BV&BN High School Jandrapet

BV&BN High School Jandrapet BV&BN High School, jandrapet old students organized recently getTogether function in high school premises.

On 25th October Mr. D. SURESH arranged get together in Temptation Restaurant,  Chirala. Some of the friends from 1987 ba...
26/10/2024

On 25th October Mr. D. SURESH arranged get together in Temptation Restaurant, Chirala. Some of the friends from 1987 batch joined with Suresh and shared their memories. Total programme coordinated by Tellabati and Dharmarao.

ఇది అత్యంత విలువైన పుస్తక భాండాగారం... ఇందులో రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత, లాంటి ఎన్నో ఉపయోగ కర  పుస్తకాలు ఉన్నా...
21/08/2024

ఇది అత్యంత విలువైన పుస్తక భాండాగారం...
ఇందులో రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత,
లాంటి ఎన్నో ఉపయోగ కర పుస్తకాలు ఉన్నాయి... ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఇంత విలువైన సమగ్రమైన సమాచారాన్ని ఒకే క్లిక్తో పొందలేరు...
భగవద్గీత... https://tinyurl.com/yrw54twr
మహా భారతము .. https://tinyurl.com/mynht85r
రామాయణము... https://tinyurl.com/cb8h94ss
భాగవతము ... https://tinyurl.com/r8uxjhbb
వేదములు ... https://tinyurl.com/y2haxbad
అష్టాదశ పురాణములు... https://tinyurl.com/4a69k9tk
పిల్లల నీతి కథలు... https://tinyurl.com/482ed93y
అందరికీ ఆయుర్వేదం... https://tinyurl.com/nnybunhe
🙏🙏🙏🙏

Bhagavad Gita in telugu meaning pdf free download video భగవద్గీత pdf తెలుగులో with meaning free download, Ghantasala Bhagavad Geeta mp3 free download

మన మిత్రుడు కామన శ్రీనివాస రావు ఆతిథ్యం మేరకు మన స్నేహితులందరూ 1987 xth క్లాస్  batch  కలసిన వేళ.... Date.14.11.2023 మధ్...
15/11/2023

మన మిత్రుడు కామన శ్రీనివాస రావు ఆతిథ్యం మేరకు మన స్నేహితులందరూ 1987 xth క్లాస్ batch కలసిన వేళ.... Date.14.11.2023 మధ్యాహ్నం చాలా సరదాగా గడిచింది. మరికొన్ని మరిచి పోలేని గంటలు జీవితంలో.

11/11/2023

మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు .

*1* . *తల్లి*

మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన... తల్లి మొదటి అద్భుతం.

*2* . *తండ్రి*

మన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని తన కన్నీళ్లను దాచేస్తాడు.మన పెదవులపై చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు.దుఃఖాన్ని తాను అనుభవిస్తూ.. సంతోషాన్ని మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం.....

*3* . *తోడబుట్టిన* *వాళ్ళు*

మన తప్పులను వెనుకెసుకురావాడానికి...
మనతో పోట్లాడడానికి... మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు...
తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం......

*4* . *స్నేహితులు*

మన భావాలను పంచుకోడానికి..
మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...
ఏది ఆశించకుండా.. మనకు దొరికిన స్నేహితులు నాలుగో అద్భుతం....

*5* . *భార్య* / *భర్త*

ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా చేస్తుంది.కలకాలం తోడు ఉంటూ... ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే... ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది .....భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే ఐదో అద్భుతం మన సొంతం .

*6* . *పిల్లలు*

మనలో స్వార్థం మొదలవుతుంది.. మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...
వారి ఆలోచనలే ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..
వారికోసం మాత్రమే గుండె కొట్టుకుంటూ ఉంటుంది..
వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు అసలు ఉండరు... పిల్లలు ఆరో అద్భుతం.

అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?

*7* . *మనవళ్ళు* *మనవరాళ్లు*

వీరికోసం ఇంకా కొన్నిరోజులు బతకాలనే ఆశపుడుతుంది.. వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం మళ్ళీ పసిపిల్లలం... అయిపోతాం.వీరు మన జీవితానికి దొరికిన.. ఏడో అద్భుతం....

ఇలా అద్భుతాలన్నీ మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం...
కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు మన సొంతం అవుతాయి
చిన్న పలకరింపు చాలు... మనల్ని ఆ అద్భుతంగా చూడడానికి.
అందుకే అందరిని చిరునవ్వుతో స్వాగతించి మరో అద్భుతాన్ని సృష్టించేద్దాం ...

ఇప్పుడు మన మధ్య ఉన్న మనిషి తెల్లవారేసరికి వుంటాడో లేదో తెలియని కాలం ఇది అందుకే ఉన్న దానిలో సర్దుకుపోయి హాయిగా జీవించడం లోనే ఆనందం. ✍️ _P V R

04/11/2023

*తన కోపమే తన శత్రువు*

పూర్వం విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు తపస్సు పూర్తయ్యాక లేచాడు. అక్కడికి ఇంద్రుడు వచ్చాడు. మాటామాటా వచ్చింది. ఇంద్రుడి స్వర్గాన్ని తలదన్నే స్వర్గం సృష్టించాడు విశ్వామిత్రుడు. అదే త్రిశంఖు స్వర్గం!

అయితే పుణ్యాత్ములంతా ఇంద్రుడు ఉన్న స్వర్గానికే వెళతారు తప్ప విశ్వామిత్రుడు తన తపోశక్తిని ధారబోసి సృష్టించిన స్వర్గంలోకి వెళ్ళరు.

