Vsb ప్రాణదాత

Vsb ప్రాణదాత VSB ప్రాణదాత, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రంలో అన్ని జిల్లాలో రక్తదానం కొరకు సంప్రదించండి.

మంచి ఆరోగ్యానికి 12 సూత్రాలు.How to Maintain Good Health : ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించడం అన్నది ఓ పెద్ద సవాల్. ఎన్నో అంశ...
29/05/2020

మంచి ఆరోగ్యానికి 12 సూత్రాలు.

How to Maintain Good Health :
ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించడం అన్నది ఓ పెద్ద సవాల్. ఎన్నో అంశాలు మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చెయ్యాలో తెలుసుకుందాం...

మన చుట్టూ పొల్యూషన్. తినే ఆహారంలో కల్తీ. తాగే నీటిలో క్రిములు. సాయంత్రం కాగానే దోమలు, బయటకు వెళ్తే చెడు వాసనలు వీటికి తోడు రకరకాల రోగాలు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే సమయంలో మన లైఫ్ స్టైల్, మనం జీవించే విధానం, చేస్తున్న ఉద్యోగాలు అన్నీ మన ఆరోగ్యంపై చెడు ప్రభావమే చూపిస్తున్నాయి. అందువల్ల ఈ రోజుల్లో ఆరోగ్యంగా జీవించడం అన్నది ఓ సవాలవుతోంది. చాలా మందికి పాతికేళ్లకే అడ్డమైన వ్యాధులు వచ్చేస్తున్నాయి. 40 ఏళ్లకే ముసలి తనపు లక్షణాలు కనిపిస్తున్నాయి. 60 ఏళ్లు జీవించడమే కష్టమవుతోంది. కానీ...

కొంతమంది మాత్రం ఈ రోజుల్లోనూ ఎంతో ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వందేళ్లకు పైగా ఎలాంటి రోగాలూ లేకుండా బతుకుతున్నారు. అలాంటి వాళ్ల ఆరోగ్య రహస్యాల్ని పరిశోధకులు తెలుసుకున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం.
ఫాలో అయిపోదాం.
మంచి ఆరోగ్యానికి 12 సూత్రాలు :

#జంక్_ఫుడ్‌కి_చెక్ :
ఇది చాలా మందికి నచ్చని టిప్. ఎందుకంటే... ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్ల వంటివి తినడం కామనైపోతోంది. ఇంట్లో వండుకునే వీలు లేక చాలా మంది ఇలాంటి ఫుడ్‌కి అలవాటుపడిపోతున్నారు. బట్... ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదు. జంక్ ఫుడ్ బదులు... పండ్లు, కేరట్ల వంటి కూరగాయలు, వేరు శనగ లాంటి పప్పులు తింటే ఎంతో మంచిది.

#వ్యాయామం_మస్ట్ : టైముకి తినడం, టైముకి పడుకోవడం ఎంత ముఖ్యమో... బాడీని ఫిట్‌గా ఉంచుకోవడమూ అంతే ముఖ్యం. ఎక్సర్‌సైజ్ చేస్తే... శరీరంలో వృథాగా ఉన్న కొవ్వు కరుగుతుంది. బాడీలో వివిధ పార్టులు ఎంత సైజులో ఉండాలో అంత సైజుకి వచ్చేస్తాయి. అదే ఎక్సర్‌సైజ్ చెయ్యకపోతే... కొన్ని శరీర భాగాలు కొవ్వు పేరుకొని అదనంగా పెరిగి... అనారోగ్యాలకు కారణమవుతాయి. నడక, పరుగు, స్విమ్మింగ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ స్ట్రెస్ పోగొట్టి ఫిట్ నెస్ పెంచుతాయి.

#సరిపడా_నిద్ర : మనందరం బాగా కష్టపడతాం. కానీ సరిగా నిద్రపోం. నిజానికి రాత్రి 8 గంటలకే పడుకొని... ఉదయం 4 గంటలకు లేవడం సరైన పద్ధతి. కానీ...
ఈ రోజుల్లో చాలా మంది రాత్రి 12కి పడుకొని...
తెల్లారి 6 గంటలకల్లా లేచిపోతున్నారు. రోజూ అదే సమయం కాకుండా వేర్వేరు టైమ్స్‌లో పడుకుంటున్నారు.
ఇవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. రోజుకు కనీసం 7 గంటలు పడుకోవాలి. 8 గంటలు పడుకుంటే ఇంకా బెటర్. నిద్ర సరిగా లేకపోతే బుర్ర హీటెక్కిపోతుంది. మతిమరపు మొదలవుతుంది. ఇర్రిటేషన్ వస్తుంది. బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి, షుగర్ వ్యాధి వస్తుంది. హార్మోన్లు దెబ్బతిని అడ్డమైన రోగాలూ వస్తాయి. అన్నింటికీ చెక్ పెట్టాలంటే చక్కగా నిద్రపోవాలి.

