Nandischool

Directions Website Contact the school

Nandischool Nandi School
Sponsored by The Pedanandipadu Educational Development Society. Pedanandipadu.,Guntu

13/09/2026
Teachers' Day Celebrated Grandly at Pedanandipadu Nandi School  on 05-9-2026.*Pedanandipadu, Guntur District:* Teachers'...
07/09/2026

Teachers' Day Celebrated Grandly at Pedanandipadu Nandi School on 05-9-2026.

*Pedanandipadu, Guntur District:* Teachers' Day was celebrated in a grand manner by the *Pedanandipadu Educational Development Society (PEDS)* at the PAS College and Nandi School Auditorium.

The function was presided over by the Society President, *Sri K. Satyanarayana, Addl. SP (Retd).*

The Chief Guest was *Sri Gali Lenin, Chief Digital and Business Officer at Atomicwork and Founder of Global CIO Circle, USA (California).*

Addressing the students and teachers, Sri Gali Lenin appreciated the Management, Headmaster Sri Satyanarayana and the teachers of Nandi School for their dedication and for maintaining high standards. He specially congratulated them for achieving *100% results since 2013.*

On this occasion, Society President Sri K. Satyanarayana felicitated all the teachers for their selfless service.

The Chief Guest felicitated the Headmaster and the students.

*Former ETV News Reader Smt. Gali Pragathi,* Committee Members of PEDS and many others attended the programme and made it a grand success.

---

*పెదనందిపాడులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు*

పెదనందిపాడు ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ సొసైటీ (PEDS) ఆధ్వర్యంలో PAS కాలేజీ మరియు నంది స్కూల్ ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

సొసైటీ అధ్యక్షులు *శ్రీ కె. సత్యనారాయణ, http://Addl.SP (Retd)* గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

అమెరికా (కాలిఫోర్నియా) నుండి విచ్చేసిన *శ్రీ గాలీ లెనిన్, చీఫ్ డిజిటల్ అండ్ బిజినెస్ ఆఫీసర్, Atomicwork, ఫౌండర్ - గ్లోబల్ CIO సర్కిల్, USA* గారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. 2013 నుండి నంది స్కూల్ *100% ఫలితాలు* సాధిస్తున్నందుకు మేనేజ్‌మెంట్‌ను, హెడ్ మాస్టర్ శ్రీ సత్యనారాయణ గారిని, ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

సొసైటీ అధ్యక్షులు ఉపాధ్యాయులను సన్మానించారు. ముఖ్య అతిథి హెడ్ మాస్టర్‌ను, విద్యార్థులను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో *మాజీ ETV న్యూస్ రీడర్ శ్రీమతి గాలీ ప్రగతి గారు,* కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

01/09/2026

🌸 “అచ్చుల పలుకుల్లో… తేనెలొలికే తెలుగు మాధుర్యం!” 🌸
🌸✨ అచ్చులే మన తెలుగు భాషకు ఆభరణాలు…! ✨🌸

అ… ఆ… ఇ… ఈ…
ఉ… ఊ… ఎ… ఏ…
ఐ… ఒ… ఓ… ఔ… అం… 🎶

అక్షరం అక్షరంగా పలికితే…
అది ఓ మధుర గానం… 🎵
పదం పదంగా వినిపిస్తే…
అది ఓ తీయని తేనె జల్లు… 🍯🌸

చిన్నారుల ముద్దుముద్దు గొంతుల్లో
తెలుగు అచ్చుల గేయం మార్మోగుతుంటే…
వారి హావభావాలు, ఆహ్లాదకరమైన ప్రదర్శన
చూసేందుకు రెండు కళ్లూ సరిపోలేదు…! 👏🏻😍

మన తెలుగు…
తేనెలొలికే భాష…
తియ్యని పలుకుల భాష…
భావాలకు ప్రాణం పోసే భాష…
మనసులను మురిపించే మాతృభాష! ❤️

🌿 తెలుగు భాష మాధుర్యమే వేరు…
తెలుగు పలుకులోని తీయదనమే వేరు…
తెలుగు అక్షరాల అందమే వేరు…! 🌿

🙏🏻💐 తెలుగు తల్లికి వందనం…
తెలుగు భాషకు అభివందనం…! 💐🙏🏻

29/08/2026
నంది పాఠశాల, పెదనందిపాడు, గుంటూరు జిల్లా – ఆంధ్రప్రదేశ్ – 522235ప్రతిష్టాత్మక ‘షైనింగ్ స్టార్స్ అవార్డు’ అందుకున్న ఎస్.ఎ...
20/07/2026

నంది పాఠశాల, పెదనందిపాడు, గుంటూరు జిల్లా – ఆంధ్రప్రదేశ్ – 522235
ప్రతిష్టాత్మక ‘షైనింగ్ స్టార్స్ అవార్డు’ అందుకున్న ఎస్.ఎస్.సి విద్యార్థి చుక్కా అభిషిఖ్త్‌కు ఘన సన్మానం

పాలకవర్గ అధ్యక్షులు శ్రీ కాళహస్తి సత్యనారాయణ గారి అభినందనలు

పెదనందిపాడు నంది పాఠశాలకు చెందిన రాజుపాలెం గ్రామ ఎస్.ఎస్.సి విద్యార్థి చుక్కా అభిషిఖ్త్ ప్రతిష్టాత్మక "షైనింగ్ స్టార్స్ అవార్డు" అందుకొని పాఠశాలకు విశిష్ట గుర్తింపు తీసుకురావడం పట్ల పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గుంటూరులోని బి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్–2025-26 ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ సి.ఎమ్. సాయి కాంత్ వర్మ గారు, ఐ.ఏ.ఎస్., అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజినేయులు గారు (రిటైర్డ్ ఐ.ఏ.ఎస్.) చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక షైనింగ్ స్టార్స్ అవార్డును చుక్కా అభిషిఖ్త్ అందుకున్నారు.

