08/06/2016
నమస్తే…..
ఏంటీ, మీ పిల్లలను ఏ స్కూల్ కు పంపాలని ఆలోచిస్తున్నారా? రోజుకో ప్రైవేట్ స్కూల్ వాళ్లు వచ్చి మా బడిలో చేర్పిస్తే… మీ పిల్లల భవిష్యత్ ఇలా ఉంటుంది,అలా ఉంటుందని అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ తెగ కన్ఫ్యూస్ చేస్తున్నారా? అయితే ఈ విషయంలో మేము మీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాం.వీలైతే మేం చెప్పినట్టు చేయండి. ఫస్ట్…. ఓ సారి మన ఊరిలోని ప్రభుత్వ పాఠశాల దగ్గరకు వెళ్లండి..దాన్ని గమనించండి..ఇప్పుడు ఓ సారి కళ్లు మూసుకొని ..అక్కడ ఆ స్కూల్ లేదని మనస్సులో గట్టిగా అనుకొని… కళ్లు తెరిచి చూడండి. గుండెలో కళుక్కుమంది కదా…! ఒక్కసారిగా ఏదో తెలియని బాధ మీ మనస్సును ఆవరించింది కదా..మీరు చదువుకున్న రోజులు..మీ జ్ఞాపకాలు ఒక్కసారిగా సమాధి చేయబడిన ఫీలింగ్ మిమ్మల్ని తెగ ఇబ్బంది పెట్టింది కదా..! యస్…. మీరు మేల్కొనకపోతే… ఇప్పుడు అదే జరుగబోతోంది. మన కళ్ల ముందే మనకు విజ్ఞానాన్ని ప్రసాదించిన చదువులమ్మ ఒడి కాలగర్భంలో కలిసిపోనుంది. అందుకే మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి..వాటిని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
సెంటిమెంట్ కాదు మా పిల్లల చదువే మాకు ముఖ్యం అని ప్రశ్నించే మీకు మా సమాధానాలు:
1వ ప్రశ్న: ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలకు చదువు రాదు, అలాంటప్పుడు మా పిల్లల్నిసర్కారీ స్కూల్స్ లో ఎందుకు చేర్పించాలి?
జవాబు: ఇది కేవలం అపోహ మాత్రమే… ప్రైవేట్ పాఠశాలల అభూతకల్పన మాత్రమే. ఎందరో IAS,IPSలు , మరెందరో ఉన్నత పదవుల్లో ఉన్న వారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే. మరో విషయం… చదువంటే కేవలం మార్కులే అనే భ్రమలోకి మిమ్మల్ని నెట్టివేశాయి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. విద్యార్థిని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేదే విద్య…అది ప్రభుత్వ బడులతోనే సాధ్యం.
2వ ప్రశ్న: ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠాలు సరిగ్గా చెప్పరు కదా?
జవాబు: గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సంపాదించడం అంత తేలికైన విషయం కాదు. ఉపాధ్యాయ అర్హత పరీక్షను దాటి, DSCలో వేల మందిని వెనక్కి నెట్టి… ఈ ఉద్యోగాన్ని అందుకున్న వ్యక్తి పాఠాలు సరిగ్గా చెప్పరు అనడం మన అవివేకం… అతనికున్న విషయ పరిజ్ఞానం ముందు ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎందుకు కొరగారు అనేది నగ్న సత్యం. పాతతరం టీచర్లు పాఠాలు సరిగ్గా చెప్పకపోయేవారు అనే వాదనలో కొంత వాస్తవమున్నప్పటికీ…ఇప్పటి ఉపాధ్యాయుల్లో విదార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలనే కోరిక, పట్టుదల బలంగా ఉన్నాయి మనం పూర్తి స్థాయిలో సహకరించాలే కానీ అద్భుతమైన ఫలితాలను అందించడానికి వారు ఎప్పుడూ సిద్దమే.
3వ ప్రశ్న: అసలు గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పిస్తే మాకేంటి.?
