05/10/2020
మన #మదనపల్లె ఘణ #చరిత్ర...
"చరిత్రపుటల్లో మదనపల్లెకు చెక్కుచెదరని స్థానం వుంది."
క్రీ.శ.1622లో ఏర్పడ్డ #మదనపల్లె #పట్టణం #ఆంధ్రా #తమిళనాడు #కర్ణాటక రాష్ట్రాల సంస్కృతుల మేలుకలయికతో మదనపల్లె అన్నింటా ప్రత్యేకతను చాటుకుంటోంది.
చోళరాజ్య చరిత్రను బట్టి #మదనపల్లె చరిత్ర తెలుస్తోంది. అయితే ఈ పట్టణం
శ్రీ యోగభోగేశ్వరస్వామి ఆలయం వద్ద పాత ఊరు వున్నట్టు చరిత్ర కారులు అంటున్నారు.
బాహుదానదికి పడమర వైపున ఊరు వున్నందున వాస్తుశాస్త్ర ప్రకారం అభివృద్ధి చెందేందుకు అవకాశం లేనందున అప్పటి పాలెగారు శ్రీమాన్ అహొబిలనాయడు ఊరును మార్చాలని నిర్ణయించారు.
కొత్త ఊరును నిర్ణయించేందుకు స్థల విషయమై ఒక గోవును విడిచిపెట్టారని, ఆ గోవు గడ్డిమేస్తూ అడవిలో ప్రస్తుతం పట్టణం వున్న ప్రాంతానికి వచ్చి ఆగిందని దానిని ఆధారంగా తీసుకుని క్రీ.శ.1618లో ఆహొబిలనాయడు నూతన పట్టణం నిర్మాణానికి శ్రీకారం చుట్టారని స్థానికుల నమ్మకం. అప్పట్లో పట్టణానికి మదనపురి అనే పేరు పెట్టారని కాలక్రమంలో మదనపల్లెగా మారిందని ప్రతీతి.
మదన అంటే మన్మధుడు నివాసం ఉండే విధంగా ఆహ్లాదాకరమైన వాతావరణం వున్నందున పట్టణానికి ఆ పేరు వచ్చిందని ప్రజలు అంటున్నారు. ఆహొబిల నాయడు పట్టణం చుట్టూ ఒక కోటను కట్టించారని ఆ కోటకు పలు ద్వారాలు ఏర్పాటు చేశారని చరిత్రకారులు చెబుతున్నారు. కాలక్రమంలో ఆ కోట ధ్వంసమైంది. ప్రస్తుతం నడిబొడ్డున వున్న కోటవీధి, అగర్తల వీధి, సిపాయి వీధులే ఇందుకు నిదర్శనం. ఈ ప్రాంతంలో కోట నిర్మిచుకున్నట్లు కొన్ని ఆధారాలు కూడా వున్నాయి.
విజయనగర రాజులు పాలెగాళ్ళగా వున్న బసవన్న, మాదన్నలు మదనపల్లె పట్టణాన్ని పరిపాలించారు. వీరికి గుర్తుగా పట్టణానికి తూర్పువైపు రెండు కొండలకూ మాదన్నకొండ, బసవన్న కొండ అని పేరుపెట్టినట్టు చెబుతున్నారు. కాలక్రమంలో
ఈ పేర్లు బసినికొండ, మాదిన కొండలుగా మారాయి.
సూర్యుడు దక్షణాయణంలో మాదిన కొండపైన, ఉత్తరాయణంలో బసినికొండ పైన ఉదయిస్తాడు.