కొన్నాళ్ళకి ఆవేశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు ‘అయ్యయ్యో తపశ్శక్తిని అంతా కోపం, ఆవేశం వల్ల పోగొట్టుకున్నానే!’ అని మళ్ళి తపస్సు చేశాడు.

మళ్ళి 1000 సం.లు పూర్తయ్యాయి. ఈసారి ఇంద్రుడు తాను వెళితే సామరస్యంగా ఉంటుందని, పెద్దగా స్పందించడని భావించి ఊర్వశిని పంపాడు.

తప్పస్సు నుండి లేచేసరికి ఊర్వశి ఎదురుగా వయ్యారాలు పోతూ నిలబడి ఉంది. ఊర్వశిని చూసిన విశ్వామిత్రుడు మోహితుడై 1000 సంవత్సరాల పాటు ఊర్వశితో ఉన్నాడు.

అనంతరం మోహం, పరవశం నుండి తేరుకున్న విశ్వామిత్రుడు తన తపోశక్తి వృథా అయినందుకు బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయి మళ్ళి తపస్సు చేశాడు.

ఈసారి కూడా వేయి సంవత్సరాలు తపస్సు పూర్తయ్యే సమయానికి ఇంద్రుడు బాగా ఆలోచించాడు. నేను వెళ్ళినా, ఊర్వశిని పంపినా ఉపయోగం ఉండదు.

అందుకని వశిష్టుడిని ఎదురుపడేలా చేద్దాం అనుకుని తపస్సు పూర్తయ్యేసరికి వశిష్ఠుడు ఎదురుపడేలా చేశాడు. విశ్వామిత్రుడు వశిష్టుడిని చూసేసరికి అగ్గిమీద గుగ్గిలం అయిపోయాడు.

తీవ్రమైన కోపంతో విపరీతంగా తిట్టేశాడు. అంతే వెయ్యేళ్ళ తపశ్శక్తి అంతా క్షణకాలంలో పోయింది.

తపోశక్తి పోవడంతోనే తేరుకున్న విశ్వామిత్రుడు ‘అయ్యయ్యో ఎంత పొరబాటు చేశాను. తపశ్శక్తిని క్షణకాలంలో వృథా చేసేశాను,’ అని బాధపడ్డాడు.

ఇంద్రుడు ఎదురుపడినప్పుడు ఆవేశాపడినా తపశ్శక్తి పోవడానికి చాలాకాలం పట్టింది. ఊర్వశి ఎదురుపడినప్పుడు మోహించినా కూడా తపశ్శక్తి పోవడానికి చాలాకాలం పట్టింది. కాని కోపం రావడం వల్ల తపశ్శక్తి పోవడానికి కేవలం క్షణకాలంలో హరించుకు పోయింది. కోపం అంత బలమైనది.

ఒకరిని తిట్టి తెగ సంబరపడిపోతూ ఉంటారు చాలామంది. కాని అలా తిట్టడం వల్ల వారి దోషాలు తొలగిపోతాయి. మీరు ఎంతోకాలం కష్టపడి సంపాదించుకున్న పుణ్యం క్షణకాలంలో హరించుకొని పోతుంది.

వేయి సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో చేసిన తపస్సే క్షణకాలంలో పోయినప్పుడు, యే సాధనలు లేని సామాన్య జీవితం గడిపే సామాన్యుడికి కోపం మహాపెద్ద శత్రువు.

మంచి హరించుకుపోతే మిగిలేది చెడే. చెడు సంస్కారాలు ప్రబలమైతే మిగిలేది బాధలు, దుఃఖం, అనారోగ్యం! మీరు ఎందులో వీక్ గా ఉంటే దాన్ని దెబ్బతీస్తుంది.

కోపమే మహా శత్రువు. దీనిని దృష్టిలో పెట్టుకొని కోపం తగ్గించుకోండి!

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

05/12/2020

🙏

మనం *జీవితంలో, మనశ్శాంతిగా, సంతోషంగా, ఆనందంగా, సంతృప్తిగా, ఉండాలంటే...*

*గెలుపు ఓటములను వదిలేయాలి.*

*అహాన్ని, అసూయాలని వదిలేయాలి.*

*మొండితనం, మూర్ఖత్వం, వృద్ధా ప్రసంగం* మరియు *ఎదుటి వారిని గేలి, అవహేళన, చులకన చేయడం వదిలేయాలి.*

*గతం* దుఃఖం, బాధను మరియు *భవిష్యత్తు* భయం, ఆందోళన కలిగిస్తుంది. కావున "వానిని" కూడా వదిలేయాలి.

మనం ఎల్లప్పుడూ *వర్తమానం* లో ఉంటూ, అందరితో *మనం మనస్ఫూర్తిగా కలివిడిగా మాట్లాడుతూ, నవ్వుతూ జీవించాలి.*

అలాగే, *ఒకరికి ఒకరు సహాయసహకారాలు చేసుకుంటూ, ప్రేమ అపాయ్యతలతో సంతృప్తిగా జీవించాలి.*

ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, మనం గెలవాల్సింది మన ఎదుటి మనిషిని కాదు, *వారి మనసును.*

ప్రతి మనిషిలో, మంచి చెడులు రెండు ఉంటాయి. మంచి శాతం ఎక్కువగా ఉంటే, *మంచివారు* మరియు చెడు శాతం ఎక్కువగా ఉంటే, *చెడ్డవారు* గా గ్రహించాలి.

