04/11/2020
శబ్ధం యొక్క తరంగ శక్తినీ, వేగాన్ని నిరూపించడానికి ఈ వీడియో ఒక చక్కని ఉదాహరణ,
శబ్దానికి తరంగశక్తి వుంటుంది, దాని ఫ్రీక్వెన్సీ స్థాయిని బట్టి నెగెటీవ్ లేదా పాజిటివ్ వైబ్రేషన్ ఉత్పన్నమవుతుంది. మంత్ర శాస్త్రంలో శబ్దానికే అత్యంత ప్రాముఖ్యత వుంటుంది, బీజాక్షరాల తో ఏర్పడే శబ్దం ఒక అద్భుతమైన మంత్ర శక్తిగా రూపాంతరం చెందుతుంది, వాటి నుండి వచ్చే శక్తి వైబ్రేషనే నాడు యంత్రాలుగా, చక్రాలుగా రూపొందించబడ్డాయి, ఇదంతా మన పూర్వీకులు దివ్య దృష్టితో ఏనాడో కనొగొని మంత్రం, యంత్రం, తంత్రం వంటి వాటిని ఆచరించి చూపించారు,
పేరు కూడా ఒక శబ్దమే, మన పేరులోని ప్రతి అక్షరానికి ఒక సంఖ్యా వైబ్రేషన్, ఒక గ్రహ తత్వం వుంటుంది, వ్యక్తి పుట్టిన సమయాన్ని అనుసరించి ఆయా వ్యక్తికి కొన్ని మిత్ర గ్రహాలు, శత్రు గ్రహాలు, వాటి ఆధారంగా కొన్ని మిత్ర సంఖ్యలు, శత్రు సంఖ్యలు ఏర్పడుతాయి, వ్యక్తి పేరులో మిత్ర అక్షరాలు, మిత్ర సంఖ్యా వైబ్రేషన్ ఎక్కువగా వుంటే తలచిన కార్యాలను నెరవేర్చుకోగలగడం, అవకాశాలను అందిపుచ్చుకోగలగడం, జీవితంలో మెట్టు మెట్టుగా ఎదగడం వంటివి జరిగి అదృష్ట జాతకుడిగా పేరు గడిస్తారు, ఆ వ్యక్తి జన్మ తేదీని అనుసరించి అతని పేరులో శత్రు సంఖ్యా వైబ్రేషన్ ఎక్కువగా వుంటే కృషికి తగిన ఫలితాలు దక్కకపోవడం, అవకాశాలు జారవిడుచుకోవడం, మానసిక అనిశ్చితి మొదలగు సమస్యలతో సతమతమవడం జరుగుతుంటుంది.
#వ్యక్తి_పేరే_ఒక_మంత్రం, #పేరు_రాయడం_ఒక_తంత్రం,
ఈ మంత్రం, తంత్రం ఫలించడం లేదా దుష్ఫలించడం అనేది
ఆ వ్యక్తి పుట్టిన తేదీ పై ఆధారపడి వుంటుంది. ఎందుకంటే పుట్టిన తేదీలోని సంఖ్యలను బట్టే శబ్దాలు మనపై పాజిటీవ్ గాను లేదా నెగటీవ్ గాను ప్రభావం చూపిస్తాయి.
శబ్దానికి అంతటి శక్తి వుంది, పాశ్చాత్యుడైన స్ట్రాంగ్లన్ అన్న శాస్త్రవేత్త గాయత్రి మంత్రం పై పరిశోధనలు చేసి ఇలా పేర్కొన్నాడు, గాయత్రి మంత్రాన్ని సక్రమంగా ఉచ్చరించినట్లయితే అది ఒక సెకండుకు రెండు లక్షల ప్రకంపనలను కలిగిస్తుంది అని తెలిపి, ప్రయోగ రీత్యా ఆయన అమెరికాలో నిరూపించాడు.
హన్స్ జెన్నీ అనే శాస్త్ర వేత్త ఓంకారం పై పరిశోధనలు చేసి టొనోగ్రఫీ ద్వారా ఏర్పడిని శ్రీ చక్రాన్ని అందరి కళ్ళకీ చూపించి, “ఓం”కార శబ్ద రూపం సాక్షాత్తు శ్రీ చక్రమే అని నిరూపించాడు.
మన శాస్త్రాలపైన పాశ్చాత్యులు తలమునకలై పరిశోధనలు చేసి భారతీయ ఘణత చాటుతుంటే మనలో కొందరు మాత్రం కనీస అధ్యయనం కూడా చేయకుండా, మూఢ నమ్మకాలు, బూటకాలు, ఇంకా ఏ కాలంలో ఉన్నారు అంటూ కొట్టి పారేస్తున్నాం,
మనసు పెట్టి అధ్యయణం చేస్తే మన శాస్త్రాల మహత్యం తప్పకుండా తెలుస్తుంది.
ఇప్పటి వరకూ చరిత్రలోనూ, ప్రస్తుత కాలంలోనూ
ప్రసిద్ది గాంచిన ప్రముఖుల (సెలబ్రిటీల) పేర్లలోని సంఖ్యలు
వారి వారి పుట్టిన తేదీలలోని సంఖ్యలకి అనుకూలముగా వుండడం
మనం గమనించవచ్చును.
వ్యక్తి పేరులోని వైబ్రేషన్ అతను పుట్టిన తేదీలోని సంఖ్యలకు అనుగుణంగా వుంటే
అదృష్టం, విజయాలూ, కీర్తి, సుఖ సంతోషాలతో జీవించవచ్చును.
__/\__సర్వేజనా సుఖినోభవంతు__/\__
ఓంప్రకాష్ విశ్వజ్ఞ - ఆస్ట్రో న్యూమరాలజిస్ట్