Z.P High School Simhradpuram

Z.P High School Simhradpuram Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Z.P High School Simhradpuram, School, zphigh school, Pulivendla.

సింహాద్రిపురం జెడ్‌పీ హైస్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయునికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుసింహాద్రిపురం :సింహాద్రిపురం జిల్లా పరిష...
05/09/2025

సింహాద్రిపురం జెడ్‌పీ హైస్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయునికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

సింహాద్రిపురం :
సింహాద్రిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల భాష ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న *పోచంరెడ్డి పద్మనాభరెడ్డి* గారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. విద్యారంగ అభివృద్ధికి చేసిన కృషి, పదవ తరగతి ఫలితాల్లో సాధించిన విశిష్ట విజయాలు, ఆధునిక లాంగ్వేజ్ ల్యాబ్ ఏర్పాటు, పాఠశాలలో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి సేవలను గుర్తించిన కడప జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయనను సన్మానించారు.

ఈ అవార్డును జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్‌.పీ గారు ప్రత్యేక కార్యక్రమంలో బహుకరించారు.

ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు రవీంద్ర, జయప్రకాశ్ రెడ్డి, సూర్యచంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ ఘనత సింహాద్రిపురం పాఠశాలకు గర్వకారణమని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.

09/07/2025

మెగా PTM

*మెగా PTM  ఆహ్వాన సందేశం*జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(కామన్ మాన్ కార్పొరేట్ స్కూల్)సింహాద్రిపురం – 516454📅 తేదీ: 10-07-202...
09/07/2025

*మెగా PTM ఆహ్వాన సందేశం*

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
(కామన్ మాన్ కార్పొరేట్ స్కూల్)
సింహాద్రిపురం – 516454

📅 తేదీ: 10-07-2025
🕘 సమయం: ఉదయం 9:00 గంటలకు
📍 స్థలం: పాఠశాల ప్రాంగణం, సింహాద్రిపురం

శుభ ఆహ్వానం – మెగా పిటిఎం 2.0

గౌరవనీయ తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థులు మరియు గ్రామ ప్రముఖులుకు,

*విద్యార్థి వికాసం కోసం మనం కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉన్న ఈ సమయంలో, మీ అమూల్యమైన సలహాలు, సూచనల కోసం నిర్వహిస్తున్న మెగా పిటిఎం 2.0 కార్యక్రమానికి హాజరై దీవెనలందించవలసిందిగా మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాము.*

ఈ కార్యక్రమంలో మీరు చూడబోయే ముఖ్యాంశాలు:

🎓 విద్యార్థుల ప్రతిభ ప్రదర్శన
🏆 ప్రోత్సాహక బహుమతుల అందజేత
🧑‍🏫 తల్లిదండ్రులకు ఉపాధ్యాయులతో ప్రత్యక్ష చర్చ
📊 పాఠశాల అభివృద్ధి నివేదిక
🎭 విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
📸 స్కూల్ ఫెసిలిటీస్ & ప్రయోగశాలల ప్రదర్శన

ప్రజల పాఠశాల – కార్పొరేట్ ప్రమాణాలతో

👉 భాషా ప్రయోగశాల
👉 సైన్స్, మ్యాథ్స్ ల్యాబ్‌లు
👉 IFP డిజిటల్ ప్యానెల్స్
👉 CCTV భద్రత
👉 ఐఐఐటీ, ఎన్ఎంఎంఎస్ శిక్షణ
👉 గ్రంధాలయం

ఈ కార్యక్రమానికి మేము ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాము.
మీ సమయాన్ని కేటాయించి విద్యార్థుల భవిష్యత్తుకు మీ మద్దతు తెలియజేయండి.

మీ సేవలో,
శ్రీ సతీష్ ప్రభు కుమార్
హెడ్ మాస్టర్
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
సింహాద్రిపురం – 516454

03/07/2025
14/04/2025
*Gratitude to OVR Family & Hemalatha Ma’am’s Family for Their Generous Support*Dear all,*Yesterday, our school successfu...
16/02/2025

*Gratitude to OVR Family & Hemalatha Ma’am’s Family for Their Generous Support*

Dear all,

*Yesterday, our school successfully hosted two important programs—the Inspector Sir Students' Awareness Meeting on Child Marriages and the Cluster Complex Meeting.* These programs were a great success, and we owe our sincere thanks to our generous donors.

