St.Johns High School Nellore

St.Johns High School Nellore

Share

St.Johns High School
Subedarpet
Nellore
524002

22/01/2024

😃95'sBATCH.... Tag the students...& Tell the name of faculty's

15/02/2023

|| YSRCP ప్రజల సెల్‌ఫోన్లకూ జగన్‌ స్టిక్కర్లు || రాష్ట్రవ్యాప్తంగా 1.65 కోట్ల ఇళ్లకు తిరిగి వాటి తలుపులకు ||
‘ప్రజల సెల్‌ఫోన్లకు జగన్‌ స్టిక్కర్లు’ అతికించేందుకు అధికార వైకాపా సన్నద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.65 కోట్ల ఇళ్లకు తిరిగి వాటి తలుపులకు ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనే పేరుతో ఉన్న స్టిక్కర్లను అతికించడంతోపాటు.. ఆయా ఇళ్లలోని వారి సెల్‌ఫోన్లకూ ప్రత్యేకంగా రూపొందించిన చిన్న సైజ్‌ స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించారు.

Follow us Political Sinnodu for more updates!


మార్చి 18 నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరిట ప్రచారం
5.65 లక్షల మంది గృహసారథులు ఇంటింటికీ వెళ్లేలా కార్యక్రమం
మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులతో సీఎం జగన్‌ సమావేశం
పనితీరు మారకుంటే మార్పులు తప్పవని ఎమ్మెల్యేలకు హెచ్చరిక

‘ప్రజల సెల్‌ఫోన్లకు జగన్‌ స్టిక్కర్లు’ అతికించేందుకు అధికార వైకాపా సన్నద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.65 కోట్ల ఇళ్లకు తిరిగి వాటి తలుపులకు ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అనే పేరుతో ఉన్న స్టిక్కర్లను అతికించడంతోపాటు.. ఆయా ఇళ్లలోని వారి సెల్‌ఫోన్లకూ ప్రత్యేకంగా రూపొందించిన చిన్న సైజ్‌ స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించారు. సచివాలయ వైకాపా సమన్వయకర్తలు, గృహసారథులు మొత్తం 5.65 లక్షల మందితో ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరిట మార్చి 18 నుంచి 26 వరకు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులకు ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. సోమవారం వీరందరితో ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీఎం ఆదేశాలు, సమావేశంలో చర్చించిన అంశాలివీ..

‘రాష్ట్రవ్యాప్తంగా 93% అంటే సుమారు 5 లక్షల మంది గృహసారథుల నియామకం పూర్తయింది. మిగిలినవారినీ ఈ నెల 16లోగా నియమించాలి. దీంతో క్షేత్రస్థాయిలో 5.65 లక్షల మందితో వైకాపా సైన్యం అందుబాటులోకి వస్తుంది. వీరితోనే పార్టీ కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలి. ఇప్పటికే 387 మండలాల్లో వీరికి శిక్షణ ఇచ్చారు, మిగిలిన మండలాల్లోనూ ఈ నెల 19లోగా శిక్షణను ఎమ్మెల్యేలు పూర్తి చేయాలి’ అని సీఎం నేతలను ఆదేశించారు. మార్చి 18 నుంచి నిర్వహించే ప్రచార కార్యక్రమంలో గృహసారథులు ఇంటింటికీ తిరుగుతూ గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఏం చేశారు? దానికి భిన్నంగా, అంతకు మించి ఇప్పుడు వైకాపా ప్రభుత్వం చేసిందేంటి? వారి ఇళ్లలో ఇచ్చిన పథకాలేంటి అనే వివరాలతో కూడిన ప్రచార పత్రాలను ఇవ్వడంతోపాటు వారు ప్రభుత్వం నుంచి ఇంకా ఏం కోరుకుంటున్నారనే సమాచారాన్నీ సేకరిస్తారు. ‘జగన్‌ ప్రభుత్వంపై మీ అభిప్రాయాలను తెలపండి’ అంటూ 5 అంశాలతో కూడిన ఒక పత్రాన్ని భర్తీ చేయించుకుని వారికి ఇబ్బంది లేకపోతే సంతకం కూడా తీసుకుంటారు. ‘జగన్‌ ప్రభుత్వంపై నమ్మకం ఉందంటే ఈ నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వండి’ అని ఒక నంబరు ఇస్తారు.