మన విచక్షణ జ్ఞానంతో, అనుభవజ్ఞానంతో, వారిలోని, మంచిని మంచివారిని గ్రహించాలి. అలాగే చెడును, చెడ్డవారిని వదిలేయాలి.

మన మనసు యొక్క అంతిమ ధ్యేయం. అన్నిరకాల పరిస్థితులను, వాస్తవాలను *అంగీకరించడం.*

అలాగే, అన్నిరకాల పరిస్థితులలోనూ *ధైర్యంగా, ప్రశాంతంగా, సంతోషంగా వుండటం.*

మన *శ్వాస విలువ* తెలిస్తే *శాంతి.*
తెలియక పోతే *అశాంతి, ఆందోళన, బాధలు, కష్టాలు మరియు కన్నీళ్లు.*

మనం ప్రతి రోజు, కొంత సమయం, మన కోసం కేటయించి, *ధ్యానం* సాధన చేయాలి.

మన కోసం, మన ఆరోగ్యం కోసం మరియు మన వారి బాగు కోసం.

మనం మానసికంగా, శారీరకంగా మంచి ఆరోగ్యంగా ఉంటేనే, *మన వారికి మనం "ఆసరా" కాగలం* !!
🙏

29/11/2020

👌 ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలక వుంది. అది తన పిల్లలు పెద్దవవుతుండడంతో బయటకువెళ్లి ఏదైనా అపాయంలోపడతాయేమోనని భయపడి, ఒకరోజు రెపరేపా రెక్కలుకొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి పిల్లలారా.., రండి మీకొక మంచి పాట నేర్పిస్తాను. అంది.
సంతోషంతో ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు,
👉 వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..!

👉గింజలు విసురుతాడు జాగ్రత్త..!
👉 వలవేస్తాడు జాగ్రత్త..!
👉 పట్టుకుంటాడు జాగ్రత్త..!
👉 మెడ విరుస్తాడు జాగ్రత్త.. !
*అనే పాటనేర్పింది.*

అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు బహురమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. హమ్మయ్యా..! వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పరవాలేదు. అనుకొని వేటకొరకు అడవులలోకి తుర్రున వెళ్ళిపోయింది ఆ తల్లి చిలుక.

ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..! అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడలిపోయి చెట్టుచాటున నక్కి పోనీ గింజలు విసిరిచూద్దాం.. అని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త..! అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏంచెయ్యాలో అర్ధంకాక వలవేసాడు. ఈలోగా వలవేస్తాడు జాగ్రత్త..! అని పాడుతూ ఆ చిలుకలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కక్కటిగా పట్టుకొని మెడవిరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ చిలుకలు మెడ విరు...స్తా......డు........ అంటూనే చచ్చిపోయాయి.

అయ్యో... ఈ చిలుకలు పాట అయితే నేర్చుకున్నాయి గాని, దానిలోని అర్ధాన్ని గ్రహించుకోలేదు.

మన పిల్లల చదువులు కూడా ఇలాగే వున్నాయి. పిల్లలే కాదు మనమందరము కూడా

నేడు మన మందరమూ చక్కని దేవుని శ్లోకాలు, పాటలు, మంత్రాలు, పురాణాలు, ప్రవచనాలు, వేదాలు, సహస్రనామాలు, వింటున్నాము, చదువుచున్నాము. పాటించ(ఆచరించ) కుండా వదిలేస్తున్నాము. నాకు తెలిసి దేముడు, or, ఋషులు వాటిని పాటించ (ఆచరించ) మన్నారు గాని 11 సార్లు చెయ్యి, మండలం చెయ్యి, లక్ష సార్లు చెయ్యి అని ఎక్కడా చెప్పినట్లు లేదు . అవి మనం సృష్టించు కున్నవి.
మనలాగే చిలక పిల్లలు బాగా పాడటం నేర్చుకున్నాయి గాని అర్థాన్ని గ్రహించక పాపం చనిపోయాయి.🤔

విత్తన గణపతి, పర్యావరణ హిత గణపతి.మట్టి గణపతి, చాక్లెట్ గణపతి, తమలపాకు  గణపతి, చిరుధాన్యాల గణపతి,  వివిధ రకాల ఆకులతో చేసి...
22/08/2020

విత్తన గణపతి, పర్యావరణ హిత గణపతి.
మట్టి గణపతి, చాక్లెట్ గణపతి, తమలపాకు గణపతి, చిరుధాన్యాల గణపతి, వివిధ రకాల ఆకులతో చేసిన గణపతి... ఇలా పర్యావరణ హితమైన గణపతి విగ్రహాలు చాలా వున్నాయి.
పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించని విగ్రహాలు ఇవి. ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్న విత్తన గణపతి పర్యావరణానికి మరింత మేలు చేసేది. మన చుట్టూ వున్న వాతావరణాన్ని ఆరోగ్యం గా తయారు చేసే విగ్రహాలు ఇవి. వినాయక చవితి ఆచరించిన భక్తుల ను అనుగ్రహించే గణపతి... విత్తన వినాయక రూపంలో పూజలందుకుంటే మనకు మంచి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని అందించే ప్రకృతి మాత గా నిలుస్తారు. మట్టి విగ్రహ రూపంలో పూజలందుకొని, ఆ తర్వాత పర్యావరణాన్ని కాపాడే చెట్టుగా , మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే కూరగాయల మొక్కలుగా , వివిధ రకాలుగా మన ముంగిట నిలుస్తారు. బంక మట్టితో తయారు చేసిన విగ్రహంలో విత్తనాలను వుంచి , పూజలు అయిపోయిన తర్వాత తొట్టిలో నిమజ్జనం చేస్తే , దానిలో ఉండే విత్తనం మొలకెత్తి చెట్టై మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. కాబట్టి మీత్రులరా వినాయక వ్రత మాచరించే వారందరూ విత్తన గణపతిని పూజించి, పర్యావరణ ప్రేమికులుగా మారాలని కోరుకుంటూ... మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

14/08/2020

Read this beautiful story completely.