క్రీ.శ. 907-955 మధ్య మదనపల్లె చోళ సామ్రాజ్యంలో భాగంగా వుంటూ పరాంతకుని పరిపాలన కింద వుండేది. ఆ తర్వాత మదనపల్లెను యాదవనాయకులు, హొయసల పాలకులు పరిపాలించారు. వీరి తరువాత విజయనగర సామ్రాజ్యం కిందకు చేరింది. అప్పటి మదనపల్లె పాలెగారు విజయనగరం రాజులకు సాలీనా కప్పం చెల్లించేవారు. విజయనగర సామ్రాజ్యం పతనానంతరం 1565లో గోల్కొండ నవాబులు పాలన కిందకు వచ్చింది. ఆ తర్వాత 1602 మహారాష్ట్ర ముఖ్యుడు షహిజీ మదనపల్లె, పుంగనూరు ప్రాంతాలను తన పాలనలో తీసుకున్నారు. మహారాష్ట్ర పాలకులు 50 సంవత్సరాలు మదనపల్లెపై అధిపత్యం కొనసాగించినట్లు తెలుస్తోంది.
క్రీ.శ.1713లో అప్పటి కడప నవాబు అబ్దుల్‌నబీఖాన్ మదనపల్లెను చేజిక్కించుకున్నాడు. దీంతో అంతవరకు కర్ణాటక పరిధిలో వున్న మదనపల్లె కడప డివిజన్ పరిధిలోకి చేరింది.
మదనపల్లెను గుర్రంకొండ పరగణాలోకి చేర్చి అబ్దుల్‌నబీఖాన్ కొంతకాలం
పరిపాలించారు. కడప నవాబులకు మహారాష్ట్రా నాయకులకు హొరాహొరీగా యుద్ధాలు జరుగుతున్న కాలంలో మదనపల్లె, పుంగునూరు కోసం పలు యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెబుతుంది. ఈ సందర్భంగా కడప నవాబు, మహారాష్ట్ర నాయకుడైన బాలాజీరావును ఓడించి మదనపల్లెను కైవసం చేసుకున్నాడు. ఆ తరువాత మైసూరు మహారాజు గుర్రంకొండ దుర్గాన్ని వశపరచుకున్నారు. దీంతో గుర్రంకొండ పరగణాలో వున్న మదనపల్లె మైసూరు సామ్రాజ్యం కిందకు వచ్చింది. ఒకటవ, రెండవ మైసూరు యుద్ధాల్లో మైసూరు సైనికులకు మదనపల్లెకు అండగా నిలిచినట్లు తెలుస్తోంది. హైదరాలీ తరువాత మైసూరు సింహాసనం ఎక్కిన టిప్పుసుల్తాన్ మదనపల్లెకు రెండుసార్లు వచ్చినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.
1792లో జరిగిన మూడవ మైసూరు యుద్ధంలో టిప్పుసుల్తాన్ ఓడిపోవడంతో శ్రీరంగపట్నం ఒడంబడిక జరిగింది. ఈ ఒడంబడిక ప్రకారం గుర్రంకొండ డివిజన్ మదనపల్లెతో సహా నిజాం పాలకులకు దత్తత చేయబడింది. నిజాం పాలకులకు నాటి వైస్రాయి వెలస్లీతో కుదిరిన ఒప్పందం ప్రకారం కడప, కర్నూలు, బళ్ళారి, అనంతపురం జిల్లాలు ఆంగ్లేయుల వశమయింది. 1800లో అక్టోబర్ 12న కుదిరిన ఒప్పందం ప్రకారం మదనపల్లె బ్రిటిష్ పాలనకు వచ్చింది.
కడప జిల్లా కలెక్టర్‌గా క్రీ.శ.
1800-1807 మధ్య పనిచేసిన థామస్ మన్రో మొదటిసారిగా మదనపల్లెను సందార్శించారు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధుడైన మన్రో మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయం వున్న ప్రాంతంలో ఒక పూరి గుడిసెను నిర్మించుకుని వేసవి విడిదిగా ఏర్పాటు చేసుకున్నారు.
ఆ తరువాత క్రీ.శ.1850 మదనపల్లెను సబ్‌డివిజన్‌గా ఏర్పాటు చేశారు. మొదటి కలెక్టర్‌గా ఎల్‌బి మనోలినిని నియమించారు. కడప జిల్లా కలెక్టర్లు వేసవి విడిది కోసం మదనపల్లెకు వచ్చేవారు.
