాలకు పోకుండా మట్టి వినాయకుని పూజించి "పర్యావరణాన్ని" ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. విద్యావంతులు సమాజాన్ని, విద్యార్థులను, ప్రతి ఒక్కరిని చైతన్యవంతులుగా చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలి.

విజయ్ కుమార్
శ్రీ శివానంద హైస్కూల్
సిరిపురం

Thousands laid down their lives so that our country is breathing this day. Never forget this sacrifice 💝🇮🇳Happy Independ...
15/08/2020

Thousands laid down their lives so that our country is breathing this day. Never forget this sacrifice 💝🇮🇳
Happy Independence Day 🇮🇳💝🇮🇳

శ్రీ కృష్ణ పరమాత్ముడి జన్మదినం సందర్భంగా "అమ్మబాష ధర్మ జ్యోతి సేవా సంఘం" ఆధ్వర్యంలో నిర్వహించబడిన రాష్ట్రస్థాయి భగవద్గీత...
12/08/2020

శ్రీ కృష్ణ పరమాత్ముడి జన్మదినం సందర్భంగా "అమ్మబాష ధర్మ జ్యోతి సేవా సంఘం" ఆధ్వర్యంలో నిర్వహించబడిన రాష్ట్రస్థాయి భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలలో (ఆడియో ధ్వని ముద్రిక) ఎంపికై జిల్లాలో ద్వితీయ స్థానం సంపాదించిన తమ్మినైనా.సింహగిరి నరహరి నాయుడు కు అభినందనలు తెలియజేసుకుంటున్నాము.
ప్రిన్సిపాల్ & స్టాఫ్
శ్రీ శివానంద హైస్కూల్
సిరిపురం

Viswakavi Rabindranath Tagore           He was a Bengali poet, novelist, musician, painter and play wright who reshaped ...
07/08/2020

Viswakavi Rabindranath Tagore

He was a Bengali poet, novelist, musician, painter and play wright who reshaped bengali literature and music. As author of gitanjali with its "profoundly sensitive, fresh and beautiful verse", he was the first non-european and the only indian to be awarded the nobel prize for literature in 1913 . His poetry in translation was viewed as spiritual, and this together with his mesmerizing persona gave him a prophet-like aura in the west. His "elegant prose and magical poetry" still remain largely unknown outside the confines of bengal.

Vijay Kumar
Sri Sivananda high school
Siripuram

Address

Siripuram

Opening Hours

Monday 9am - 4:15pm
Tuesday 9am - 4:15pm
Wednesday 9am - 4:15pm
Thursday 9am - 4:15pm
Friday 9am - 4:15pm
Saturday 9am - 4:15pm

Telephone

+919676730562

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Sivananda High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sri Sivananda High School:

Shortcuts

Share

Category