Lalitha Charitable Trust

Lalitha Charitable Trust Save Orphans, Save Old citizens, Provide Education to poor street Children, Save the Global Warming(

*.      లలితావైభవం 438* 🌹🌻🌺💐🌸🍀🍂            తేదీ:24.08.2026      సోమవారం 🌹💄🍂🌞🪷🌺🍁                          *నామము*        ...
23/08/2026

*. లలితావైభవం 438*
🌹🌻🌺💐🌸🍀🍂
తేదీ:24.08.2026
సోమవారం

🌹💄🍂🌞🪷🌺🍁

*నామము*

*కురుకుళ్ళా*

*సాక్ష్యము*

" *కురుకుళ్లాఖ్యదేవీ శ్రీపురేఅహంకారచిత్తమయప్రాకారయోర్మధ్యే విమర్శమయవాప్యాం అధికృతా. తదుక్తం లలితాస్తవరత్నే వాపీం* *ప్రకృత్య కురువిందమణినిలయాం కులాచలస్పర్ధికుచ నమన్మధ్యాం కుంకుమవిలిప్తగాత్రీం కురుకుళ్ళాం మనసి కుర్మహే సతత మితి.* *తంత్రరాజే చ ద్వావింశే పటలే నిరూపితా తద్రూపా"*

*అర్ధము*

కురుకుళ్ళా కురుకుళ్ళా అనే దేవీ స్వరూపురాలు నా తల్లి లలితాంబిక విశేషము విమర్శమయనాపిక యందు అధికారముగల కురుకుళ్ళా దేవీ స్వరూపురాలు

*భాష్యము*

🌳కురుకుళ్ళా అనేది ఒక దేవత. నా తల్లి లలితాంబిక కట్టిన శ్రీపురములోని అహంకార చిత్తమయ ప్రాకారాల మధ్యలో విమర్శమయమైన బావి యందు ఉంటుంది.

"లలితాస్తవ రత్నం" లో
" *కురువిందతరుణినిలయాం కులాచలస్పర్ధి కుచనమన్మధ్యాం కుంకుమ విలిపగాత్రీం కురుకుళ్ళాం మనసి కుర్మహే సతతం"*

🌴ఈ కురుకుళ్ళా దేవి ఎలా ఉంటుందంటే..? కురువింద రత్నములపై నివసించునది. కుల పర్వతాలను మించిన కుచములును కలిగి ఉండటం వలన ఆ పాలిండ్ల భారముతో నడుము వంగిన తల్లి ఈ కురుకుళ్ళా దేవి.

🌷 కుంకుమ లేపనము గావించబడిన దేహము గల తల్లి అయిన కురుకుళ్ళా దేవిని మన మనస్సులో అపూర్వంగా ధ్యానింతుము. ఇంకా ఏమని చెప్పిందంటే వేదమూ..! ఈ ప్రాకార ఆవరణలో (శ్రీచక్ర) ఆ దేవి పేరు శ్యామ. ఈ తల్లినే కురుకుళ్ళా దేవి అని అంటారు.

🌺ఈ దేవతా స్వరూపములోనే నా తల్లి లలితాపరాభట్టారిక ఉంటుంది. కాబట్టే నా తల్లి జగజ్జణని అయిన లలితాదేవిని కురుకుళ్ళా అని అంటారు. మన శరీరములో ఉన్న సుషుమ్న నాడీ మార్గములో ముఖ్య నాడి కురుకుళ్ళా అని అనబడుతోంది.

🍁 ఆధారచక్రం దగ్గర నుండి సహస్రారం దాకా, గ్రంధి త్రయముతో సహా ఈ ప్రాణ నాడి ఉంటుంది. అందుకే ఈ తల్లిని కురుకుళ్ళా అని అనబడుతోంది.. "భావనోపనిషత్" లో ఈ విధంగా చెప్పబడింది.

" *వారాహీ పితృరూపా, కురుకుళ్ళావళిదేవతా మాతా"*

🌹ఇదే నాడీ వ్యవస్థను తెలియజేయాలంటే..? ఎంత మంది శాస్త్రజ్ఞులు ఎన్ని ఎం.ఆర్.ఐ లేదా సి.టి.స్కాన్ లు పట్టుకుని ఇప్పుడు నాడీ వ్యవస్థ గురించి చెపుతున్నారు. నా తల్లి లలితాదేవి బ్రహ్మాండ పురాణములో ఈ మానవ దేవాలయములో ఉన్న 72,000 నాడీ మండల వ్యవస్థ గురించి ఎప్పుడో చెప్పేశారు వేద వ్యాస భగవాణులు.

🌼అందుకే ఈ ప్రపంచములో సనాతన ధర్మానికి ఉన్న పవిత్రత మరియూ శక్తీ ఏ ఇతర మతాలకూ లేవు. ఏ మతములో కూడా భవిష్యత్ లో జరగబోయేదీ.. మరియు జరిగినదీ చెప్పగలిగే జ్యోతిష్య శాస్త్రము ఉన్న అతి ధర్మ మార్గమైన మతం ఒక్క హైందవ సనాతన ధర్మమే..! అలా ఎప్పుడో ఈ బ్రహ్మాండాన్నంతటినీ నా తల్లి లలితాదేవి స్థిర నివాసమైన శ్రీ చక్రములో నిర్మించింది యావత్ ప్రపంచాన్ని.

🥀అలా ఆ శ్రీచక్రానికి ప్రధాన దేవత నా తల్లి జగన్మాత అయిన లలితాదేవి. నా తల్లి లలితాంబిక శరీరము నుండి వచ్చిన కాంతిపుజాలు అష్ట సిద్ధులైన అణిమాది దేవ్వతలు. అలాగే ఉపాసన చేసే అమ్మ భక్తుడు లేదా ఆరాధన చేసే భక్తుడి తండ్రి వారాహి. తల్లి కురుళ్ళాదేవి.

