3D astrology tutorials

3D astrology tutorials it is only astro tutorials .it is containg 3 systems in astrology,1.parashara,2.jaimini,3. Krishnamu

07/12/2025

good after noon friends. ఈ మధ్య నాకు బాగా అలవాటైన ఫోన్ పాడైపోయింది.వేరే phone లో sim వేశాను. పోస్టింగ్స్ కొంచెం ఇబ్బంది గా ఉంది. త్వరలో ఒక మంచి ఫోన్ తీసుకుని కంటిన్యూ చేస్తాను.

08/01/2024

08/01/2024
08/01/2024
08/01/2024

జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి (మే 20, 1894 – జనవరి 8, 1994) కంచి కామకోటి పీఠము యొక్క జగద్గురు పరంపరలో 68వ వారు. వారు పరమాచార్య, మహాస్వామి మున్నగు పేర్లతో కూడా పిలవబడతారు. ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక అంటారు స్వామి. స్వామి సంకల్పబలంతో ఇది ఫలానా సమయానికి పూర్తి కావాలంటే అయి తీరాల్సిందే. ఒక ధర్మం శక్తి ఆ ధర్మానికి చెందిన వ్యక్తులసంఖ్యపై గాక దాన్ని ఆచరించే వారి స్వభావంపై ఆధారపడి ఉంటుందంటారు స్వామి.

జీవిత విశేషాలు
కంచి మహాస్వామిగా పేరుగాంచిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు మే, 20,1894 వ సంవత్సరములో దక్షిణ తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని విల్లుపురం గ్రామమునందు ఒక స్మార్త హొయసల కర్నాటక బ్రాహ్మణ కుటుంబములో మే 20, 1894 నాడు అనూరాధ నక్షత్రములో (చాంద్రమాసానుసారము) జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి మహాలక్ష్మీ, శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గార్లు. వారికి చిన్నతనములో పెట్టబడిన పేరు స్వామినాథన్. జిల్లా విద్యాధికారిగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రిగారికి వారు రెండవ అబ్బాయి. వారి ఇలవేల్పు, కుంబకోణము దగ్గర్లోనున్న స్వామిమలై ఆలయము ప్రధాన దేవత ఐన స్వామినాథుని పేరు మీదుగా బాలుడికి స్వామినాథన్ అని నామకరణము చేసారు. స్వామినాథన్ దిండివనములో తన తండ్రి పనిచేస్తున్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం ఆరంభించారు. వారు చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకుని పలు పాఠ్యాంశాలలో రాణించారు. వారికి 1905లో ఉపనయనము జరిగింది. శివన్ సర్ గా పేరొందిన సదాశివ శాస్త్రిగారు స్వామినాథన్ కి అనుజులు. ఆబాలుడు 13వ ఏటనే సన్యాసదీక్ష పుచ్చుకొని కంచి కామ కోటి పీఠం అధిష్టించాడు. చంద్రశేఖ రేంద్ర స్వామి కేవలం పీఠాధిపతులే కారు. వారిలో ఒక రాజకీయవేత్త, చారిత్రక పరిశోధకుడు, ఒక శాస్త్రపరిశోధ కుడు, జ్యోతిశ్శాస్త్రవేత్తను, ఆధ్యాత్మిక తరంగాన్ని ఇలా ఒకటేమిటి ఎందరినో దర్శించవచ్చు. ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభాసామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితం అద్భుతం, అనితర సాధ్యం. నిండు నూరేళ్ళు విలక్షణమైన జీవితాన్ని గడిపి, పాదచారియై దేశమంతా సంచరిస్తూ ధర్మప్రభోదాలు సలిపి, అనేక దివ్యశక్తులు ప్రదర్శిస్తూ, సనాతన ధర్మపునరుద్ధరణకై జీవితాన్ని అంకితం చేసుకున్న మహాపురుషులు స్వామి. ఈయన 'నడిచే దేవుడి' గా ప్రసిద్ధికెక్కాడు.

కంచి పీఠాధిపతులుగా
పూర్వాశ్రమంలో స్వామినాథ అనే పేరుతో పిలవబడే వారు. స్వామికి 1905 వ సంవత్శరములో ఉపనయనము జరిగింది. ఫిబ్రవరి 13, 1907 వ సంవత్సరములో స్వామి కంచి పీఠానికి 68 వ పీఠాధిపతిగా నియమించబడ్డారు.