ఇలా మదనపల్లెకు వస్తూనే హార్సిలీహిల్స్‌ను కనుగొన్నారు. మదనపల్లె చరిత్రను ఒకసారి పరిశీలిస్తే తరచూ వరదలు, తుఫానులు, భీభత్సవాలు, కరవులు ప్రజలను అతాలకుతలం చేసింది. పట్టణం ఇప్పటివరకు మూడు సార్లు వరద ముంపునకకు గురైంది. వరదల్లో సుమారు 80 మంది ప్రజలు మరణించారు. కరువు విలతాండవం చేయడంతో ఆకలి బాధాకు మరో 40 మందికిపైగా మరణించినట్లు తెలుస్తోంది. క్రీ.శ. 1803లో మదనపల్లెలో గొప్ప కరవు సంభవించింది.
ఆ తరువాత సంవత్సరం పెను తుఫాను తాకిడికి మదనపల్లె అట్టుడికింది. క్రీ.శ.1866 లో మరో కరువు వచ్చి రెండు సంవత్సరాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. తిరిగి 1872లో పెనుతుఫాను వల్ల ప్రజలు బాధితులయ్యారు. 1875లో మదనపల్లెలో అతి భయంకరమైన కరువు సంభవించింది. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కరువు నివారణ చర్యలుచేపట్టింది. లంగర్ ఖానా (పేదగృహాలు) పేరుతో మదనపల్లెకు 3 కిలోమిటర్ల దూరంలో అంగళ్ళు రోడ్డులో నిర్మించారు. 1891-92 ల మధ్య మరో పెద్ద కరువు వచ్చింది. ఈ సందర్భంగా అప్పటి మద్రాసు రాష్ట్ర గవర్నర్ లార్డ్ వెన్‌లాక్ మదనపల్లెను సందర్శించారు. అప్పటికి మదనపల్లె ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా వుండేది. అటుతర్వాత 1897, 1900, 1948, 1953 సంవత్సరాల్లో కూడ కరవు వచ్చింది.
1902లో మదనపల్లెలో ప్లేగువ్యాధి సోకడంలో ప్రజలు పట్టణం ఖాళీచేసి పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలోని బసినికొండ చేరారు. ప్రభుత్వ కార్యాలయంలను సైతం బసినికొండకు తరలించారు. అప్పట్లో మదనపల్లె ప్రజలు వలస వెళ్ళిన ప్రాంతంలోనే ప్రస్తుతం బసినికొండ ఏర్పడింది. 1916లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అప్పట్లో సింహళ ప్రాంతీయుడు జిపి ఆర్యరత్న తన స్కౌట్స్ సిబ్బందితో కలిసి మంటలను ఆర్పేందుకు కృషిచేశారు. కాగా పట్టణం అభివృద్ధికి కృషి చేసిన కొలరిజ్ అవెన్యూ గుర్తుగా ప్రస్తుతం పట్టణంలోని అవెన్యూ రోడ్‌కు ఆయన పేరు పెట్టారు. కాలిరజ్ అవెన్యూ మదనపల్లె చరిత్రపై ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మదనపల్లె అను పుస్తకం రాశారు. బ్రిటిష్‌వారితో జరిగిన స్వాతంత్య్ర సంగ్రామంలో మదనపల్లె వాసులు వీరోచితంగా పోరాటం చేశారు. 1911లో జిల్లా విభజన జరిగినపుడు కడప జిల్లా పరిధిలో వున్న మదనపల్లె, వాయల్పాడులను చిత్తూరు జిల్లాలో చేర్చారు. మదనపల్లెలో వైదుంబ, విజయనగర రాజుల శాసనాలు అనేకం కలవు. వైదుంబరాజుల శాసనాలలో వీరుల మరణ విషయం పొందుపరచబడింది.