🌸ఇక్కడ మాతా అంటే..? ఉపాసకుడి లేదా సాధకుని కోరికలను తీర్చేది. ఐహిక వాంచలను తీర్చీ మోక్షాన్ని ప్రసాదించేది. మానవ శరీరములో ఉన్న సుషుమ్నా నాడీ మండలములో ప్రాణ నాడి అని చెప్పబడే సుషుమ్నా నాడినే "కురుకుళ్ళా" అని అంటారు.

🍂సుధా సింధువు మధ్యన మణిద్వీపమందున్న నా తల్లి పరమేశ్వరి అయిన లలితాపరాభట్టారిక ఈ పట్టణానికి చిత్తము - అహంకారము అనబడే రెండు ప్రాకారాల మధ్య విమర్శ రూపమైన బావియందు ఉండేది కురుకుళ్ళా దేవి అనే దేవత. కాబట్టీ ఆ తల్లిని మాతగా భావించాలి.

🌻అందుకే నా తల్లి జగన్మాత అయిన లలితాపరాభట్టారికను కురుకుళ్ళా అని పిలుస్తున్నారు వేద వ్యాస భగవాణులు మరియు జగద్ గురువులైన భగవత్పాద విరచిత ఆది శంకరాచార్యుల వారు.

రేపు ఇంకో నామముతో అమ్మ వైశిష్ట్యము తెలుసుకుందామా.

జై భవానీ తల్లీ లలితా పరాభట్టారికా..!

🌻🍀🌹🍁🌸💐🌺

సదా మీ ఆధ్యాత్మిక సేవలో
మీ
చిన్నిక్రిష్ణ.
లలితోపాసకులు, లలితాపీఠం,
లలితా చారిటబుల్ ట్రష్ట్,
అనాధ ఆశ్రమము, (పిల్లలు మరియు వృద్ధులు)
గోశాల, లలితా త్రిపురాంతకేశ్వర వేణుగోపాల స్వామి ఆలయం, చుట్టూరా 108 దేవతల గోపురాలు, అమ్మవారి ఆవిర్భావ ఇతిహాసపు మ్యూజియం, ఫ్రీజర్ బాక్సు మరియు కైవల్య రథం సేవలు, అనాథ శవాల దహనం.

లలితా పురం కోసంగిపురం జ.
పలాసా మరియు కాశీబుగ్గ. చరవాణి:8500272747

*గమనిక* :
🙏🏾🌹🙏🏾🌹🙏🏾🌹🙏🏾
ఇందులో ఏమైనా దోషాలు గానీ ఇంకా ఏదైనా సందేహ నివృత్తి గానీ కావాలంటే..? కేవలము మెస్సెజ్ ద్వారా నాకు తెలియజేయగలరు.

దానిని సద్విమర్శగా స్వీకరించి మరలా మీ సలహాలను మరియు సూచనలను ఇందులో చేర్చి మీకు వివరణ ఇవ్వబడును.

ఎందుకంటే..? సమాజానికి తప్పుడు సమాచారము అందకూడదు.

*ఈరోజు అన్నదాత* 🌾🌷🍀☘️🍃🌳🌴మన జంట పట్టణాల్లో నివాసం ఉంటున్న మరియూ పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో సేవచేస్తూ తరిస్తున్న...🌾 శ్రీ *ప...
23/08/2026

*ఈరోజు అన్నదాత*
🌾🌷🍀☘️🍃🌳🌴
మన జంట పట్టణాల్లో నివాసం ఉంటున్న మరియూ పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో సేవచేస్తూ తరిస్తున్న...

🌾 శ్రీ *పవిత్ర కుమార్ సాహు మరియు వారి ధర్మపత్ని శ్రీమతి శరితా సాహు దంపతుల గారాల వంశోద్ధారకుడు చిరంజీవి దేవజీత్ సాహు*...

🌷 2 వసంతాలను పూర్తీ చేసుకునీ 3డవ దివ్య వసంతములోకి అడుగిడుతున్న శుభ సందర్భముగా ఈరోజు మన ఆశ్రమములో నారాయణ సేవ నిర్వహించారు.

🌴బయట నుండి సాత్వికమైన శాఖాహారాన్ని అన్ని రకాల రుచులతో తెచ్చారు శ్రీ పవిత్ర కుమార్ సాహూ గారు. వీరు గతములో కూడా మన ఆశ్రమాన్ని ఒకసారి ఆదుకున్నారు.

🌳 ఇలా ఈరోజు వారికి దయకలిగి వారి వంశోద్ధారకుడి జన్మదినము మన ఆశ్రమములో జరుపుకునీ ఇలా ఈరోజు ఆదుకున్న శ్రీ పవిత్ర కుమార్ సాహు మరియు శ్రీమతి శరితా సాహు దంపతులకు హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలను సమర్పిస్తూ....

💐 వారి దాన నిరతి ఇంకా పెంపొందడానికి నిండుగా ఆయురారోగ్యాలను ప్రసాదించాలని నా తల్లి లలితాదేవిని ప్రార్థిస్తూ ఈరోజు అన్నదానానికి కారణ భూతుడైన *చిరంజీవి దేవజీత్* సాహు కు ఇలాంటి జన్మ దినాలను 108 కి పైగా చేసుకోవడానికి ఆయుస్షుని ప్రసాదిస్తూ...

🌺 చక్కగా చదువుకునీ ప్రయోజకుడై అమ్మానాన్నలకు తోడూ నీడలా ఉండాలని ఆసీర్వదిస్తూ నివేదించడమైనది.

*.      లలితావైభవం 437* 🌹🌻🌺💐🌸🍀🍂            తేదీ:23.08.2026       ఆదివారం 🌹💄🍂🌞🪷🌺🍁                                 *నామము*...
22/08/2026

*. లలితావైభవం 437*
🌹🌻🌺💐🌸🍀🍂
తేదీ:23.08.2026
ఆదివారం

🌹💄🍂🌞🪷🌺🍁

*నామము*

*కోమలాకారా*

*సాక్ష్యము*

" *కోమలః సుకుమారః ఆకారో అవయవవిన్యాసో యస్యాః"*

*అర్ధము*

కోమలాకారా సుకుమారమైన శరీరము మరియు ఆకారము గల తల్లి లలితాంబిక

*భాష్యము*

🌺సుకుమారమైన ఆకారము గల తల్లి పరమపావని అయిన లలితా పరాభట్టారిక. నా తల్లి లలితాంబిక అవయవ నిర్మాణమే వేరుగా గలది. సాముద్రిక శాస్త్రము ప్రకారము స్త్రీ మూర్తి ఎలా శిల్పము చెక్కినట్లు ఉంటుందో అలా అందమైన ముఖము గల తల్లి.