*ఉపాధ్యాయులు చదవవలసిన ఓ మంచికథ!!*

*🔮బహుమతి* ....తప్పకుండా చదవండి.. నాకైతే కళ్ళు చెమర్చాయి..

```
ఉదయం పూజ అయ్యాక, పేపరు చదువుకుంటున్న నేను... ఎవరో కాలింగ్‌బెల్‌ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో ‘‘మాస్టారూ, బాగున్నారా?’’ అని పలకరించాడు.
వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ‘ఎవరా’ అని ఆలోచిస్తూ యథాలాపంగా ‘‘ఆ, బాగానే ఉన్నాను. లోపలికి రా బాబూ’’ అన్నాను.
లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ‘అతడెవరా’ అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం ‘‘మంచినీళ్ళు కావాలా?’’ అని అడిగాను. వద్దన్నాడు.
గొంతు సవరించుకుని అతడే అడిగాడు- ‘‘నన్ను గుర్తుపట్టారా మాస్టారూ?’’ అని.
నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో అన్నాడు ‘‘నేను సత్యమూర్తి నీ. మీ స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేసేవారు’’ అని.
అప్పుడు గుర్తుకు వచ్చింది. సత్యమూర్తి చాలా మంచి స్టూడెంట్‌. బాగా తెలివైనవాడు. ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేవాడు. అతడు స్కూల్లో చేరినరోజే వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి ‘మాస్టారూ, మావాడు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నా కోరిక. ఏ తప్పుచేసినా అల్లరిచేసినా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను. వాడు బాగా చదువుకుంటే అదే పదివేలు’ అని చెప్పారు. వృత్తిరీత్యా ఎంతోమంది రాజకీయ నాయకులని చూసిన నాకు, ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజుల్లో నేను హెడ్‌మాస్టర్‌గా పనిచేసేవాణ్ణి. పిల్లలకి గణితం, సైన్సు బోధించేవాణ్ణి.
అయితే సత్యమూర్తి దండించే పరిస్థితులు వచ్చేలా ప్రవర్తించలేదు. చాలా బాగా చదివేవాడు. ఏ సందేహం వచ్చినా అడిగి నివృత్తి చేసుకునేవాడు. అతడికి చదువులో, ముఖ్యంగా గణితం మీద ఉన్న అభిరుచి చూసి అతడికి మరింత శ్రద్ధతో కిటుకులు బోధించేవాణ్ణి.
కుశలప్రశ్నలయ్యాక, అతడు వచ్చిన పని చెప్పాడు. ‘‘మాస్టారూ, వచ్చే పదిహేనో తారీఖున నా పెళ్ళి, మా స్వగ్రామంలో. మర్నాడు సాయంత్రం ఈ ఊళ్ళోనే రిసెప్షన్‌. మీరూ అమ్మగారూ పెళ్ళికి తప్పకవచ్చి మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించాలని నా ప్రార్థన. మీరు ఎప్పుడు బయల్దేరతారో చెబితే, నేను మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కారు ఏర్పాటు చేస్తాను’’ అంటూ, నా చేతిలో శుభలేఖ పెట్టి, నాకూ మా ఆవిడకీ పాదాభివందనం చేశాడు.
శుభలేఖ చూశాను. అర్ధరాత్రి ముహూర్తం. నేను అతడికి మృదువుగా చెప్పాను- ఆరోగ్యరీత్యా ప్రయాణించలేమనీ వీలైతే రిసెప్షన్‌కి వస్తాననీ చెప్పాను. పెళ్ళికి రాలేమని అనేసరికి అతడి ముఖం కొద్దిగా చిన్నబోయింది. అయితే రిసెప్షన్‌కి ఇద్దరూ తప్పక రావాలని మాట తీసుకుని మరీ బయల్దేరాడు. కారు పంపవద్దనీ మేమే వస్తామనీ చెప్పాను.
పెళ్ళి రెండ్రోజులుందనగా మా ఆవిడ జయ, రిసెప్షన్‌ గురించి గుర్తుచేసి, బహుమతి ఏమిద్దామని అడిగింది. సత్యమూర్తి చాలా ధనవంతుడు. అతడి స్థాయికి తగిన బహుమతి ఇచ్చే తాహతు నాకు లేదు. చాలాసేపు ఆలోచించిన తరవాత నా ఉద్దేశ్యం జయకి చెప్పాను, తనూ అంగీకరించింది.
రిసెప్షన్‌కి నేనూ జయా వెళ్ళాం. సత్యమూర్తి స్నేహితులైన నా పూర్వవిద్యార్థులు కొంతమంది కలిశారు. సత్యమూర్తి తండ్రి వచ్చి పలకరించారు. రిసెప్షన్‌ మొదలయ్యాక నేనూ జయా వేదిక మీదకి వెళ్ళి వధూవరులని ఆశీర్వదించాం. సత్యమూర్తి చేతిలో నేను తీసుకెళ్ళిన కవరు పెట్టాను.
ఆ కవరులో పెట్టిన ఉత్తరంలో ఇలా రాశాను.

చిరంజీవి సత్యమూర్తికి
ఆశీస్సులు.
ఈ సమయంలో ఉత్తరం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నావా? తమ ఉన్నతికి పాటుబడిన ఉపాధ్యాయులని ఏమాత్రం పట్టించుకోని ప్రస్తుత కాలంలో నువ్వు గుర్తుపెట్టుకుని వెతుక్కుంటూ వచ్చి ఎంతో అభిమానంగా మమ్మల్ని నీ పెళ్ళికి ఆహ్వానించినందుకు చాలా సంతోషమైంది.
వృద్ధాప్యం వల్ల ఈమధ్య మా బంధువులలోనైనా ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించినా అంతగా వెళ్ళడం లేదు. నీ విషయంలో ఈ పద్ధతికి విరామం
ఇద్దామని నిర్ణయించుకున్నాను. కారణాలు అనేకం. నువ్వు నా అభిమాన విద్యార్థివి కావడం, మీ తండ్రిగారి మీద నాకున్న గౌరవం... వగైరా.