మే తర్వాత మార్పులే
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులు మే నెలలోపు పనితీరును మెరుగుపరుచుకోకుంటే కొత్త సమన్వయకర్తలను నియమిస్తామని స్పష్టం చేశారు. ‘సుమారు 14 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. మీ మంచి కోసమే చెబుతున్నా. పనితీరు మెరుగుపరుచుకోండి. ప్రజల్లో ఉండండి. లేకుంటే ఆ తర్వాత మీకు సమయం ఉండదు. అందువల్ల కొత్తవాళ్లను తీసుకువచ్చి వారిని ప్రజల్లోకి పంపాల్సి ఉంటుంది’ అని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. కార్యక్రమం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బాగా చేసిన టాప్‌-10 మంది, చివర్లో నిలిచిన 10 మంది పేర్లను ప్రకటించారు. గత సమావేశం (డిసెంబరు 16) నుంచి ఇప్పటి వరకు పనితీరు బాగోలేని 20 మంది పేర్లను ఐప్యాక్‌ ప్రతినిధి రిషిరాజ్‌ ప్రకటించారు. వారిలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, ఆదిమూలపు సురేష్‌, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్‌, కొడాలి నాని, చెన్నకేశవరెడ్డి, బొత్స అప్పలనరసయ్య, చింతల రామచంద్రారెడ్డి, మేకతోటి సుచరిత, జొన్నలగడ్డ పద్మావతి, మద్దిశెట్టి వేణుగోపాల్‌, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, గ్రంధి శ్రీనివాస్‌, అన్నా రాంబాబు, కాటసాని రామిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, జి.శ్రీనివాసనాయుడు, నియోజకవర్గ బాధ్యుల్లో సురేష్‌ (తాడికొండ), అడారి ఆనంద్‌ (విశాఖ పశ్చిమ), ఆమంచి కృష్ణమోహన్‌ (పర్చూరు) ఉన్నట్లు తెలిసింది. సచివాలయాల పరిధిలో కేవలం రెండు గంటల్లోపు తిరిగిన మరో కేటగిరిలో మంత్రులు దాడిశెట్టి రాజా, విశ్వరూప్‌, ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌, బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌ తదితరులు ఉన్నట్లు సమాచారం. డిసెంబరు 16 నుంచి ఇప్పటివరకు దూలం నాగేశ్వరరావు (43 రోజులు), వరికూటి అశోక్‌బాబు (42 రోజులు), రాచమల్లు శివప్రసాదరెడ్డి (41 రోజులు) మొదటి మూడు స్థానాల్లో నిలిచినట్లు సీఎం ప్రకటించారు.

ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లో గెలవాల్సిందే
‘ప్రభుత్వం వచ్చాక మనం ప్రజలకు ఇంత చేస్తున్నాం. అందువల్ల ఎన్నికలు జరగబోతున్న మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో కచ్చితంగా మనం (వైకాపా) గెలిచి తీరాలి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి మంత్రి బొత్స సత్యనారాయణ, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రకాశం- నెల్లూరు- చిత్తూరుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కడప- అనంతపురం- కర్నూలుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్‌ఛార్జులుగా వ్యవహరిస్తారు. వాటి పరిధిలోని ఎమ్మెల్యేలందరిపైనా అభ్యర్థుల గెలుపు బాధ్యత ఉంటుంది. దానికి ఎమ్మెల్యేలే పూర్తి బాధ్యులు’ అని సీఎం స్పష్టం చేశారు. మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు, ఆ పార్టీ బలపరిచిన ఉపాధ్యాయ నియోజకవర్గాల అభ్యర్థులైన పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, వెన్నపూస రవీంద్రారెడ్డి, సీతంరాజు సుధాకర్‌, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డిలను సీఎం పరిచయం చేశారు.







11/02/2023

https://www.facebook.com/101552989489984/posts/131947156450567/?mibextid=Nif5oz

NELLORE FIRE ACCIDENT| నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం |

నెల్లూరు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కలెక్టరేట్‌లో భద్రపరిచిన ఎన్నికల సామగ్రి పూర్తిగా దగ్ధమైంది.

Follow us Political Sinnodu for more updates!


నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు వాహనాలతో మంటలు ఆర్పుతున్నారు. ఇవాళ రెండో శనివారం సెలవు కావడంతో సిబ్బంది ఎవరూ విధుల్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కలెక్టరేట్‌లో భద్రపరిచిన ఎన్నికల సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

01/11/2022

Class rooms

01/11/2022
17/10/2022

ఇక్కడ మీ తీపి జ్ఞాపకాలు షేర్ చేయండి ఫ్రెండ్స్....

Sign Up for Free Online Courses | Alison 26/01/2022

Free Diploma Certificate from this link


Sign Up for Free Online Courses | Alison All Alison courses are free to study and complete. With over 3500 free online courses and classes to choose from, why not start now?

01/08/2021

Guess the batch details...

24/07/2021

Want your school to be the top-listed School/college in Nellore?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Subedarpet
Nellore
524002