🌷 ఆకర్ణాంతమూ చేప కన్నులు ఎలా ఉంటాయో అలా ఉంటాయి నా తల్లి కనులు. ముక్కు సంపంగిని పోల్చారు జగద్ గురువులైన భగవత్పాద విరచిత ఆది శంకరాచార్యుల వారు అమ్మవారి ముక్కును సంపంగి పువ్వుతో పోల్చారు. పోల్చడము కాదు. నా తల్లి జగన్మాత అయిన లలితాంబిక ముక్కు సంపంగి పువ్వే.

🍀 ఎందుకంటే..? ఈ లోకములో తేనెటీగలు అన్ని పుష్పాల మీదా వ్రాలి మకరందాన్ని గ్రోలుతాయట గానీ సంపంగి పువ్వు దగ్గరకు చేరవు. ఇది మామూలు విషయము కాదు. కాకపోతే సీతాకోక చిలుకను మీరు గమణించండి. అన్ని పువ్వుల మీదా వాలి మకరందాన్ని గ్రోలుతుంది గానీ సంపంగి పువ్వు పరిసరాలకు చేరదు.

🌾 అలాగే అమ్మవారి చెక్కిల్లు ఎర్రని గులాబీలట. అమ్మవారి చుబుకము మందార కుసుమమట. మూడు కన్నులు గల నా తల్లి నుదుట బ్రహ్మాండాన్ని దాచి ఉంచుతుందట.

🌼 భృగు మధ్య స్థాణములో ఈ సమస్త సృష్టి, స్థితి మరియు లయాలు దాగి ఉంటాయట. అమ్మవారి మెడ నా తండ్రి మెడలాగే నీలవర్ణము కలిగి ఉంటుందట. అమ్మవారి చేతులు మోకాల్లవరకూ ఉంటాయట. ఆ చేతులో సూర్య చంద్రుల వెలుగు ఉంటుందట.

🌿నా తల్లి పాలిండ్లు ఈ జగత్తుకే దిక్కునిచ్చే రెండు హిమాలయ పర్వతాలట..! నా తల్లి లలితాంబిక నడుము సన్నగా సింహము నడుము ఎలా ఉంటుందో అలా ఉంటుందట.

🌳 అమ్మవారి నాభి యావత్ జగత్ కే మూలాధారమని జగద్ గురువులు శంకరులు చెప్పారు. నా తల్లి లలితాదేవి ఊరువులలో సమస్త దేవతలు కొలువై ఉంటారట. అన్నీ బాగుంటాయట అంటే..?

💐 అమ్మ శరీర కాంతి బంగారు రంగుతో ఉంటుందట. గానీ నా తల్లి లలితాదేవి ముడుకులు మాత్రము నల్లగా ఉంటాయట..! ఎందుకంటే..? నా తండ్రి పరమేశ్వరుడు ఎదురైనప్పుడల్లా వంగి ముడుకులు మీద కూర్చొని నమస్కారము చేస్తుందట..! అందుకే నా తల్లి ముడుకులు నల్లగా అరిగిపోయినాయట.

🍁 అమ్మ పాదాలు సరైన సాముద్రికముతో మూడు లోకాలూ అందులో దాగి ఉన్నాయట..! అంటే..? ఇంకా వర్ణించ సాధ్యము కాదు మన భక్తికీ మరియూ ఉపాసనకూ..!

🌴 అలా కుశలా అని పైన చెప్పిన నామాన్నే మరలా వివరించుకున్నట్లుగా ఉంది కదా..! కోమలము అంటే..? మృదుత్వము. కాబట్టీ కుసుమ కోమలమైన ఆకారము కల తల్లి ఒక్క నా తల్లి లలితాపరాభట్టారికయే..!

🌳 ఒక్క దేవతలనే కాదు, మానవులనే కాదు, క్రూరస్వభావులైన రాక్షసులను కూడా సమ్మోహనము చేసేటటువంటి తల్లి ముల్లోకపావని అయిన ఆది దేవత నా తల్లి జగదాంబ లలితాంబ. ఇంకా చెప్పాలంటే..? సకల జన వశీకరణము చేసే అమితానందమైన రూపము గల తల్లి.

🌹 అందుకే కోమలాకారా అని పిలుస్తున్నారు వేద వ్యాస భగవాణులు మరియు జగద్ గురువులైన భగవత్పాద విరచిత ఆది శంకరాచార్యుల వారు.

రేపు ఇంకో నామముతో అమ్మ వైశిష్ట్యము తెలుసుకుందామా.

జై భవానీ తల్లీ లలితా పరాభట్టారికా..!

🌻🍀🌹🍁🌸💐🌺

సదా మీ ఆధ్యాత్మిక సేవలో
మీ
చిన్నిక్రిష్ణ.
లలితోపాసకులు, లలితాపీఠం,
లలితా చారిటబుల్ ట్రష్ట్,
అనాధ ఆశ్రమము, (పిల్లలు మరియు వృద్ధులు)
గోశాల, లలితా త్రిపురాంతకేశ్వర వేణుగోపాల స్వామి ఆలయం, చుట్టూరా 108 దేవతల గోపురాలు, అమ్మవారి ఆవిర్భావ ఇతిహాసపు మ్యూజియం, ఫ్రీజర్ బాక్సు మరియు కైవల్య రథం సేవలు, అనాథ శవాల దహనం.