వచ్చిన చిక్కల్లా ‘నీకు ఏ బహుమతి ఇవ్వాలా’ అన్నదే. మనమిచ్చే బహుమతి అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నీకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని చాలా తర్జనభర్జనపడ్డాను. ఎంత ఆలోచించినా సరైన వస్తువేదీ నా బుద్ధికి తట్టలేదు. ఏ వస్తువు అనుకున్నా అది నీ తాహతుకి చాలా తక్కువవుతుందనిపించింది లేదా నీ దగ్గర ఇప్పటికే ఉండి ఉంటుందని పించింది. డబ్బే ఇద్దామనుకుంటే, నేనివ్వగలిగిన మొత్తం నీకు చాలా తక్కువవుతుందనిపించింది. అటువంటి సమయంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఉత్తరంతో జతచేసిన కాగితమే నేను నీకు ఇస్తున్న బహుమతి.
నువ్వూ నీ సహధర్మచారిణీ ఎంతో ఆనందంగా మీ భావిజీవితాన్ని గడిపేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం....
దీవెనలతో,
శంకరం మాస్టారు

డిన్నర్‌ చేశాక వద్దంటున్నా మా ఇద్దరికీ బట్టలు పెట్టారు అతడి తల్లిదండ్రులు. తీసుకోకపోతే సత్యమూర్తి బాధపడతాడంటూ బలవంతం చేశారు. చాలా మొహమాట మేసింది మాకు. అలాగే వద్దంటున్నా మమ్మల్ని కారులో మా ఇంటి దగ్గర దిగబెట్టారు.
నెల రోజుల తర్వాత నా పేరున ఓ ఉత్తరమొచ్చింది. తెరిచి చూస్తే అది సత్యమూర్తి రాసినది.

దైవసమానులైన మాస్టారుగారికి,

నమస్కారములు.
నా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించినందుకు సంతోషం. ఆరోజు నా పెళ్ళి రిసెప్షన్‌లో మీరు ఇచ్చిన బహుమతి చూశాక, దానికి జతచేసిన ఉత్తరం చదివాక చాలాసేపు అలా ఉండిపోయాను. మేధావులు ఎందుకు ప్రత్యేకంగా ఉంటారో అర్థమయింది.
మీరు రూ.1,116 నా పేరున ఓ అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చి, ఆ రసీదు జత చేశారు. నా పెళ్ళికి వచ్చిన అన్ని బహుమతులలో దీన్ని అత్యంత విలువైనదిగా భావిస్తాను. దీని గురించి చర్చించేముందు నాకు మీ గురించి ఉన్న అభిప్రాయాలని తెలియజేయాలని అనుకుంటున్నాను.
స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మీరు నాకు ఓ రోల్‌మోడల్‌. చిన్నప్పటి నుండీ నేను ఇతరులని ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాణ్ణి. అలాగే స్కూల్లో చదువుతున్నప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాణ్ణి. అందువల్ల నేనుచాలా మంచి విషయాలే నేర్చుకున్నాను.
నేను ప్రస్తుతం ఇంత మంచి స్థాయిలో ఉండటానికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. మిమ్మల్ని మరీ విసిగించకుండా ఉదాహరణగా స్కూల్లో జరిగిన ఒకటి రెండు సంఘటనల్ని మీకు గుర్తుచేస్తాను.
ఓరోజు మాకు సోషల్‌ స్టడీస్‌ క్లాసు జరుగుతుండగా మీరు రౌండ్సుకి వచ్చారు.
ఆ సమయంలో మేమంతా సోషల్‌ స్టడీస్‌ మాస్టారు వెంకట్రావుగారు పెట్టిన స్లిప్‌టెస్ట్‌ రాస్తున్నాం. మీరు వచ్చిన సమయానికి వెంకట్రావు మాస్టారు చిన్న కునుకు తీస్తున్నారు. పాపం అంతవరకూ ఆయన మాకు బోధిస్తూనే ఉన్నారు. మీరు క్లాసులోకి వచ్చి మాస్టారుని ‘‘ఏమిటిది మాస్టారూ, క్లాసులో ఇలా నిద్రపోతున్నారు?’’ అని గట్టిగా మందలించారు. పాపం ఆయన సంజాయిషీ ఇవ్వబోతుంటే, ‘వద్దు, తర్వాత వచ్చి కలవమని’ కాస్త కటువుగా చెప్పారు. వెంకట్రావు మాస్టారి ముఖం చిన్నబోయింది. మాకూ కొద్దిగా బాధ అనిపించింది. ఆయన చాలా శ్రద్ధగా పాఠాలు చెప్పేవారు.
ఆ రోజుల్లో ఏ మాస్టారుదైనా పుట్టినరోజైతే, ఆ ఉదయం అసెంబ్లీ సమయంలో మీరు వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించి, వారి గురించి రెండు మంచిమాటలు మాట్లాడేవారు. అది మన స్కూల్లో ఆనవాయితీ. పై సంఘటన జరిగిన మర్నాడు వెంకట్రావు మాస్టారి జన్మదినం. ఆరోజు అసెంబ్లీ సమయంలో మీరు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చిన తర్వాత చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
‘వెంకట్రావు మాస్టారు మనకున్న మంచి ఉపాధ్యాయుల్లో ఒకరు. పూర్వవిద్యార్థులెవరైనా నాకు బయట ఎక్కడైనా కనిపిస్తే ముందుగా ఆయన కుశలాన్ని గురించి తప్పక అడుగుతారు. ఇక్కడ నిన్న జరిగిన ఓ సంఘటన గురించి మీ అందరికీ చెప్పాలి. నేను రౌండ్సులో భాగంగా ఆయన క్లాసుకి వెళ్ళాను. పిల్లలంతా స్లిప్‌టెస్ట్‌ రాస్తున్నారు. మాస్టారు చిన్న కునుకులో ఉన్నారు. నేను ఆయనను మందలించి తర్వాత వచ్చి కలవమన్నాను.
