The Mission By Sevenhills

The Mission By Sevenhills Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The Mission By Sevenhills, Education, Nalgonda.

THE MISSION
నలుగురు కోసం నడిచే దారిలో నడక ఎంత కష్టమైనా నడవడం ఆపకు ఎన్ని అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయకు ఎందుకంటే భవిష్యత్తులో అది ఎందరికో బంగారు బాటవుతుంది అదే నీకు రాచబాట కాగలదు మరిచిపోకు మిత్రమా✍️✍️

12/12/2025
05/12/2025

28/11/2025

డిసెంబర్‌ 4, 5 తేదీల్లో పుతిన్‌ భారత పర్యటన

దిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి భారత్‌ రానున్నారు. డిసెంబర్‌ 4, 5 తేదీల్లో ఆయన భారత పర్యటన జరగనున్నట్లు క్రెమ్లిన్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 2021 తర్వాత పుతిన్‌ భారత్‌ పర్యటించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ సందర్శన ప్రాధాన్యం సంతరించుకుంది.

🔶 మోదీ–పుతిన్‌ గత సమావేశాలు

గత రెండేళ్లుగా భారత్–రష్యాల మధ్య ఉన్నతస్థాయి పరస్పర సందర్శనలు, సమావేశాలు కొనసాగుతున్నాయి.

గత ఏడాది రెండు సార్లు మోదీ–పుతిన్‌లు భేటీ అయ్యారు.

జూలై 2024లో జరిగిన శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని మోదీ రష్యా వెళ్లారు.

అక్టోబర్లో రష్యా కజాన్‌లో జరిగిన బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా వీరిద్దరూ మళ్లీ కలుసుకున్నారు.

ఇటీవల చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో కూడా మోదీ–పుతిన్‌లు భేటీ అయి పలు కీలక అంశాలపై చర్చించారు.

🔶 పర్యటనలో ఏం చర్చించనున్నారు?

పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య

రక్షణ సహకారం

ఇంధన–శక్తి రంగ ఒప్పందాలు

వాణిజ్య విస్తరణ

జియోపాలిటికల్‌ పరిస్థితులు
పై చర్చలు జరగనున్నట్లు విదేశాంగ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

28/11/2025

హైదరాబాద్‌కు ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ — డిసెంబర్‌లో G.O.A.T ఇండియా టూర్‌

ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ ఈ డిసెంబర్‌లో హైదరాబాద్‌ పర్యటించనున్నట్లు సమాచారం. G.O.A.T India Tour–2025లో భాగంగా మెస్సీ హైదరాబాద్‌కు రావడం క్రీడాభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.

తెలంగాణ బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా, ‘Telangana Rising’ కార్యక్రమానికి మెస్సీని గ్లోబల్‌ బ్రాండ్‌ అంబాసడర్‌గా ఆహ్వానించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక డిమాండ్‌ ఉన్న క్రీడా ప్రముఖుల్లో మెస్సీ ఒకరు.
భారతదేశంలో ఏకంగా ఒకే బ్రాండ్‌ ఎండోర్స్‌మెంట్‌కు ఏడాదికి రూ.100 కోట్లకు పైగా ఛార్జ్‌ చేస్తున్నట్లు సమాచారం.

మెస్సీ పర్యటన తెలంగాణలో క్రీడలు, యువత, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రమోషన్‌కు పెద్ద మద్దతు ఇస్తుందని అధికారులు భావిస్తున్నారు.

28/11/2025

🌊 గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు

2027 గోదావరి పుష్కరాల కోసం అధికారిక తేదీలు నిర్ణయించబడ్డాయి. రాష్ట్రాలు, కేంద్రం కలిసి భారీ ఏర్పాట్లు ప్రారంభించనున్నాయి.

🔹 పుష్కరాల కాలం:
2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించబడనున్నాయి.

🔹 కేంద్ర నిధుల కేటాయింపు:
పుష్కరాలకు ముందుగానే కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.