లలితా పురం కోసంగిపురం జ.
పలాసా మరియు కాశీబుగ్గ. చరవాణి:8500272747

*గమనిక* :
🙏🏾🌹🙏🏾🌹🙏🏾🌹🙏🏾
ఇందులో ఏమైనా దోషాలు గానీ ఇంకా ఏదైనా సందేహ నివృత్తి గానీ కావాలంటే..? కేవలము మెస్సెజ్ ద్వారా నాకు తెలియజేయగలరు.

దానిని సద్విమర్శగా స్వీకరించి మరలా మీ సలహాలను మరియు సూచనలను ఇందులో చేర్చి మీకు వివరణ ఇవ్వబడును.

ఎందుకంటే..? సమాజానికి తప్పుడు సమాచారము అందకూడదు.

*.          శుభవార్త* 🙏🏾🌺🙏🏾🌺🙏🏾🌺🙏🏾మరో ఇష్టాపూర్త దానము మన ఆశ్రమ వంట పూర్తీగా ప్రకృతి వనరులతో చేద్దామనే ఉద్దేశ్యముతో మొన్న...
22/08/2026

*. శుభవార్త*
🙏🏾🌺🙏🏾🌺🙏🏾🌺🙏🏾
మరో ఇష్టాపూర్త దానము మన ఆశ్రమ వంట పూర్తీగా ప్రకృతి వనరులతో చేద్దామనే ఉద్దేశ్యముతో మొన్న గ్రీన్ స్టౌ కోసము *శ్రీ మల్లా కాంతారావు* గారి వద్ద ప్రస్తావించంగా ఆయన డైరక్ట్ గా ఆన్ లైన్ లో బుక్ చేసీ వితరణ చేశారు.

🌺ఆయన ఇచ్చినది కూడా 500 మంది కి వంట చేసే సామర్ధ్యము ఉన్నదే. గానీ మన ఆశ్రమానికి 3 స్టౌ లు కావాలి. *ఒకటి చిన్న స్టౌను కిడ్నీ హాస్పటిల్ లో చేస్తున్న శ్రీమతి సౌమ్య తల్లి ఇచ్చారు.* పెద్ద సామర్థ్యం ఉన్న స్టౌను *శ్రీ మల్లా కాంతా రావు గారు ఇచ్చారు.*

🙏🏾 *మూడవ స్టౌ ను షిరిడి సాయీ కాష్యూ అధినేత శ్రీ బోయిన నరేష్ గారు వితరణ చేస్తున్నారు.*

🌹 *ఈ స్టౌకు సంబందించి మనకే ఆర్డర్ చేసుకోమని రూ..23,000-00 లు ఫోన్ పే ద్వారా చెల్లించారు.*

🌼 నేను స్వయంగా పరిశీలించి నాసిక్ లో గోదావరి తల్లి పుట్టిన ప్రదేశములో ఒక షిరిడి సాయి దేవస్థానము వారు ఈ స్టౌ నే వినియోగిస్తూ అర్ధ గంటలో 300 మందికి ఒక్కో ఐటం ఒక్కొ స్టౌ మీద పెట్టీ అన్నదానమును నిర్వహిస్తున్నారు.

☘️అదే ఆశ్చర్యంగా ఉంది. ఎంత ఆదాయో. దాని ఖర్చూ కేవలమూ మన జీడి పరిశ్రమలో బ్రాయిలర్ కు వాడే కట్టె ముక్కల కన్నా చిన్నవి రెండు చాలు..! ఎంత వంట అయినా పూర్తీ అయిపోతుంది.

🍀 ఇష్టాపూర్తాలు అంటే మీ తెలుసు కదా..! మొట్ట మొదట అన్నదానము, మంచినీటి సౌకర్యము, పాఠశాల, వైద్యము, నిరాశ్రయులకు ఆశ్రయము కల్పించుట, ఏదైనా గ్రామములో రామాలయము లేకపోతే అక్కడ రామాలయాన్ని నిర్మించుట, అలాగే పాత దేవాలయాలు శిధిలావస్థలో ఉంటే వాటిని తిరిగి పునర్ణిర్మించుట ..!

🌾 ఇలా చాలా ఉన్నాయి. ఇవి చేస్తేనే కీర్తి శేషత్వము అంటారు. చాలా ఉన్నాయి.. 18 రకాలు ఉన్నాయి..! *అయితే నీకు పొయ్యి ఇచ్చేస్తే కీర్తి శేషత్వమా అని అంటారేమో..! ఇది అన్నదానము క్రిందకు వస్తుంది.* సంవత్సరానికి ఇంచుమించూ 3.00 లక్షల రూపాయలు ఆదా అవుతాయి శ్రీ మల్లా కాంతారావు మరియు శ్రీ బోయిన నరేష్ గారి వలన.

🌷మీ ఇద్దరి పెద్ద మనసుకూ నా తల్లి లలితాంబిక నిండుగా ఆయురారోగ్యాలను ప్రసాదించీ.. మీ వ్యాపారాభివృద్ధి జరిగి ఇంకా దానా ధర్మాలను చేస్తూ ఇస్ఠాపూర్తాలతో మీ ఆధ్యాత్మిక సేవింగ్స్ ఖాతాలో జమచేసుకోండీ

*.         కృతజ్ఞతలు* 🌺🙏🏾🌺🙏🏾🌺🙏🏾🌺 *చర్చా కార్యక్రమం*🌺🌳🍁🪻🌹☘️🌼 🙏🏾ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఉదయమూ, మధ్యాహ్నము మరియూ రాత్రి ...
22/08/2026

*. కృతజ్ఞతలు*
🌺🙏🏾🌺🙏🏾🌺🙏🏾🌺
*చర్చా కార్యక్రమం*
🌺🌳🍁🪻🌹☘️🌼

🙏🏾ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా ఉదయమూ, మధ్యాహ్నము మరియూ రాత్రి కూడా అన్నదానాలను పెడుతున్న మహోన్నత దాతలకు పాదాభివందనాలు.

