Kothagudem city

Kothagudem city Kothagudem City is a online portal of kothagudem. Here you can find the complete information of schools,colleges,business etc. Kothagudem district
(237)

16/01/2025
05/01/2025

*కొత్తగూడెం లో ఎయిర్పోర్ట్ సర్వే కు 38 లక్షలు నిధులు విడుదలకు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం..*

05/01/2025

👉కొత్తగూడెం టౌన్ (36 వార్డులు), పాల్వంచ టౌన్ (24 వార్డులు), సుజాతనగర్ (7 పంచాయతీల)లను కలుపుతూ మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.

👉ఏడాదిపాటు పట్టుబట్టి కార్పొరేషన్ సాధించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

👉కార్పొరేషన్ ఏర్పాటుతో పాతికేళ్లుగా ఎన్నికలు జరగని పాల్వంచ మున్సిపాలిటికి ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్.

👉శరవేగంగా అభివృద్ధి సాదించనున్న కొత్తగూడెం నియోజకవర్గం.

👉తన ప్రతిపాదనతో కార్పొరేషన్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, IAS అధికారులు జితేష్ వి పాటిల్, దాన కిషోర్, గౌతమ్, శ్రీదేవి గర్లకు కృతజ్ఞతలు తెలిపిన కూనంనేని.

తెలంగాణ హైకోర్టు జోక్యంతో నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరర...
25/07/2023

తెలంగాణ హైకోర్టు జోక్యంతో నేడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
ఈ క్రమంలో అత్యంత సమీప అభ్యర్థి జలగం వెంకటరావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించి సంచలన తీర్పు ఇచ్చారు. వనమా విజయంపై జలగం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వనమా తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఆస్తులను సక్రమంగా ప్రకటించలేదన్న ఆరోపణలున్నాయి. ఇవి నిజమని గుర్తించిన కోర్టు అతడిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించారు. జలగం వెంకట్రావును 2018 డిసెంబర్ 12 నుంచి ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది.

వనమా వెంకటేశ్వరరావు 1989లో తొలిసారి కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4,120 ఓట్ల తేడాతో గెలుపొందారు. జలగం వెంకటరావు ఆంధ్ర ప్రదేశ్ ఐదవ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు కుమారుడు. ఆయన సోదరుడు జలగం ప్రసాదరావు కూడా మాజీ మంత్రి. వెంకటరావు 2004లో తొలిసారిగా ఖమ్మం సత్తుపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీ(బీఆర్‌)ఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసి కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) తరఫున ఖమ్మం (ఉమ్మడి) నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే.

04/01/2023
20/09/2021

Required boys and girls to work as waiters and packing persons for Hotel Bhavani Restaurant, vidyanagar, kothagudem . Daily payments. Food and accommodations free . Contact 9866922823

28/06/2021

ఈ రోజు 28.6.2021,సోమవారం .

జిల్లా లోని అన్ని గవర్నమెంట్ కరోన వాక్సిన్ సెంటర్ లలో

హై రిస్క్ సమూహలకు స్పెషల్ డ్రైవ్ లో కరోనా వాక్సిన్ వేయబడును...

వాక్సిన్ కు వచ్చేవారు ఆధార్ కార్డ్ మరియు డిపార్ట్మెంట్ ఐడెంటిటీ కార్డ్.
డ్రైవర్స్ తమ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని రాగలరు.

వాక్సిన్ కు ఈ క్రింద పేర్కొన్నవారు అర్హులు*

ఈ రోజు నుండి అన్ని రకాల వ్యాపారులు.
1.కిరాణా షాపులు - ఉద్యోగులు,
2.మాంసం వ్యాపారులు,
3.చేపల వ్యాపారులు,
4.కూరగాయల దుకాణాలు,
5.వీధి వ్యాపారులు,
6.బార్బర్ సెలునులు,
7.బ్రాందీ షాపులు-ఉద్యోగులు
8.చిన్న హోటల్ - ఉద్యోగులు
9.రైతు బజార్- వ్యాపారులు
10.పండ్లు-పూల వ్యాపారులు
11.లాండ్రీ షాపులు,
12.మెడికల్ షాపులు
13.స్మశానవాటికలో పనిచేయు వారు.
14.చిరు వ్యాపారులు.(పాన్ షాపులు మొదలగునవి).

ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ స్టాప్ అందరికి వాక్సిన్ వేయబడును.

1.గవర్నమెంట్ టీచర్స్
2.లోకల్ బాడీస్
3.గిరిజన సంక్షేమ, సాంఘీక సంక్షేమ, బి. సి. సంక్షేమ శాఖ .
4.ఎయిడెడ్ స్కూల్స్
5.ప్రైవేట్ స్కూల్స్
6.జూనియర్ కాలేజీ సిబ్బంది.
7.విద్యా వాలంటీర్లు .

మరియు

1.ఆటో/ క్యాబ్ డ్రైవర్స్.
2.ఎక్షైజ్ శాఖ ఉద్యోగులు.
3.పంచాయతీ రాజ్ ప్రజా ప్రతినిధులు.
4.ఎలక్ట్రికల్( ట్రాన్స్కో, జెన్ కో) ఉద్యోగులు.
5.స్టాంప్స్ మరియు రెజిస్ట్రేషన్స్ శాఖ ఉద్యోగులు.
6.ఇందిర క్రాంతి పదం ఉద్యోగులు.
7.బ్యాంక్ ఉద్యోగులు.
8.గ్రామీణ వైద్యులు.
9.ఇంజనీరింగ్ ఉద్యోగులు( పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ,ఇరిగేషన్)
10.పోస్టల్ ఉద్యోగులు.
11.వ్యవసాయ,పట్టు పరిశ్రమ,ఉద్యానవన, పశు వైద్య శాఖ ఉద్యోగులు.
12.వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులు.
13.కిడ్నీ డయాలసిస్/
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు.
14.పూజారీలు,ఇమాములు,
ఫాస్టర్లు.
15.మీడియా ప్రతినిధులు.
16.స్వయం సహాయక సంఘాలు.
17.ప్రైవేట్ హాస్పిటల్స్-వైద్య సిబ్బంది (హెల్త్ కేర్ వర్కర్స్).
18.ప్రైవేట్ లాబ్ సిబ్బంది.

1 వ డోస్ ఏప్రిల్ నెలలో వేయించుకొని 2 వ డోస్ డ్యూ ఉన్నవారికి 2 వ డోస్ వేయబడును.

వాక్సిన్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు వేయ బడును.

డా. నాగేంద్ర ప్రసాద్,
జిల్లా ఇంమ్యునైజేషన్ అధికారి,
భద్రాద్రి- కొత్తగూడెం.

24/06/2021

🙏🏼. అందరికి నమస్కారం

జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం...

ఈ రోజు 24.6.2021,గురువారం .

జిల్లా లోని అన్ని గవర్నమెంట్ వాక్సిన్ సెంటర్లలో

హై రిస్క్ సమూహలకు స్పెషల్ డ్రైవ్ లో కరోనా వాక్సిన్ వేయబడును...

వాక్సిన్ కు వచ్చేవారు ఆధార్ కార్డ్ మరియు డిపార్ట్మెంట్ ఐడెంటిటీ కార్డ్.
డ్రైవర్స్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని రాగలరు.

వాక్సిన్ కు ఈ క్రింద పేర్కొన్నవారు అర్హులు***

ఈ రోజు నుండి ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ స్టాప్ అందరికి వాక్సిన్ వేయబడును.

1.గవర్నమెంట్ టీచర్స్
2.లోకల్ బాడీస్
3.గిరిజన సంక్షేమ, సాంఘీక సంక్షేమ, బి. సి. సంక్షేమ శాఖ .
4.ఎయిడెడ్ స్కూల్స్
5.ప్రైవేట్ స్కూల్స్
6.జూనియర్ కాలేజీ సిబ్బంది.
7.విద్యా వాలంటీర్లు .

