15/04/2020
శ్రీ సరస్వతీ విద్యామందిర్ రాయదుర్గం పాఠశాల
శ్రీ సరస్వతీ విద్యాపీఠం(రి)అనంతపురము సమితి కి అనుబంధం
శ్రీ యన్. రామక్రిష్ణ గారు అధ్యక్షులు 9866345715
శ్రీ సి. చంద్రమోహన్ గుప్త గారు కార్యాధ్యక్షులు 9491866006
శ్రీ పి. ఈశ్వర్ రెడ్డి గారు
ఉపాధ్యక్షులు 9246868666
శ్రీ కాకర్ల రాఘవయ్య గారు కార్యదర్శి 94408 72073
గౌరవనీయులైన పాఠశాల ప్రబంధకారిణి సభ్యుల కు సమితి సభ్యులకు, పూర్వాచార్యులకు, పూర్వవిద్యార్థుల కు హితైషులకు, దాతలకు నమస్కారములు
విషయము:-కరోనా మహమ్మారి-మన విద్యా సంస్థలపై దాని ప్రభావం. ఈ కష్ఠ సమయములో మన పాఠశాలలో సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని ఆర్థికంగా ఆదుకోవటం మన అందరి బాధ్యత.
ఆర్యా
శ్రీ సరస్వతీ విద్యాపీఠం అనంతపురం సమితి కి అనుబంధంగా శ్రీ సరస్వతీ విద్యామందిరము రాయదుర్గం పాఠశాల నిర్వహించ బడుతున్నది. విద్యారంగంలో విశిష్ఠ సేవలు అందిస్తూ విద్యార్థులకు చదువుతో బాటు సంస్కారం, దేశభక్తి, క్రమశిక్షణ, సంప్రదాయాలను,నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తూ సమాజానికి మంచి విద్యార్థులను అందిస్తున్న స్వచ్ఛంద సేవా పాఠశాల. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు శాశ్వత ఆచార్యులు 7మంది తాత్కాలిక ఆచార్యులు 10మంది ఇతర సిబ్బంది 3 మొత్తం 20 మంది పనిచేస్తున్నారు.
1. ప్రస్తుతం ప్రపంచము మొత్తమును వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం ఎంత కాలం ఉంటుందో ఊహించ లేకుండా ఉన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలకు అనుగుణంగా మన బాధ్యతలు నిర్వర్తించాల్సిందే. ఈ సంకట సమయంలో మన పాఠశాలలో స్వఛ్ఛందముగా అతితక్కువ వేతనములతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని నిలుపుకోవలసిన భాధ్యత మన అందరిపైన ఉన్నది.
2.మన పాఠశాలలో చదువుతున్న ఎక్కువ మంది విద్యార్థులు సామాన్య కుటుంబాల నుండి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. పోషకుల నుండి తీసుకుంటున్న నిర్వహణ శుల్కం చాలా తక్కువ. అయినను ఎక్కువ మంది సంవత్సరం చివర్లో చాలా కష్టంగా చెల్లిస్తుంటారు. అది సరిగ్గా ఇదే సమయం కావున ఇప్పుడున్న పరిస్థితి గురించి మళ్లీ నేను వివరించాల్సిన అవసరంలేదు.
3. పరిస్థితులు ఎలా ఉన్నా మన ఉపాధ్యాయులకు వేతనాలు మాత్రం సమయానికి అందించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఈ వేతనాలు మార్చి, ఏప్రిల్, మే, జూన్ (నాలుగు మాసములు) చెల్లించాల్సి ఉన్నది. మన పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సామాన్య కుటుంబ జీవితాన్ని గడుపుతున్నవారే. కావున ఈ క్లిష్టసమయములో మన ఉపాధ్యాయులను ఇతర సిబ్బందిని ఆర్థికంగా ఆదుకోగలరని ప్రార్థిస్తున్నాను. మీరందించిన ఆర్థిక సహకారం అంతా ఉపాధ్యాయులకు, ఇతర సిబ్బంది వేతనాలకు మాత్రమే ఉపయోగపడుతుంది.
4. కావున దయచేసి పాఠశాల ప్రబంధకారిణి సభ్యులు, సమితి సభ్యులు, పూర్వాచార్యులు, దాతలు, హితైషులు, పూర్వ విద్యార్థులు అందరూ తమవంతు సహకారాన్ని అందించగలరని కోరుతున్నాను. అలాగే ఈ ధర్మకార్యం లో మీ మిత్రులను, బంధువులను. భాగస్వామ్యం చేయగలరని ఆశిస్తున్నాను. వీలైనంత త్వరగా ఈ కార్యం పూర్తి చేయగలరు. మొత్తం వేతనములు నెలకు రూ. 75,000. నాలుగు నెలలకు ( మార్చి, ఏప్రిల్, మే, జూన్) రూ. 3,౦౦,౦౦౦(3 లక్షలు)
విరాళములు పంపవలసిన వివరాలు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం - రాయదుర్గం :బ్యాంకు అకౌంట్ నెంబర్ :HDFC Bank
ACCOUNT Number :50100343419975
IFSC CODE : HDFC0002025
గమనిక: పదివేల రూపాయలు పైన విరాళములు ఇచ్చుదాతలు 80జి సౌకర్యం ఉపయోగించుకొనగలరు.
భవదీయ
శ్రీ సోమ నాగేంద్ర
కార్యదర్శి 9182357091
శ్రీ సరస్వతీ విద్యమందిరము రాయదుర్గం
శ్రీ.ఆవుల రమేష్ ప్రధానాచార్యులు 8309670040
శ్రీ సరస్వతీ విద్యామందిరము రాయదుర్గం