ఆయన నన్ను కలిశాక తెలిసిందేమిటంటే, మొన్న రాత్రి మాస్టారుగారి అమ్మాయికి తీవ్ర అస్వస్థత చేసిందట. అర్ధరాత్రి ఒంటిగంటకు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఉదయం ఆరుగంటలకికానీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. మాస్టారికీ ఆయన భార్యకీ రాత్రంతా నిద్రలేదు. ఆవిడని వాళ్ళమ్మాయికి తోడుగా ఆసుపత్రిలో ఉంచి, ఆయనమటుకు మామూలుగానే స్కూలుకి వచ్చేశారు. ఆయనకి సెలవులు చాలా ఉన్నాయి. ‘మాస్టారూ, సెలవు తీసుకోపోయారా’ అని నేనంటే, ఆయన ఏమన్నారో తెలుసా- ‘పిల్లల ఫైనల్‌ పరీక్షలు దగ్గరబడ్డాయి. వాళ్ళని బాగా ప్రిపేర్‌ చేయాలిగదా సార్‌. ఆసుపత్రిలో నేనుండి చేసేపని ఏదీలేదు. మా ఆవిడ చూసుకుంటుంది’ అని. ఎంతమందికి ఇలా పనిమీద భక్తి ఉంటుంది చెప్పండి?
దురదృష్టంకొద్దీ ఆ నిద్రలేమి ప్రభావంఓ క్షణం ఆయన మీద పడింది. కాకతాళీయంగా నేను అదే సమయంలో వెళ్ళాను. అనవసరమైన ఆవేశంతో ఆయన్ని పిల్లలముందు మందలించినందుకు నేను ఆయన్ని మన్నించమని కోరుకుంటున్నాను’
అని ఆయనవైపు చేతులు జోడించారు. వెంకట్రావు మాస్టారు కళ్ళల్లో మెదిలిన చిన్న కన్నీటితెర, మీ తప్పేమీలేదన్నట్లుగా మిమ్మల్ని వారిస్తూ మీకు చేసిన ప్రతి నమస్కారం నేనెప్పటికీ మర్చిపోలేను.
ఆరోజు మీ మాటలు విన్నాక నాకు అర్థమైన విషయమేమిటంటే, మనం తెలిసిచేసినా తెలియకచేసినా తప్పు చేస్తే, అది ఒప్పుకునే ధైర్యం ఉండాలి. నలుగురిలో మీరు మాస్టారుని మందలించారు కాబట్టి, పదిమందిలో క్షమాపణ కోరారు. ఆ విధంగా చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. అలాగే ఎవరైనా మంచిపని చేస్తే వెంటనే మెచ్చుకోవాలి. అది వారికి మరింత స్ఫూర్తినిస్తుంది అని అర్థమయింది. ఆరోజు నేను నేర్చుకున్న ఆ పాఠాలు, ఇవాళ నా వృత్తిలో ఎదగడానికీ నా సహోద్యోగులతో మంచి సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవడానికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి.
బహుమతి
స్కూల్లో ఆటలపోటీలు జరిగినప్పుడు గెలుపొందినవారికి కప్పులూ మెడల్సూ ఇచ్చేవారు. అదే క్విజ్‌, వ్యాసరచన, వక్తృత్వం పోటీలలో గెలుపొందినవారికి మీరు పుస్తకాలు బహుమతిగా ఇచ్చేవారు.
ఆ పుస్తకాలు జనరల్‌నాలెడ్జికి సంబంధించినవో మహనీయుల జీవితచరిత్రలూ లేదా ఆత్మకథలో అయి ఉండేవి. ఓ వారం, పదిరోజులయ్యాక మీరు ఆ బహుమతి పొందిన విద్యార్థిని ఆ పుస్తకంలోని విషయాల గురించి అడిగేవారు. ఇచ్చిన పుస్తకం చదివామా లేదా, అందులోని ఏ మంచి విషయాలు మమ్మల్ని ప్రభావితం చేశాయో తెలుసుకోవాలని మీ యోచన. మొదట్లో అది మాకు కొంత ఇబ్బందిగా ఉండేది. బహుమతి ఎందుకు వచ్చిందా అనుకునేవాళ్ళం. కానీ రానురాను దానివల్ల మంచి పుస్తకాలు చదవాలన్న ఆసక్తి మాలో కొంతమందికి కలిగింది. నేను ఇప్పుడు ఉద్యోగరీత్యా చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటాను.
ఆ సమయాన్ని నేను మంచి పుస్తకాలు చదవడానికి వెచ్చిస్తాను - ఆ పుస్తకాల ప్రేరణతో నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను. అవి నా ఉద్యోగంలోనూ నిత్య జీవితంలోనూ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్న ఇంకో విషయం- సమయపాలన. మీరు స్కూలుకి ఎప్పుడూ అందరికంటే ముందు వచ్చేవారు. సాయంత్రం ఎప్పుడైనా ఏ ఉపాధ్యాయుడైనా పని ఉండి స్కూలు వదిలిన తర్వాత కూడా ఉండి, పనిచేసుకుంటూ ఉంటే మీకు అవసరం లేకపోయినా ఆయనకి తోడుగా ఉండేవారు. అది మీ సహోద్యోగులకి మీరిచ్చే ఓ భరోసాలా ఉండేది. ఈ విషయంలో కూడా మిమ్మల్ని నేను అనుకరిస్తూనే ఉన్నాను.
ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే, మిమ్మల్ని గమనించి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను అనేకంటే, మీరు మీ ప్రవర్తనతో మాటలతో మీకు తెలియకుండానే మాకు ఎన్నో బోధించారు అనడం ఉత్తమం. అప్పుడే కాదు... ఇప్పుడు కూడా.
బహుమతులు చాలామంది ఇస్తారు. కొద్దిమంది ఆ ఇచ్చిన బహుమతి అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలని ఆలోచిస్తారు. కానీ, మీ బహుమతి నన్ను ఆలోచించేలా చేసింది. మీరన్నట్లు మామూలుగా అయితే రూ.1,116 నాకు చాలా చిన్న మొత్తమే. కానీ మీరు ఆ మొత్తాన్ని ఓ అనాథశరణాలయానికి విరాళంగా ఇచ్చారు- అదీ నా పేరున.
మీరు చేసిన ఈ గొప్పపని నాలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. అనేకసార్లు నేను చేసే అనవసర ఖర్చుల్ని గుర్తుచేసింది. మీరు ఇచ్చిన బహుమతిని నేను అప్పుడే అనుకరించేశాను. నా పెళ్ళయిన మూడు రోజులకి మా కజిన్ పెళ్ళి అయ్యింది. వాడికి లెక్కపెట్టలేనంత డబ్బు ఉంది. అందుకని మేమిద్దామనుకున్న రూ.50,000లని ఓ అనాథ శరణాలయానికి వాడి పేరుమీద విరాళంగా ఇచ్చాం. వాడెంత సంతోషించాడో మాటల్లో చెప్పలేను. మీరు మాకు ఓ కొత్త మార్గాన్ని చూపారు. మేమెందరమో ఈ కొత్త దారిలో ప్రయాణించే అవకాశం కల్పించారు.
