26/12/2025
మైపర్ లో ఘనంగా శ్రీమతి తెరిసమ్మ 3 వర్ధంతి వేడుకలు
కర్నూల్ నగరంలోని ఏ క్యాంప్ నందు గల మైపర్ ఫార్మసి కాలేజ్ లో ఈరోజు తెరిసా శామ్యూల్ జార్జ్ సొసైటీ వ్యవస్థాపకురాలు శ్రీమతి చెరుకూరి తెరిసమ్మ గారి 3 వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీమతి చెరుకూరి తెరిసమ్మ గారు మొట్టమొదటగా 1983లో రాయలసీమ జిల్లాలోనే రాయలసీమ క్రిస్టియన్ కాలేజ్ ని స్థాపించి దాని ద్వారా ఎస్ ఆర్ సి సి బీఈడీ, తెరిసా డిగ్రీ కాలేజ్,, ఎస్ఆర్సి స్కూల్ మరియు ఆమె పేరు మీద స్థాపించిన మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్, ఎస్ఆర్సి బీఈడీ కాలేజ్ నందు చదివిన విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఎంతో క్రమశిక్షణతో విద్యను నేర్పి ఎంతోమందికి ఆదర్శప్రాయమయ్యారు ఈ సందర్భంగా వక్తలు ఆమె గురించి కొనియాడారు. ఈ సందర్భంగా మైపర్ ఫార్మసి కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ శ్రీమతి తెరిస్సమ్మ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మైపర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రాజ్ కుమార్. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కాసర్ల సురేష్, ఎస్ఆర్సి బీఈడీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రకాష్, ఐజయ్య, ఇతర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొని నివాళులర్పించారు.