జయ జయ శంకర హర హర శంకర
జయ జయ శంకర హర హర శంకర

08/01/2024

నడిచే దేవుడు, జగద్గురువులు, ప్రాతః స్మరణీయులు కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని కన్న పుణ్యదంపతులు

తల్లి గారు : శ్రీమతి మహా లక్ష్మి గారు
తండ్రి గారు : శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు

అందరం "జయ జయ శంకర హర హర శంకర " అని వ్రాసి స్వామి వారి అనుగ్రహం పొందుదాం

జయ జయ శంకర
హర హర శంకర

07/01/2024

శ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ మహాస్వామి వారి ఆరాధనోత్సవము సందర్భముగా రేపు (08/01/2024) భక్తులందరూ పఠించుకొనుటకు వీలుగా అందించబడుతున్నది...

శ్రీ జగద్గురు కాంచీ కామకోటి పీఠాధీశ్వర శ్రీమచ్చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ భగవత్పాదాష్టోత్తర శతనామావళిః

1. శ్రీ చన్ద్రశేఖరేంద్రాస్మదాచార్యాయ నమో నమః
2. శ్రీ చంద్రమౌళి పాదాబ్జ మధుపాయ నమో నమః
3. ఆచార్య పాదాధిష్ఠానాభిషిక్తాయ నమో నమః
4. సర్వజ్ఞాచార్య భగవత్స్వరూపాయ నమో నమః
5. అష్టాంగయోగ నిష్ఠాది గరిష్ఠాయ నమో నమః
6. సనకాది మహాయోగి సదృశాయ నమో నమః
7. మహాదేవేంద్ర హస్తాబ్జ సంజాతాయ నమో నమః
8. మహాయోగీంద్ర సంవేద్య మహత్త్వాయ నమో నమః
9. కామకోటి మహాపీఠాధీశ్వరాయ నమో నమః
10. కలిదోష నివృత్తేక కారణాయ నమో నమః
11. శ్రీ శంకర పదాంభోజ చిన్తనాయ నమో నమః
12. భారతీ కృత జిహ్వాగ్ర నర్తనాయ నమో నమః
13. కరుణారస కల్లోల కటాక్షాయ నమో నమః
14. కాన్తి నిర్జిత సూర్యేందు కమ్రాభాయ నమో నమః
15. అమన్దానందకృన్మంద గమనాయ నమో నమః
16. అద్వైతానందభరిత చిద్రూపాయ నమో నమః
17. కటీతటలసచ్చారు కాషాయాయ నమో నమః
18. కటాక్షమాత్ర మోక్షేఛ్ఛా జనకాయ నమో నమః
19. బాహుదండ లసద్దండ భాసురాయ నమో నమః
20. ఫాలభాగ లస్త్భూతి భూషితాయ నమో నమః
21. దరహాస స్ఫుర ద్దివ్య ముఖాబ్జాయ నమో నమః
22. సుధామధుర సౌహార్ద భాషణాయ నమో నమః
23. తపనీయ తిరస్కారి శరీరాయ నమో నమః
24. తపః ప్రభా విరాజత్త్వక్తాదృశాయ నమో నమః
25. సంగీతానంద సందోహ సర్వస్వాయ నమో నమః
26. సంసారాంబుధి నిర్మగ్న తారకాయ నమో నమః
27. మస్తకోల్లాసి రుద్రాక్ష మకుటాయ నమో నమః
28. సాక్షాత్పర శివామోఘ దర్శనాయ నమో నమః
29. చక్షుర్గత మహాతేజోత్యుజ్వలాయ నమో నమః
30. సాక్షాత్కృత జగన్మాతృ స్వరూపాయ నమో నమః
31. క్వచిత్బాల జనాత్యన్త సులభాయ నమో నమః
32. క్వచిన్మహాజనాత్యంత దుష్ప్రాపాయ నమో నమః
33. గోబ్రాహ్మణ హితాసక్త మానసాయ నమో నమః
34. గురుమండల సంభావ్య విదేహాయ నమో నమః
35. భావనామాత్ర సంతుష్ట హృదయాయ నమో నమః
36. భావ్యాది భావ్య దివ్య శ్రీపదాబ్జాయ నమో నమః
37. వ్యక్తావ్యక్త తరానేక చిత్కళాయ నమో నమః
38. రక్త శుక్ల ప్రభామిశ్ర పాదుకాయ నమో నమః
39. భక్త మానస రాజీవ భవనాయ నమో నమః
40. భక్త లోచన రాజీవ భాస్కరాయ నమో నమః
41. భక్త కామలతా కల్ప పాదపాయ నమో నమః
42. భక్తి ముక్తి ప్రదానేక శక్తిదాయ నమో నమః
43. శరణాగత దీనార్త రక్షకాయ నమో నమః
44. శమాది షట్క సంపత్ప్రదాయకాయ నమో నమః
45. సర్వదా సర్వధా లోక సౌఖ్యదాయ నమో నమః
46. సదా నవనవాకాంక్ష్య దర్శనాయ నమో నమః
47. సర్వ హృత్పద్మ సంచార నిపుణాయ నమో నమః