2025–26 విద్యా సంవత్సరానికి గాను నంది పాఠశాల తరఫున ఎస్.ఎస్.సి పరీక్షల్లో 590/600 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అభిషిఖ్త్ ఈ గౌరవాన్ని దక్కించుకోవడం విశేషం.

ఈ విజయాన్ని పురస్కరించుకొని పాఠశాల పాలకవర్గ అధ్యక్షులు శ్రీ కాళహస్తి సత్యనారాయణ గారు విద్యార్థి అభిషిఖ్త్‌ను ఆయన తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. విద్యార్థికి నగదు ప్రోత్సాహకం అందజేసి, భవిష్యత్తులోనూ ఇదే పట్టుదలతో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ నల్లూరి సత్యనారాయణ గారు, అధ్యాపకులు శ్రీ రామాంజినేయులు గారు, సమీపంలోని పి.ఎ.ఎస్. కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. వీర రాఘవయ్య గారు, ఫిజికల్ డైరెక్టర్ డా. పాతూరి శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొని విద్యార్థిని అభినందించారు.

అనంతరం నంది పాఠశాలలో ప్రత్యేకంగా నిర్వహించిన అభినందన సభలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సమక్షంలో చుక్కా అభిషిఖ్త్‌ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పాఠశాల సెక్రటరీ & కరస్పాండెంట్ డా. లావు రత్తయ్య గారు, ట్రెజరర్ శ్రీ లావు ఆదిశేషయ్య గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ నర్రా బాలకృష్ణ గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ మందడి చలపతిరావు గారు, పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు కుటుంబ సభ్యులు అభిషిఖ్త్‌కు హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసి, ఆయన భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.

💐 𝗢𝘂𝗿 𝗡𝗮𝗻𝗱𝗶 𝗦𝗰𝗵𝗼𝗼𝗹 𝗦𝗦𝗖 𝗦𝘁𝘂𝗱𝗲𝗻𝘁 𝗖𝗵𝘂𝗸𝗸𝗮 𝗔𝗻𝗵𝗶𝘀𝗵𝗶𝗸𝘁𝗵 𝗥𝗲𝗰𝗲𝗶𝘃𝗲𝗱 𝗦𝗵𝗶𝗻𝗶𝗻𝗴 𝗦𝘁𝗮𝗿 𝗔𝘄𝗮𝗿𝗱 𝗳𝗿𝗼𝗺 𝗛𝗼𝗻𝗮𝗿𝗮𝗯𝗹𝗲 𝗠𝗟𝗔 𝗦𝗿𝗶. 𝗕𝗼𝗼𝗿𝗹𝗮 𝗥𝘀𝗺𝗮𝗻𝗷𝗮𝗻𝗲𝘆𝘂𝗹...
20/07/2026

💐 𝗢𝘂𝗿 𝗡𝗮𝗻𝗱𝗶 𝗦𝗰𝗵𝗼𝗼𝗹 𝗦𝗦𝗖 𝗦𝘁𝘂𝗱𝗲𝗻𝘁 𝗖𝗵𝘂𝗸𝗸𝗮 𝗔𝗻𝗵𝗶𝘀𝗵𝗶𝗸𝘁𝗵 𝗥𝗲𝗰𝗲𝗶𝘃𝗲𝗱 𝗦𝗵𝗶𝗻𝗶𝗻𝗴 𝗦𝘁𝗮𝗿 𝗔𝘄𝗮𝗿𝗱 𝗳𝗿𝗼𝗺 𝗛𝗼𝗻𝗮𝗿𝗮𝗯𝗹𝗲 𝗠𝗟𝗔 𝗦𝗿𝗶. 𝗕𝗼𝗼𝗿𝗹𝗮 𝗥𝘀𝗺𝗮𝗻𝗷𝗮𝗻𝗲𝘆𝘂𝗹𝘂 𝗚𝗮𝗿𝘂., 𝗜𝗔𝗦(𝗥𝗲𝘁𝗱) & 𝗖𝗼𝗹𝗹𝗲𝗰𝘁𝗼𝗿 𝗦𝗿𝗶. 𝗖𝗠 𝗦𝗮𝗶𝗸𝗮𝗻𝘁𝗵 𝗩𝗮𝗿𝗺𝗮 𝗚𝗮𝗿𝘂.!💐

This year our school Nani School student *chukka Abhishikth* Received Shining Stars Award 2026,From Sri B.Ramanjaneyulu IAS Retd.& MLA Prathipadu,and Sri C M Saikanth Varma IAS, Collector & Dist.Magistrate Guntur,on 20-7-26,.Ch.Abhishikth secured 590 marks in 10 th class,we the Management, is feeling Happy, every year our school student receives Merit awards from Government.Since 2012 , School is securing 100% results in the 10 th class Examinations.

Regards
K.Satyanarayana
Addl.SP Retd.
President
The Pedanandipadu Educational Development Society
9848025819

Address

Nandi School Sponsored By The Pedanandipadu Educational Development Society. Pedanandipadu. , Guntur-Dt. AP
Pedanandi Padu
522235

Alerts

Be the first to know and let us send you an email when Nandischool posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Nandischool:

Shortcuts

Share

Category