23/07/2017
శ్రీ విజ్ఞాన్ విద్య నికేతన్ స్కూల్ నవాబుపేట్
చట్టాన్ని చేతులో కి తీసుకొని ఒక మారు మూల గ్రామంలో మహిళ ప్రిన్సిపాల్ కు పదే పదే ఫోన్ లు చేసి జూన్ నుంచి నాలుగు సార్లు దాడి చేసి డబ్బులు ఇవ్వనందుకు అబల అని చూడకుండా ఆమె స్థలం లోకి పది మంది వచ్చి ఆమెను గాయ పరిచి ఎదిరిస్తే అట్రాసిటీ కేస్ పెట్టి ఆడపిల్ల ఫోటో లు తీసి సోషల్ మీడియా లో పెట్టి ఆమె ఆత్మ గౌరవం పొడగొట్టి ఆత్మ హత్య చేసుకునేలా చేస్తున్నారు .
ప్రభుత్వ అధికారులను అందరిని లంచ గొండిలని నిందిస్తున్నారు.
అస్సలు మీరు వచ్చింది అక్రమ వసూళ్ళ కు ఇవ్వక పోతే దాడి .
ఇది SFI ఉదేశమా !ఇది మాకు తెలియదు మీకు బందు ( స్ట్రైక్ ) అనగానే మేము సహకరిస్తున్నాము .
మేము ఒకప్పుడు SFI కార్యకర్తలమే . ఒక స్త్రీ చదువుకొని స్వయం ఉపాధి పొందుతూ తనతో పాటు 20 మందికి ఉపాధి కలిపిస్తూ సమాజ నిర్మాణానికి తోడ్పడుతుంది .భావి భారత పౌరులను తయారు చేస్తుంది. మీరు పురుషులై ఉండి అక్రమ వాసులకు పాలు పడుతూ సమాజ నాశనానికి కారణం అవుతున్నారు .అడ్డుకున్న అధికారుల ఆత్మ గౌరవంను కించ పరుస్తున్నారు .ఇలాంటి స్త్రీ పై పది మంది దాడి చేస్తే రక్షించుకునే హక్కు ఆమెకు ఉంది .దీని అట్రాసిటీ అంటున్నారు . ఒక భారతమాత ఒడిలో ఒక తల్లి కి అన్యాయం జరిగితే భారత బిడ్డలైన విద్యార్థులు , విద్యార్థి సంఘాలు , మహిళ లోకం సహించదు .మీరు పుట్టింది మిమ్మల్ని పెంచింది ఒక తల్లి.
వికారాబాద్ జిల్లా లోని మహిళ అధికారులైన ( కలెక్టర్, SP ,DEO ) వీరిని ఆదర్శనంగా తీసుకొని ఒక మహిళ ఉపాధి కలిపిస్తూ ప్రిన్సిపాల్ గా ఉండటం అన్యాయమా ! ఒక IAS ఆఫీసర్ భార్య IAS లేరా ! కలెక్టర్ భార్య కలెక్టర్ లేరా ! ఒక టీచర్ భార్య ప్రిన్సిపాల్ కావడం నేరమా !
ఒక ట్రైనింగ్ టీచర్ ప్రిన్సిపాల్ గా ఉంటే పదవ తరగతి చదవలేదు అని అంటున్నారు . తెలిసి తెలియక మాట్లాడుతున్నారు పరిహారం అనుభవిస్తారు .
మిత్రులారా సర్టిఫికెట్స్ చూడండి మీకే న్యాయ అన్యాయాలు తెలుస్తాయి . SFI పెరు పెట్టుకొని దాని విలువ తియ్యకండి.