48. సర్వేంగిత పరిజ్ఞాన సమర్థాయ నమో నమః
49. స్వప్న దర్శన భక్తేష్ట సిధ్ధిదాయ నమో నమః
50. సర్వ వస్తు విభావ్యాత్మ సద్రూపాయ నమో నమః
51. దీన భక్తావనైకాంత దీక్షితాయ నమో నమః
52. జ్ఞానయోగ బలైశ్వర్య మానితాయ నమో నమః
53. భావ మాధుర్య కలిత భావాఢ్యాయ నమో నమః
54. సర్వభూత గణామేయ సౌహార్దాయ నమో నమః
55. మూకీభూతానేక లోక వాక్ప్రదాయ నమో నమః
56. శీతలీకృత హృత్తాప సంసేవ్యాయ నమో నమః
57. భోగ మోక్ష ప్రదానేక యోగజ్ఞాయ నమో నమః
58. శ్రీఘ్ర సిధ్ధి కరానేక శిక్షణాయ నమో నమః
59. అమానిత్వాది ముఖ్యార్ధ సిధ్ధిదాయ నమో నమః
60. అఖండైక రసానంద ప్రబోధాయ నమో నమః
61. నిత్యానిత్య వివేక ప్రదాయకాయ నమో నమః
62. ప్రత్యగేకరసాఖండ చిత్సుఖాయ నమో నమః
63. ఇహాముత్రార్ధ వైరాగ్య సిధ్ధిదాయ నమో నమః
64. మహామోహ నివృత్యర్థ మంత్రదాయ నమో నమః
65. క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రత్యేక దృష్టిదాయ నమో నమః
66. క్షయవృధ్ధి విహీనాత్మ సౌఖ్యదాయ నమో నమః
67. తూలాజ్ఞాన విహీనాత్మ తృప్తిదాయ నమో నమః
68. మూలాజ్ఞానా బాధితాత్మ ముక్తిదాయ నమో నమః
69. భ్రాంతి మేఘోచ్చాటన ప్రభంజనాయ నమో నమః
70. శాంతి వృష్టి ప్రదామోఘ జలదాయ నమో నమః
71. ఏక కాలకృతానేక దర్శనాయ నమో నమః
72. ఏకాంత భక్తి సంవేద్య స్వభావాయ నమో నమః
73. శ్రీచక్ర రథ నిర్మాణ సుప్రధాయ నమో నమః
74. శ్రీ కళ్యాణతరామేయ సుశ్లోకాయ నమో నమః
75. ఆశ్రితాశ్రయణీయత్వ ప్రాపకాయ నమో నమః
76. అఖిలాండేశ్వరీ కర్ణ భూషాదాత్రే నమో నమః
77. సశిష్యగణ యాత్రా విధాయకాయ నమో నమః
78. సాధుసంఘ నుతామేయ చరణాయ నమో నమః
79. అభిన్నాత్మైక్య విజ్ఞాన బోధకాయ నమో నమః
80. భిన్న భిన్న మతైశ్చాభి పూజితాయ నమో నమః
81. తత్తద్విపాక సద్బోధ దాయకాయ నమో నమః
82. తత్తద్భాషా ప్రకటిత స్వబోధాయ నమో నమః
83. సర్వత్ర సాధితానేక సత్కార్యాయ నమో నమః
84. చిత్ర చిత్ర ప్రభావాతి ప్రసిధ్ధాయ నమో నమః
85. లోకానుగ్రహ కృత్కర్మ నిష్ఠితాయ నమో నమః
86. లోకోధ్ధరణ కృద్భూరి నియమాయ నమో నమః
87. సర్వ వేదాంత సిధ్ధాంత సమ్మతాయ నమో నమః
88. కర్మ బ్రహ్మాత్మ యోగాది మర్మజ్ఞాయ నమో నమః
89. వర్ణాశ్రమ సదాచార రక్షకాయ నమో నమః
90. ధర్మార్ధ కామ మోక్ష ప్రదాయకాయ నమో నమః
91. పద వాక్య ప్రమాణాది పారీణాయ నమో నమః
92. పాదమూల నతానేక పండితాయ నమో నమః
93. వేదసారార్థ సద్గోష్ఠీ లోలుపాయ నమో నమః
94. వేదశాస్త్ర పురాణాది విచారాయ నమో నమః
95. వేద వేదాంగ తత్వ ప్రబోధకాయ నమో నమః
96. వేదమార్గ ప్రమాణత్వఖ్యాపకాయ నమో నమః
97. నిర్ణిద్ర తేజోవిజిత నిద్రాద్యాయ నమో నమః
98. నిరంతర మహానంద సంపూర్ణాయ నమో నమః
99. స్వభావ మధురోదార గాంభీర్యాయ నమో నమః
100. సహజానంద సంపూర్ణ సాగరాయ నమో నమః
101. నాదబిందు కళాతీత వైభవాయ నమో నమః
102. వాది భేద విహీనాత్మ బోధనాయ నమో నమః
103. ద్వాదశాంత మహాపీఠ నిషణ్ణాయ నమో నమః
104. దేశకాలా పరిఛ్ఛిన్న దృగ్రూపాయ నమో నమః
105. నిర్మాన శాంతి మహిత నైశ్చల్యాయ నమో నమః
106. నిర్లక్ష్య లక్ష్య సంలక్ష్య నిర్లేపాయ నమో నమః
107. శ్రీ షోడశాంత కమల సుస్థితాయ నమో నమః
108. శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వత్యై నమో నమః

facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

02/01/2024

*తేదీ 01-01-2024 సోమవారం శ్రీఏడుపాయల వనదుర్గాభవాని అమ్మవారి అలంకరణ*

31/12/2023

ఓం శ్రీ గురుభ్యోనమః
*సోమవారం, జనవరి1, 2024*
*శ్రీ శోకృత్ నామ సంవత్సరం*
*దక్షిణాయనం - హేమంత ఋతువు*
*మార్గశిర మాసం - బహళ పక్షం*
తిథి : *పంచమి* మ12.17 వరకు
వారం : *సోమవారం* (ఇందువాసరే)
నక్షత్రం : *మఖ* ఉ7.17 వరకు
తదుపరి పుబ్బ
యోగం : *ఆయుష్మాన్* తె3.36 వరకు
కరణం : *తైతుల* మ12.17 వరకు
తదుపరి *గరజి* రా1.24 వరకు
వర్జ్యం : *సా4 09 - 5.55*
దుర్ముహూర్తము : *మ12.24 - 1.08* &
*మ2.36 - 3.20*
అమృతకాలం : *రా2.48 - 4.34*
రాహుకాలం : *ఉ7.30 - 9.00*
యమగండ/కేతుకాలం : *ఉ10.30 - 12.00*
సూర్యరాశి: *ధనుస్సు* || చంద్రరాశి: *సింహం*
సూర్యోదయం: *6.34* ॥ సూర్యాస్తమయం: *5.32*
*ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు*
*Wish You A Happy New Year*
*సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు*
*_గోమాతను పూజించండి_*
*_గోమాతను సంరక్షించండి_*

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

Address

Syamala Nagar
Rajahmundry

Telephone

+918247258828

Website

Alerts

Be the first to know and let us send you an email when 3D astrology tutorials posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category