*The meeting hall, made possible through kind donations, was extremely useful for these events.* We extend our heartfelt gratitude to the OVR family and Hemalatha Ma’am’s family for their invaluable support.

*A special appreciation goes to Hemalatha Ma’am, who not only contributed personally but also reached out to many former students, inspiring them to donate.* Her efforts greatly contributed to the success of these programs.

We sincerely thank Hemalatha Ma’am, the OVR family, and all the donors for their kindness and commitment to the well-being of our students.

With gratitude,
Y. Jayaprakash Reddy

16/02/2025

*మోడ్రన్ లైబ్రరీ అనే నా ఆలోచనకు అద్భుతమైన రూపం మరియు అంతర్జాతీయ ప్రమాణాలు తెచ్చిన దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు.*

విద్యార్థుల ఆలోచనలను విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు, వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు గ్రంథాలయాలు కీలకమైన సాధనాలు. ఈ లక్ష్యంతోనే మేము మోడ్రన్ లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ అద్భుతమైన గ్రంథాలయం అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందేందుకు కీలకంగా వ్యవహరించిన పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అభివృద్ధికి కొత్త మార్గాలను సూచించే ఓ వెలుగు నిలయంగా ఈ లైబ్రరీ విద్యార్థులకు మారాలి.

*"పుస్తకాలను చదవడం వల్ల మానవుడికి అందే జ్ఞానం, ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తిని పెంచుతుంది." – అబ్దుల్ కలాం*

స్కూల్ ప్లానింగ్‌లో ఈ హాల్‌ను డైనింగ్ హాల్ గా ఉపయోగించాలని భావించారు. అయితే, తరగతుల మధ్య డైనింగ్ హాల్ ఉంచడం వల్ల కలిగే అసౌకర్యాన్ని అహోబిలాపురం ఉన్నత పాఠశాలలో గమనించి, విద్యార్థుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని కిచెన్ షెడ్ మరియు డైనింగ్ హాల్‌ను ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి ప్రభాకర్ రెడ్డి అన్నకు చేసాను.

ఈ నిర్ణయం వల్ల, ఈ రోజు మేము అద్భుతమైన మోడ్రన్ లైబ్రరీ ఏర్పాటు చేయగలిగాము. ఇది విద్యార్థులకు కొత్త ఆశయాలను, ఆలోచనలను పంచే వేదికగా నిలుస్తుంది.

సహాయ సహకారాలు అందించినవారికి ప్రత్యేక ధన్యవాదాలు

ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయ సహకారాలు అందించిన *చారగుండల లక్ష్మీ నారాయణ* గారికి మరియు *వెన్నపూస సుజాత గారికి* మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

అలాగే, గ్రంథాలయానికి అవసరమైన ముఖ్యమైన పుస్తకాలు, "The Hindu Young World" మేగజైన్, "The Indian Express" పత్రిక, "Kids National Geographic" మేగజైన్ అందించిన *రఘురామిరెడ్డి శశికళ గార్లాకు* మా ప్రత్యేక ధన్యవాదాలు.

*"ఒక మంచి పుస్తకం వందమంది గురువుల జ్ఞానాన్ని అందించగలదు." – రాజారామ్మోహన్ రాయ్*

ఈ మోడ్రన్ లైబ్రరీ పిల్లలకు, ఉపాధ్యాయులకు, పుస్తకాల ప్రేమికులకు ఒక అద్భుతమైన జ్ఞాన కేంద్రంగా మారాలి.

*"గ్రంథాలయం అనేది భవిష్యత్తుకు తలుపులుగా, జ్ఞానాన్ని అందించే ధారగా నిలుస్తుంది." – సర్వేపల్లి రాధాకృష్ణన్*

ఈ గ్రంథాలయం విద్యార్థులకు కొత్త ఆలోచనలు అందించాలి, పరిశోధనా మేధస్సును పెంపొందించాలి. తరతరాలకు ఇది జ్ఞాన కాంతిగా మారాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.

ఈ ప్రయాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు!

