07/05/2026
అమెరికా – ఇరాన్ యుద్ధం ప్రపంచానికి ఒక పెద్ద పాఠం నేర్పింది.
అమెరికా తనను ప్రపంచ సూపర్ పవర్‌గా చూపించుకోవాలనుకుంది… కానీ ఈసారి ప్రపంచం ముందు బలహీనంగా కనిపించింది.
ట్రంప్ ప్రతి రోజు “డీల్… డీల్…” అంటూ మాట్లాడుతుంటే, ఇరాన్ మాత్రం చాలా కూల్‌గా “ప్రపోజల్ పంపండి… చూస్తాం” అని సమాధానం ఇస్తోంది. నిజంగా అమెరికా గెలిచుంటే ఇలా వేడుకోవాల్సిన అవసరం ఉండేదా?
ఇక 14 పాయింట్ల ఒప్పందంలో ఏముంది?
• హోర్ముజ్ జలసంధి తిరిగి ఓపెన్ చేయాలి
• ఇరాన్ 15 సంవత్సరాలు యురేనియం ఎన్రిచ్‌మెంట్ ఆపాలి
• అండర్‌గ్రౌండ్ న్యూక్లియర్ సైట్లు మూసేయాలి
• అమెరికా ఆంక్షలు తగ్గిస్తుంది
• ఫ్రీజ్ చేసిన బిలియన్ల డాలర్ల ఇరాన్ డబ్బు విడుదల చేస్తారు
కానీ అసలు ప్రశ్న ఏమిటంటే…
ఇరాన్ ఇంకా నిలబడి పోరాడుతుంటే, ఎందుకు ఈ షరతులు అంగీకరిస్తుంది?
సాటిలైట్ చిత్రాల ప్రకారం మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలపై భారీ నష్టం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఒక KC-135 అమెరికన్ ట్యాంకర్ విమానం కూడా మాయమైందనే సమాచారం బయటకు వచ్చింది. కానీ ఈ విషయంపై ట్రంప్ మౌనం ఎందుకు?
ఇజ్రాయెల్ కూడా ఆగే పరిస్థితిలో లేదు. హిజ్బుల్లా, హమాస్‌పై దాడులు ఆపమని అమెరికా ఒత్తిడి తీసుకురాలేకపోతోంది. అంటే ప్రపంచానికి ఒక విషయం స్పష్టమైంది — అమెరికా చెప్పిందే చివరి మాట అన్న రోజులు మారుతున్నాయి.
చైనా, రష్యా బహిరంగంగా ఇరాన్‌కు మద్దతు ఇస్తున్నాయి. చైనా అయితే “ఇరాన్‌కు శాంతియుత అణు విద్యుత్ హక్కు ఉంది” అని స్పష్టం చేసింది.
మరోవైపు పాకిస్తాన్ మాత్రం “ముస్లిం ప్రపంచంలో అణ్వస్త్రాలు ఉన్న ఏకైక దేశం మేమే” అన్న గర్వాన్ని కోల్పోవాలని అస్సలు కోరుకోదు. అందుకే ఇరాన్ అణ్వస్త్ర శక్తిగా మారడాన్ని అది కూడా సైలెంట్‌గా వ్యతిరేకిస్తుంది.
ఈ యుద్ధం ముగిసినా… ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య శత్రుత్వం ఆగదు.
ఈ పోరు ఇప్పుడు కేవలం బాంబులది కాదు… ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న శక్తుల యుద్ధం.