#కాఫీ_తాగండి : చాలా మంది కాఫీ తాగడాన్ని ప్రమాదకరంగా భావిస్తారు. ఎందుకంటే అందులో కెఫైన్ ఉంటుంది కాబట్టి. బట్... రోజుకు రెండు కాఫీలు తాగితే ఆరోగ్యానికి చెడు కంటే మేలే ఎక్కువ జరుగుతుందని పరిశోధనలు తేల్చాయి. ప్రధానంగా టైప్ 2 డయాబెటిస్, మతిమరపు, అల్జీమర్స్ వంటి రోగాలకు చెక్ పెట్టాలంటే కాఫీ తాగాలి. బాడీ హైడ్రేటెడ్‌గా ఉండేందుకు కూడా కాఫీ పనిచేస్తుంది.

#పొగ_తాగరాదు : ఎంత మంది ఎన్నిసార్లు చెప్పినా... చాలా మంది స్మోకింగ్ మాత్రం వదల్లేరు. కొన్ని రోజులు మానేసినా... మళ్లీ మనసు పీకేస్తోంది అంటూ మొదలుపెట్టేస్తారు. అలాంటి వారు గట్టిగా అనుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో పొగ తాగను అని బలంగా డిసైడవ్వాలి. ఎందుకంటే... స్మోకింగ్ వల్ల అన్నీ నష్టాలే. కాన్సర్ వస్తుంది. ఊపిరి తిత్తులు పాడైపోతాయి. నోట్లో కురుపులు వస్తాయి. ఇలా చెప్పుకుంటే చాలా రోగాలు. దీనిపై డిబేట్ అనవసరం. ఆరోగ్యం కావాలంటే స్మోకింగ్ వదిలేయాల్సిందే.

#రిఫైన్డ్_ఫుడ్_వద్దు : కొన్ని ఆహార కంపెనీలు ప్రాసెస్ చేసిన ఫుడ్ అమ్ముతాయి. రిఫైన్డ్ కార్బొహైడ్రేడ్స్ తయారుచేస్తాయి. అలాంటివి తినే బదులు... ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్ బాగా ఉండేవి తినాలి. అంటే చేపలు, గుడ్లు తినవచ్చు. శాఖాహారులైతే ఆవకాడో, క్యారెట్లు, పాలకూర వంటివి తినవచ్చు. బెర్రీస్, కమలాలు, దానిమ్మకాయలు అలాంటి పండ్లు తింటే ఆరోగ్యమే ఆరోగ్యం.

#సుగంధ_ద్రవ్యాలు_వాడాలి : మన అదృష్టమేంటంటే... మన ఇండియాలో... సుగంధ ద్రవ్యాలు చాలా ఎక్కువ. ఆ స్పైసెస్‌లో మంచి రుచి మాత్రమే కాదు... ఆరోగ్యాన్ని కాపాడే చాలా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. సూక్ష్మక్రిములతో అవి పోరాడతాయి. అందువల్ల మనం వంటల్లో తప్పనిసరిగా పసుపు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆవాలు, ధనియాలు... ఇలాంటివి తప్పనిసరిగా వాడాలి...

#ఉదయం_ఫుల్లుగా_తినాలి : బాడీకి రాత్రంతా రెస్ట్ ఇస్తాం కాబట్టి... తెల్లారే మన శరీర భాగాలన్నీ ఉత్తేజంతో ఉంటాయి. ఆ టైంలో వాటికి ఆహారం ఇస్తే... అవి బాగా పనిచేస్తాయి. అందువల్ల మార్నింగ్ వేళ లేచిన రెండు, మూడు గంటల్లో బ్రేక్ పాస్ట్ తినాలి. ఫాస్ట్‌గా కాకుండా బాగా నమిలి తినాలి. అలాగే కాస్త ఎక్కువగానే తినాలి. మధ్యా్హ్నం కాస్త తక్కువ తినాలి. రాత్రికి ఇంకా తక్కువ తినాలి. అలాగే... ఆహారంలో ఫ్రూట్స్ ఉండేలా చేసుకోవాలి. ఆహారం తినే ముందు, తర్వాత ఓ గ్లాస్ నీరు తాగడం మర్చిపోవద్దు....

#డ్రై_ఫ్రూట్స్_తప్పనిసరి : డ్రై ఫ్రూట్స్ రేటెక్కువ. వాటిని సంపన్నులే తినగలరు అని చాలా మంది అంటూ ఉంటారు. కావచ్చు గానీ... అందరూ డ్రై ఫ్రూట్స్ తింటూ ఉండాలి. గింజలు, పప్పులు, బద్దల వంటివి తినాలి. బాదం, పిస్తా, జీడిపప్పు వంటివి ఎక్కువ తినకపోయినా... వారానికి మూడుసార్లైనా అలాంటివి కొద్ది మొత్తంలో తినాలి. ఇక వేరుశనగ, బఠాణీలు, శనగలు, బీన్స్, మొక్కజొన్న ఇలాంటివి కాస్త ఎక్కువే తినవచ్చు. ఇవన్నీ మనల్ని ముసలి తనం రాకుండా కాపాడేస్తాయి...

