10/05/2024
పదో తరగతి విద్యార్థులు రాసిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో విన్నెర్స్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు.
రాజమండ్రి నగరంలోని ప్రభుత్వ స్కూల్స్ లో చదువుతున్న పిల్లలకి ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకున్న వారిలో 180 మందికి గాను 174 మంది ర్యాంకులు సాధించినట్లు డైరెక్టర్ బి కిరణ్ బాబు తెలిపారు. ఉత్తమ ర్యాంకు సాధించిన దుర్గా సాయి రాష్ట్రస్థాయిలో 1551 కు ర్యాంకు సాధించినందుకు అభినందనలు తెలిపారు సాధారణ విద్యార్థులు సైతం మంచిర్యాంకు సాధించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కోచింగ్ ఇచ్చిన అధ్యాపకులు కే ప్రతాప్, శివప్రసాద్, సత్తిబాబు మరియు అపర్ణ తదితరులు పాల్గొన్నారు