🌺 *ఆశ్రమం లో అన్నదానం చెయ్యాలంటే 15 రోజులు, లేదా ఒక్కోసారి నెల రోజుల ముందు కేటాయించుకోవాల్సిన పరిస్థితి తెచ్చిన దాతలకు హృదయ పూర్వక పాదాభి వందనాలు.*

🌼అలాగే దేవాలయ నిర్మాణములో ఎంతో మంది చేతులు కలిపీ అమ్మవారి ప్రతిష్టను చేయించారు. ఏమిచ్చీ మీ ఋణాన్ని తీర్చగలమూ..?

☘️ అమ్మవారు మరియు అయ్యవారి అనుగ్రహము ఈ దాతలందరికీ కలుగుతుంది తప్పకుండా..! ఎందుకంటే..? లలితాదేవికి ప్రత్యక్ష దేవాలము ఎక్కడో రేర్ గా చూశాను. కాబట్టీ అమ్మవారికి దేవాలయము నిర్మాణము మీ అందరి చేత చేయించాలనే సంకల్పముతో అమ్మ ప్రతిష్ఠ చేయించుకుంది.

🌹 అయితే 2016 లో మొదలుపెట్టీ ఇంతవరకూ ఆశ్రమాన్ని ప్రారంబించకపోవడము బాధగా ఉంది. మధ్యలో 3 సంవత్సరాలు ఇబ్బంది కలిగింది ఇదే నెల ఆగష్టు 2023 నుండీ 2026 వరకూ..!

🍁అమ్మవారు అనుగ్రహిస్తోంది..!!! మరియు శనీశ్వర స్వామి వారు కూడా అనుగ్రహిస్తున్నారు.. ఎందుకంటే శని స్వామి వక్ర దశలో ఉన్నారు కాబట్టి.

🪻 *అన్ని పరిస్థితులూ చక్కబడుతున్నాయి. అలా చక్కబడితే ఈ సంవత్సరము విజయదశిమి నాడు 500 మందితో ఆశ్రమాన్ని ప్రారంభించేద్దామనే శుభ సంకల్పముతో* అన్ని లైసెన్సులకు అంటే..?

🌷కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన అన్ని లైసెన్సులూ ఉన్నాయి. పిల్లల కోసమే శిశు సంక్షేమ శాఖ అనుమతిని తీసుకోవాల్సి ఉంది. అది తీసుకునీ బాలికల వసతి గృహములో బోర్డింగ్ మరియు బాలుర కొరకు కట్టిన దాంట్లో స్కూలు తో ప్రారంభము చేసేద్దామని సంకల్పముతో ఉన్నాను.

🌴 తరువాత తరువాత అభివృద్ధి కార్యక్రమాలు ఒకొక్కటీ చేసుకోవచ్చును. అయితే ఇంతవరకూ ఒక్క అధ్యక్షుల పేరునే ఆశ్రమము కేంద్ర ప్రభుత్వములో మినిష్టరీ ఆఫ్ హోం ఎఫ్ఫైర్స్ లో రిజిష్టర్ కాబడింది.

🍀 స్థానికముగా ఆశ్రమానికి పాలక వర్గము కావాలి కాబట్టీ సెప్టెంబర్ 4 క్రిష్ణాష్టమి రోజున పాలక వర్గము ఏర్పాటు చేయాలని అమ్మవారు ఆదేశించారు. మీ అందరీ ఆమోదము కొరకు ప్రార్ధిస్తూ..

🌿మరలా ప్రత్యేకముగా అందరినీ కలిసి విన్నపము చేస్తాను.. ఇది కేవలమూ మీ ఆమోదము కోసము మాత్రమే. గ్రూప్ లాక్ తీశాను కాబట్టీ అన్ని వర్గాలను కలుపుకుంటూ పాలక వర్గము చేస్తే మీ అందరి ఆశ్రమము అవుతుంది అప్పుడు.. మీ అందరి నిర్ణయము మేరకు భవిష్యత్ లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలూ జరుగుతాయి మీ ఆమోదముతో..! అందరూ మీ మీ అభిప్రాయాలను మరియు నాలో ఏమైనా లోపాలు ఉంటే కూడా చెప్పండి దయచేసీ..!

సదా మీ సేవలో తరించే మీ చిన్నికృష్ణ
లలితా చారిటబుల్ ట్రస్ట్ కోసంగిపురం పలాస

*.      లలితావైభవం 436* 🌹🌻🌺💐🌸🍀🍂            తేదీ:22.08.2026       శనివారం 🌹💄🍂🌞🪷🌺🍁                అమ్మ సహస్ర నామము 93 *కుశ...
21/08/2026

*. లలితావైభవం 436*
🌹🌻🌺💐🌸🍀🍂
తేదీ:22.08.2026
శనివారం

🌹💄🍂🌞🪷🌺🍁

అమ్మ సహస్ర నామము 93

*కుశలా కోమలాకారా కురుకుళ్ళా కుళేశ్వరి, కుళకుండాలయా కౌళమార్గ తత్పరసేవితా"*

*నామము*

*కుశలా*

*సాక్ష్యము*
" *సృష్ట్యాదినిర్మాణకౌశలవత్వాత్ కుశలా. కుశం జలం లాతి ఆదత్త ఇతి వా. అదంతత్వాత్కః కుత్సితః శలః చంద్రమా యస్యా ఆగ్రే తదధికకాంతిమత్త్వాదితివా. శలం తు శల్లకీలోమ్ని శలో భృంగిగణే విధౌః వితి* *విశ్వః* "

*అర్ధము*

కుశలా = సృష్టి, స్థితి మరియు లయములను చేయుటయందు అత్యంత నేర్పరి గల తల్లి జగజ్జణని అయిన లలితాంబిక.

*విశేషములు*

1.సృష్ట్యాదులను చేయుటయందు అత్యంత నేర్పు గల తల్లి లలితాదేవి

2.జలమును స్వీకరించీ మళ్ళీ మనకు ఇచ్చునది

3.ఏ దేవి ముందు చంద్రుడు కుత్సితుడగువో ఆ తల్లి కుశల అనగా చంద్రుని కంటే అధిక కాంతి గల తల్లి లలితాంబిక.

*భాష్యము*

🌳 సృష్ట్యాది నిర్మాణములందు నేర్పు గల తల్లి జగన్మాత అయిన లలితాపరాభట్టారిక. కాబట్టే కుశలా అని అనబడుతోంది.

