17/07/2021
కాంగ్రెస్ మొదటి ప్రధానమంత్రి నెహ్రూ 16 సంవత్సరాలు పరిపాలించినా, అంబేడ్కర్ పేరు మీద ఏ ఒక్క పథకం ప్రకటించలేదు. ఆ తర్వాత లాల్ బహుదూర్ శాస్త్రి సంవత్సరంన్నర కాలంలో కూడా అంబేడ్కర్ పేరు మీద ఏ ఒక్క పథకం ప్రకటించలేదు. ఆ తర్వాత నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ 17 సంవత్సరాలు పరిపాలించి తన తండ్రి పేరు మీద, గాంధీ పేరు మీద వేల కొలది పథకాలు, ప్రాజెక్టులు ప్రారంభించింది. అంబేడ్కర్ పేరు మీద ఏమీ చేయలేదు. జనతా పార్టీ 1977-1980 మధ్య మురార్జీ దేశాయ్, చరణ్ సింగ్ పరిపాలించారు. వారు కూడా అంబేడ్కర్ ను మరచి పొయారు. పైన పేర్కొన్న ప్రధాన మంత్రులు ఎవ్వరూ కూడా అంబేడ్కర్ కు సముచిత స్థానం ఇవ్వలేదు. వీరెవ్వరూ అంబేడ్కర్ చిత్రపటాన్ని పార్లమెంటు సెంట్రల్ హాల్ లో పెట్ట లేదు. అంబేడ్కర్ పేరు మీద ఒక పోస్టల్ స్టాంపు గాని, రుపాయి నోటు మీద అంబేడ్కర్ ఫొటో గాని, అంబేడ్కర్ జయంతి రోజున సెలవు ప్రకటించటం గాని చేయలేదు. పైన పేర్కొన్న ప్రధానులు హరిజన పదాన్ని కూడా నిషేదించలేదు. వీరందరూ అంబేడ్కర్ జయంతి రోజున దండలు వేసి, నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళి పొయారే తప్పా ఘనమైన చర్యలు ఏమీ చేయలేదు. ఇవి అన్నియు అక్షర సత్యాలు.
1989 లో శ్రీ వి.పి సింగ్ గారు ప్రధాన మంత్రి అయిన తర్వాత 1990 లో అంబేడ్కర్ జయంతికి తొలిసారిగా జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు ప్రతి ప్రభుత్వం అంబేడ్కర్ జయంతి రోజున సెలవు ప్రకటిస్తూ వస్తున్నారు. మధ్యలో పి.వి. నరసింహారావు కాలంలో ఒక్క సంవత్సరం తప్ప, వి.పి. సింగ్ గారు 1990లో అంబేడ్కర్ కు భారత రత్న ప్రకటించారు. అంబేడ్కర్ పేరు మీద రెండు రుపాయల నాణెం, రెండు రుపాయల పోస్టల్ స్టాంప్ విడుదల చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో తొలిసారిగా అంబేడ్కర్ నిలువెత్తు చిత్రపటాన్ని పెట్టారు. (ఒక రాజ్యాంగ నిర్మాత చిత్ర పటం పార్లమెంట్ లో పైన పేర్కొన్న ప్రధానమంత్రులు పెట్ట లేదంటే వారికి ఎంత కులవివక్ష ఉందో మనమందరం తెలుసుకోవాలి)
నియో బుద్ధిస్టులకు రిజర్వేషన్‌లు ప్రకటించింది వి.పి. సింగ్ గారు.
అంబేడ్కర్ మనుమడైన ప్రకాష్ అంబెడ్కర్ కు రాష్ట్రపతి కోటాలో నామినేటెడ్ రాజ్యసభ సభ్యత్వం ఇప్పించింది వి.పి. సింగ్ గారు. హరిజన పదాన్ని నిషేధించింది వి.పి. సింగ్ గారు.
బిసిలకు మండల్ కమిషన్ ను అమలు చేసింది శ్రీ వి.పి. సింగ్ గారు. అద్వానీ రథయాత్రను అడ్డుకున్నది శ్రీ వి.పి.సింగ్ గారు. అందుకే ఆయనను ప్రథానమంత్రి పదవి నుండి దించేసారు. ఈ దేశంలో అంబేడ్కర్ కు గుర్తింపు ఇచ్చింది మా పార్టీ అంటే మా పార్టీ అని తుప్పు పట్టిన డబ్బాల వాగు చున్న ప్రస్తుత అవకాశ వాద పార్టీలకు చెంపదెబ్బలా ఈ సమాచారం చెప్పండి...
---- ఇట్లు
అంబేద్కరిస్టులు