🔹 అంశాల వివరాలు:

గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ.100 కోట్లు ప్రకటించిన కేంద్రం

మౌలిక వసతులు, ఘాట్లు, రవాణా, భద్రత, పర్యాటక సౌకర్యాల అభివృద్ధికి ఈ నిధులు వినియోగం

సంబంధిత రాష్ట్రాలకు త్వరలో మార్గదర్శకాలు పంపనున్న కేంద్రం

🕉 గోదావరి పుష్కరాలు ప్రతి 12 ఏళ్లకోసారి వచ్చే పవిత్ర స్నాన యాత్ర. ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

28/11/2025

> పెరిగిన భారత్‌ GDP వృద్ధిరేటు.. 2025-26 రెండో త్రైమాసికంలో 8.2 శాతం GDP నమోదు.. గత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో 5.6 శాతం GDP.. గత 6 త్రైమాసికాల్లో ఇదే అత్యధిక GDP వృద్ధిరేటు

23/11/2025

��శుభోదయం..�సమయం లేదు.. మిత్రమా ��
�.. మిత్రమా
మనలాంటి పేద,మధ్యతరగతి నిరుద్యోగ యువత కోసం మరియు సమసమాజ స్థాపన కోసం ఎన్నో ఒడిదుడుకులు,ఆటంకాలు ఎదుర్కొని అహర్నిశలు శ్రమిస్తూ,ప్రస్తుత సమాజంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పది మందికి జ్ఞానాన్ని బోధిస్తూ నువ్వే ఒక నాయకత్వాన్ని లీడ్ చేయమని మనకు మార్గదర్శకత్వం ఇస్తున్న ఏకైక వేదిక మన "THE MISSION ���" విజయవంతంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని 11 వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా 2025 నవంబర్ 24 న నిర్వహించుకుంటున్న 10 వ వార్షికోత్సవ సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి�.
MISSION ���@

@వేదిక: రవీంద్ర భారతి, లక్డికాపూల్ దగ్గర,హైదరాబాద్@

23/11/2025

23/11/2025

✨ “మిషన్ అనే వెలుగు”
uniform లో ధైర్యం,
హృదయంలో సేవ…
దేవుడు ఇచ్చిన పేరు,
ప్రజలు పెట్టిన గౌరవమే “మిషన్”.
పదవి ఒక బాధ్యత,
సేవ ఒక నిబద్ధత…
రెoడు చేతులతో రక్షణ,
మూడో చేతిగా జ్ఞానాన్నిచ్చే మహత్తు.
చిన్న గ్రామాల్లో వెలిగించిన వెలుగు,
లక్షల హృదయాల్లో నింపిన ఆశ…
పేదవాడి కలకే అండగా నిలిచే
ఆశీర్వాదం లాంటి అడుగులు.
పుస్తకం చేత పట్టించి,
ధైర్యం గుండెలో నాటించి,
తడబడే యువతకు
“నీ సామర్థ్యం నువ్వే” అని చెప్పే గురువు.
స్వార్థం లేని సేవ,
సమన్వయం తోడైన ప్రేమ,
ఏడుకొండల సర్ దీవెనలతో
ఎంతో మంది జీవితాలు మార్చారు!
మార్పు కోసం మిషన్,
మిషన్ కోసం మనసు,
మనసు కోసం మానవత్వం—
అదే ఎడుకొండలు సార్ మహత్యం🙏🏻🙏🏻🙏🏻

23/11/2025

🙏🌹శుభోదయం..💐సమయం లేదు.. మిత్రమా 💐💐
💐.. మిత్రమా
మనలాంటి పేద,మధ్యతరగతి నిరుద్యోగ యువత కోసం మరియు సమసమాజ స్థాపన కోసం ఎన్నో ఒడిదుడుకులు,ఆటంకాలు ఎదుర్కొని అహర్నిశలు శ్రమిస్తూ,ప్రస్తుత సమాజంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పది మందికి జ్ఞానాన్ని బోధిస్తూ నువ్వే ఒక నాయకత్వాన్ని లీడ్ చేయమని మనకు మార్గదర్శకత్వం ఇస్తున్న ఏకైక వేదిక మన "THE MISSION 🏹🏹🏹" విజయవంతంగా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని 11 వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా 2025 నవంబర్ 24 న నిర్వహించుకుంటున్న 10 వ వార్షికోత్సవ సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి🙏.
MISSION 🏹🏹🏹@

@వేదిక: రవీంద్ర భారతి, లక్డికాపూల్ దగ్గర,హైదరాబాద్@

Address

Nalgonda

Alerts

Be the first to know and let us send you an email when The Mission By Sevenhills posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category