Narasimha YADAV Rapothu

Narasimha YADAV Rapothu IAM A physics lecturer

17/07/2022
జగం మెచ్చిన జనం నచ్చిన సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత "అల్లా రఖా రెహమాన్" గారి జన్మదినం జనవరి6న ఆసందర్భంగా..జననం    6 జనవర...
06/01/2021

జగం మెచ్చిన జనం నచ్చిన సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత "అల్లా రఖా రెహమాన్" గారి జన్మదినం జనవరి6న ఆసందర్భంగా..

జననం 6 జనవరి1967

రెహమాన్ కి ముందు పెట్టిన పేరుఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చాడు. తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం దక్కింది

రెహ్మాన్‌ అసలు పేరు ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్‌. తండ్రి ఆర్. కె. శేఖర్, తల్లి కస్తూరి. శేఖర్ సంగీత దర్శకుడు. ఆలయాల్లో భజన పాటలు పాడేవాడు. రెహమాన్ కు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు. అక్క కొడుకు జి. వి. ప్రకాష్ కూడా ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు. నాలుగేళ్ళ వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. ఆ సమయంలో ఇంట్లోని సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు- పేదరికం. 11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు
నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు.

రెహమాన్ భార్య సైరా బాను. తడ దర్గా ఖాద్రీ ఈమెను రెహమాన్ తల్లికి చూపించి సరైన జోడీ అని చెప్పారు. అలా వీరి వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఖతీజా, రహీమా, అమన్‌. రెహమాన్ పుట్టిన రోజైన జనవరి 6 నే కుమారుడు అమన్ కూడా పుట్టాడు.

చిన్నతనాన పనిలో పడి బడికి సరిగా వెళ్ళలేక పోయాడు. దాంతో తల్లి కూడా అతన్ని చదువు మానేసి సంగీతం మీదనే దృష్టిపెట్టమని చెప్పింది. మొదట్లో చదువుకోలేకపోయినందుకు అసంతృప్తి చెందినా తరువాత జీవిత పాఠాలు నేర్చుకున్నందుకు సంతోషపడ్డాడు. 1987 లో చెన్నై లోని కోడంబాకం లోకి వచ్చిన రెహమాన్ కుటుంబం అప్పటి నుంచీ అక్కడే ఉంటోంది. అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో కూడా రెహమాన్ కు ఓ ఇల్లుంది. పని ఒత్తిడి నుంచి బయటపడ్డానికి, సాధారణ జీవితం గడపడానికి అక్కడికి వెళుతూ ఉంటాడు.

తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఇంట్లోనే ఒక స్టూడియో ప్రారంభించాడు. రెహమాన్ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఇంట్లో హిందూ దేవుళ్ళతోపాటు మేరీమాత, మక్కా మదీనా చిత్రాలు కూడా ఉండేవి. భర్త చనిపోయిన తర్వాత ఆమె ప్రశాంతత కోసం నెల్లూరు జిల్లా, తడ దగ్గరలోని సూఫీ ప్రవక్త కరీముల్లా షా ఖాద్రీ బోధనలకు ఆకర్షితులై వీరి

Address

Challavanikunta Village, Pasnoor Post Nampally Mandal, Nalgonda District
Nalgonda
508373.

Telephone

+919666020947

Website

Alerts

Be the first to know and let us send you an email when Narasimha YADAV Rapothu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Narasimha YADAV Rapothu:

Shortcuts

Share

Category