జవాబు: మధ్యాహ్న భోజన పథకం పేర ఉచిత పౌష్టిక ఆహారం. ఫ్రీ యూనిఫామ్, ఉచిత పాఠ్య పుస్తకాలు, పక్కా బిల్డింగ్ లో ఉన్నత విలువలతో కూడిన విద్యా బోధన. సునిశితులైన ఉపాద్యాయులచే టీచింగ్, విశాల ఆటస్థలాలు, అన్నింటికి మించి మార్కుల కోసం బట్టి పట్టించే చదువులకు వీడ్కోలు పలికించి…విద్యార్థి ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కు పనికొచ్చే చదువును అందించడం. నెలకోసారి విద్యార్థుల తల్లిదండ్రులతో సమీక్షా సమావేశం, వ్యాయామ విద్య,ఉచిత ఆరోగ్య పరీక్షలు , నవోదయ, ప్రభుత్వ IITల అడ్మీషన్ లలో సర్కారీ స్కూల్స్ లో చదువుకున్న విద్యార్థులకు ప్రత్యేక ఫ్రిపరెన్స్ ఉంటుంది.
4వ ప్రశ్న: ఇంగ్లీష్ మీడియం సంగతేంటి?
జవాబు: నాలుగు రైమ్స్, 20 ఇంగ్లీష్ పదాలు ….మీ పిల్లల నోటి నుండి వస్తే అబ్బా…మా పిల్లాడికి మస్త్ ఇంగ్లీష్ వచ్చేసింది అనుకునే భ్రమ మనది. ముందు దాని నుండి బయటపడదాం…ప్రభుత్వ బడులల్లో అంతకు మించిన ఇంగ్లీష్ ను బోధించే సామార్థ్యం ఉన్న టీచర్స్ ఉన్నారు. మన స్కూల్ విషయానికి వస్తే…మనమంతా మా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు కావాల్సిందే అని డిమాండ్ చేస్తే…ప్రభుత్వం తప్పక అనుమతినిస్తుంది…దగ్గరుండి మరీ ప్రోత్సాహిస్తుంది. ఫస్ట్ స్కూల్స్ లో సరిపడ పిల్లలుంటే…ఏం కావాలన్నా అడిగి మరీ తెప్పించుకోవొచ్చు.
కళ్లు తెరిపించే నిజాలు:
చదువు భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులలో అధిక శాతం మంది ప్రైవేట్ స్కూల్స్ లో చదివిన వారే.
ఉద్యోగం పొందకపోయినా…ఏదో ఓ రంగంలో నిలదొక్కుకునే సామర్థ్యం ప్రభుత్వ బడులలో చదివిన వారికి ఎక్కువ.
ఆత్మస్థైర్యం, ధైర్యం, పాజిటివ్ థింకింగ్, పోటీతత్త్వం, పరోపకార గుణాలు ప్రభుత్వ పాఠశాలలో సహజంగా అలవడుతాయి.
తల్లిదండ్రులను గౌరవించడం, సామాజిక కార్యక్రమాల్లో ముందుండడం, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడంలో..గవర్నమెంట్ స్కూల్ పిల్లలే ముందుంటారు.
మేమిచ్చే బహుమతి వివరాలు:
ఈ విద్యా సంవత్సరంలో మన గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థికి 1000 రూపాయల విలువగల స్కూల్ కిట్ ను ఉచితంగా అందిస్తాం….
( స్కూల్ బ్యాగ్+ ప్లేట్+వాటర్ బాటిల్+ నోట్ బుక్స్+ 5పెన్స్+2 పెన్సిల్స్+కలర్ పెన్సిల్స్+ జామెంట్రీ బాక్స్ లతో కూడిన గిఫ్ట్ ప్యాక్). అంతేకాక గవర్నమెంట్ స్కూల్స్ లో తమ పిల్లలను చేర్పించిన తల్లీదండ్రులను ప్రత్యేక అతిథితో సన్మాన కార్యక్రమ