15/12/2023
🔥🔥🔥🔥🔥🔥🔥🔥
*ప్రభుత్వ ఉద్యోగులందరు ఉన్నోళ్ళు ఎట్లయితరు?*
*ప్రభుత్వము పరిశీలించాలి..*
*ప్రజలందరు ఆలోచించాలి..*
మీ *BPL* కార్డు పంపకాల ప్రకారం చూస్తే..
👉ఊరిలో ఐదు ఎకరాల భూమి ఉన్నోడు పేదోడు అయితే,
ఐదు గుంటల భూమి లేని ఉద్యోగి ఉన్నోడు ఎట్లయితడు?
👉పదిహేను లక్షల బ్రీజాలో వచ్చి ఉచిత బియ్యం తీసుకుపోయే వాడు పేదోడే అయితే,
ఆర్టీసీ బస్ లో అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగి ఉన్నోడు ఎట్లయితడు?
👉లక్షల్లో జీతాలు తీసుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగి పేదోడే అయితే, వేలల్లో జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగి ఉన్నోడు ఎట్లయితడు?
👉రెండు అంతస్తుల భవంతి లో నివాసం ఉన్నవాడు పేదోడే అయితే
కిరాయి ఇంట్లో ఉండే ఉద్యోగి ఉన్నోడెట్లయితడు?
👉IT లు కట్టే బిజినెస్ మెన్ ల తల్లిదండ్రులు పేదోల్లు అయితే
13 సంవత్సరాల సర్వీసు లో ఇంత వరకు IT కట్టే స్థాయిలో జీతం పొందని ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రులు ఉన్నొళ్ళెట్లయితరు?
ప్రజలు గుర్తెరగాలి ఉద్యోగులు అందరు ఉన్నోళ్ళు కాదు..ఐరన్ బట్టలు వేసుకున్నంత మాత్రానా ధనవంతులు కారు..
నేటికీ 70 శాతం మంది ఉద్యోగులు జీతాల మీద సొంత ఇల్లు కట్టి పిల్లల చదువులు పూర్తి చేస్తే గొప్ప..
👉నేటి ఉద్యోగులకు మీరు ఊహించినట్టు ఉచిత ఆరోగ్యం లేదు...
ఉచిత విద్య ఫీజు రీయింబర్స్మెంట్ లేదు..
రిటైర్మెంట్ అయ్యాక పెన్షన్ లేదు...
*ఈర్ష్యపరులారా*
మీ చుట్టూ ఉన్న ఉద్యోగులకు వారసత్వంగా వచ్చిన నౌకర్లు కావు అవి.. *వాళ్ళ అవ్వ అయ్యలు ఉపవాసం ఉండి కూలీనాలీ చేసి బడికి పంపితే చిన్నప్పటి నుండి ఆటపాటలు మరిచి,*
*పండగలు పబ్బాలు వదిలేసి,*
*నోటికి రుచి మరచి,*
*కంటికి నిద్ర వదిలి, పుస్తకాల* *పురుగులా పాతిక* సంవత్సరాలు పాటు పెడితే,వచ్చిన ఉద్యోగం అది..*
ఆ ఉద్యోగం రాగానే వచ్చే జీతంతో ప్రతి పైసా ఖర్చుకు పదిసార్లు ఆలోచిస్తూ, పద్ధతిగా ఖర్చు చేస్తూ ప్రణాళికాబద్ధంగా బ్రతుకుతున్నారు
అంతే తప్ప వాళ్ళంతా బలిసినోళ్ళు కాదు.. భాగ్యవంతులు కారు..