28/01/2019
ఒక రోజు, ఒక గాడిద పులి తో వాగ్వాదం చేసింది.
కనిపిస్తున్న ఈ గడ్డి 'నీలం రంగు'లో ఉంది అని.
దానికి ఆ పులి, లేదు ఆ గడ్డి 'పచ్చ రంగు'లో ఉంది అన్నది.
అలా ఆ రెండు చాలా సమయం పాటు ఒకరినొకరు వాదించుకున్నాయి.
తరువాత ఆ గాడిద మనలో ఎవరి మాట నిజమో తెలయాలంటే మనము మన రాజు దగ్గరికీ వెళ్లి తేల్చుకోవాలని పులితో అన్నది. దానికి పులి కూడా సరే అని, ఆ రెండు కలిసి అడవికి రాజైన సింహ దగ్గరికి వెళ్ళాయి.
అన్ని రకాల అడవి జంతువుల మద్య ఒక పెద్ద రాయి మీద విశ్రాంతి తిస్కుంటున్న సింహంతో, మొదటగా గాడిద "ఓ అడవిరాజ!!, ఈ అడవిలో ఉన్న గడ్డి నీలం రంగులో ఉంది అని నేను, లేదు పచ్చ రంగులో ఉంది అని ఈ పులి నాతో వాదిస్తోంది. మీరే మాకు తీర్పు తీర్చాలి!" అని అన్నది.
దానికి సింహం అవును నువ్వు చెప్పింది నిజం అని చెప్పింది. వెంటనే ఆ గాడిద, ఆనందంతో అడవి మొత్తం దూకుతూ గంతులేసింది.
తరువాత తిరిగి వచ్చి, ఓ అడవిరాజా! నాతో వాదించిన ఈ పులి కి శిక్ష వేయండి అని అడుగగా, సరే అని ఆ పులి ని ఒక రోజు పాటు ఎవరితోనూ మాట్లాడుండా ఉండాలని శిక్ష విధించింది.
ఆ తరువాతి రోజు, ఆ పులి సింహ దగ్గరికి ఒంటరిగా వచ్చి, "ఓ అడవిరాజా!! ఈ అడవిలో ఉన్న గడ్డి పచ్చగా ఉంది, అది నిజమా, కాదా?" అని అడిగింది.
దానికి ఆ సింహం అవును నువ్వు చేపింది నిజమే అన్నది.
"మరి నిన్న ఆ గాడిదతో అవును ఈ గడ్డి నీలం రంగులోనే ఉన్నది అని చెప్పి నాకు ఒక రోజు పాటు శిక్ష ఎందుకు విధించారు " అని అడిగింది పులి.
దానికి ఆ సింహం, "నేను ఆ గాడిదతో నీలా వాదించడం నాకు ఇష్టంలేదు. అందుకనే అది అన్నదే నిజమని అన్నాను." అన్నది.
మరి నాకెందుకు శిక్ష విందించారు అని పులి అడుగగా, "అడవిలో చాలా తెలివిగల నువ్వు, నోటికొచ్చింది మాట్లాడే ఆ మూర్ఖ గాడిదతో వాదించి, నీ తెలివిని ఉపయోగించకుండా, దానితో కలిసి నాదగ్గరకు వచ్చినందుకు " అని సింహ జవాబిచ్చింది.
**కథ యొక్క నీతి:**
నోటికొచ్చింది మాట్లాడే మూర్కులతో వాదించకుడదు, అలా చేస్తే ఫలితం మీ విలువైన సమయం, అందరిముందు మీకున్న గౌరవం పోతుంది.