*"గ్రంథాలయం అనేది ఒక గొప్ప విద్యాలయము. అక్కడ పుస్తకాలే గురువులు, అవే మార్గదర్శకాలు." – డా. బి. ఆర్. అంబేద్కర్*

- వై. జయప్రకాశ్ రెడ్డి

*A Proud Moment on My Daughter Dharmika Sri Sai’s Birthday*As a father, today is a very special and proud moment for me....
16/02/2025

*A Proud Moment on My Daughter Dharmika Sri Sai’s Birthday*

As a father, today is a very special and proud moment for me. *On the occasion of my beloved daughter Dharmika Sri Sai’s birthday, she has chosen to celebrate in a truly meaningful way.* With her own pocket money, she has donated a Champak Hindi magazine subscription to the Z.P.H. School, Simhadripuram Library.

Her thoughtful gesture reflects her deep love for education and her desire to contribute to the learning journey of other students. It fills my heart with joy to see her understand the importance of sharing knowledge at such a young age.

This act holds even greater significance for me as I serve as an S.A. Hindi Teacher in the same school. Seeing my daughter support the school’s library and encourage reading among students makes me extremely proud. I believe that small acts of kindness like this can make a big difference in shaping young minds.

On this special day, I pray that Dharmika is blessed with happiness, success, and wisdom in all that she does. May she continue to grow with the same compassion and generosity in her heart.

*Happy Birthday, Dharmika Sri Sai!*

With love and pride,
Y. Jayaprakash Reddy
S.A. Hindi Teacher,
Z.P.H. School, Simhadripuram

*సింహాద్రిపురం ఉన్నత పాఠశాలలో లాంగ్వేజ్ ల్యాబ్ విద్యా వాలంటరీ ఖర్చును భరించనున్న పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాని...
16/02/2025

*సింహాద్రిపురం ఉన్నత పాఠశాలలో లాంగ్వేజ్ ల్యాబ్ విద్యా వాలంటరీ ఖర్చును భరించనున్న పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు*

సింహాద్రిపురం జెడ్పి ఉన్నత పాఠశాలలో లాంగ్వేజ్ ల్యాబ్ నిర్వహణ కోసం విద్యా వాలంటరీ నియామకానికి అవసరమైన ఖర్చును పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం భరించడానికి ముందుకు వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

*ప్రతీ విద్యార్థి ఇంగ్లీష్, హిందీ వంటి భాషల్లో మెళకువలు నేర్చుకుని సంబంధిత కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపర్చుకోవడం లక్ష్యంగా ఈ ల్యాబ్ ఏర్పాటు చేయబడింది. ఈ అవకాశాన్ని అందించడానికి పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోడలు శ్రీమతి లక్ష్మీ విభ గారి జన్మదిన శుభ సందర్భంగా తాము ముందుకు రావడం ఎంతో సంతోషకరమైన విషయం.*

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, స్కూల్ డెవలప్‌మెంట్ కమిటీ తరఫున పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీ సేవా భావం మరెందరికైనా స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

- స్కూల్ డెవలప్‌మెంట్ కమిటీ
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సింహాద్రిపురం.

*ప్రకటన*సింహాద్రిపురం ఉన్నత పాఠశాలలో వాలంటీర్ అవసరంసింహాద్రిపురం జెడ్పి ఉన్నత పాఠశాలలో వాలంటీర్‌గా సేవలు అందించేందుకు ఆస...
16/02/2025

*ప్రకటన*

సింహాద్రిపురం ఉన్నత పాఠశాలలో వాలంటీర్ అవసరం

సింహాద్రిపురం జెడ్పి ఉన్నత పాఠశాలలో వాలంటీర్‌గా సేవలు అందించేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరబడుచున్నవి.

అర్హతలు:
✅ బోధనపై ఆసక్తి ఉండాలి.
✅ ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
✅ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
✅ సేవా స్పూర్తి కలిగిన వారు ఉండాలి.

ప్రాధాన్యత:
➡️ సింహాద్రిపురం మరియు పరిసర గ్రామాలకు చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
➡️ వికలాంగులు మరియు మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత.

దరఖాస్తు విధానం:
👉 ఆసక్తి గల అభ్యర్థులు తమ Resume ను క్రింది నెంబర్‌కి లేదా మెయిల్ కు పంపగలరు:
📞 8978011171
✉️ [email protected]

స్కూల్ డెవలప్మెంట్ కమిటీ,
జెడ్పి ఉన్నత పాఠశాల, సింహాద్రిపురం.

Address

Zphigh School
Pulivendla
516454

Telephone

+918978011171

Website

Alerts

Be the first to know and let us send you an email when Z.P High School Simhradpuram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category