25/09/2026
ప్రజా గ్రీవెన్స్లో వచ్చిన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి
ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
ప్రజల నుంచి 22 సమస్యలపై అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి
పుట్టపర్తి: 25
ప్రజా గ్రీవెన్స్లో వచ్చిన ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన 22 అర్జీలను ప్రజల నుంచి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి లు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా, వాటిని సావధానంగా విని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రధానంగా రెవెన్యూ, తాగునీరు, రహదారులు, విద్యుత్, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర అంశాలకు సంబంధించిన అర్జీలు ప్రజల నుంచి వచ్చినట్లు తెలిపారు.
ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు చొరవ చూపాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి అర్జీని పరిశీలించి, సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను అర్జీదారులకు తెలియజేయాలని అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల నుంచి వచ్చిన ప్రతి విజ్ఞప్తిని బాధ్యతగా తీసుకుని సకాలంలో పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా తమ సమస్యలను పరిష్కరించేందుకు స్పందించిన ఎమ్మెల్యే, మాజీ మంత్రికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గ అధికారులు , కూటమి ప్రజా ప్రతినిధులు,ప్రజలు పాల్గొన్నారు.