#మంచి_కొవ్వు_కావాలి : మన బాడీలో మంచికొవ్వు, చెడ్డ కొవ్వూ రెండూ ఉంటాయి. మంచి ఆహారం తింటే మంచి కొవ్వు తయారవుతుంది. అది మనకు ఎంతో మేలు చేస్తుంది. అదే ఎక్కువగా నూనెలో వేయించిన ఫ్రైల వంటివి తింటే... చెడ్డ కొవ్వు గూడు కడుతుంది. అది చాలా డేంజరస్. దాని వల్ల సర్వ రోగాలూ వస్తాయి. చర్మం పాడవుతుంది. జుట్టు రాలిపోతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది. షుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ ఇలా ఎన్నో రోగాలు వస్తాయి. అందుకే... మనం మంచి ఆహారం తినాలి. ఎక్కువగా ఉడికించినవి తినాలి.

#అతిగా_పని_చెయ్యవద్దు : కొంతమంది పని రాక్షసుల్లా పనిచేస్తారు. పని తప్ప మరో లోకం వాళ్లకు తెలియదు. అలా ఉండకూడదు. పని టైంలో పని చెయ్యాలి. రోజులో మూడు నాలుగు గంటలు రిలాక్స్ అయ్యేందుకు కూడా వీలు కల్పించుకోవాలి. మరీ ఎక్కువ టెన్షన్లు పెట్టుకోకూడదు. మాటిమాటికీ టెన్షన్ వద్దు. కూల్ కూల్ అనుకుంటూ మనసును తేలిక చేసుకోవాలి. టీవీల్లో మొబైళ్లలో కామెడీ సీన్ల వంటివి చూడాలి. తద్వారా టెన్షన్లు కాస్త తగ్గుతాయి.

#స్వచ్ఛమైన_గాలి : ఇళ్లలో, ఆఫీసుల్లో డోర్లన్నీ మూసేసుకొని ఏసీల్లో జీవిస్తే అంతా నష్టమే. బయటి నుంచీ వచ్చే గాలిలో ఆక్సిజన్ ఎక్కువ. అది మన బ్రెయిన్‌కి చాలా అవసరం. అది అందేలా చెయ్యాలి. మొక్కలు, చెట్ల మధ్య నడవాలి. వీలైనంతవరకూ ప్రకృతిలో జీవించేందుకు ప్రయత్నించాలి. అప్పుడు ఆరోగ్యమే ఆరోగ్యం.

LUSH GREEN 4 Acr SPACIOUS CAMPUS LIMITTED SEATS ADMISSION OPEN ONLINE: https://dpsrajahmundry.unicampus.in/addenqform.aspx DELHI PUBLIC SCHOOL RAJAHMUNDRY DI...

13/09/2019
03/09/2019

ఏ.వి. కిరణ్ ఫ్రెండ్స అసోసియేషన్ ఘనంగా నిర్వహిస్తున్న గణేష్ మహోత్సవాలు గత తొమ్మిది సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ...

విద్యుత్ సంస్థలను దీవాళా తీయించి వేలకోట్ల దోపిడీ...
31/08/2019

విద్యుత్ సంస్థలను దీవాళా తీయించి వేలకోట్ల దోపిడీ...

విద్యుత్ సంస్థలను దీవాళా తీయించి వేలకోట్ల దోపిడీ.. SUBSCRIBE US FOR MORE VIDEOS @ https://www.youtube.com/c/VSBNEWSTelugu SUBSCRIBE US FOR MORE VIDEOS @ http...

25/08/2019

ఆర్ ఆర్ డిస్ట్రిక్ట్ నాగోల్ వినాయకుల తయార్ చేసినవాళ్లు రాహుల్ కళాకార్ , కళాకారులు. నాగేష్ , చైతన్య వినాయకుడు అన్...

https://youtu.be/UYJZVkDCmKw
23/08/2019

https://youtu.be/UYJZVkDCmKw

సనాతన భారతీయ ధర్మంలో గోవుకు ఒక విశిష్టమైన స్థానం ఉంది.సాక్షాత్తూ భగవంతుడైన శ్రీకృష్ణుడు (గవామ్ మధ్యే వసామ్యహం)...

12/08/2019

ముస్లిం సోదరులకు సోదరీమణులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి మరియు బత్తుల మల్ల...

12/08/2019

సికింద్రాబాద్ కంటోన్మెంట్ రెండో వార్డు పరిధి అన్నా నగర్ మహంకాళి బోనాల జాతర కృష్ణయ్య ముదిరాజ్ పలారం బండి ఊరేగి....

Address

Rajahmundry

Alerts

Be the first to know and let us send you an email when Vsb ప్రాణదాత posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share