18/08/2021
" *ఎవరిదీ ఈ హత్య*"
ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులు చెల్లించని *తల్లితండ్రులదా*?.... కట్టవలసిన అవసరం లేదు
అన్న *ఓ ఎమ్మెల్యేదా*?.... లేక
ఫీజు అడిగితే కేసు పెడతాం అన్న *అధికారులదా*?..... లేక
70% మాత్రమే ఫీజు తీసుకోమన్న *ప్రభుత్వానిదా*?....
TC లకు విలువ లేకుండా,
టీసీలు లేకుండానే అడ్మిషన్ చేర్చుకొమ్మన్న *విద్యాశాఖ అధికారులదా*?.....
*అవకాశం దొరికింది కదా అని ఆన్లైన్లో విద్యార్థుల పేర్లు మేనేజ్మెంట్ కు తెలియకుండా తొలగిస్తున్న మండల విద్యాశాఖ అధికారులదా?.... *ఎప్పుడూ పనికట్టుకుని బడ్జెట్ స్కూల్లను విమర్శించే సంఘాల నాయకులదా*?......
*ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసైనా*.....
*ఎన్ని కష్టాలు పెట్టినా*...., *ఎన్నెన్ని ఇబ్బందులు ఎదురైనా... పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తోన్న ప్రైవేట్ పాఠశాలల సంఘాలదా*?.....
ఎవరు! ఎవరు! ఈ బాధ్యత వహించగలరు? పోయిన ప్రాణం ఎవ్వరు? ఎవ్వరు? తీసికొని రాగలరు? ఇప్పటికైనా రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ప్రభుత్వము మరియు విమర్శించే సంఘాలు, ఏదేని ఒక్క విషయంలో మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు, ఓ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి, మేధోమధనం గావించి, మంచి చెడులను చర్చించి, రూట్ లెవెల్ నందు ఉన్న వారితో చర్చించి, తదుపరి మాత్రమే మాటలు మాట్లాడితే బాగుంటుందని మనవి.
మీ ఒక్క మాట వల్ల *ఎంతమంది ప్రేరణ పొంది ఫీజు ఎగ్గొట్టారో, ఈ అవకాశం కొరకు ఎంతమంది వేచి ఉన్నారో* *బడ్జెట్ స్కూళ్ళు మేనేజ్మెంట్ కన్నీటిని అడిగితే చెప్తుంది, తన కన్నీటి బరువెంతో*
దానికి వారు చెల్లించిన మూల్యం ఎంతో.......
ఎన్ని గుండెలు ఆగెనో....
ఇంకెన్ని గుండెలు ఆగునో.....
మరేన్ని తనువులు చాలించునో......
B.Ed చేసి ఉద్యోగం లేక ఏదో అవకాశం ఉంది కాబట్టే ఈ రంగంలోనికి వచ్చాము,
వచ్చాము కాబట్టి ఇంకొక రంగం వైపు వెళ్ళ లేక ఎలాగోలాగా నెట్టుకొస్తున్నాము , అంతే కానీ తెలివి తక్కువ అయి కాదు, దోచుకోవటానికి అంతకంటే కాదు.
*ప్రైవేట్ పాఠశాలలు వద్దు అనుకుంటే ఒక్క ప్రభుత్వ ఉత్తర్వుతో అన్నిటినీ మూసి వేయండి*, మా దారిన మేం పోతాము. మా చావు మేం చస్తాం.
*ఎందరో మేధావులను దేశానికి అందించిన గురువుల పరిస్తితి ఇదా*?
దయనీయం, దారుణం, గర్హనీయం
*చదువు నేర్పు గురువుల యెడ ఎందుకింత ఏహ్యభావం*,
ఎందుకింత చిన్నచూపు.
*మోసే వారికే తెలుస్తుంది కావటి బరువు* అన్నట్లు,
ఎవ్వరి కష్టాలు వారికే తెలుస్తాయి. *ఈత కొట్టే వాడికి వచ్చే ఆయాసం గట్టున ఉన్న వాడికి ఎలా తెలుస్తుంది*.
మాట్లాడే వారు మీరు ఒక్క స్కూల్ పెట్టీ మెయింటైన్ చేస్తే తెలుస్తుంది బరువు భాధ్యత.
*ఇంకొక ప్రాణం మళ్లీ పోకుండా జాగ్రత్త వహిస్తారని ఆశిస్తూ*.....
*సుబ్రమణ్యం మరియు రోహిణి గార్లకు*
😭 *అశ్రు నివాళి* 😭