Bheemireddy Madhan Mohan Reddy memorial foundation

Bheemireddy Madhan Mohan Reddy memorial foundation Trust opened to help poor students

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ లొక్డౌన్ కారణంగా మన గ్రామంలో పనులులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను పంచాయితీ వారి స...
18/05/2021

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ లొక్డౌన్ కారణంగా మన గ్రామంలో పనులులేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలను పంచాయితీ వారి సహకారంతో గుర్తించి BMR ఫౌండేషన్ ద్వారా పదిరోజులకు సరిపోయే నిత్యావసర సరుకులను (సన్న బియ్యం - 4kgs ,ఆయిల్ ప్యాకెట్ , సోప్ - 1 ,ఆశీర్వాద్ గోధుమపిండి - ప్యాకెట్ ,షుగర్ 1 kg, ఎగ్స్ 1 డజన్ ,ఉల్లిపాయలు 2 kg ,సాల్ట్ ప్యాకెట్ total 8 ఐటమ్స్) పంపిణి చేయడం జరుగుతున్నది. ఈ కష్ట కాలంలో సహృదయంతో మనమందరం మన గ్రామంలో ఏ కుటుంబం పస్తులతో నిద్రపోకుండా ఉండాలి అని కోరుకుంటూ...🙏

రేజర్ల గ్రామంలోని SC కాలనీలో గొంతేలమ్మ తల్లి గుడి వద్ద BMR మెమోరియల్ ఫౌండేషన్ వారి సహకారంతో బాలవికాస నీటి శుద్దీకరణ💧 పధక...
17/10/2020

రేజర్ల గ్రామంలోని SC కాలనీలో గొంతేలమ్మ తల్లి గుడి వద్ద BMR మెమోరియల్ ఫౌండేషన్ వారి సహకారంతో బాలవికాస నీటి శుద్దీకరణ💧 పధకం ద్వారా కొత్తగా నిర్మింపబడిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం 08-10-2020 గురువారం నాడు జరిగినది. దీని ద్వారా రేజర్ల గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన నీరు తక్కువ ధరలకే అందుబాటులోనికి తీసుకురావడం జరిగింది 🙏

కీ శే భీమిరెడ్డి మదన మోహనరెడ్డి గారి వర్థంతి సందర్భంగా మే 21 న పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందిగ్రామంలో ఉపాధి హామ...
21/05/2020

కీ శే భీమిరెడ్డి మదన మోహనరెడ్డి గారి వర్థంతి సందర్భంగా మే 21 న పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది

గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న సుమారు 400 మందికి ఫ్రూట్ జ్యూస్ మరియు పండ్లు అందించడం జరిగింది

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన  లాక్ డౌన్ నేపథ్యంలో రేజర్ల గ్రామంలో బి ఎం ఆర్ ఫౌండేషన్ మరియు హరిజనవాడ యూత్ ఆధ్వర్యం...
26/04/2020

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో రేజర్ల గ్రామంలో బి ఎం ఆర్ ఫౌండేషన్ మరియు హరిజనవాడ యూత్ ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారు, గ్రామ సర్పంచ్ జక్కుల ప్రభాకర్ గారు, మాజీ సర్పంచ్ పరెడ్ల సత్యనారాయణరెడ్డి గారు, సొసైటీ అధ్యక్షులు భీమిరెడ్డి నర్సింహారెడ్డి గారు,మాజీ సర్పంచ్ దేశిరెడ్డి దామోదర్ రెడ్డి గారు,మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి గారు పంచాయతీ మరియు సొసైటీ వార్డ్ మెంబర్స్, మరియు యూత్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు 🙏🙏

12/04/2020

బి ఎం ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారి ఆద్వర్యం లో గ్రామ ప్రజలకు ఉచితముగా కూరగాయలు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది.

ఈరోజు రేజర్ల గ్రామం లో బి ఎం ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారి ఆద్వర్యం లో గ్రామ ప్రజలకు ఉచితముగా క...
12/04/2020

ఈరోజు రేజర్ల గ్రామం లో బి ఎం ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారి ఆద్వర్యం లో గ్రామ ప్రజలకు ఉచితముగా కూరగాయలు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు 450 కుటుంబాలకు పంపిణీ చేయటం జరిగింది. మిగిలిన షుమారు 550 కుటుంబాలకు రేపు పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల ప్రభాకర రావు, PACSసొసైటీ అధ్యక్షులు శ్రీ భీమిరెడ్డి నరసింహారెడ్డి, కొప్పుల రాఘవరెడ్డి గారు, కాసర్ల రాంబాబు, దేసిరెడ్డి మధురవాణి,SK రహమతున్నిసా బేగం తదిదరులు పాల్గొన్నారు.