ఇలా మీరు మీ చర్యలతో మాకు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు- ఉద్యోగంలో ఉన్నప్పుడూ రిటైర్‌ అయ్యాకా కూడా. అదే మీ గొప్పతనం.
పాదాభివందనాలతో,
మీ విద్యార్ది,
సత్యమూర్తి.

అతడి గొప్ప వ్యక్తిత్వానికి మనసులోనే హర్షిస్తూ, ఉత్తరం జయ చేతిలో పెట్టాను```
(ఈ కథా రచయిత ఎవరో తెలియదు..రచయిత పేరు లేకుండానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. నాకు నచ్చిన ఈ కథ ని మీతోనూ చదివిద్దామని ఇక్కడ పోస్ట్ చేశా..రచయిత పేరు తెలిస్తే చెప్పండి..కథా రచయిత కు నమస్కారాలు)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

31/07/2020

*"మనలో చాలామందిమి అనుకుంటాం . నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం ?"*
*అతడు అనుకున్నాడు నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని*

*జరిగిన కధ !*

*స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో 1892 లో జరిగిన వాస్తవం.*

*18 సంవత్సరాల ఆ యువకుడు ఫీజులు కట్టలేక ఏమి చెయ్యాలో తెలీని స్థితిలో ఉన్నాడు . అతడు తల్లి తండ్రులు లేని అనాధ !*

*అతడూ అతడి స్నేహితుడూ కలిసి ఒక పధకం ఆలోచించారు . వాళ్ళ యూనివర్సిటీ లో ఒక సంగీత కచేరీ ఏర్పాటు చేద్దామనీ , అందులో ఖర్చులు పోను మిగీన దానితో తమ ఫీజులు కట్టెయ్యవచ్చు అనీ నిర్ణయించుకున్నారు.*

అప్పట్లో గొప్ప పియానో వాద్య కారుడు
Ignace J.Paderewski. వద్దకు వెళ్ళారు...ఆయన మేనేజరు ఫీజు రూపం లో 2000 డాలర్లు కనీస మొత్తం గా ఇవ్వాలనీ,ఆ పైన ఇతర ఖర్చులు అనీ ఒప్పదం చేసుకున్నారు.వీళ్ళు అంగీకరించారు.టికెట్లు అమ్మడం సాగించారు . అనుకున్న రోజు వచ్చింది . ప్రోగ్రాం అద్భుతం గా జరిగింది . అయితే వీళ్ళు అనుకున్నట్టు వసూళ్లు రాలేదు.మొత్తం 1600 డాలర్లు మాత్రమె వచ్చింది*.

*వాళ్ళు . దగ్గరకు వెళ్ళారు . వసూలు అయిన మొత్తమూ,400 డాలర్లకు చేక్కూ పట్టుకు వెళ్లి జరిగిన మొత్తం విషయం చెప్పారు . సాధ్యమయినంత త్వందరలో ఆ మిగిలిన సొమ్ము చెల్లిస్తాము అనీ,క్షమించమనీ అన్నారు.*

*వాళ్ళ గురించి Paderewski. కి తెలీదు .. ఆయన వాళ్ళని అతకు ముందు చూడలేదు . ఆయన ఆ చెక్కును చింపేశాడు . . 1600 డాలర్లూ వాళ్ళ చేతిలో పెడుతూ వాళ్ళతో ఆయన ఇలా అన్నాడు.*

*"మీకు అయిన ఖర్చులు ఎంతో లెక్క పెట్టుకోండి.* *మీ ఫీజులకు ఎంతో అవుతోందో అది కూడా ఇందులో నుండి మినహాయించుకోండి*. *ఏమైనా మిగిలితే ఆ మిగిలిన సొమ్ము నాకు ఇవ్వండి "*

ఈ సంఘటన Paderewski మానవతను చాటి చెబుతుంది . తనకు తెలీని , తనకు ఏమీకాని , వారి వలన ఎటువంటి ప్రయోజనమూ ఆశించకుండా తన శ్రమనూ , తన ఆదాయాన్నీ ఇవ్వడం Paderewski హృదయం గురించి చెబుతోంది కదూ!

మనలో చాలామందిమి, అనుకుంటాం " నేను అతడికి సహాయం చేస్తే నాకేమిటి ప్రయోజనం?"
అతడు అనుకున్నాడు " నేను సహాయ పడకపోతే వాళ్ళకి ఎవరు సహాయ పడతారు ? అని.

అదే ఉత్తములకీ మనకీ తేడా !
ఇది ఇక్కడితో ఆగిపోలేదు

Paderewski తర్వాతి కాలం లో పోలాండ్ ప్రధాని అయ్యారు.

రెండో ప్రపంచ యుద్ధం లో పోలాండ్ సర్వ నాశనం అయిపొయింది.15 లక్షల మంది ఆకలితో అలమటించే స్థితికి చేరారు.

Paderewski కి ఏమి చెయ్యాలో తోచలేదు . ఎవరిని అడగాలో తోచలేదు . చివరికి అమెరకా ఆహార , పునరావాస విభాగాన్ని సంప్రదించాడు

దానికి అధిపతి . ఇతడే తర్వాత అమెరికా అధ్యక్షుడు కూడా అయ్యాడు . అతడు వెంటనే ప్రతిస్పందించాడు . టన్నులకొద్దీ ఆహార పదార్ధాలు పోలాండ్ కు సరపరా జరిగింది. పోలాండ్ లో ఆహార సంక్షోభం నివారించబడింది

Herbert Hoover చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పడానికి Paderewski అమెరికా వెళ్లి హూవర్ ను కలిశాడు . కృతజ్ఞతలు చెబుతూ ఉండగా హోవర్ అన్నాడు

*కొన్ని సంవత్సరాల క్రితం మీరు కాలేజీ ఫీజులు కట్టలేని ఇద్దరు యువకులకు సహాయం చేశారు .వారిలో నేను ఒకడిని.*

*ఈ ప్రపంచం ఒక అద్భుతమైన విషయం!!!*

*"~నీవు ఏది ఇస్తావో అది నీవు అనేక రెట్లు పొందుతావు అనే గీతాసారం ఇది."*

*"~The world is a wonderful place. What goes around usually comes around."*

22/07/2020

ప్రపంచంలో ఉన్న నాన్నలందరికీ ఈ కథ అంకితం
నాన్న అంటే ఎవరు...??

మీకేమైనా తెలుసా...?

*బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.*

*“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా* *బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.*

*అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.

*దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకూ బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం”అన్నాడు.

*“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా...

*“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.

*మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి తోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.

*అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. “మీ నాన్న రా!” అంటూ అమ్మ తన కంటి చూపుతో ఆయన్ని పరిచయం చేసింది.*

*బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు..? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా.

*“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు. అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదేంటని అడిగా.

*“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు..

*“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాసతో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను.

*ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపలాగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని.

*ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ. “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా. అర్ధం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు.

*ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా.

*మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి.

*కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను* *నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు.

*నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహా శివుణ్ణి, మనసులో ప్రార్దించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో, వడివడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో... నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనేం... నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలీదు. నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా.

*నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు. ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. “ఏమైంది బాలకా” అని అన్నాడు. “భయం వేసింది స్వామి. అందుకే పిలిచా” అన్నా నేను.

*భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా. అవును నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది.

*నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి.

*ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.

*నీ జీవిత మజిలీ ఎలా సాగిందని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు...

మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు అని సమాధానం చెప్పాను గర్వంగా.

*“అదేంటి అలా అంటావ్...! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా.

*“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను. బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు.* *ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది. అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి. “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్తు దేవుడేనని”.మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి. అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను.*

*ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో... క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు. ఏమిటది స్వామీ...! అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా.*

*అమ్మ దేవుడి అంశ అయితే.......

నాన్న సాక్ష్యాత్తు దేవుడే.... కాదంటారా...!

Address

Ongole
523002

Opening Hours

Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919441036377

Alerts

Be the first to know and let us send you an email when BV&BN High School Jandrapet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to BV&BN High School Jandrapet:

Shortcuts

Share

Category