20/08/2026
శ్రద్ధాంజలి
విశాఖపట్నంలో జరిగిన విషాదకర సంఘటనలో, ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన చిరునవ్వుల చిన్నారి,LKG విద్యార్థి ప్రణయ్ తేజ అకాల మరణం చెందడం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి, చెప్పలేనంత గాఢ దుఃఖానికి గురిచేసింది.
కలలు వికసించాల్సిన వయసులోనే ఆ పసిపాప ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవడం అత్యంత హృదయవిదారకం. ఆ పసిపాపను కోల్పోయి, పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ఈ తీరని శోకాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము.
ఆ అమాయక చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ప్రణయ్ తేజ మృతికి గౌతమ్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తరఫున గాఢ సానుభూతి, తీవ్ర సంతాపం మరియు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము.
గమనిక:
చిన్నారి ప్రణయ్ తేజ మృతికి సంతాప సూచకంగా రేపు ఒక రోజు మన గౌతమ్ మోడల్ స్కూల్ కు సెలవు (బంద్) పాటిస్తున్నాము.
ఇట్లు,
వి. నరేష్ కుమార్ (MA, M.Ed, LLB)
Correspondent