టపా శ్రీరాములు గా మనందిరికి సుపరిచితులైన సాలి శ్రీరాములు గారు ఈరోజు రేజర్ల గ్రామంలో స్వర్గస్థులు అయ్యారు అని తెలియపరచడాన...
31/03/2020

టపా శ్రీరాములు గా మనందిరికి సుపరిచితులైన సాలి శ్రీరాములు గారు ఈరోజు రేజర్ల గ్రామంలో స్వర్గస్థులు అయ్యారు అని తెలియపరచడానికి చింతిస్తున్నాము.
టపా శ్రీరాములు గారు రేజర్ల గ్రామంలో పోస్ట్ మ్యాన్ గా అందరికి సుపరిచితులు. ప్రత్యేకంగా మా కుటుంబంలో ఒక సభ్యునిగా మా కష్ట సుఖాలలో అన్నివేళలా మా వెంటే ఉండి మాకు మార్గదర్శనం చేసిన సందర్భాలు కోకొల్లలు. ముఖ్యంగా భీమిరెడ్డి మదన మోహనరెడ్డి గారితో వున్న ప్రత్యేక అనుబంధం తో గ్రామంలో మా నాన్న గారి విగ్రహ ప్రతిష్ట లో ప్రముఖ పాత్ర పోషించారు మరియు BMR ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలకి 7 సంవత్సరాల క్రితం అంకురార్పణ జరిగే విధంగా ప్రోత్సహించిన ముఖ్యమైన వ్యక్తులలో టపా శ్రీరాములు గారు ఒకరు 🙏🙏

అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కార్యకర్తగా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని మొట్ట మెదటి సారి మన గ్రామానికి తీసుకువోచ్చిన వ్యక్తి టపా శ్రీరాములు గారు.

💐💐వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్దిస్తున్నాము 💐💐

ఈరోజు బి ఎం ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  మన గ్రామం లో ఇరవై నిరుపేద కుటుంబాలకు కొద్ది రోజులు పోషణ నిమిత్తం బియ్యం మరియు సరుకు...
29/03/2020

ఈరోజు బి ఎం ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన గ్రామం లో ఇరవై నిరుపేద కుటుంబాలకు కొద్ది రోజులు పోషణ నిమిత్తం బియ్యం మరియు సరుకులు అందించటం జరిగింది.

గ్రామ ప్రజలకు విజ్ఞప్తి :కరోనా వైరస్ లాక్ డౌన్ కారణం గా ప్రజల సౌకర్యార్ధం ఈరోజు నుండి మన రేజర్ల గ్రామ పంచాయతీ కార్యాలయం ...
27/03/2020

గ్రామ ప్రజలకు విజ్ఞప్తి :

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణం గా ప్రజల సౌకర్యార్ధం ఈరోజు నుండి మన రేజర్ల గ్రామ పంచాయతీ కార్యాలయం నందు కూరగాయలు
బీ ఎం ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్కెట్ రేటుల కంటే ప్రతి కేజీ పై 10 తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కావున ప్రజలు గమనించి ఉదయం 8.00 గంటల నుండి 10.00 గంటల లోపు సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరించి వెళ్లి కూరగాయలు తెచుకొనగలరు.

02/07/2019

స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న BMR ఫౌండేషన్ ఛైర్మెన్ భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారు.

02/07/2019

ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న BMR ఫౌండేషన్ ఛైర్మెన్ భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారు.

BMR ఫౌండేషన్ వరుసగా అయిదవ సంవత్సరం రేజర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మరియు అంగన్వాడీ స్కూల్స్...
02/07/2019

BMR ఫౌండేషన్ వరుసగా అయిదవ సంవత్సరం రేజర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మరియు అంగన్వాడీ స్కూల్స్ కు వెళుతున్న పిల్లలకు ఉచిత స్కూల్ బ్యాగ్స్ ను సింగరేణి కాలోరిస్ సత్తుపల్లి PO భీమిరెడ్డి సంజీవరెడ్డి గారి చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది.

ఫౌండేషన్ ద్వారా గ్రామంలోని ప్రతి అంగన్ వాడి స్కూల్ భవనానికి సీలింగ్ ఫాన్స్ ఏర్పాటు మరియు బీసీ కాలనీ స్కూల్ లో ఫ్లోరింగ్ అద్వానంగా వుండి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని గమనించి ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపుతామని ఫౌండేషన్ ఛైర్మెన్ భీమిరెడ్డి సుబ్బారెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది.🙏🙏

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మరియు BMR ఫౌండేషన్ మెంబర్ జక్కుల ప్రభాకరరావు గారు, గ్రామ ఉప సర్పంచ్ భీమిరెడ్డి అరుణ గారు, గ్రామ పెద్దలు కొప్పుల రాఘవరెడ్డి గారు, గాదె వెంకటరెడ్డి గారు, ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు , టీచర్స్ మరియు గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు 🙏🙏

Address

Rejarla
Sathupally
507303

Telephone

9000532872

Website

Alerts

Be the first to know and let us send you an email when Bheemireddy Madhan Mohan Reddy memorial foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share