మరియు

1.ఆటో/ క్యాబ్ డ్రైవర్స్.
2.ఎక్షైజ్ శాఖ ఉద్యోగులు.
3.పంచాయతీ రాజ్ ప్రజా ప్రతినిధులు.
4.ఎలక్ట్రికల్( ట్రాన్స్కో, జెన్ కో) ఉద్యోగులు.
5.స్టాంప్స్ మరియు రెజిస్ట్రేషన్స్ శాఖ ఉద్యోగులు.
6.ఇందిర క్రాంతి పదం ఉద్యోగులు.
7.బ్యాంక్ ఉద్యోగులు.
8.గ్రామీణ వైద్యులు.
9.ఇంజనీరింగ్ ఉద్యోగులు( పంచాయతీ రాజ్, మిషన్ భగీరథ,ఇరిగేషన్)
10.పోస్టల్ ఉద్యోగులు.
11.వ్యవసాయ,పట్టు పరిశ్రమ,ఉద్యానవన, పశు వైద్య శాఖ ఉద్యోగులు.
12.వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగులు.
13.కిడ్నీ డయాలసిస్/
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారు.
14.పూజారీలు,ఇమాములు,
ఫాస్టర్లు.
15.మీడియా ప్రతినిధులు.
16.స్వయం సహాయక సంఘాలు.
17.ప్రైవేట్ హాస్పిటల్స్-వైద్య సిబ్బంది (హెల్త్ కేర్ వర్కర్స్).
18.ప్రైవేట్ లాబ్ సిబ్బంది.

వాక్సిన్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు వేయ బడును.

ఈ రోజు కోవాక్సిన్ 2 వ డోస్ కూడా డ్యూ ఉన్న ఉన్నవారికి ఇవ్వగలరు.

డా.నాగేంద్ర ప్రసాద్.
జిల్లా ఇంమ్యునిజేషన్ అధికారి.
భద్రాద్రి-కొత్తగూడెం.

