PJVOC PARGI

PJVOC PARGI PJ VOCATIONAL JUNIOR COLLEGE PARGI

భూమి కోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాట్టిచెప్పి మహిళా లోకానికి స్పూర్తి...
10/09/2025

భూమి కోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాట్టిచెప్పి మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన వీరవనిత
"చాకలి ఐలమ్మ వర్ధంతి" సంధర్భంగా వారికి ఘన నివాళులు...

#చిట్యాల_ఐలమ్మ (సెప్టెంబరు 26, 1895 - సెప్టెంబర్ 10, 1985) #చాకలి_ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధెైర్యశాలి. 2022 నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది.
అగ్రకులాల స్త్రీలు, దొరసానులు తమను కూడా ‘దొరా’ అని ఉత్పత్తికులాల (బీసీ కులాల) చేత పిలుపించుకొనే సంస్కృతికి చరమగీతం పాడినవారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు. దొరా అని పిలువకపోతే ఉన్నతకులాలతో పాటు వారి అనుంగు ఉంపుడుకత్తెలలో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలలో బయటకు వచ్చేది. వెనుకబడిన కులాల మీద ఆ పీడన రూపాలు విరుచుకుపడేవి. తమను దొరా అని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి, దగ్గరుండి ఆఘాయిత్యం చేయించేవారు. ఈ భూమినాది... పండించిన పంటనాది... తీసుకెళ్లడానికి దొరెవ్వడు... నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు.. అంటూ మాటల్ని తూటాలుగా మల్చుకొని దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రెైతాంగ విప్లవాగ్ని చాకలి అయిలమ్మ.

మల్లంపల్లి మక్థెధారు ఉత్తమరాజు కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది. కొండల్ రావు తల్లి జయప్రదా దేవి ఐలమ్మకూ భూమి సాగు చేసుకునేందుకు అనుమతి ఇచింది. ఆ భూమిలో నాలుగు ఎకరాలు సాగుచేశారు. పాలకుర్తి పోలీస్ పటేల్ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు.[12] పాలకుర్తి పోలీస్ పటేల్ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది. పాలకుర్తి పట్వారీ పప్పులుడకక అయిలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రాపాక రాంచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసులో అగ్రనాయకులతో పాటు అయిలమ్మ కుటుంబాన్ని ఇరికించారు. అయినప్పటికీ న్యాయస్థానంలో తీర్పు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వచ్చింది.

అయిలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్‌ముఖ్‌,పోలీస్ పటేల్ ను పిలిపించుకొని, అయిలమ్మ కౌలుకు తీసుకున్న ఉత్తమరాజు జయప్రదా దేవి భూమిని తన పేరున రాయించుకున్నాడు. భూమి తనదని, వండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వందమందిని దేశ్‌ముఖ్‌ పంపాడు. ఆంధ్రమహాసభ కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోసారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పువచ్చింది. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్‌ముఖ్‌ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. ఐలమ్మ ఇంటిని కూడా తగులబెట్టారు. ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఐలమ్మ కుమారులు ముగ్గురు, పాలకుర్తి కమ్యునిష్టు నాయకత్వం ఇంటిని కూల్చి అదే స్ధలంలో మొక్కజొన్న పంటను పండించారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ అయిలమ్మ కుటుంబం ఎరజ్రెండాను వీడలేదు.
ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10, 1985 న అనారోగ్యంతో మరణించింది. పాలకుర్తిలో ఐలమ్మ స్మారక స్థూపం, స్మారక భవనాన్ని సిపిఎం పార్టీ వారు ప్రజల విరాళాలతో నిర్మాణం చేశారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 2015 సెప్టెంబరు 10న పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందకారత్ ఆవిష్కరించారు.










#పరిగి


ఎందుకు జూలై 11 జనాభా దినోత్సవం జరుపుకుంటారు?1987లో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్నప్పుడు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ...
11/07/2025

ఎందుకు జూలై 11 జనాభా దినోత్సవం జరుపుకుంటారు?

1987లో ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్నప్పుడు, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కుటుంబ నియంత్రణ ప్రయోజనాలు, లింగ సమానత్వం, పేదరికం, తల్లి ఆరోగ్యం, మానవ హక్కులు మొదలైన జనాభా సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ దినోత్సవం ప్రారంభమైంది.