🍁 భూత భవిష్యత్ వర్తమాన కాలాలల్లో ఎప్పుడూ వృద్ధి క్షయాలు (హీనం) అనేది లేని తల్లి జగన్మాత అయిన లలితాంబిక. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేది. క్షేమంగా ఉండేది.

🪻 ఏ రకమైన వాంఛలు లేక తృప్తిగా ఉంటుంది నా తల్లి పరమేశ్వరి అయిన లలితాంబిక. కాబట్టీ అమ్మవారైన లలితా పరా భట్టారికను కుశలా అని అనబడుతోంది. అంటే..? అన్ని విషయముల యందూ ఆరి తేరిన తల్లి ముల్లోకాలను ఏలేటటువంటి జగన్మాత లలితాంబిక.

☘️అంటే..? పంచ కృత్యాలయందు, సర్వ విధ విజ్ఞాన మందు, చతుషష్టి కళల యందు, అద్వితీయమైన నేర్పరి కాబట్టీ కుశలా అనబడుతోంది. ఇంకా అద్భుతము ఏమిటంటే..? మనము త్రాగే నీటిలో అమ్మవారు ఉంటుందట..! మనము త్రాగే నీరుని ఆ తల్లీ స్వీకరించీ మనకు ఇస్తుందట..!

🍁ఆద్యంతము (అంటే ఈ చివర నుండి ధృవుడు వరకూ) కంటే..! ప్రత్యయము లేదా చంద్రుని కంటే కూడా అధిక కాంతి గల తల్లి ముల్లోకపావని అయిన లలితాపరాభట్టారిక.

🌹 నపుంసక లింగ శల శబ్ధమునకు శల్లకి (ఏతు పంది) లోమము పులింగ మగుచున్నందున శల శబ్దం నకు భృంగీగణము చంద్రుడు అని అర్ధము విశ్వ నిఘంటువులో ఉంది కాబట్టీ మీకు అర్ధము అవడానికి వ్యాకరణమును ఇవ్వడమైనది.. (అమర కోశము నుండి)

🌼ఆ చంద్రుని మించిన కాంతి, మనము త్రాగే నీరులో నా తల్లి ఉంటుందీ.. మరియూ ఆదీ అంతమూ లేని తల్లి కాబట్టీ కుశలా అని పిలుస్తున్నారు వేదవ్యాస భగవాణులు మరియు జగద్ గురువులైన భగవత్పాద విరచిత ఆది శంకరాచార్యుల వారు. ఇది మూడు అక్షరాల నామము .

🌹మనిషి మనుగడకు ఆధారమైన నీటిని ఇస్తున్న నామము. కేవలము కుశలా అన్నంత మాత్రానే అనుగ్రహాన్ని ఇచ్చే తల్లి జగజ్జణణి అయిన లలితాంబిక.

రేపు ఇంకో నామముతో అమ్మ వైశిష్ట్యము తెలుసుకుందామా.

జై భవానీ తల్లీ లలితా పరాభట్టారికా..!

🌻🍀🌹🍁🌸💐🌺

సదా మీ ఆధ్యాత్మిక సేవలో
మీ
చిన్నిక్రిష్ణ.
లలితోపాసకులు, లలితాపీఠం,
లలితా చారిటబుల్ ట్రష్ట్,
అనాధ ఆశ్రమము, (పిల్లలు మరియు వృద్ధులు)
గోశాల, లలితా త్రిపురాంతకేశ్వర వేణుగోపాల స్వామి ఆలయం, చుట్టూరా 108 దేవతల గోపురాలు, అమ్మవారి ఆవిర్భావ ఇతిహాసపు మ్యూజియం, ఫ్రీజర్ బాక్సు మరియు కైవల్య రథం సేవలు, అనాథ శవాల దహనం.

లలితా పురం కోసంగిపురం జ.
పలాసా మరియు కాశీబుగ్గ. చరవాణి:8500272747

*గమనిక* :
🙏🏾🌹🙏🏾🌹🙏🏾🌹🙏🏾
ఇందులో ఏమైనా దోషాలు గానీ ఇంకా ఏదైనా సందేహ నివృత్తి గానీ కావాలంటే..? కేవలము మెస్సెజ్ ద్వారా నాకు తెలియజేయగలరు.

దానిని సద్విమర్శగా స్వీకరించి మరలా మీ సలహాలను మరియు సూచనలను ఇందులో చేర్చి మీకు వివరణ ఇవ్వబడును.

ఎందుకంటే..? సమాజానికి తప్పుడు సమాచారము అందకూడదు.

*ఈరోజు అన్నదాత* 🌺🌾🌹🌷🍁🪻🌳మన పలాసా లో స్థిర నివాసం ఉంటున్న *శ్రీ సార రామారావు గారు, టైలర్ గారి ధర్మ పత్ని కీర్తిశేషులు శ్రీ...
21/08/2026

*ఈరోజు అన్నదాత*
🌺🌾🌹🌷🍁🪻🌳
మన పలాసా లో స్థిర నివాసం ఉంటున్న *శ్రీ సార రామారావు గారు, టైలర్ గారి ధర్మ పత్ని కీర్తిశేషులు శ్రీమతి పద్మ తల్లి...*

🌳తన ఆత్మ బంధువులను విడిచిపెట్టి వారినందరిని శోక సంద్రం లో ముంచి తాను హాయిగా స్వర్గ ప్రాప్తి పొంది నేటికి మూడవ సంవత్సరికం వారి భర్త గారైన సర్ సార రామారావు గారు...

🌳మన ఆశ్రమములో ఉన్న అందరికీ పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనాలు పెట్టారు.

🌳 *ఇందునిమిత్తమై రూ.1100 /- బురివిరాళంగా ఇచ్చారు.*

🌳నా తల్లి కీర్తిశేషులు శ్రీమతి పద్మ గారు 2024 రోజున పరమ పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజున తుది శ్వాస విడిచి పెట్టింది.

