MPPS Rachala

MPPS Rachala MPPS Rachala is located in Rachala Village, Addakal Mandal, Mahabubnagar Dist, Telangana State, India..

11/08/2022
31/01/2022

ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయునది ఏమనగా
*తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తేదీ:01.02.2022నుండి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతున్న సందర్భంగా* పాఠశాల కు హాజరు కాబోతున్న మీ అందరికీ కూడా స్వాగతం.. సుస్వాగతం.

*ఈ సందర్భంగా ఈ క్రింద సూచించబడిన సూచనలు సలహాలను విధిగా పాటించాల్సిందిగా కోరడమైనది.*

1.🛺🚌 బస్సు లేదా ఆటోలలో వచ్చేవారు ప్రయాణ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండేవిధంగా అనగా తక్కువగా మాట్లాడుతూ, మాస్క్ ధరించి ఉండవలెను.
2.🧂 కనీసం రెండు బాటిల్స్ లో మంచి నీటిని తమ వెంట తెచ్చుకోవలెను. ఇట్టి నీటిని ఇతరులతో పంచుకోరాదు.
3.🍚 మధ్యాహ్న సమయంలో భోజనము ఇతరులతో పంచు కోరాదు.
4.🥄 భోజన సమయంలో చెంచా ను ఉపయోగించడం మంచిది
5.😷 పాఠశాలలో తప్పనిసరిగా మాస్కు ధరించాలి
6.🧴 చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకున్న తరువాతనే పాఠశాలలోకి ప్రవేశించాలి.
7.👬👬 పాఠశాలలో గుంపులుగా తిరగడం మరియు మధ్యాహ్న సమయంలో కలిసి భోజనం చేయడం పూర్తిగా నిషిద్ధం
8.🤝 కరచాలనాలకు స్వస్తి పలకండి
9.🙏నమస్కారం ద్వారా పలకరించండి.
10.🧍‍♂️. 🧍‍♂️ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించండి.
11.🎒 మీ రూల్ నెంబర్ వారీగా కేటాయించిన గదిలోనే ప్రతిరోజు కూర్చోవాలి.
12.🏏 ఆటలకు తాత్కాలిక విరామం ఇవ్వండి.
13.🪣 వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి.
14.🚽 మరుగుదొడ్లను ఉపయోగించిన పిదప చేతులు శుభ్రం చేసుకోండి.
15.💉 ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా పాఠశాల హెచ్.ఎం./టీచర్లకు మరియు తల్లిదండ్రులకు తెలపండి.
16.ఎప్పటికప్పుడు టీచర్లు ఇచ్చే సూచనలను పాటిస్తూ కరోనా నుండి మనల్ని మనం, మన మిత్రుల్ని మరియు తోటివారిని కాపాడుకుంటూ చక్కటి విజ్ఞానాన్ని అంది పుచ్చుకుంటారని ఆశిస్తూ...

*ఇట్లు*
*ప్రధానోపాధ్యాయులు*
*మరియు ఉపాధ్యాయబృందం*
*ZPHS /PS/UPS*

Address

Mahabubnagar
509219

Website

Alerts

Be the first to know and let us send you an email when MPPS Rachala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share