 #అడ్మిషన్లు_జరుగుతున్నాయి2025-26 విద్యా సంవత్సరం చదవడానికి గల  #పి.జె_వొకేషనల్_జూనియర్_కళాశాల  #పరిగి యందు అడ్మిషన్లు జ...
10/07/2025

#అడ్మిషన్లు_జరుగుతున్నాయి

2025-26 విద్యా సంవత్సరం చదవడానికి గల #పి.జె_వొకేషనల్_జూనియర్_కళాశాల #పరిగి యందు అడ్మిషన్లు జరుగుతున్నాయని కళాశాల యాజమాన్యం తెలియజేశారు. అదే క్రమంలో కళాశాలలో ఉన్నటువంటి MLT, MPHW(F) కోర్సులలో చేరేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని భవిష్యత్తులో కళాశాల అందించేటువంటి గొప్ప అవకాశాలను వినియోగించుకొని కార్పొరేట్ హాస్పిటల్స్ లలో ట్రైనింగ్ తీసుకుంటూ సాలరీ పొందే అవకాశం, #పారామెడికల్ బోర్డు నుంచి #రిజిస్ట్రేషన్_సర్టిఫికెట్ తీసుకోవడం, #ప్రైవేట్_సెక్టార్లలో ప్లేస్మెంట్ తీసుకొని #ఉద్యోగరీత్యా గడిపే అవకాశాలు మన కళాశాల ఎంతోకాలంగా విద్యార్థులకు అందిస్తుందని తెలియజేశారు. ఈ గొప్ప సదావకాశం పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు మరియు ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు లేదా కళాశాలలో ఉన్నటువంటి కోర్సులపై మక్కువ ఉన్న #విద్యార్థులు ఎవరైనా ఉంటే మన కళాశాల ఆహ్వానం పలుకుతుందని అన్నారు. #పరిమితిలో_సీట్లు_కలవు.







#పరిగి


సమయం ఆసన్నమవుతున్న వేళ మనం ఎంత ఆలోచన చేసిన, మనము వేయవలసిన అడుగు ముందుకి పడనంత వరకు మనలో ఎలాంటి నైపుణ్యం దాగి ఉందో బయటికి...
27/06/2025

సమయం ఆసన్నమవుతున్న వేళ మనం ఎంత ఆలోచన చేసిన, మనము వేయవలసిన అడుగు ముందుకి పడనంత వరకు మనలో ఎలాంటి నైపుణ్యం దాగి ఉందో బయటికి తెలియదు. అందుకుగాను ఆలస్యం చేయక విచ్చేయండి మన #పీజే_వోకేషనల్_జూనియర్_కళాశాల_పరిగి. #అడ్మిషన్లు జరుగుచున్నాయి. కాలేజ్ అడ్మిషన్ సీట్లు తక్కువగా ఉన్నందున కాలేజ్ ఆహ్వానాన్ని స్వీకరించి మన విద్యార్థుల పురోగతిని నైపుణ్యాన్ని వారి భవిష్యత్ తరాలకు ఉపయోగించుకునే విధంగా చేయడానికి మనందరి సహకారం తప్పకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క #విద్యార్థి, తల్లిదండ్రులు తెలుసుకొని మునుముందు రోజుల్లో ఉద్యోగ స్థానాలను పొందే విధంగా మన కళాశాల అన్నివేళలా విద్యార్థులకు అండగా నిలుస్తుందని సగర్వంగా చెప్పుకోవచ్చు.







#పరిగి


గత  #రెండు సంవత్సరాలుగా  #రాష్ట్రంలో  #మొదటి స్థానంలో నిలుస్తూ ఎందరో విద్యార్థులను ఉన్నత చదువులకై వారి ప్రతిభాశక్తులను ఉ...
27/06/2025

గత #రెండు సంవత్సరాలుగా #రాష్ట్రంలో #మొదటి స్థానంలో నిలుస్తూ ఎందరో విద్యార్థులను ఉన్నత చదువులకై వారి ప్రతిభాశక్తులను ఉపయోగించుకునే విధంగా మరియు విద్యార్థుల కలలను నెరవేర్చే రకంగా అన్ని కళాశాలలతో పోటీపడుతూ అగ్రస్థానంలో నిలిచిపోతున్న #పి.జె.ఒకేషనల్ జూనియర్ కళాశాల #పరిగి.



#పరిగి





వరుస విజయాలతో ముందుకు వెళ్తూ ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన ఏకైక కళాశాల పి.జె వొకేషనల్ జూనియర్ కాలేజ్ పరిగి.  ...
21/06/2025

వరుస విజయాలతో ముందుకు వెళ్తూ ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన ఏకైక కళాశాల పి.జె వొకేషనల్ జూనియర్ కాలేజ్ పరిగి.