09/01/2021

*మార్చిలోగా సింగరేణిలో 651 ఖాళీల భర్తీకి నిర్ణయం*
: *సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌*
తెలంగాణ వచ్చాక ఇప్పటి వరకూ 13,934 ఉద్యోగాలు కల్పించిన సింగరేణి
ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశం మేరకు సింగరేణి సంస్థలో ప్రస్తుతం గల 651 ఖాళీలను మార్చిలోగా భర్తీ చేయనున్నామని సింగరేణి సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం (జనవరి 8వ తేదీ) నాడు హైద్రాబాద్‌ నుండి విడుదల చేసిన ప్రకటనలో ఆయన వివరాలు తెలియజేశారు.
ఈ రిక్రూట్‌ మెంట్‌ ప్రక్రియ మొత్తం మార్చి 2021 నాటికి పూర్తి చేస్తామని, అన్ని పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి దానిలో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని వివరించారు. 651 ఖాళీలలో 569 ఎన్‌.సి.డబ్ల్యు.ఎ. పరిధిలోని కార్మిక ఉద్యోగాలు, 82 అధికార పోస్టులు ఉన్నాయని, ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా వీటిని భర్తీ చేయనున్నామని తెలిపారు.
569 కార్మిక పోస్టుల ఖాళీ వివరాలు
సింగరేణి సంస్థ వివిధ విభాగాలలో గుర్తించి, భర్తీ చేయనున్న 569 కార్మిక పోస్టుల ఖాళీలకు సంబంధించిన పోస్టుల వివరాలు : జూనియర్‌ అసిస్టెంటు (క్లర్కులు)-177 పోస్టులు, ఫిట్టర్లు-128, ఎలక్ట్రిషీయన్లు టైనీలు-51, వెల్డర్ ట్రైనీలు-54, టర్నర్‌/ మెషినిస్టు ట్రైనీలు-22, మోటర్‌ మెకానిక్‌ ట్రైనీలు-14, మౌల్డర్ ట్రైనీలు-19 పోస్టులను ఎంపిక చేయబోతున్నారు. అలాగే ఆసుపత్రులలో వివిధ రకాల ఖాళీలను కూడా మార్చిలోగా భర్తీ చేయబోతున్నారు. దీనిలో జూనియర్‌ స్టాఫ్‌ నర్స్‌-84 పోస్టులు, ల్యాబ్‌ టెక్నిషీయన్లు-7, ఫార్మాసిస్టులు-5, అలాగే ఎక్స్‌-రే, ఇ.సి.జి., వెంటిలేటర్‌ విభాగాల్లో రెండేసి పోస్టులు, ఫిజియోథెరపీ, వెంటిలేటర్‌ విభాగంలో ఒక్కొక్క పోస్టును భర్తీ చేయనున్నారు.
82 అధికార పోస్టుల ఖాళీల వివరాలు
కాగా వివిధ శాఖల్లో సింగరేణి సంస్థ గుర్తించి, భర్తీ చేయనున్న 82 ఖాళీలకు సంబంధించిన అధికార పోస్టుల వివరాలు : మైనింగ్‌ విభాగంలో మేనేజిమెంటు ట్రైనీలు-39 పోస్టులు, పర్సనల్‌ ఆఫీసర్‌-17, మేనేజిమెంటు ట్రైనీలు (ఇండస్ట్రీయల్‌ ఇంజనీరింగ్‌)-10, సివిల్‌ శాఖలో మేనేజిమెంటు ట్రైనీలు-7, మేనేజిమెంటు ట్రైనీలు (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)-6, జూనియర్‌ అటవీ అధికారి-3 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశంపై ఇంటర్నల్‌ అభ్యర్ధులకు గొప్ప సదవకాశం : 1,436 పోస్టుల్లో భర్తీ
సింగరేణిలో కారుణ్య నియామకాల ప్రక్రియ, డిపెండెంట్‌ ఉద్యోగాలలో భాగంగా సుమారు 10 వేల మందికి పైగా యువకులు సింగరేణిలో ఉద్యోగం పొందారు. వీరిలో అనేకమంది ఉన్నత విద్యార్హతలు కలిగి ఉన్నారు. కానీ బదిలీ వర్కర్లు లేదా జనరల్‌ మజ్దూర్లుగా పని చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు ఇటీవల శాసనసభలో మాట్లాడుతూ, సింగరేణిలో ఏర్పడే ఖాళీలలో సంస్థలో పనిచేస్తున్న అర్హులైన అభ్యర్ధులకు కూడా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు వివిధ గనులు, విభాగాలు, కార్యాయాలల్లో ఖాళీగా ఉన్న 1,436 పోస్టులను ఇంటర్నల్‌ అభ్యర్ధుల కోసం గుర్తించి, వారితోనే భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సి&ఎం.డి. శ్రీ ఎన్‌.శ్రీధర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు త్వరలోనే ఇంటర్నల్‌ సర్క్యూలర్ల ద్వారా ధరఖాస్తులను ఆహ్వానించి, నియామకాలు చేపట్టనున్నామని తెలిపారు.
