Srivani Vidyaniketan, Kothapatnam

Srivani Vidyaniketan, Kothapatnam Srivani Vidyaniketan & Srivani Kidz are schools run by Sriram Educational Society aimed to provide q It is recognized by Govt. of AP.

Srivani Vidyaniketan & Srivani Kidz are schools run by Sriram Educational Society aimed to provide quality education.

29/06/2025
07/11/2023

మన ఒంగోలు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 హెల్ప్ లైన్ నంబర్

8184 82 82 82

కొత్తపట్నం లో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం :  కొత్తపట్నం శ్రీవాణి విద్యానికేతన్ ఆధ్వర్యంలో ఒంగోలు శ్రీరామ్ మల...
04/11/2023

కొత్తపట్నం లో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం :

కొత్తపట్నం శ్రీవాణి విద్యానికేతన్ ఆధ్వర్యంలో ఒంగోలు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో రేపు ఆదివారం 5/11/2023 ఉదయం 10 గంటలకు కొత్తపట్నంలోని శ్రీవాణి విద్యానికేతన్ స్కూల్ ఆవరణలో ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించబడును.

ఈ ఉచిత వైద్య శిబిరంలో చిన్న పిల్లల్లో వచ్చే అన్ని రకాల జబ్బులు, ఎముకలు, కీళ్లు, నరములు, స్త్రీల సమస్యలు, గర్భిణీ స్త్రీల సమస్యలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ సమస్యలు, ఊపిరితిత్తులు, ఇ.యన్.టి. సమస్యలు, దంత సమస్యలు, ఫిజియో థెరఫీ సమస్యలు , జ్వరాలు, నెమ్ము, దగ్గు, ఆయాసం, బి.పి, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్, గుండె, కిడ్నీ, లివర్ సమస్యలు, పక్షవాతం, మొదలగు అన్ని వయసులలో వచ్చు అన్ని రకాల వ్యాధులకు నిపుణులైన స్పెషలిస్ట్ వైద్యులచే ఉచితంగా పరీక్షించబడును.

బిపి, ఇసిజి గుండె పరీక్ష, షుగరు, యూరిక్ యాసిడ్, పాదాల నరాల స్పర్శ పరీక్ష, పల్స్ ఆక్సీ మీటర్ పరీక్షలు ఉచితంగా చేసి అందరికీ మందులు ఉచితంగా ఇవ్వబడును.

మరిన్ని వివరాలకు హెల్ప్ లైన్ నంబర్ 8184 82 82 82 నందు సంప్రదించగలరు.

ఈ సదవకాశాన్ని కొత్తపట్నం మండల ప్రజలందరూ వినియోగించుకొనవలసినదిగా కోరుచున్నాము.

-
డాక్టర్ ౘాపల వంశీ కృష్ణ,
MS ( Ortho ) Osmania, M.Ch ( Ortho ), UK Trained In Spine & Joint Replacement Surgery,
శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుంటూరు రోడ్డు, ఒంగోలు.

01/03/2023

National Science Day - 2023 at Srivani Vidyaniketan, Kothapatnam

National Science Day - 2023:జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిన్న ఫిబ్రవరి 28 న మన శ్రీ వాణి విద్యానికేతన్ స్కూల్ లో అత్యం...
01/03/2023

National Science Day - 2023:

జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు నిన్న ఫిబ్రవరి 28 న మన శ్రీ వాణి విద్యానికేతన్ స్కూల్ లో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ముఖ్య అతిధిగా కొత్తపట్నం మండల విద్యా శాఖాధి కారి గౌరవనీయులు శ్రీ అజయ్ బాబు గారు పాల్గొని సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యాన్ని విద్యార్థులకు ఉపదేశించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్జిబిషన్ ని ప్రారంభించి విద్యార్థులు తయారు చేసిన వివిధ సైన్స్ ప్రాజెక్టులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ ౘాపల కోటేశ్వర రావు గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

-
ౘాపల కోటేశ్వర రావు M.Sc,
కరెస్పాండెంట్,
శ్రీవాణి విద్యానికేతన్,
కొత్తపట్నం
01/03/2023

National Science Day Celebrations - 2022.మన పాఠశాలలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాలు. ముఖ్య అతిధిగా కొత్తపట్నం SI ఫ...
01/03/2022

National Science Day Celebrations - 2022.

మన పాఠశాలలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాలు.

ముఖ్య అతిధిగా కొత్తపట్నం SI ఫాతిమా గారు విచ్చేసి విద్యార్థులకు స్పూర్తిని నింపే సందేశాన్నిచ్చి విజేతలకు బహుమతులు అందజేశారు.

- 28/2/2022.

డాక్టర్ సర్వేపల్లి రాధ కృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారాల మహోత్సవం : శ్రీరామ్ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు శ్రీరామ్ సూ...
11/04/2021

డాక్టర్ సర్వేపల్లి రాధ కృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారాల మహోత్సవం :

శ్రీరామ్ ఎడ్యుకేషన్ సొసైటీ మరియు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా 10/4/2021 శనివారం ఉదయం కొత్తపట్నంలోని BSM ZP హైస్కూల్ నందు గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.

2019 - 20 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండలంలో ఎంపిక చేసిన 5 పాఠశాలలు - కే.పల్లెపాలెం లోని మొత్తం మూడు పాఠశాలలు, కొత్తపట్నం లోని శ్రీవాణి విద్యానికేతన్ మరియు కొత్తపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్ , లోని మొత్తం 100 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించడం జరిగింది.

మండలంలో విద్యాభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి విశేషముగా కృషి చేస్తున్న నలుగురు ఉపాధ్యాయులు - కొత్తపట్నం హైస్కూల్ నుండి హేమంత్ కుమార్, శ్రీవాణి విద్యానికేతన్ నుండి నాగేశ్వర రావు మరియు పీతా కోటేశ్వర రావు, కొత్తపట్నం పల్లెపాలెం స్కూల్స్ నుండి అంజలి దేవి గార్లకు
డాక్టర్ సర్వేపల్లి రాధ కృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయ ప్రతిభా పురస్కారాలను ప్రధానం చేయడం జరిగింది. వీరిని 5,000/- రూపాయల నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక లతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో చిన్ననాటి గురువులు ప్రాధమిక పాఠశాల నుండి నగుబోయిన వీరయ్య, హైస్కూల్ నుండి దండుబ్రోలు వీర రాఘవులు మరియు కాలేజి నుండి జువాలజీ లెక్చరర్ తోట రామస్వామి గార్లని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించడం విశేషం.

అనంతరం ఈ 5 పాఠశాలల్లో అత్యధిక హాజరు మరియు ప్రతిభ కనబరచిన 50 మంది విద్యార్థులకు ఉత్తమ విద్యార్ధి, ఉత్తమ ప్రతిభ అవార్డులను ప్రదానం చేశాము.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా DEO సుబ్బా రావు గారు పాల్గొన్నారు.

అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా అభియాన్ జిల్లా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (APC) శ్రీనివాస రెడ్డి, డిప్యూటీ DEO రోజా రాణి, MEO కిషోర్, డాక్టర్ చాపల శాంత కుమారి, శ్రీరామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ కోటేశ్వర రావు, సెక్రెటరీ చాపల మహేంద్ర గార్లు పాల్గొన్నారు.

-

చాపల కోటేశ్వర రావు,
శ్రీరామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ,
కొత్తపట్నం.

డా.చాపల వంశీ కృష్ణ,
శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
ఒంగోలు.

Address

Kothapatnam
523286

Telephone

9866591713

Website

Alerts

Be the first to know and let us send you an email when Srivani Vidyaniketan, Kothapatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category