16/08/2025
అసలు పెళ్ళి ఎందుకు?
పెళ్లి గురించి ప్రస్తావన కంటె ముందు, మనిషి ఒక సంఘజీవి అనడం కేవలం మానవుడి తొలినాటి దశలో ఉన్న తెలివి తో చెప్పిన ఒక సంకుచితమైన మాట. అక్కడ కేవలం ఆడవారు మాత్రమే సంతాన ఉత్పత్తి కి కారణం అనే భావన ఉంది.
ఇక కొంత కాలానికి ఆ సంఘ భావన భిన్న లైంగిక లక్షణాలు గల సంఘ జీవి అని కాస్త విస్తృత అర్థం వచ్చేలా సంతానం కు ఇరువురు కారణం అనే స్థాయి కి చేరింది.
మరి కొంత కాలానికి అది బహు లైంగిక సంబంధాలు గల సంఘ జీవి నుండి పరిమిత లైంగిక సంబంధంగల కుటుంబ జీవి గా మార్పు చెందింది.
ఈ పరిణామాల క్రమంలో లో "బందం, వావి వరస ల గుర్తింపు", ఆ పైన "ప్రేమ, అభిమానం, ఆనందం, బాద మొదలగు మానసిక అంశాలు", "గుర్తింపు భాద్యత లాంటి సామాజిక అంశాలు", "బంగారం, ఇళ్లు, భూములు లాంటి ఆర్థిక అంశాలు" పెళ్లి అనే దానికి విస్తృత అర్థాన్ని కలిగిస్తున్నా... పరిస్థితులు మారుతున్న కొలది సంపూర్ణ అర్థాన్ని మాత్రం ఇవ్వడం లేదు. పైగా ఎల్లప్పుడు ఆ అర్దం మారుతూ వస్తుంది.
ఇక నా దృష్టిలో ఒక రెండు కుటుంబాలు సామాజిక నడవడిక కు కట్టుబాటు కు అనుగుణంగా ఆరోగ్యకరమైన, జన్య పరిణామ క్రమం కు దాని అధ్యయనం సులభంగా ఉండేలా మరొక కుటుంబాన్ని ఏర్పరచే తంతు గా పెళ్లి ని నిర్వహిస్తాను ఇక ఇందులో వధువు వరుడు మనసులు ప్రేమతో ముడిపడి ఉన్నా ఆ తంతు జరిగిన తరువాత ప్రేమ కలిగినా ఆ పెళ్లికి సంపూర్ణ అర్థం ఉన్నట్లు.
అలా ఏర్పడిన కుటుంబానికి ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు, స్నేహితులు చేసే సహకారమే కట్న కానుకలు.
ఆలోచించండి!!!!