*గొప్ప మరణం*

🌳ఈరోజు ఈ రూపంగా ఆదుకున్న శ్రీ సార రామారావు గారికి కృతఙ్ఞతలు ఆవిష్కరిస్తూ..

🌳వీరు చేసిన అన్నదానానికి స్వర్గ ప్రాప్తి పొందిన మా తల్లి కీర్తిశేషులు శ్రీమతి పద్మ గారు ఎంతో సంతోషం పొందేస్తారు.

*.      లలితావైభవం 435* 🌹🌻🌺💐🌸🍀🍂            తేదీ:20.08.2026       శుక్రవారం 🌹💄🍂🌞🪷🌺🍁                              *నామము* ...
20/08/2026

*. లలితావైభవం 435*
🌹🌻🌺💐🌸🍀🍂
తేదీ:20.08.2026
శుక్రవారం

🌹💄🍂🌞🪷🌺🍁

*నామము*

*చాంపేయకుసుమప్రియా*

*సాక్ష్యము*

" *చాంపేయ కుసుమం నాగకేశరపుష్పం చంపాసంబంధిపుష్పం వా ప్రియ యస్యా"*

*అర్ధము*

చాంపేయకుసుమప్రియా చాంపేయకుసుమ = దేవదారు పుష్పములు,

ప్రియా = ఇష్టముగా గల తల్లి లలితాదేవి

*భాష్యము*

🌷దేవదారు పుష్పములు మిక్కిలి ఇష్టముగా గల తల్లి జగజ్జణని అయిన లలితా పరాభట్టారిక.

🌺లేదా సంపెంగ పూలు అంటే..? మరీ మరీ ఇష్టము. అమ్మవారి ముక్కు సంపంగి పువ్వు అన్నమాట. సంపంగి తోట ఉన్న దగ్గర నా తల్లి చాలా ఆనందంగా విహరిస్తూంటూంది.

🌷 అందుకే మన ఆశ్రమములో ఆరు రకాల సంపెంగ చెట్లు ఓ 15 చక్కనైన చెట్లు అమ్మవారికోసమై అతి ప్రీతిగా పెంచుతూన్నాను. చిన్నపిల్లలను పెంచినత్లుగా అతి అపురూపంగా పెంచుతున్నాను.

🌾 సంవత్సరము మొత్తములో ఒక్క రోజు కూడా అమ్మవారికి సంపెంగ పూల దండ లేకుండా లేదు. అదే బజారులో అయితే సీజనల్ గానే దొరుకు తాయి సంపెంగ పూలు.

🌾 గానీ మన ఆశ్రమములో నిత్యమూ అమ్మవారికి సంపెంగ మాలా ధారణతో ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే చాంపేయ పుష్పము అనగా నాగ కేశర పుష్పము.

🌺ఈ పుష్పము అన్నా అమ్మవారికి ప్రీతి. శరన్నవరాత్ర నవరాత్ర వ్రతములో తొమ్మిది రోజులూ చాలా కష్ట పది సేకరించి మరీ మాల కట్టీ అమ్మవారికి అలంకరణ చేస్తాము.

🌳 ఆ నాగ కేశర పుష్పాల చెట్లు కూడా మూడు రకాల చెట్లు పెంచుతున్నాను. గానీ ఇంకా పుష్ప వతి కాలేదు నా మూడు తల్లులు. వారు పుష్పవతులైతే నా అమ్మవారి పూలాలంకరణ కన్నుల వైభవంగా ఉంటుంది.

💐ఒక్కొక్కటీ సమకూర్చుకుంటోంది నా తల్లి లలితాపరాభట్టారిక. ఇంకా అర్ధము ఏమిటీ అంటే..? చాంపేయమూ అంటే..? బంగారు రంగు వర్ణ పుష్పాలు. ఈ పుష్పాలు సమర్పించిన వారంటే..? వారి వైపే అమ్మవారు అతి ప్రసన్నగా చూస్తూంటూంది.

🪻మన దేవాలయములో నా తల్లి చూపు రోజుకో దిక్కు చూస్తుంది. ఒక్కోసారి నవ్వుతూంటూంది. ఒక్కోసారి స్థబ్ధంగా ఉండిపోతుంది. అమ్మవారి అలకలూ సంతోషమూ ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాను.

🍁 ఈ నామానికి ఇంతకంటే ఎక్కువ భాష్యము లేదు..

రేపు ఇంకో నామముతో అమ్మ వైశిష్ట్యము తెలుసుకుందామా.

జై భవానీ తల్లీ లలితా పరాభట్టారికా..!

🌻🍀🌹🍁🌸💐🌺

సదా మీ ఆధ్యాత్మిక సేవలో
మీ
చిన్నిక్రిష్ణ.
లలితోపాసకులు, లలితాపీఠం,
లలితా చారిటబుల్ ట్రష్ట్,
అనాధ ఆశ్రమము, (పిల్లలు మరియు వృద్ధులు)
గోశాల, లలితా త్రిపురాంతకేశ్వర వేణుగోపాల స్వామి ఆలయం, చుట్టూరా 108 దేవతల గోపురాలు, అమ్మవారి ఆవిర్భావ ఇతిహాసపు మ్యూజియం, ఫ్రీజర్ బాక్సు మరియు కైవల్య రథం సేవలు, అనాథ శవాల దహనం.

లలితా పురం కోసంగిపురం జ.
పలాసా మరియు కాశీబుగ్గ. చరవాణి:8500272747

*గమనిక* :
🙏🏾🌹🙏🏾🌹🙏🏾🌹🙏🏾
ఇందులో ఏమైనా దోషాలు గానీ ఇంకా ఏదైనా సందేహ నివృత్తి గానీ కావాలంటే..? కేవలము మెస్సెజ్ ద్వారా నాకు తెలియజేయగలరు.

దానిని సద్విమర్శగా స్వీకరించి మరలా మీ సలహాలను మరియు సూచనలను ఇందులో చేర్చి మీకు వివరణ ఇవ్వబడును.

ఎందుకంటే..? సమాజానికి తప్పుడు సమాచారము అందకూడదు.