ఇంటర్నల్‌ రిక్రూట్‌ మెంట్‌ లో ఇ.పి. ఆపరేటర్‌ ట్రైనీలు-210 పోస్టులు, ఇ.పి. ఆపరేటర్‌ ఫిట్టర్‌ ట్రైనీలు-178, క్లర్కులు (జూనియర్‌ అసిస్టెంట్స్‌)-177, వార్డు అసిస్టెంట్లు-175, ఆయా పోస్టులు-94, డ్రైవర్లు-64, వెల్డర్లు ట్రైనీలు-55, అసిస్టెంట్‌ ఫోర్‌ మెన్‌ (మెకానికల్‌) ట్రైనీలు-56, ఎలక్ట్రీషీయన్‌ ట్రైనీలు-51, ఇ.పి. ఎలక్ట్రీషీయన్‌ ట్రైనీలు-42, పిట్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ (పి.ఓ.ఎ.)-36, జూనియర్‌ అకౌంటెంట్లు-24, టర్నర్‌ మెషినిస్టు ట్రైనీలు-22, మౌల్డర్ ట్రైనీలు-19, మోటార్‌ మెకానిక్‌ ట్రైనీలు-14, స్టోర్‌ కీపర్స్‌-13, జూనియర్‌ ఫారెస్ట్‌ అసిస్టెంట్స్‌-8, ల్యాబ్‌ టెక్నిషీయన్లు-7, ‘లా’ అసిస్టెంట్స్‌-5, ఫార్మాసిస్ట్‌-5 పోస్టులతో పాటు, ఎక్స్‌రే, ఇ.సి.జి., వెంటిలేటర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రెండేసి ఖాళీలు, డైటిషీయన్‌, ఫిజియోథెరపిస్టు, డయాలసిస్‌ టెక్నిషీయన్లకు ఒక్కొక్క పోస్టు చొప్పున గల ఖాళీలను ఇంటర్నల్‌ అభ్యర్ధుల ద్వారా మాత్రమే భర్తీ చేయనున్నారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడినాకా 13,934 ఉద్యోగాలు కల్పించిన సింగరేణి
సింగరేణి సంస్థ తన బొగ్గు ద్వారా, థర్మల్‌ విద్యుత్‌ ఉత్పాదన ద్వారా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడడంతో పాటు, రాష్ట్రావతరణ తర్వాత తొలిసారిగా కొత్త ఉద్యోగాలు కల్పించిన ఘనతను కూడా సాధించింది. 2014 నుండి ఇప్పటి వరకు 13,934 ఉద్యోగాలను కల్పించి రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వ సంస్థగా నిలిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం మేరకు కారుణ్య ఉద్యోగల నియామకల ప్రక్రియ కింద ఇప్పటివరకూ 10,879 ఉద్యోగాలు కల్పించగా, 45 ఎక్స్‌టర్నల్‌ రిక్రూట్‌ మెంటు నోటిఫికేషన్లు జారీ చేసి 3,055 మంది యువతను ఉద్యోగాలలో నియమించింది. కాగా తాజాగా కంపెనీ మరో 651 పోస్టులను డైరెక్టు రిక్రూట్‌ మెంట్‌ ద్వారా మార్చి 2021 నాటికి భర్తీ చేయనుంది.
కాగా 75 ఇంటర్నల్‌ నోటిఫికేషన్ల ద్వారా ఇంటర్నల్‌ అభ్యర్ధులకు 2,501 ఉద్యోగాల కల్పించింది. అలాగే తాజా ఇంటర్నల్‌ రిక్రూట్‌ మెంట్‌ ద్వారా మరో 1,436 పోస్టులను మార్చికల్లా భర్తీ చేయనుంది. ఇవికూడా పూర్తయితే, మార్చి 2021 నాటికి సింగరేణి సంస్థ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్తగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య 18,522 చేరనుంది. దీనిపై సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులతో పాటు సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇంత పెద్దఎత్తున రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థ యువతకు ఉద్యోగాలు కల్పించిన సందర్భాలు లేవని వారు ప్రశంసిస్తున్నారు.
ప్రతిభ ఆధారంగానే ఉద్యోగ నియామకాలు : యాజమాన్యం
సింగరేణి సంస్థ చేపట్టనున్న అన్ని నియామకాలు అభ్యర్ధుల ప్రతిభ, రాత పరీక్షలో వారికి వచ్చే మార్కుల పైనే ఆధారపడి ఉంటాయనీ, కనుక పరీక్షలకు బాగా సంసిద్ధమవ్వాలని యాజమాన్యం సూచిస్తోంది. ఇంటర్వ్యూ అనే ప్రక్రియ ఉండదనీ, కనుక ఎటువంటి పైరవీలకు అవకాశం ఉండబోదనీ, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా చేప్తే వారి మాటలకు మోసపోవద్దని యాజమాన్యం హెచ్చరిస్తోంది.
చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్

29/09/2020

ఈరోజు రాత్రి 29 - 9-20
రాత్రి రుద్రంపుపూర్ కు వచ్చే
రోడ్లన్నీ చెట్లు కూలి పోయి,
కరెంటు స్థంబాలు నేల కులాయి,
రాకపోకలు పూర్తిగా నిలిచి
పోయాయి

17/08/2020

Date:-17.08.2020, water level in Godavari river at Bhadrachalam at 3:00 pm is 61.2 feet.

Address

Kothagudem
Kothagudem
507101

Website

Alerts

Be the first to know and let us send you an email when Kothagudem city posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Kothagudem city:

Shortcuts

Share