#పరిగి


గత 2 సంవత్సరాలుగా స్టేట్ 1st  ర్యాంక్ గా దూసుకుపోతున్న ఏకైక కళాశాల పి.జె వొకేషనల్ జూనియర్ కాలేజ్ పరిగి.          #పరిగి ...
21/06/2025

గత 2 సంవత్సరాలుగా స్టేట్ 1st ర్యాంక్ గా దూసుకుపోతున్న ఏకైక కళాశాల పి.జె వొకేషనల్ జూనియర్ కాలేజ్ పరిగి.









#పరిగి


2025 - 2026 విద్యా సంవత్సరానికి గాను  ొకేషనల్_జూనియర్_కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి అని కళాశాల  #ప్రిన్సిపాల్ గార...
05/06/2025

2025 - 2026 విద్యా సంవత్సరానికి గాను ొకేషనల్_జూనియర్_కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి అని కళాశాల #ప్రిన్సిపాల్ గారు అన్నారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు , (F), కోర్సులలో చేరేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.






#పరిగి


 #భారత_రాజ్యాంగ_దినోత్సవం లేదా సంవిధాన్ దివస్‌ను ప్రతి ఏడాది నవంబర్ 26న జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ అసెం...
26/11/2024

#భారత_రాజ్యాంగ_దినోత్సవం లేదా సంవిధాన్ దివస్‌ను ప్రతి ఏడాది నవంబర్ 26న జరుపుకుంటారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ అసెంబ్లీ దేశ #రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు ఇది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

#భారతదేశంలో జాతీయ #న్యాయ_దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబరు 26న జరుపుకుంటారు. 1979లో నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతి సంవత్సరం నవంబరు 26న నేషనల్ లా డే నిర్వహించాలని ప్రకటించారు.1949లో భారత రాజ్యాంగ కమిటి రాజ్యాంగ ముసాయిదాను చేపట్టింది. కమిటీ సభ్యులు 1949 నవంబరు 26వ తేదీన తొలి ముసాయిదా ప్రతులపై సంతకాలు చేశారు. అది 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం, కాబట్టి రాజ్యాంగ ముసాయిదా ప్రతుల తొలి సంతకాల రోజైన నవంబరు 26వ తేదిని జాతీయ న్యాయదినోత్సవంగా ఎంచుకున్నారు. ఈ దినోత్సవం నాడు న్యాయవాదులు సమావేశమై న్యాయాన్ని కాపాడుతామని న్యాయ ప్రతిజ్ఞ చేస్తారు.









 #కాళోజీ_నారాయణరావు_వర్ధంతి                    #ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ  (సెప్టెం...
13/11/2024

#కాళోజీ_నారాయణరావు_వర్ధంతి
#ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) " #కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం. కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తాడు. అతను స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. అతను 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. అతని జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది. వరంగల్ లో నెలకొన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అతని పేరు పెట్టబడింది. అలాగే హన్మకొండ పట్టణంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నారు.

#తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.

అతను 1914, సెప్టెంబరు 9 న (కర్ణాటక) రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. అతని తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు.

కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం అతను గేయాల్లో రూపుకడతాయి. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం మడికొండలో స్థిరపడింది.

ప్రాథమిక విద్యానంతరం హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్ న్యాయపాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. 1939లో హైదరాబాదులో ఉన్నత న్యాయస్థానానికి అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది. 1940లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పి.వి.నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను అతను అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతనికి నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచాడు. అతని మరణానంతరం అతను పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేసారు.














#పరిగి


 #జాతీయ_విద్యా_దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబరు 11న నిర్వహించబడుతుంది. స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి  #విద్య...
11/11/2024

#జాతీయ_విద్యా_దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబరు 11న నిర్వహించబడుతుంది. స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి #విద్యాశాఖామంత్రి అయిన #మౌలానా_అబుల్_కలామ్_ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు #విద్యాశాఖామంత్రిగా పనిచేసాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్ధం ఆయన #పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008, సెప్టెంబరు 11న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి #మంత్రిత్వ శాఖ ప్రకటించింది.













#పరిగి


Address

Road No. 01, Venkateshwara Colony, Vikarabad
Pargi
501501

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when PJVOC PARGI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category