*.    ఈరోజు అన్నదాత*🌹🙏🏾🌹🙏🏾🌹🙏🏾🌹 *ఈరోజు అన్నదాతే అని చెప్పడానికే భారంగా ఉంది.  గుండెంతా బరువుగా అతి విషాదముతో ఈ మెస్సేజ్ ప...
19/08/2026

*. ఈరోజు అన్నదాత*
🌹🙏🏾🌹🙏🏾🌹🙏🏾🌹
*ఈరోజు అన్నదాతే అని చెప్పడానికే భారంగా ఉంది. గుండెంతా బరువుగా అతి విషాదముతో ఈ మెస్సేజ్ పెడుతున్నాను.*

🌿చక్కనైనటువంటి భవిష్యత్ ఉన్న అందగాడూ.. మృత్యువు సముద్ర అలలరూపములో కబలించేసింది.

🙏🏾గత సంవత్సరము 3 గ్గురు పిల్లలు సముద్ర స్నానాలకు వాల్ల వూరులోనే.. అంటే భావనపాడు రేవులో దిగీ గల్లంతైన వారిలో ఈ జస్వంత్ ఒకడు.

🌹వీరిది పూడి జగన్నాధపురం. అంటే..? భావన పాడు ప్రక్కగ్రామము. ఈ చిట్టి తండ్రి జస్వంత్ ఇంటర్మీడియేట్ ద్వితీయ సంవత్సరము చదువుతూ ఉండేవాడు.

🪻 ఆ తల్లీ తండ్రులు అయిన *శ్రీ తిమ్మల వల్లభ మరియు శ్రీమతి సుధ దంపతుల గారాల వంశోద్ధారకుడు..* ఎంత కడుపు కోత అనుభవించారో.. పాపము..!!!

🌼ఈ చిట్టి తండ్రి పేరున కీ.శే.జస్వంత్ పేరున ఆత్మ శాంతి కొరకు శ్రద్ధాంజలి ఘటిస్తూ బాదాతప్త హృదయముతో మధ్యాహ్నము అన్ని రకాల రుచులతో ఆ తల్లీ తండ్రులు అన్నదానమును నిర్వహించారు.

🪻 *_ఇందుకోసమై రూ..3,500-00 లు నిత్యాన్నదానానికి బూరి విరాళంగా ఇచ్చారు._*

🌿రాత్రి ఆ స్వర్గీయ చిట్టి తండ్రి జస్వంత్ పేరున ఒక తీపి జ్ఞాపకార్ధము వారి స్నేహితులూ.. ఆత్మీయులు అందరినీ విడిచిపెట్టీ జస్వంత్ అందని లోకాలకు వెల్లిపోయాడు. గాబట్టీ రాత్రి భాగం జస్వంత్ మిత్ర వర్గము మరియూ ఆత్మీయులందరూ కలిసీ మంచి రకాల రుచులతో భోజనాలను పెట్టారు.

🙏🏾 *ఇందుకోసము ఆ స్నేహితులంతా కలిసి నివాళులు అర్పిస్తూ, శ్రద్ధాంజళిని ఘటిస్తూ రూ..2,500-00 లు బూరి విరాళంగా ఇచ్చారు.*

🌺 *ఈ బృహత్తర కార్యక్రమములో సాయి, లోకెష్, దేవా, రమేష్, సంతోష్, తిరుపతి, వెంకటేష్, శ్రీను, దీరు* తదితరులు పాల్గొని కన్నీటి పర్యంతమయీ ఆ స్వర్గీయ చిట్టి తండ్రికి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు.

☘️ ఉన్నత లోకాలలో ఉన్న ఆ చిట్టి తండ్రి తన స్నేహితులూ మరియూ అమ్మనాన్నలు చేసిన వితరణ కార్యక్రమానికి ఎంతో సంతోషం పొంది మరింత ఉన్నత లోకాలకు చేరుతుంది స్వర్గీయ జస్వంత్ ఆత్మ.

🙏🏾ఈరోజు ఈ రూపంగా మన ఆశ్రమాన్ని ఆదుకున్న లోకేష్ తదితర మిత్ర బృందానికి మీ పెద్ద మనసుకు కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ..

💐ఆ జస్వంత్ తల్లి తండ్రులకు ఊరట కలగాలని నా తల్లి లలితాదేవిని ప్రార్ధిస్తూ..

*.          వితరణ* 🙏🏾🌹🙏🏾🌹🙏🏾🌹🙏🏾ఈరోజు ఆ భగవాన్ సత్య సాయి సేవాసమితి మహిళా దినోత్సవ వేడుకలను పురష్కరించుకునీ...🌹 ఈరోజు సత్యస...
19/08/2026

*. వితరణ*
🙏🏾🌹🙏🏾🌹🙏🏾🌹🙏🏾
ఈరోజు ఆ భగవాన్ సత్య సాయి సేవాసమితి మహిళా దినోత్సవ వేడుకలను పురష్కరించుకునీ...

🌹 ఈరోజు సత్యసాయి సేవా సమితి పలాసా మహిళా సాయి సేవకులు మరియూ వారితో పాటు భగవాన్ సేవకులు అయిన శ్రీ జామి చిరంజీవి సాయిరాం గారు కూడా వచ్చీ..

💐మన ఆశ్రమములో ఉన్న అభాగ్యులకు మిఠాయిలూ, పండ్లు మరియు సత్యసాయి ఫోటోలు అందజేసి ఆ సాయి నామ సంకీర్తన చేసీ అందరినీ సాయి సన్నిధిలో ఆనంద డోలలూగించారు.

☘️ ఆ సత్య సాయి మహిళాదినోత్సవాన్ని పురష్కరించునీ మన ఆశ్రమాన్ని ఎంచుకునీ సేవ పరమావధి చేసిన ఆ సాయి సేవకులకు మన ఆశ్రమము తరపున కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ..

Address

Lalitha Charitable Trust
Palasa
532221

Alerts

Be the first to know and let us send you an email when Lalitha Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Lalitha Charitable Trust:

Shortcuts

Share